c lakshma reddy
-
ఎంసెట్ మెడికల్కి ఎస్ కోడ్ ప్రశ్నపత్రం ఎంపిక
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో ఆదివారం మధ్యాహ్నం జరుగనున్న వైద్యవిద్య, వ్యవసాయ పరీక్ష (ఎంసెట్ మెడికల్) కు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ సి. లక్ష్మారెడ్డి ఎస్ కోడ్ ప్రశ్నపత్రాన్ని ఎంపికచేశారు. ఈ పరీక్షకు 1,01,005 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈ పరీక్ష ఆదివారం మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకూ జరుగుతుంది. ఈ సందర్బంగా మంత్రి సి.లక్ష్మారెడ్డి మాట్లాడుతూ ఈసారి నీట్ ద్వారానే ఎంబీబీఎస్, బీడీఎస్ అడ్మిషన్లు ఉంటాయన్నారు. అయితే విద్యార్థులు అనుభవం కోసం ఎంసెట్ పరీక్ష రాయవచ్చు అని ఆయన తెలిపారు. -
వైద్య ఆరోగ్యశాఖలో మార్పులకు కమిటీ
మహబూబ్నగర్ : తన శాఖలో సమూల మార్పులకు కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సి.లక్ష్మారెడ్డి తెలిపారు. ఆదివారం మహబూబ్నగర్ జిల్లాలో పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. అందులోభాగంగా బొమ్రాజ్పేట బ్రిడ్జి తోపాటు కొడంగల్, కోస్గిలో 100 పడకల ఆసుపత్రులకు శంకుస్థాపన చేశారు. అనంతరం లక్ష్మారెడ్డి మాట్లాడుతూ... రంగారెడ్డి జిల్లా పరిగిలోని 30 పడకల ఆసుపత్రిని 100 పడకల ఆసుపత్రిగా మారుస్తామని హామీ ఇచ్చారు. అలాగే 60 నెల్లో రైతుల ఆత్మహత్యలు లేకుండా చూస్తామని లక్ష్మారెడ్డి తెలిపారు.