
సాక్షి, హైదరాబాద్: ఎన్నికల అఫిడవిట్‌ను ట్యాంపరింగ్ చేసినట్లు తనపై వస్తున్న ఆరోపణలు అవాస్తవమని, ఇదే అంశంపై దాఖలైన పిటిషన్‌ను డిసెంబర్ 15న ఢిల్లీ హైకోర్టు డిస్మిస్ చేసిందని ఎక్సైజ్ శాఖమంత్రి శ్రీని వాస్‌గౌడ్ తెలిపారు. టీఆర్‌ఎస్‌ఎల్పీ కార్యా లయంలో బుధవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మహబూబ్‌నగర్‌లో రాజకీయంగా ఎదుగుతున్న తనపై కొందరు కక్షకట్టి ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారన్నారు. తనపై జరుగుతున్న కుట్ర వెనుక మహ బూబ్‌నగర్ జిల్లాకు చెందిన ఓ మాజీ మంత్రి, మాజీ ఎంపీ, మరో నాయ కుడు ఉన్నారని, వారి పేర్లు త్వరలో బయట పెడతానని చెప్పారు.
ట్రాఫిక్ చలాన్లు, బ్యాం కు రుణాల వివరాలను అఫిడవిట్‌లో చేర్చలేదని తనపై చేస్తున్న ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదన్నారు. పిటిషన్‌దారులను తప్పుబడుతూ తప్పుడు కేసులు వేయొద్దని కోర్టు హెచ్చరించినా.. కొన్ని మీడియా సంస్థలు దుష్ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. తెలంగాణ కోసం ఉద్యోగాన్ని వదులుకుని రాజకీయాల్లోకి వచ్చానని, ఇళ్లు కట్టుకోవడం, కారు కొనుక్కోవడాన్ని కూడా కొందరు రాజకీ యం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు.
Comments
Please login to add a commentAdd a comment