నల్గొండ: ఫాలిహౌజ్ సబ్సిడీలకు రూ. 250 కోట్ల నిధులు కేటాయిస్తున్నట్లు తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. బుధవారం నల్గొండ జిల్లా భువనగిరిలో ఫాలిహౌజ్ను మంత్రి పోచారం ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ... గుంట గుంటకు సాగు నీరు.... ఇంటింటికి మంచి నీరు అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యం అని ఆయన స్పష్టం చేశారు. అప్పులు, ఆత్మహత్యలు లేని రైతుల రాష్ట్రంగా తెలంగాణను రూపుదిద్దుతామని పోచారం స్పష్టం చేశారు.