
'చంద్రబాబూ ఓ సారి అద్దంలో ముఖం చూసుకో'
హైదరాబాద్: మహానాడులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ వాణిజ్య పన్నుల శాఖ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ మండిపడ్డారు. హైదరాబాద్ అభివృద్ధి తన ఘనతేనంటున్న చంద్రబాబు ఓ సారి అద్దంలో ముఖం చూసుకోవాలని తలసాని సూచించారు.
ఏపీకి సంపద మీరు సృష్టించుకోండని... పట్టిసీమ ప్రాజెక్ట్లో అయ్యా, బాబులు ఎంత కొట్టేస్తున్నారో నాకు తెలుసునని తలసాని ఈ సందర్భంగా వెల్లడించారు. జూన్ 2వ తేదీ నుంచి 7వ తేదీ వరకు పరేడ్ గ్రౌండ్స్లో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలు నిర్వహిస్తామని తెలిపారు. జూన్ 7వ తేదీన ట్యాంక్ బండపై ముగింపు ఉత్సవాలు నిర్వహిస్తామని తలసాని సూచించారు.