సాక్షి, పశ్చిమగోదావరి : రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలవడం మంచి పరిణామమని తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ప్రతి ఏడాది ఆయన సంక్రాంతి సంబరాలను పశ్చిమగోదావరి జిల్లాలో జరుపుకుంటారు. ఈ ఏడాది కూడా తలసాని అక్కడకు వెళ్లారు. మంగళవారం భోగి పండుగను భీమవరంలో జరుపుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ.. ఇక్కడి సంక్రాంతి సంబరాల్లో పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు.
ఏపీలో ప్రభుత్వం మారుతుందని గతేడాది సంక్రాంతి సందర్భంగా చెప్పానని.. అలాగే ఇక్కడ టీడీపీ ప్రభుత్వం పోయి వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వచ్చిందన్నారు. తమ రాష్ట్రం నుంచి ఒకాయనకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తామన్నామని.. మాట ప్రకారమే రిటర్న్ గిఫ్ట్ ఇచ్చామని పరోక్షంగా చంద్రబాబును ఉద్దేశించి అన్నారు. హైదరాబాద్‌లో పెద్ద భవనం కట్టి.. నగరమంతా తానే అభివృద్ధి చేసినట్లు చంద్రబాబు చెప్పుకుతిరుగుతున్నారని విమర్శించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాలన బాగుందని మంత్రి తలసాని ప్రశంసించారు.
Comments
Please login to add a commentAdd a comment