మెట్రో రైలును 250 కి.మీ పొడిగిస్తాం: కేటీఆర్
హైదరాబాద్: హైదరాబాద్ మెట్రో రైలు సర్వీసు కేవలం 72 కిలో మీటర్లకే పరిమితం చేయమని తెలంగణ ఐటీ, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. 2040 నాటికి రైల్వే సర్వీసును 250 కి.మీ మేర విస్తరిస్తామని చెప్పారు. శుక్రవారం కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ... మెట్రో రైలు నిర్మాణంలో తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తుందని ఆయన స్పష్టం చేశారు. ఎలాంటి అవాంతరాలు వచ్చిన మెట్రో పనులు పూర్తి చేస్తామన్నారు.
చిన్న చిన్న సమస్యలు ఉన్న సాధ్యమైనంత తర్వలో వాటిని అధిగమిస్తామని చెప్పారు. భూగర్బ రైలు మార్గానికి సంబంధించి ప్రత్యామ్నాయాలను ఆలోచిస్తున్నట్లు తెలిపారు. మెట్రో రైలు కవర్ కానీ ప్రాంతాలలో బీఆర్టీఎస్,ఎల్ఆర్టీఎస్ రైలు సేవలను అందుబాటులోకి తీసుకువస్తామన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోనే మెట్రో రైలు పనులు జరుగుతాయని తెలిపారు.