సాక్షి, హైదరాబాద్: మంత్రి మల్లారెడ్డి నివాసం, కార్యాలయాలపై ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. పన్ను ఎగవేత ఆరోపణలపై ఐటీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. మొత్తం 50 బృందాలు ఈ తనిఖీల్లో పాల్గొన్నాయి. మల్లారెడ్డితో పాటు ఆయన కుమారులు, అల్లుడి ఇంట్లోనూ తనిఖీలు జరుగుతున్నాయి.
మల్లారెడ్డి సోదరుడు, వియ్యంకుడి నివాసాల్లోనూ సోదాలు నిర్వహిస్తున్నారు. 14 విద్యాసంస్థల ప్రధాన కార్యాలయాల్లో ఐటీ తనిఖీలు జరుగుతున్నాయి. కాలేజీల ఆర్థిక లావాదేవీల రికార్డులను పరిశీలిస్తున్నారు. క్రాంతి బ్యాంక్‌లో మల్లారెడ్డి ఇంజినీరింగ్ కాలేజీ లావాదేవాలు ఉన్నట్లు గుర్తించారు. దీంతో క్రాంతి బ్యాంక్ ఛైర్మన్ రాజేశ్వర్‌రావు ఇంట్లోనూ సోదాలు నిర్వహించారు.
Comments
Please login to add a commentAdd a comment