
సాక్షి, హైదరాబాద్: మంత్రి మల్లారెడ్డి కుమారుడు మహేందర్‌రెడ్డికి హైపర్ టెన్షన్ వల్లే అస్వస్థతకు గురైనట్లు వైద్యులు చెప్పారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఇదిలా ఉంటే, మంత్రి మల్లారెడ్డి ఆస్పత్రి వద్ద ధర్మాకు దిగారు. తన కొడుకును చూడనివ్వడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
కుమారుడిని సీఆర్‌పీఎఫ్ బలగాలతో కొట్టించారని అన్నారు. తన కుమారుడికి ఏమవుతుందోనని భయంగా ఉందంటూ ఆందోళన వ్యక్తం చేశారు. ఐటీ సోదాల్లో నగదు, పలు కీలక పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మల్లారెడ్డి ఇంటివద్ద భారీగా సీఆర్‌పీఎఫ్ బలగాలను మోహరించి సోదాలు కొనసాగిస్తున్నారు.
చదవండి: (కుమారుడికి అస్వస్థత.. ఐటీ అధికారులపై మంత్రి మల్లారెడ్డి ఆగ్రహం)
Comments
Please login to add a commentAdd a comment