
మంచిర్యాల: ఈటల రాజేందర్‌ను మంత్రి పదవి నుంచి ప్రభుత్వం బర్తరఫ్ చేయడాన్ని నిరసిస్తూ జిల్లా కేంద్రంలోని చార్వాక భవన్‌లో తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం నాయకులు ఆయనకు మద్దతుగా నిరసన దీక్ష చేపట్టారు. సంఘం జిల్లా అధ్యక్షుడు డాక్టర్ నీలకంఠేశ్వర్‌రావు మాట్లాడుతూ నిరాధారమైన ఆరోపణలు చేస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. మంత్రివర్గంలోని అవినీతిపరులు, భూకబ్జాదారులపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర బీసీ యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు రాంశెట్టి నరేందర్, బీసీ సంక్షేమ సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు ఒడ్డెపల్లి మనోహర్, ముత్తోజు రమేశ్, జిల్లా కార్యదర్శి గుండోజు రమేశ్, నాయకుడు రాజన్న పాల్గొన్నారు.