CmKCR
-
మల్ల దోఖా చేసేందుకు వస్తున్నరు: సీఎం కేసీఆర్
సాక్షి, నారాయణపేట: పాలమూరును నాశనం చేసిందే కాంగ్రెస్ పార్టీ అని సీఎం కేసీఆర్ ఫైర్ అయ్యారు. సోమవారం ఇక్కడ జరిగిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ ప్రసంగించారు. ‘ఇక్కడి నుంచి ఎంతో మంది మంత్రులు ఉండె.. కానీ ఒక్క పని చేయలేదు. ఒక్కడు కూడా జై తెలంగాణ అన్న పాపాన పోలేదు. ఇపుడు మల్ల దోఖా చేసేందుకు వస్తున్నారు. మన భవిష్యత్ బాగుండాలంటే బీఆర్ఎస్ మాత్రమే శ్రీరామ రక్ష. కరెంటు మూడు గంటలు ఉండాల్నా.. 24 గంటలు కావాల్నా.. 24 గంటలు కావాలంటే బీఆర్ఎస్ గెలవాలె. రైతుల భూములు కాపాడాలని ధరణి తెచ్చాం. ఇపుడు ధరణిని తీసేస్తామని కాంగ్రెస్ అంటోంది. నారాయణపేట హైదారాబాద్ తర్వాత మున్సిపాలిటీ గా ఏర్పడిన మొదటి పట్టణం. ఉమ్మడి ఏపీలో అప్పట్లో నారాయణ పేట ఎడారిని తలపిస్తుండే. కాంగ్రెస్ పాలకులే నాశనం పట్టించారు. తెలంగాణ వచ్చినంక ఒక్కొక్కటి సర్దుకుంటున్నం. ఏడెనిమిది నెలల్లో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కాల్వ పనులు పూర్తి అయితయి. నారాయణపేట, కొడంగల్, మక్తల్ నియోజకవర్గాలకు నీళ్లొస్తయ్’ అని కేసీఆర్ అన్నారు. రాహుల్ గాంధీకి ఎద్దున్నదా తెల్వనీకి... ‘జోగులాంబ తల్లి ఒక శక్తి పీఠం. అందుకే జిల్లాకు అమ్మవారి పేరు పెట్టాం. తిరుపతి వెంకట కవులను సన్మానించిన చరిత్ర గద్వాలది. గద్వాలను గబ్బు పట్టించిన గబ్బు నాయళ్లు ఎవరు? ఆ పార్టీల చరిత్ర కూడ తెలుసుకోవాలి. కృష్ణా, తుంగభద్ర నదులను ఎటు కాకుండగా ఆగం చేసిందెవరు. ఇక్కడి నాయకులు ఆంధ్ర నాయకులకు మంగళహారతులు పట్టిండ్రు. రాహుల్ గాంధీకి వ్యవసాయం గురించి తెల్వడానికి ఆయనకు ఎద్దు ఉన్నదా? వ్యవసాయం ఉన్నదా? పాత పాలమూరు జిల్లాలో పెద్ద సంఖ్యలో వాల్మీకి బోయలున్నారు. వారిని ఎస్టీల్లో కలపాలని అసెంబ్లీలో రెండు సార్లు తీర్మానం చేసి పంపినా ప్రధాని మోదీకి చీమ కుట్టినట్టు కూడా లేదు’ అని కేసీఆర్ గద్వాల సభలో మండిపడ్డారు. -
సీఎం కేసీఆర్ బస్సులో తనిఖీలు..
సాక్షి,కొత్తగూడెం: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ఫ్రీ అండ్ ఫెయిర్‌గా జరిగేందుకు ఎన్నికల కమిషన్ అన్ని చర్యలు తీసుకుంటోంది. ఎంతటివారి వాహనాన్ని అయినా అధికారులు ఆపి చెక్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆదివారం కొత్తగూడెంలో బీఆర్ఎస్ ప్రజాఆశీర్వాద సభ కోసం వచ్చిన సీఎం కేసీఆర్ ప్రయాణించే ప్రగతిపథం వాహనాన్ని ఎన్నికల అధికారులు తనిఖీ చేశారు. ఇటీవలే మంత్రి కేటీఆర్‌తో పాటు హోం మంత్రి మహమూద్ అలీల వాహనాలను కూడా ఎన్నికల అధికారులు తనిఖీలు చేసిన విషయం తెలిసిందే. తాజాగా సీఎం వాహనం తనఖీ చేయడం చర్చనీయాంశంగా మారింది. ఏదైనా సమాచారం మేరకు సీఎం బస్సును తనిఖీ చేశారా రొటీన్ చెకింగ్‌లో భాగంగా చేశారా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. -
ఢిల్లీలో బిఆర్ఎస్ ఆఫీస్ నేడే ప్రారంభం
-
TS New Secretariat: కొత్త సచివాలయాన్ని ప్రారంభించిన సీఎం కేసీఆర్ (ఫొటోలు)
-
దళిత బంధుపై కెసిఆర్ కీలక వ్యాఖ్యలు
-
క్రిస్మస్ వేడుకల్లో సీఎం కేసీఆర్ (ఫొటోలు)
-
బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయాన్ని ప్రారంభించిన సీఎం కేసీఆర్ (ఫొటోలు)
-
అసెంబ్లీ బరిలో కవిత..
మౌలిక వసతుల లేమి.. ఏళ్ల తరబడి సాగుతున్న భూగర్భ డ్రెయినేజీ పనులు.. వెనుక బడిన నగర సుందరీకరణ నేపథ్యంలో నగరాభివృద్ధిని పట్టాలెక్కించడానికి స్వయంగా సీఎం కేసీఆర్ హైదరాబాద్‌లో సమీక్ష నిర్వహించారు. ఈ అంశం స్థానిక ప్రజల్లో ఆసక్తిని కలిగించడంతో పాటు అభివృద్ధిపై ఆశలను చిగురింపజేసింది. మరోవైపు రాజకీయ వర్గాల్లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను రానున్న ఎన్నికల్లో అర్బన్ నుంచి బరిలో దింపడమే పరమార్థమని అంచనాలు సాగుతున్నాయి. సిట్టింగ్ ఎమ్మెల్యే గణేశ్ గుప్తాను పార్లమెంట్ స్థానానికి పోటీ చేయిస్తారని భావిస్తున్నారు. సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : వ్యవసాయ వనరులతో అభివృద్ధి పరంగా రాష్ట్రంలో ముందంజలో ఉన్న నిజామాబాద్ జిల్లా తన ప్రత్యేకతను చాటుకుంటోంది. అయితే జిల్లా కేంద్రమైన నిజామాబాద్ నగరపాలక సంస్థగా అప్‌గ్రేడ్ అయి 17 సంవత్సరాలు అవుతున్నప్పటికీ మౌలిక సదుపాయాల అభివృద్ధి, నగర సుందరీకరణ పనుల విషయంలో పరిస్థితి ముందుకు పడడం లేదు. నిధులు వస్తున్నప్పటికీ వివిధ పనుల విషయంలో ఏళ్లతరబడి ఆలస్యం అవుతోంది. దీంతో నగర నవీకరణ వెనుకబడుతోంది. 1972లో మున్సిపాలిటీగా ఉన్నప్పుడు రూపొందించిన మాస్టర్‌ప్లాన్ తప్ప కొత్త మాస్టర్‌ప్లాన్‌ను పట్టాలు ఎక్కించలేదు. రాష్ట్ర ఆవిర్భావానికి ముందు ప్రారంభమైన భూగర్భ డ్రెయినేజీ పనులు ఇప్పటివరకు పూర్తి కాలేదు. తెలంగాణ ప్రభుత్వం వచ్చి 8 సంవత్సరాలు పూర్తి అయినప్పటికీ ఈ పనులు సాగుతూనే ఉన్నాయి. అంచనాలు మాత్రం పెరుగుతూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ముఖ్యమంత్రి కేసీఆర్ నేరుగా హైదరాబాద్‌లో నిజామాబాద్ నగర అభివృద్ధి పనుల విషయమై సమీక్ష నిర్వహించారు. రెండు నెలల్లో నిజామాబాద్ వస్తానని, ఈలోగా ఇక్కడి అధికారులు, ప్రజాప్రతినిధులు ఖమ్మం వెళ్లి అక్కడ జరిగిన నగర అభివృద్ధిని చూసి రావాలని సూచించారు. ముఖ్యమంత్రి కేవలం ఒక్క నిజామాబాద్ నగర అభివృద్ధి పనుల విషయమై సమీక్ష చేయడంపై ప్రతిఒక్కరిలో ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో నగరాభివృద్ధి పనుల విషయమై ప్రజల్లో చర్చ సాగుతోంది. అయితే వివిధ వర్గాల్లో మాత్రం రాజకీయ అంశాలపై సూక్ష్మ పరిశీలనలు చేస్తున్నారు. 2014 నుంచి 2019 వరకు నిజామాబాద్ ఎంపీగా ప్రాతినిధ్యం వహించిన కల్వకుంట్ల కవిత రెండోసారి ఓటమిపాలయ్యారు. బీజేపీ నుంచి ధర్మపురి అరి్వంద్ విజయం సాధించారు. తర్వాత కవిత ఉమ్మడి నిజామాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. ఇదిలా ఉండగా వచ్చే శాసనసభ ఎన్నికల్లో కవిత నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగుతారనే ఊహాగానాలు వివిధ వర్గాల్లో వేడెక్కుతున్నాయి. గత కొన్ని నెలల క్రితం మాత్రం కవిత బోధన్ లేదా ఆర్మూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారని ప్రచారం జరిగింది. తాజాగా కవిత వచ్చే ఎన్నికల్లో నిజామాబాద్ అర్బన్ నుంచే బరిలో ఉంటారని చర్చ జరుగుతోంది. ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యే బిగాల గణేషగుప్తాను ఈసారి నిజామాబాద్ పార్లమెంటు అభ్యరి్థగా బరిలోకి దించుతారని రాజకీయ వర్గాల్లో అనుకుంటున్నారు. ఈ క్రమంలోనే కవిత నగరంపై ప్రత్యేక దృష్టి సారించారని, ఇందులో భాగంగానే నగర అభివృద్ధి విషయమై ముఖ్యమంత్రితో సమీక్ష చేయించినట్లు పలువురు అభిప్రాయపడుతున్నారు. ఎన్నికలు ముందస్తుగా వచ్చినప్పటికీ, షెడ్యూల్ మేరకు వచ్చినా సమయం ఏడాది లోపే ఉండడంతో ఈ విషయమై ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. కల్వకుంట్ల కవితకు రాష్ట్ర కేబినెట్లోకి రావాలనే కోరిక ఎప్పటి నుంచో ఉంది. ప్రస్తుతం ఎమ్మెల్సీగా అవకాశం ఉన్నప్పటికీ.. ఎమ్మెల్యేగానే శాసనసభలో అడుగుపెట్టి మంత్రి కావాలనే లక్ష్యంతో ఉన్నట్లు తెలుస్తోంది. 2014 నుంచి 2019 వరకు ఎంపీగా ప్రాతినిధ్యం వహించిన కె కవిత రెండోసారి ఓటమిపాలయ్యారు. బీజేపీ నుంచి ధర్మపురి అర్వింద్ విజయం సాధించారు. 40 ఏళ్ల క్రితం రూపొందించిన మాస్టర్ ప్లానే నగరానికి ఇప్పటికీ అమలవుతోంది. -
మన శత్రువు మోదీనే.. వికారాబాద్ సభలో కేసీఆర్ ఆగ్రహం..
మాయమాటలు నమ్మితే దోపిడీకి గురవుతం. వచ్చిన తెలంగాణను గుంట నక్కలు పీక్కు తినకుండా చూడాలి. కైలాసం ఆటలో పెద్దపాము మింగిన కథ అయితది జాగ్రత్త. తెలంగాణ ఆగం కాకుండా బుద్ధి జీవులు కాపాడుకోవాలి. – కేసీఆర్ వేగంగా పురోగమిస్తున్న తెలంగాణకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రధాన శత్రువుగా మారారని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు విమర్శించారు. రాష్ట్రంలో అభివృద్ధిని జీర్ణించుకోలేక అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తున్నారని ధ్వజమెత్తారు. ‘రైతులకు ఉచిత కరెంట్ ఇయ్యొద్దట. మోటార్లకు మీటర్లు పెట్టాల్నట. సింగరేణి బొగ్గున్నంక కూడా మోదీ చెప్పిన సావుకార్ల కాడ కొనాల్నట. కార్పొరేట్లకు లక్షల కోట్లు దోచిపెట్టాల్నట..’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశ ప్రగతి రోజురోజుకూ దిగజారుతోందని, ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయని, నిరుద్యోగమూ పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ‘ఇవాళ పెట్రోల్ ధర ఎంత, గ్యాస్ సిలిండర్ ధర ఎంత? ఇవన్నీ ప్రశ్నించినందుకేనా తెలంగాణపై కుట్ర చేస్తున్నారు. ఇలాంటి దిక్కుమాలిన ప్రభుత్వం మనకు అవసరమా? ఒక్కసారి ఆలోచించండి..’ అంటూ ప్రజలను కోరారు. కేంద్రంలో రాష్ట్రాల సంక్షేమం చూసే ఉత్తమ ప్రభుత్వం రావాలని, అందుకోసం ఈ కేంద్ర ప్రభుత్వాన్ని ఇంటికి పంపుదామని పిలుపునిచ్చారు. మళ్లీ మోసపోతే గోస పడతామని, ఈ దుర్మార్గులు, దుష్టశక్తులకు తగిన బుద్ధి చెప్పాలని విజ్ఞప్తి చేశారు. మంగళవారం వికారాబాద్‌లో నూతన కలెక్టరేట్, సమీకృత కార్యాలయ భవనాన్ని, టీఆర్ఎస్ కార్యాలయాన్ని సీఎం ప్రారంభించారు. మెడికల్ కళాశాల భవనానికి శంకుస్థాపన చేశారు. అనంతరం ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ అధ్యక్షతన జరిగిన బహిరంగ సభలో కేసీఆర్ ప్రసంగించారు. నెత్తికి రుమాలు కట్టుకొని గాలిమాటలు చెప్పిండు ‘నిన్నటి ప్రధాని ప్రసంగంలో (స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా) పస ఏమీ లేదు. ప్రధాని ఏదో చెబుతారని దేశ ప్రజలు ఎదురుచూశారు. కానీ నెత్తికి రుమాలు కట్టుకుని గాలి మాటలు చెప్పిండు. భవిష్యత్తులో ఉజ్వల భారతదేశం నిర్మాణం దిశగా మనం కంకణ బద్ధులం కావాలి. లేకుంటే సమాజం వెనుకబడతది. సమైక్య పాలనలోని బాధలు మళ్లీ రావద్దంటే మనం జాగ్రత్తగా ఆలోచించాలి. విద్యుత్ సంస్కరణల పేరుతో మీటర్లు పెట్టి, రైతులకు కేంద్రం శఠగోపం పెడుతోంది. మనకు ఉచిత కరెంటు ఉండాల్నా.. వద్దా? మీరే చెప్పండి..’ అని సీఎం ప్రశ్నించారు. మోసపోతే.. గోస పడుతం ‘మాయమాటలు నమ్మితే దోపిడీకి గురవుతం. వచ్చిన తెలంగాణను గుంట నక్కలు పీక్కు తినకుండా చూడాలి. కైలాసం ఆటలో పెద్దపాము మింగిన కత అయితది జాగ్రత్త. తెలంగాణ ఆగం కాకుండా బుద్ధి జీవులు కాపాడుకోవాలి. 14 ఏండ్ల పాటు పోరాటం చేసి, చావు అంచుదాకా పోయి తెలంగాణ తెచ్చుకున్నం. ఇప్పుడు తెలంగాణలో మంచినీళ్లు, కరెంటు బాధ లేదు. మిషన్ భగీరథతో ఇంటింటికీ స్వచ్ఛమైన మంచి నీళ్లిస్తున్నం. అన్ని రంగాలకూ 24 గంటలు నాణ్యమైన కరెంటు ఇస్తున్నం. 26 లక్షలకు పైగా మోటార్లకు ఉచిత కరెంటు ఇస్తున్నం. దేశంలోనే అత్యధికంగా గురుకులాలు ఏర్పాటు చేసుకున్నం. ఐటీ, పారిశ్రామిక రంగాలను గొప్పగా అభివృద్ధి చేసుకున్నం. తెలంగాణ ఆదాయం అద్భుతంగా పురోగమిస్తున్నది. కానీ కేంద్రంలో ఉన్నవాళ్లు అడుగడుగునా అడ్డుపడుతున్నరు. నేడు ప్రధానమంత్రే మనకు శత్రువు అయిండు. ఎన్ని అడ్డంకులెదురైనా పరిగి, చేవెళ్ల, వికారాబాద్ నియోజకవర్గాలకు సాగు నీళ్లందిస్తాం..’ అని హామీ ఇచ్చారు. భూముల రేట్లు పడిపోతాయన్నారు.. ‘తెలంగాణ వస్తే భూములు రేట్లు పడిపోతాయని అపోహ సృష్టించారు. రంగారెడ్డి జిల్లాకు చెందిన నాటి సమైక్యవాద తొత్తులు తెలంగాణకు అడ్డు పడ్డరు. కానీ నేడు తెలంగాణ వచ్చినంక, భూముల రేట్లు విపరీతంగా పెరిగినయి. ఉద్యమ సమయంలోనే వికారాబాద్‌ను జిల్లాగా ఏర్పాటు చేస్తా అని చెప్పిన. ఇచ్చిన మాట ప్రకారం వికారాబాద్‌ను జిల్లాగా ఏర్పాటు చేసుకున్నం. తెలంగాణ రాకపోతే వికారాబాద్ జిల్లా ఏర్పాటు అయ్యేదా? వికారాబాద్‌కు మెడికల్ కాలేజీ, డిగ్రీ కాలేజీ వచ్చేవా?..’ అని కేసీఆర్ ప్రశ్నించారు. కొత్తగా 10 లక్షల మందికి పెన్షన్లు ‘ఆగస్టు 15 నుంచి కొత్తగా 10 లక్షల మందికి పెన్షన్లు ఇస్తున్నం. వ్యవసాయానికి ఉచిత కరెంటు, కల్యాణలక్ష్మీ, షాదీ ముబారక్ తదితర అనేక పథకాలను అమలు చేయాలని పక్క రాష్ట్రాల ప్రజలు కూడా కోరుతున్నరు. గూడు చెదిరి చెట్టుకొకరు పుట్టకొకరుగా అయిన రైతులను కాపాడుకోవాలనే సంకల్పం తీసుకొని అనేక రైతు కార్యక్రమాలను అమలు చేస్తున్నం. రైతు బంధు పథకంతో ఎకరాకు ఏటా రూ.10 వేల సాయం అందిస్తున్నం. ఒక గుంట భూమి ఉన్న రైతు దురదృష్టవశాత్తూ మరణిస్తే ఆ కుటుంబానికి రూ.5 లక్షల రైతు బీమా ఇస్తున్నం. నేరుగా వారి ఖాతాల్లోనే పడుతున్నయి. భవిష్యత్తులో రైతులకు ఇంకా ఎంతో చేస్తం. ప్రపంచంలోనే రైతుబంధు, రైతు బీమా లాంటి పథకాలు లేవు. ప్రజలు ఆలోచించాలె.. చర్చ పెట్టాలె..’ అని కోరారు. కర్ణాటక పోయి చూడండి ‘పక్క రాష్ట్రం కర్ణాటక పోయి చూడండి. ఎట్లున్నదో తెలుస్తది. అక్కడి పరిస్థితి ఏంది.. ఇక్కడి పరిస్థితి ఏందో తెలుస్తది. వికారాబాద్‌లో ఇంతమంచి కలెక్టరేట్ భవనం వస్తదని అనుకున్నమా? 33 జిల్లాలకు మెడికల్ కాలేజీలు ఇస్తున్నం. ఇందుకేనా కేసీఆర్ బస్సుకు బీజేపీ వోళ్లు జెండాలు అడ్డం పెట్టేది?..’ అని సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సభలో మంత్రులు వేముల ప్రశాంత్‌రెడ్డి, సబితారెడ్డి, సీఎస్ సోమేశ్‌కుమార్, ఎంపీ రంజిత్‌రెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ సునీతారెడ్డి, ఎమ్మెల్యేలు కాలె యాదయ్య, కొప్పుల మహేశ్‌రెడ్డి, నరేందర్‌రెడ్డి, రోహిత్‌రెడ్డి, ఎమ్మెల్సీలు మహేందర్‌రెడ్డి, సురభి వాణీదేవి, బీసీ కమిషన్ సభ్యుడు శుభప్రద్‌పటేల్ తదితరులు పాల్గొన్నారు. చదవండి: సామూహిక జాతీయ గీతాలాపనతో మార్మోగిన తెలంగాణ -
సంక్షేమ తెలంగాణం.. ఎన్నో పథకాల్లో దేశానికే ఆదర్శం
సాక్షి, హైదరాబాద్: ‘‘స్వతంత్ర భారతంలో ఆరు దశాబ్దాలు అస్తిత్వం కోసం ఉద్యమించిన తెలంగాణ.. ఇప్పుడు స్వరాష్ట్రంగా అవతరించి యావత్ దేశానికే దిక్సూచిగా మారింది. అంధకారంలో కొట్టుమిట్టాడిన తెలంగాణ ఇప్పుడు అన్ని రంగాలకు 24 గంటల నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తూ ఆదర్శ రాష్ట్రంగా రూపుదాల్చింది. వ్యవసాయం సంక్షోభం నుంచి పుంజుకొని 11.6 శాతం వృద్ధిరేటుతో దేశానికి అన్నం పెట్టే అన్నపూర్ణగా అవతరించింది. దేశంలోనే తెలంగాణ నంబర్ వన్‌గా నిలిచింది’’ అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు పేర్కొన్నారు. సోమవారం గోల్కొండ కోటలో నిర్వహించిన స్వాతంత్య్ర వజ్రోత్సవాల్లో త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించి, ప్రసంగించారు. ఇటు రాష్ట్ర ప్రభుత్వం సాధించిన విజయాలను ప్రస్తావిస్తూనే.. కేంద్రం తీరుపై విమర్శలు చేశారు. కేసీఆర్ ప్రసంగంలోని అంశాలు ఆయన మాటల్లోనే.. బలీయ శక్తిగా ఎదుగుతున్నాం ‘‘తెలంగాణ ప్రతి రంగంలో దేశం నివ్వెరపోయే ఫలితాలను సాధిస్తోంది. ప్రజల ఆశీర్వాద బలం, ప్రజాప్రతినిధుల నిరంతర కృషి, ప్రభుత్వ సిబ్బంది అంకితభావమే దీనికి కారణం. పారిశ్రామిక రంగంలో 12.01 శాతం వృద్ధిరేటుతో అగ్రగామిగా నిలిచిన తెలంగాణ.. ఐటీ ఎగుమతుల్లో 26.14% వృద్ధిరేటుతో అప్రతిహతంగా దూసుకుపోతోంది. ఎనిమిదేళ్లలోనే రాష్ట్రం బలీయ ఆర్థిక శక్తిగా ఎదిగి దేశ నిర్మాణంలో బలమైన భాగస్వామిగా మారింది. రాష్ట్ర సొంత పన్నుల ఆదాయంలో 11.5 శాతం వృద్ధితో దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది. ప్రభుత్వ ఆర్థిక క్రమశిక్షణ, పారదర్శకత, అవినీతి రహిత పాలన వల్లే ఇది సాధ్యమైంది. ఏడేళ్లలో రాష్ట్ర జీఎస్డీపీ 127 శాతం పెరిగితే.. దేశ జీడీపీ పెరిగింది 90 శాతమే. 2013–14లో సుమారు రూ.లక్షగా ఉన్న రాష్ట్ర తలసరి ఆదాయం.. 2021–22 నాటికి రూ.2.75 లక్షలకు పెరిగింది. ఇది జాతీయ తలసరి ఆదాయం కంటే 84 శాతం అధికం. అదనంగా 10 లక్షల పింఛన్లు అమల్లోకి.. ఇది తెలంగాణ సంక్షేమంలో స్వర్ణ యుగం. ఈ పంద్రాగస్టు నుంచే మరో 10 లక్షల మందికి పింఛన్లను అందిస్తున్నాం. దళితుల అభ్యున్నతి కోసం విప్లవాత్మకంగా దళితబంధు పథకాన్ని తెచ్చి రూ.10 లక్షలను గ్రాంటుగా అందిస్తున్నాం. కొత్తగా ఏర్పాటైన 2,616 వైన్‌షాపుల్లో 261 దుకాణాలను దళితులకే కేటాయించాం. గొల్లకుర్మల సంక్షేమం కోసం గొర్రెల పంపిణీ చేపట్టాం. వేల కోట్ల విలువైన మత్స్య సంపదను సృష్టించాం. నేతన్నకు బీమా అమలు చేస్తున్నాం. ఆరేళ్లలో 1.34 కోట్ల ఎకరాల నుంచి 2.15 కోట్ల ఎకరాలకు సాగు విస్తీర్ణం పెంచాం. రూ.57,880 కోట్లను రైతు బంధు అందించాం. ఈ పథకం అత్యుత్తమమని ఐక్యరాజ్యసమితి కూడా కొనియాడింది. ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా బలోపేతం చేసేందుకు మన ఊరు–మనబడి కార్యక్రమాన్ని అమలు చేస్తున్నాం. పల్లె ప్రగతి రూపంలో ఊళ్లు బాగుపడుతున్నాయి. దేశవ్యాప్తంగా 20 ఉత్తమ గ్రామ పంచాయతీలను ఎంపిక చేస్తే అందులో 19 గ్రామాలు తెలంగాణవే కావటం దీనికి ఉదాహరణ. వైద్యానికి పెద్దపీట వేస్తున్నాం.. వైద్య పరీక్షలు ఉచితంగా నిర్వహించేలా ప్రతి జిల్లాలో డయాగ్నస్టిక్ సెంటర్లను ఏర్పాటు చేశాం, డయాలసిస్ సెంటర్లనూ అందుబాటులోకి తెచ్చాం. హైదరాబాద్ నలువైపులా సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులను నిర్మిస్తున్నాం. నిమ్స్‌లో మరో 2 వేల పడకల ఏర్పాటు, వరంగల్‌లో ఆధునిక సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి పనులు వేగంగా సాగుతున్నాయి. వచ్చే రెండేళ్లలో ప్రతి జిల్లాకు ఒక వైద్య కళాశాల, ఒక నర్సింగ్ కళాశాల ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటివరకు 1.32 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేసుకోగా.. మరో 91,142 పోస్టులను భర్తీ చేసుకుంటున్నాం. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెరిగింది.. తెలంగాణ వచ్చాక హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ బాగా పెరిగింది. టీఎస్ ఐపాస్‌తో పరిశ్రమల స్థాపన సులభమై పెట్టుబడులు పెరిగాయి. ఎనిమిదేళ్లలో రూ.2.32 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్శించాం. 1,500కుపైగా చిన్న, పెద్ద ఐటీ పరిశ్రమలు హైదరాబాద్‌లో కొలువయ్యాయి. ఐటీ ఉద్యోగాల సృష్టిలో కర్ణాటకను వెనక్కి నెట్టి తెలంగాణ ప్రథమ స్థానంలో నిలిచింది. ఐటీ ఎగుమతుల విలువ 1.83 లక్షల కోట్లకు పెరిగింది. టీ–హబ్ 2.0 ప్రపంచంలోనే అతిపెద్ద ఆవిష్కరణల కేంద్రంగా నిలిచింది. అప్పుల పేరుతో బురద చల్లుతున్నారు తెలంగాణ అనూహ్య ప్రగతి సాధిస్తుంటే.. కొందరు మాత్రం అప్పులు ఎక్కువగా చేస్తోందంటూ కుట్రపూరితంగా మాట్లాడుతున్నారు. కేంద్రం లెక్కల ప్రకారమే 2019–20 నాటికి రాష్ట్ర అప్పులు రూ.2,25,450 కోట్లు. 2014లో ఉమ్మడి ఏపీ నుంచి తెలంగాణకు సంక్రమించిన అప్పు రూ.75,577 కోట్లు. అంటే తెలంగాణ ప్రభుత్వం చేసిన అప్పు రూ.1,49,873 కోట్లు మాత్రమే. దీన్ని ప్రాజెక్టుల నిర్మాణానికి, మౌలిక వసతుల కల్పనకు పెట్టుబడిగానే వినియోగించాం. జీఎస్డీపీ ప్రకారం దేశంలో 22 రాష్ట్రాలకు తెలంగాణ కన్నా అధికంగా అప్పులు ఉన్నాయి. జీఎస్డీపీలో రాష్ట్ర అప్పుల నిష్పత్తి 23:5 శాతమే.. అదే జీడీపీలో దేశం అప్పుల నిష్పత్తి 50:4 శాతం. ఈ వాస్తవాన్ని గమనించకుండా కొందరు రాష్ట్ర అప్పులపై దుష్ప్రచారం చేస్తున్నారు. సమాఖ్య స్ఫూర్తికి కేంద్రం తూట్లు కేంద్ర ప్రభుత్వం సమాఖ్య స్ఫూర్తికి, విలువలకు తూట్లు పొడుస్తోంది. రాష్ట్రాలను ఆర్థికంగా బలహీన పరిచే కుట్రలు చేస్తోంది. పన్నుల ఆదాయంలో న్యాయబద్ధంగా 41 శాతం వాటా రాష్ట్రాలకు చెల్లించాల్సి ఉన్నా.. సెస్‌ల విధింపు రూపంలో దొడ్డిదారిన దోచుకుంటోంది. రైతు వ్యతిరేక నల్ల చట్టాలు తెచ్చి చివరికి తోక ముడిచింది. ప్రధాని స్వయంగా క్షమాపణ చెప్పారు. కేంద్రం పాల నుంచి శ్మశానవాటికల దాకా అన్నింటిపై పన్నులతో జనంపై భారం మోపుతోంది. ఉచితాలు అంటూ సంక్షేమ పథకాల అమలును అవమానిస్తోంది. తెలంగాణలో మత చిచ్చు రేపే యత్నం కేంద్రం అసమర్థత వల్లే దేశ ఆర్థిక వృద్ధి కుంటుపడింది. నిత్యావసరాల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. రూపాయి విలువ పడిపోయింది. వీటన్నింటినీ దీన్ని కప్పిపుచ్చుకునేందుకే కొందరు విద్వేష రాజకీయాలతో ప్రజలను విభజించేందుకు ప్రయత్నిస్తున్నారు. దేశంలో శాంతియుత సహజీవనాన్ని విచ్ఛిన్నం చేసేందుకు రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారే ఫాసిస్టు దాడులకు తెగబడుతున్నారు. ఇది చూసి స్వాతంత్య్ర సమరయోధుల ఆత్మలు ఘోషిస్తూ ఉంటాయి. తెలంగాణలోనూ మతచిచ్చు రేపి సామరస్య వాతావరణాన్ని దెబ్బతీసి, అభివృద్ధిని ఆటంకపర్చేందుకు విచ్ఛిన్నకర శక్తులు ప్రయత్నిస్తున్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండి దీన్ని తిప్పి కొట్టాల్సిన అవసరముంది. రవీంద్రుడి ప్రార్థనను గుర్తు చేసుకుందాం.. ‘ఎచట మనస్సు నిర్భయంగా ఉండగలదో, ఎచట మనిషి ఆత్మ విశ్వాసంతో తలెత్తుకుని తిరగగలడో, ఎచట జ్ఞానానికి ఎట్టి ఆటంకమూ ఉండదో, ఎచట లోకం ఇరుకైన అడ్డుగోడలతో చిన్న గదులుగా చీలిపోదో, ఎచట మనస్సు నిత్యం విశాల ఆశయాలను అన్వేషిస్తూ ముందుకు సాగిపోతుందో.. అటువంటి స్వేచ్ఛాధామమైన భూతల స్వర్గంలో.. తండ్రీ నా దేశాన్ని మేల్కొలుపు..’ అన్న విశ్వకవి రవీంద్రుడి ప్రార్థనలోని ఉదాత్త విలువలను మననం చేసుకుందాం. స్వాతంత్య్రోద్యమ ఆశయాలను కాపాడుకోవడానికి కలిసికట్టుగా ముందుకు సాగుదాం. నల్లగొండ గోస మీద పాట కూడా రాసిన.. ఫ్లోరైడ్ బాధితులకు అండగా ఉద్యమకాలంలో నల్లగొండ నగారా పేరుతో నేను స్వయంగా పోరాడాను. ‘చూడు చూడు నల్లగొండ.. గుండె మీద ఫ్లోరైడు బండ’ అంటూ అప్పట్లో ఓ పాట కూడా రాశాను. ఇప్పుడు ఆ ఫ్లోరైడ్ భూతం లేకుండా స్వచ్ఛమైన నీటిని నల్లాల ద్వారా ఉచితంగా అందిస్తున్నాం. మిషన్ భగీరథ పేరుతో 100 శాతం ఆవాసాలకు మంచినీళ్లు అందిస్తున్నాం. తెలంగాణ ఫ్లోరైడ్ రహిత రాష్ట్రంగా మారిందని పార్లమెంటు వేదికగా కేంద్రం కొనియాడింది. గోల్కొండ కోటలో ఉత్సాహంగా వేడుకలు దేశ స్వాతంత్ర వజ్రోత్సవాలను రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహించింది. సీఎం కేసీఆర్ గోల్కొండ కోటలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఉదయం 10.07 గంటలకు ఆయన కోట వద్దకు చేరుకున్నారు. లోపల రాణిమహల్ ముందున్న పచ్చిక బయళ్లలో పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. తర్వాత వాహనంలో లోపలికి వచ్చారు. 10.15 గంటల సమయంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. తర్వాత దాదాపు 45 నిమిషాల పాటు ప్రసంగించారు. సీఎం ప్రసంగానికి ముందు, తర్వాత నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు, కళారూపాలు ఆకట్టుకున్నాయి. అయితే సీఎం ప్రసంగం కాసేపట్లో ముగుస్తుందనగా వర్షం ప్రారంభమైంది. త్రివర్ణ దుస్తుల్లో పరేడ్ నిర్వహించి నేలమీద కూర్చున్న విద్యార్థులు చెల్లాచెదురయ్యారు. కోట గోడల మీద నిలబడ్డ కళాకారులు తడిసిపోయారు. ఇక సీఎం వెళ్లిపోగానే అంతా గోల్కొండ నుంచి బయటికి రావడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. చదవండి: గవర్నర్ తేనీటి విందుకు సీఎం కేసీఆర్ డుమ్మా.. ఆఖరి నిమిషంలో.. -
ప్రగతిభవన్‌కు వికారాబాద్ పంచాయితీ!
సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్లో రోజుకో జిల్లాకు సంబంధించిన అసమ్మతి రాజకీయం ప్రగతిభవన్‌కు చేరుకుంటోంది. మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నికలో మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డికి టికెట్ ఇవ్వొద్దంటూ ఆ నియోజకవర్గ నేతలు బుధవారం ప్రగతిభవన్ మెట్లెక్కారు. తాజాగా వికారాబాద్ జిల్లా టీఆర్ఎస్ ముఖ్య నేతలు తమ మధ్య విభేదాలు ఉన్నాయని పరోక్షంగా సంకేతాలు ఇచ్చారు. సీఎం కేసీఆర్ ఈ నెల 16న వికారాబాద్ జిల్లా కొత్త కలెక్టరేట్, టీఆర్ఎస్ జిల్లా కార్యాలయ భవనాలను ప్రారంభించి.. కొత్తగా మంజూరైన మెడికల్ కాలేజీకి శంకుస్థాపన చేయనున్నారు. తర్వా త బహిరంగ సభలో ప్రసంగిస్తారు. ఈ నేపథ్యంలో గురువారం ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌తో మంత్రి సబితా ఇంద్రారెడ్డి, టీఆర్ఎస్ వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే మెతుకు ఆనంద్, కాలె యాదయ్య (చేవెళ్ల), మహేశ్వర్‌రెడ్డి (పరిగి), రోహిత్‌రెడ్డి (తాండూరు), పట్నం నరేందర్‌రెడ్డి (కొడంగల్) భేటీ అయ్యారు. అయితే ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి, ఆయన భార్య, వికారాబాద్ జెడ్పీ చైర్ పర్సన్ సునీత ఈ సమావేశంలో పాల్గొనలేదు. సీఎంతో భేటీకి సంబంధించి పట్నం మహేందర్‌రెడ్డి, ఆయన భార్య సునీతకు సమాచారం లేనందునే హాజరుకాలేదని సమాచారం. సబితకు సభ బాధ్యతలు వికారాబాద్ సభకు జన సమీకరణ, పార్టీ జిల్లా కార్యాలయం ప్రారంభోత్సవానికి హాజరయ్యే కార్యకర్తలకు భోజన ఏర్పాట్లు తదితరాల అంశాలపై కేసీఆర్ పలు సూచనలు చేశారు. సీఎం పర్యటన ఏర్పాట్ల సమన్వయ బాధ్యతలను మంత్రి సబితా ఇంద్రారెడ్డికి అప్పగించారు. తర్వాత సీఎంతో వికారాబాద్ జిల్లా టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు కలిసి భోజనం చేశారు. కేటీఆర్‌తో మహేందర్‌రెడ్డి భేటీ కేసీఆర్తోభేటీకి హాజరుకాని పట్నం మహేం దర్‌రెడ్డి.. గురువారం మంత్రి కేటీఆర్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా సీఎం భేటీకి వెళ్లకపోవడానికి కారణాలను చెప్పినట్టు తెలిసింది. వికారాబాద్, తాండూరు మున్సిపల్ చైర్పర్సన్ల రాజీనామా చుట్టూ రాజకీయం జరుగుతోందని, కొత్త చైర్మన్ల ఎన్నిక కోసం ఆ రెండు నియోజకవర్గాల ఎమ్మెల్యేల ప్రోద్బలంతో తెరవెనుక మంత్రాంగం సాగుతోందని మహేందర్‌రెడ్డి వివరించినట్టు సమాచారం. మరికొన్ని మున్సి పాలిటీల్లోనూ ఈ పరిస్థితి ఉందని.. మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో మున్సిపల్ చైర్పర్సన్ల రాజీనామా తలనొప్పులు తెచ్చిపెడుతుందని కేటీఆర్ చెప్పినట్లు తెలిసింది. చదవండి: కేంద్ర ఆర్థిక దిగ్బంధాన్ని ఎండగడదాం! -
నేనేమైనా వృద్ధుడినా.. సీటు నాదే.. గెలుపు నాదే..
జయశంకర్ భూపాలపల్లి: 2023 అసెంబ్లీ ఎన్నికల్లో నేనే పోటీ చేస్తా.. నేనే గెలుస్తా.. సీటు నాదే.. గెలుపు నాదే.. ఇక చర్చలు ఆపండి.. నేనేమైనా వృద్ధుడినా, మంచి ఆరోగ్యంగా ఉన్నాను. చక్కగా ప్రజలకు సేవలు అందించగలిగే సామర్థ్యం, ఓపిక ఉంది.. నన్ను ఒక్కడిని గెలిపిస్తే.. నేను, నా సతీమణితో పాటు జీఎంఆర్ఎం ట్రస్ట్ ఆధ్వర్యంలో సేవలు అందిస్తున్నాం అని ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. జిల్లాకేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆదివారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ సహకారంతో భూపాలపల్లి నియోజకవర్గాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేస్తున్నానని అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నంటిని నెరవేరుస్తున్నానని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో గెలుపు తనదేనని అన్నారు. త్వరలోనే గోరికొత్తపల్లి మండలంగా ఏర్పడబోతుందని తెలిపారు. జిల్లాకేంద్రంలో మెడికల్ కళాశాల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.168కోట్లు కేటాయించిందని వెల్లడించారు. ఇందుకు జిల్లా ప్రజల తరఫున సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలియజేశారు. వంద పడకల ఆస్పత్రిలో 71పోస్టుల మంజూరుకి రాష్ట్ర మంత్రి హరీశ్‌రావు అంగీకరించారని, త్వరలోనే నియామకాలు జరుగుతాయని తెలిపారు. భూపాలపల్లిని ఒక ప్రణాళికబద్ధంగా అభివృద్ధి చేస్తున్నామని అన్నారు. చెల్పూరు నుంచి భూపాలపల్లి పట్టణంలోని బాంబులగడ్డ వరకు జాతీయ రహదారి విస్తరణ, సైడ్ డ్రెయినేజీ నిర్మాణ పనులకు రూ.80 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. రూ.15కోట్లతో చేపట్టిన ప్రభుత్వ డిగ్రీ కళాశాల అదనపు భవన నిర్మాణ పనులు పూర్తి కావస్తున్నాయని అన్నారు. వర్షాలు తగ్గాక భూపాలపల్లికి వస్తానని సీఎం కేసీఆర్ చెప్పాడని తెలిపారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం పక్కన సుమారు రూ.3కోట్లతో శ్రీ వెంకటేశ్వర ఆలయం నిర్మాణం చేపట్టగా కొందరు కావాలని ప్రభుత్వ భూమిని అన్యాక్రాంతం చేశారంటూ ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. దేవుడి గుడి నిర్మించడం కూడా తప్పేనా అని ప్రశ్నించారు. ఈ సమావేశంలో భూపాలపల్లి మున్సిపాలిటీ చైర్పర్సన్ సెగ్గం వెంకటరాణిసిద్ధు, వైస్‌చైర్మన్ కొత్త హరిబాబు, జంగేడు పీఏసీఎస్ చైర్మన్ మేకల సంపత్‌కుమార్, కౌన్సిలర్లు, టీఆర్ఎస్ నాయకులు కొక్కుల తిరుపతి, నూనె రాజు, క్యాతరాజు సాంబమూర్తి, ముంజాల రవీందర్, పిల్లలమర్రి నారాయణ, శిరుప అనిల్, మాడ హరీశ్‌రెడ్డి, శ్రీనివాస్ పాల్గొన్నారు. -
ఒమిక్రాన్‌కైనా జాగ్రత్త పడండి, సీఎం కేసీఆర్ ముందు జాగ్రత్తలు తీసుకోవాలి: షర్మిల
సాక్షి, హైదరాబాద్: ప్రపంచదేశాలను వణికిస్తున్న కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ విషయంలోనైనా ముందస్తు జాగ్రత్తలు తీసుకుని ప్రజల ప్రాణాలను కాపాడాలని వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ‘వాస్తవానికి కరోనా కష్టకాలంలో ఆస్పత్రుల్లో పడకల కొరత ఉంది. పడకలున్న చోట ఆక్సిజన్ సదుపాయం లేక ప్రజలు అనేక కష్టాలు ఎదుర్కొన్నారు. ఆ సమయంలో ప్రజ ల ప్రాణాలను దొరగారు గాలికొదిలేశారు. కనీసం ఇప్పుడైనా ప్రజల ప్రాణాలను కాపాడండి. సీఎం కేసీఆర్ ముందస్తు జా గ్రత్తలు తీసుకోవాలి’అని ఆమె సోమవారం ట్విట్టర్ వేదికగా పే ర్కొన్నారు. ఇలాంటి కష్టకాలంలో ఆరోగ్యశ్రీ కార్డు సద్వినియోగపడేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మంచి ఉద్దేశంతో వైఎస్సార్ ప్రారంభించిన ఈ పథకాన్ని నీరుగారుస్తున్నారని కేసీఆర్‌పై మండిపడ్డారు. -
బీజేపీని పారదోలాలి..మోదీ ప్రభుత్వం ఒరగబెట్టిందేమీ లేదు: సీఎం కేసీఆర్
బీజేపీ నేతలు కల్లాల దగ్గర డ్రామా ఆడుతున్నరు. వరి వేయొద్దని రాష్ట్ర వ్యవసాయ మంత్రి చెప్తే.. తొడలు, మెడలు వంచి కొంటామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అంటున్నారు. ఇదేమిటని కేంద్ర మంత్రులను అడిగితే.. ‘మావాడు బేవకూఫ్’అని వాళ్లే చెప్తున్నరు. ఈ బురిడీ గాళ్లను నమ్ముకుంటే శంకరగిరి మాన్యాలు పడతం. కేంద్రానిది దిక్కుమాలిన పాలసీ. ఆ చేతగానితనాన్ని మంది మీద రుద్దుతరా? దిక్కుమాలిన చట్టాలు తెచ్చి మీ ప్రధాని దేశ రైతాంగానికి ఎందుకు క్షమాపణ చెప్పాడు. మీది 750మంది రైతులను పొట్టన పెట్టుకున్న హంతకుల పార్టీ. రాబందుల పార్టీ. వాళ్లు జనాన్ని ముంచేటోళ్లు, మేలు చేసేవాళ్లు కాదు. – ముఖ్యమంత్రి కేసీఆర్ సాక్షి, హైదరాబాద్: ‘‘దేశంలో రైతులు బాగుపడాలంటే ఈ దుర్మార్గ బీజేపీ పాలన పోవాలి. ఆ పార్టీని దేశం నుంచే పారదోలాలి. ఎన్ని రోజులు మోసం చేస్తరు? బీజేపీ ఏడేళ్ల పాలనలో రూ.80 లక్షల కోట్ల అప్పులు చేశారు. మొత్తం అప్పులు 1.30 కోట్ల కోట్లకు చేరాయి. మోదీ ప్రభుత్వం పేదరికాన్ని పెంచి రైతు ఆత్మహత్యలకు కారణమైంది. సాగు చట్టాలు తెచ్చి 750 మంది రైతులను పొట్టన పెట్టుకున్నరు. అనేక మతాలు, సమాజాలు కలిసి బతుకుతున్న దేశంలో సామరస్యాన్ని దెబ్బతీస్తున్నారు. ఇలాగే వదిలేస్తే మతపిచ్చి రేపి విభజన రాజకీయాలతో దేశాన్ని రావణ కాష్టం చేస్తరు’’అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు మండిపడ్డారు. సోమవారం ప్రగతిభవన్‌లో మంత్రివర్గ సమావేశం నిర్వహించిన అనంతరం సీఎం కేసీఆర్ మీడియాతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం, కేంద్ర మంత్రులపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. వివరాలు ఆయన మాటల్లోనే.. కేంద్ర మంత్రి చేతకాని దద్దమ్మ ‘‘కేంద్ర ప్రభుత్వంలో రాష్ట్రం నుంచి మంత్రి ఉంటే సంతోషపడతారు. తెలంగాణ నుంచి బాయిల్డ్ రైస్ వస్తుందని చెప్తే కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి సిపాయి. కానీ కొనం అని చెప్పే రండ కేంద్రమంత్రి కావాల్న తెలంగాణకు? చేతగాని దద్దమ్మ! ఒక ఉన్మాదిలాగా మాట్లాడుతున్నాడు. రైతులు 13 నెలలపాటు ఎండలో, వానలో, కరోనా మధ్య పోరాటం చేస్తే.. కొట్టి చంపాలని హర్యానా సీఎం చెప్తారు. కార్లెక్కించి రైతులను చంపి చివరకు క్షమాపణ చెప్పింది మీరు. మేం రైతు బంధువులం. క్రూడాయిల్ ధర తగ్గినా పెట్రోల్, డీజిల్ ధరలు పెంచింది మోదీ ప్రభుత్వం. మీరు పెంచుతరు.. మేం తగ్గించాలని ధర్నా చేస్తారా? ఇజ్జత్ మానం ఉందా? ఏ చౌరస్తాకు వస్తవో రా.. కిషన్‌రెడ్డి తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకుని తెలంగాణ రైతులకు క్షమాపణ చెప్పాలె. ధాన్యం కొనుగోళ్లపై ఏ చౌరస్తాకు చర్చకు వస్తవో చెప్పు. మీ పార్టీ వేదికల్లో ఈ అంశం మీద మాట్లాడే దమ్ము, మగతనం లేదు. కేసీఆర్ షంటుతున్నడని చెప్పు. కిషన్‌రెడ్డి ధాన్యం కొనుగోలు కాకుండా చెత్తమాటలు మాట్లాడుతూ.. హుజూరాబాద్, గజ్వేల్, దుబ్బాక అంటూ ఏదేదో అంటున్నడు. ధాన్యం కొనుగోళ్లపై పచ్చి అబద్ధాలతో దివాళాకోరు రాజకీయం చేస్తున్నరు. మీరు ధాన్యం కొంటామంటే మేం వద్దంటున్నమా? రైతులు పంట పండించి ఆత్మహత్యలు చేసుకోవాలా? అగ్రికల్చర్ పాలసీ తోక కూడా కూడా కిషన్‌రెడ్డికి తెలియదు. తెలంగాణ రైతులకు క్షమాపణ చెప్పాలె రైతుల బాధలు చెప్పేందుకు రాష్ట్ర మంత్రులు, ఎంపీలు వెళితే కేంద్రమంత్రి పీయుష్ గోయల్ ‘మీకు వేరే పనిలేదా?’అంటున్నారు. వరిసాగు విస్తీర్ణం విషయంలో కేంద్రం పచ్చి అబద్ధాలు చె ప్పింది. నాసిరకం విత్తనాల విషయంలో పీడీ చట్టం తెచ్చిన ఏకైక రాష్ట్రం తెలంగాణ. నాసిరకం విత్తనాలపై కిషన్‌రెడ్డికి ఏం తెలుసు. కేంద్రంలో ఆయనను దేకను కూడా దేకరు. హీనంగా చూస్తరు. పెద్ద నోరు తో మాట్లాడితే సరిపోతుందా? గ్లోబల్ హంగర్ ఇండెక్స్‌లో మనం నేపాల్, పాకిస్తాన్, బంగ్లాదేశ్ కంటే దిగువన 101వ స్థానంలో ఉన్నాం. సిగ్గు, లజ్జ ఉంటే గోయల్, కిషన్‌రెడ్డి కళ్లు తెరవాలి. రేపు తెలంగాణ రైతులకు కూడా మీరు క్షమాపణ చెప్పాలి. ఒక్కో పల్లెలో కోట్ల రూపాయలు తెలంగాణ వస్తే భూముల ధరలు పడిపోతాయని బుట్టచోర్గాళ్లు, దరిద్రులు అన్నారు. గతంలో ఆంధ్రాలో ఎకరం అమ్మి ఇక్కడ మూడెకరాలు కొంటే.. ఇప్పుడు తెలంగాణలో ఎకరం అమ్మి ప్రకా శం జిల్లాలో ఐదు ఎకరాలు కొంటున్నారు. ఒక్కో పల్లెలో కోట్లాది రూపాయలు ఉంటున్నాయి. మేధావులు ఆలోచించాలె ఆర్థికంగా నంబర్ వన్ స్థానంలో ఉన్న తెలంగాణలో సామాజిక వాతావరణం దెబ్బతినకుండా మేధావులు ఆలోచించాలి. రేపు పొద్దున మత కలహాలు మొదలై.. కర్ఫ్యూలు, లాఠీచార్జీలు, ఫైరింగ్‌లు పెడితే ఈ పరిస్థితి ఉంటదా? బీజేపీని అంగీకరించి తెలంగాణ, హైదరాబాద్ వాతావరణాన్ని దెబ్బతీసుకుందామా? వీళ్లను నమ్మితే సర్వనాశనమే. వారిపై ఎందాకైనా, ఏది అడ్డువచ్చినా పోరాడుతం. -
సీఎం కేసీఆర్ కరీంనగర్ పర్యటన
-
'తెలంగాణ దళిత బంధు' పథకంపై ఎన్నారైల హర్షం
తెలంగాణ ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన 'దళిత సాధికారత' పథకానికి సీఎం కేసీఆర్ 'దళిత బంధు' అని నామకరణం చేసిన విషయం తెలిసిందేనని ఎన్నారై తెరాస వ్యవస్థాపక అధ్యక్షుడు అనిల్ కూర్మాచలం తెలిపారు. రూ.1200 కోట్లతో దళిత బంధు పథకం ప్రారంభంకానుందని ఇటీవల జరిగిన అఖిల పక్ష సమావేశంలో సీఎం కేసీఆర్ తెలిపారని. మొదటి దశలో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 100 కుటుంబాల చొప్పున రాష్ట్రవ్యాప్తంగా 11,900 కుటుంబాలకు ఆర్థిక సాయం అందిస్తారని అనిల్ తెలిపారు. అన్ని వర్గాల ఆశాజ్యోతిలా ముఖ్యమంత్రి కెసిఆర్ గారు దళితుల సాధికారత కోసం తెచ్చిన 'తెలంగాణ దళిత బంధు' పథకాన్ని ఎన్నారైలంతా హర్షిస్తున్నారని, పేదల పట్ల అణగారిన వర్గాల అభివృద్ధి పట్ల చిత్తశుద్ధి ఉన్న ఏకైక నాయకుడు కెసిఆర్ మాత్రమేనని ఎన్నారైలంతా ప్రశంశించినట్టు అనిల్ కూర్మాచలం తెలిపారు. గత పాలకులంతా దళితులని ఓటు బ్యాంక్ లాగ మాత్రమే చూసారని ఎన్నడు కూడా వారి అభివృద్ధి కోసం పని చేయలేదని ఒక్క కెసిఆర్ గారు మాత్రమే దళితులంతా గౌరవంగా బతకాలని, సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా ఎదగాలని అహర్నిశలు శ్రమిస్తున్ననారని మరి సందర్భం ఏదైనా కెసిఆర్ గారి నాయకత్వాన్ని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. నాడు హుజురాబాద్ లో రైతు బంధు పథకం ప్రారంభించినప్పుడు ప్రత్యక్షంగా కార్యక్రమంలో పాల్గొన్నానని, అలాగే నేడు 'తెలంగాణ దళిత బంధు' పథకం ప్రారంభానికి కూడా హ్యాజరయ్యే అదృష్టం కలిగిందని అనిల్ కూర్మాచలం సంతోషం వ్యక్తం చేసి,అవకాశం కలిపించిన కెసిఆర్ గారికి మరియు స్థానిక నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. -
Telangana: జూన్ 15నుంచి రైతుబంధు
సాక్షి, హైదరాబాద్: వచ్చే నెల 15వ తేదీ నుంచి రైతుబంధు ఆర్థిక సహాయం పంపిణీ ప్రారంభించి 25వ తేదీలోగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదేశించారు. గత యాసంగిలో అవలంబించిన విధానాన్నే ఇప్పుడూ అనుసరిస్తూ రైతుల ఖాతాల్లో నేరుగా డబ్బులు జమ చేయాలని ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి కె.రామకృష్ణారావుకు సూచించారు. ఇప్పటిదాకా ఇచ్చిన కేటగిరీల వారీగానే రైతు బంధు ఆర్థిక సాయాన్ని ఖాతాలో వేయాలన్నారు. జూన్ 10ని కటాఫ్ తేదీగా పెట్టుకుని, ఆ తేదీలోగా పార్ట్–బీ (ధరణిలోని నిషేధిత భూముల జాబితా) నుంచి పార్ట్–ఏ లోకి చేరిన భూములకు సైతం రైతుబంధు వర్తింపజేయాలని ఆదేశించారు. శనివారం ప్రగతిభవన్‌లో వ్యవసాయ శాఖపై సీఎం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. పీడీ యాక్టు కింద అరెస్టులు చేయండి ‘వారం రోజుల్లో రుతుపవనాలు వస్తున్నందున రైతులకు అవసరమైన నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులను అందుబాటులో ఉంచాలి. పత్తి, కంది, వరి ధాన్యం విత్తనాలను అవసరమైన మేరకు సేకరించి రైతులకు అందించాలి. కల్తీ విత్తనాలు, పురుగుల మందులపై, బయో పెస్టిసైడ్స్ పేరుతో మార్కెట్లోకి వస్తున్న కల్తీ ఉత్పత్తుల మీద వ్యవసాయ, పోలీసు, ఇంటెలిజెన్స్ శాఖలు ఉక్కుపాదం మోపాలి. జిల్లాల్లో కల్తీ విత్తన తయారీదారులపై దాడులు జరపాలి. వలవేసి పట్టుకోవాలి. ఎంతటి వారినైనా పీడీ యాక్టు కింద అరెస్టు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. చిత్తశుద్ధితో పనిచేసి కల్తీ విత్తన విక్రయ ముఠాలను పట్టుకున్న వ్యవసాయ, పోలీసు శాఖ అధికారులకు ఆక్సిలరీ ప్రమోషన్, ప్రోత్సాహకాలతో పాటు ఉత్తమ సేవ పతకం అందజేస్తాం..’అని సీఎం ప్రకటించారు. తక్షణమే జిల్లాల వారీగా పోలీసులను రంగంలోకి దించాలని డీజీపీని ఫోన్లో ఆదేశించారు. నిఘావర్గాల ద్వారా కల్తీ విత్తన తయారీ ముఠాలను కనిపెట్టాలని ఇంటిలిజెన్స్ ఐజీని ఆదేశించారు. మీరు నర్సింహావతారం ఎత్తాలె.. ‘ఇగ మీరు నర్సింహావతారం ఎత్తాలె. దొరికినోన్ని దొరికినట్టే పట్టుకొని íపీడీయాక్టు పెట్టాలె. ఇగ తెలంగాణల కల్తీ విత్తనాలు అమ్మలేమురా అనేటట్టు మీ చర్యలుండాలె. కల్తీ విత్తనాల మీద యుద్దం ప్రకటించాలె’అని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. కల్తీని అరికట్టడానికి చట్ట సవరణ చేయాలని, అవసరమైతే ఆర్డినెన్స్ జారీ చేయాలని సీఎస్ సోమేశ్ కుమార్‌ను కోరారు. అనుమతి కలిగిన కంపెనీల ద్వారానే విత్తనాలు, పురుగుల మందుల విక్రయాలు జరిగేలా చూడాలని, ప్రభుత్వం జారీ చేసే క్యూఆర్ కోడ్ సీడ్ ట్రేసబిలిటీ విధానాన్ని అమలు చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డికి కేసీఆర్ సూచించారు. స్మార్ట్ ఫోన్‌తో క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేస్తే తక్షణమే విత్తన కంపెనీల పూర్తి వివరాలు తెలుసుకోవచ్చని ముఖ్యమంత్రి వివరించారు. ‘వ్యవసాయ అధికారులు ఎవరైన కల్తీ విత్తన ముఠాలతో కుమ్మక్కై వారికి సహకరించినట్టు రుజువైతే తక్షణమే ఉద్యోగం నుంచి తొలగించడంతో పాటు ఐదేళ్ల జైలు శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలి. కల్తీ నియంత్రణ కోసం జిల్లా వ్యవసాయ అధికారి, అసిస్టెంట్ డైరెక్టర్లు బాధ్యత వహించాలి. కల్తీ నిర్మూలనపై జిల్లా కలెక్టర్లు ఎస్పీలు, పోలీసు కమిషనర్లు సమీక్షలు నిర్వహించాలి. తెలంగాణలో గోదాముల సామరŠాధ్యన్ని 40 లక్షల టన్నులకు పెంచేందుకు మార్కెంటింగ్ శాఖ చర్యలు తీసుకుంటోంది..’అని సీఎం తెలిపారు. వ్యవసాయ శాఖ రోజు రోజుకూ విస్తరిస్తున్న నేపథ్యంలో ఉన్నతాధికారులను నియమించుకోవాలని సూచించారు. విత్తనాలు వెదజల్లే పద్ధతిని ప్రోత్సహించాలి విత్తనాలు వెదజల్లి వరి సాగు చేస్తే.. రెండు పంటలకు కలిపి ఏడాదిలో కోటి ఎకరాలు సాగు చేసే తె లంగాణ రైతులకు సుమారు రూ.10 వేల కోట్లపైనే పెట్టుబడి మిగులుతుందని ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. ‘ఈ పద్ధతిలో సాగు చేస్తే ఎకరానికి 2–3 బస్తాలు (1–2 క్వింటాళ్లు) అధిక దిగుబడి వచ్చే అవకాశం ఉంది. దీని గురించి రైతులకు అధికారులు విస్తృత అవగాహన కల్పించాలి. వరి విత్తనాలను వెదజల్లడం ద్వారా బురదలో కాలు పెట్టకుండానే వరి పంట వేసుకోవచ్చు. నారు పోసే పని లేదు. నారు పీకే పని లేదు. నాటు పెట్టే పని లేదు. కూలీల కోసం గొడవ లేదు. కలుపు కూలీల ఇబ్బంది లేదు. నీటి వినియోగం 30– 35 శాతం తగ్గుతుంది. 10–15 రోజుల ముందు పంట వస్తుంది. మామూలు పద్ధతిలో అయితే ఎకరానికి 25 కిలోల విత్తనాలు కావాలి. ఈ వెదజల్లే పద్ధతి అయితే 8కిలోల విత్తనపొడ్లు సరిపోతయి. వడ్లు సల్లినంక ఎన్ని రోజులకైనా నీళ్లు కట్టుకోవచ్చు. విత్తనపొడ్లు వెదజల్లినంక వర్షం పడే దాక కొన్నిరోజులు ఎదురు చూస్తే ఇంకా మంచిది. కాళేశ్వరం సహా అన్ని సాగు నీటి ప్రాజెక్టులు, లిఫ్టులు, సుమా రు 30 లక్షల బోరుబావుల పరిధిలో వరి సాగు చేసే రైతులకు ఈ పద్ధతి చాలా ఉపయోగపడుతుంది. ధాన్యం కొనుగోళ్లలో కేంద్రం వివక్ష తగదు ‘రాష్ట్రంలో రైతుల నుంచి ధాన్యాన్ని కొనడం అంటే ఒక సాహసం. దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయని సాహసాన్ని తెలంగాణ చేసింది. కరోనా సమయం లో లారీలు, హమాలీలు, డ్రైవర్లు అన్నీ కొరతే అయి నా వాటన్నిటినీ అధిగమిస్తూ, ఇప్పటికే 87శాతం ధాన్యం సేకరించినం. మరో నాలుగైదు రోజుల్లో సంపూర్ణంగా సేకరిస్తాం. ఎఫ్‌సీఐతో మాట్లాడి ఎం త ధాన్యం వచ్చినా తప్పకుండా ప్రభు త్వం కొం టుంది. రైతులు ఎట్టి పరిస్థితుల్లోనూ భయాందోళనలకు గురికావద్దు. ఆగమాగం కావద్దు. తెలంగాణలో పండుతున్న వరి ధాన్యం మొత్తాన్ని కొనాల్సిందిగా కేంద్రాన్ని కోరనున్నాం. ఈ మేరకు ప్రధానికి లేఖ రాయనున్నాం..’అని కేసీఆర్ తెలిపారు. పంజాబ్ వంటి రాష్ట్రాల్లో వంద శాతం ధాన్యం సేకరిస్తున్న ఎఫ్‌సీఐ .. తెలంగాణలో సేక రించక పోవడంపై సీఎం అసంతృప్తి్త వ్యక్తం చేశా రు. కేంద్రం ఇలా వివక్ష చూపడం సరికాదన్నారు. మా లక్ష్యం నెరవేరింది గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పరిపుష్టం కొత్త రాష్ట్రం తెలంగాణలో వ్యవసాయ రంగానికి పునరుజ్జీవం పోసి గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పరిపుష్టం చేయాలన్న ప్రభుత్వ లక్ష్యం నెరవేరిందని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. ‘మిషన్ కాకతీయ, సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంతో కోటి ఎకరాల మాగాణిగా తెలంగాణను తీర్చిదిద్దడంలో విజయం సాధించాం. రాష్ట్ర వ్యవసాయ రంగ ముఖ చిత్రాన్ని గుణాత్మకంగా మార్చి వేశాం. కేసులేసి ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా, అవాకులు చెవాకులు పేలినా, కాళేశ్వరం వంటి ప్రాజెక్టుల నిర్మాణాన్ని వెనకడుగు వేయకుండా పట్టుపట్టి పూర్తి చేసుకోగలిగాం. తద్వారా తెలంగాణ రైతుకు నేడు వ్యవసాయం మీద ధీమా పెరిగింది. తెలంగాణ వ్యవసాయం ఎక్కడ ప్రారంభమైంది. ఎంత ఉన్నత స్థాయికి చేరుకున్నదనే విషయాన్ని పరిశీలించినప్పుడు సంభ్రమాశ్చర్యం కలుగుతుంది. నీటికి కటకటలాడిన తెలంగాణలో నేడు 75 శాతం చెరువులు నదీ జలాలలతో నిండి ఉన్నయి. నడి వేసవిలో నిండుకుండలను తలపిస్తున్నయి. పంజాబ్‌తో సమానంగా దిగుబడి రెండు పంటలకు కలిపి రాష్ట్రంలో నేడు కోటిన్నర టన్నుల ధాన్యాన్ని పండిస్తున్నారంటే మామూలు విషయం కాదు. పంజాబ్‌కు సరిసమానంగా తెలంగాణలో వరి దిగుబడి అవుతున్నది. అలాగే ప్రభుత్వం ఒక్క గింజను కూడా పోనియ్యకుండా నేరుగా రైతుల కల్లాల్లోనే కొంటున్నది..’అని సీఎం అన్నారు. ఈ విషయాన్ని అర్థం చేసుకోకుండా కొన్ని ప్రతిపక్షాలు కుయుక్తులకు పాల్పడుతుంటే రైతులు తిప్పి కొడుతున్నారని, వారి ఆటలు సాగనిస్తలేరని కేసీఆర్ పేర్కొన్నారు. రైతుబంధు సహాయం వల్ల రైతులు శావుకారు దగ్గరికి అప్పులకు పోకుండా సకాలంలో ఎరువులు, విత్తనాలు కొని అధిక దిగుబడిని సాధించగలుగుతున్నారని చెప్పారు. రైతుబంధు కింద రూ.35,676 కోట్లు జమ సాక్షి, హైదరాబాద్: రైతన్నల వ్యవసాయ వ్యయాన్ని కొంతమేరకు తగ్గించడంలో భాగంగా సీఎం కేసీఆర్ ప్రభుత్వం 2018 నుంచి యేటా రెండు దఫాలుగా రైతుబంధు పథకం కింద ఆర్థిక సాయాన్ని నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో జమచేస్తోంది. ఇప్పటి వరకు మొత్తం రూ.35,676 కోట్లను రైతుల బ్యాంకు ఖాతాల్లో జమచేసింది. అందులో గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి వానాకాలం, యాసంగి పంటల కోసం రైతుల ఖాతాల్లోకి రూ.14,656.01 కోట్ల రూపాయలను జమచేసింది. ఈసారి వానాకాలం పంటల కోసం రైతులకు వారి బ్యాంకు అకౌంట్లలో జూన్ 15 నుంచి 25వ తేదీలోగా మరో దఫా ఆర్థిక సాయాన్ని అందించనుంది. 2020 సంవత్సరం వానాకాలం సమయంలో 58.02 లక్షల మంది రైతులు సాగు చేసుకునే 145.77 ఎకరాల కోసం రూ.7,288.70 కోట్లు, అలాగే 2020–21 యాసంగి కాలానికి గాను 59.32 లక్షల మంది రైతులకు 147.35 లక్షల ఎకరాల కోసం రూ.7,367.32 కోట్లు వారి బ్యాంకు ఖాతాల్లో వేసింది. చదవండి: ఇక ఐటీ ప్రాంతానికి వేగంగా ప్రయాణించే అవకాశం: కేటీఆర్ -
ఈటల రాజేందర్ బర్తరఫ్‌పై నిరసన
మంచిర్యాల: ఈటల రాజేందర్‌ను మంత్రి పదవి నుంచి ప్రభుత్వం బర్తరఫ్ చేయడాన్ని నిరసిస్తూ జిల్లా కేంద్రంలోని చార్వాక భవన్లో తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం నాయకులు ఆయనకు మద్దతుగా నిరసన దీక్ష చేపట్టారు. సంఘం జిల్లా అధ్యక్షుడు డాక్టర్ నీలకంఠేశ్వర్రావు మాట్లాడుతూ నిరాధారమైన ఆరోపణలు చేస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. మంత్రివర్గంలోని అవినీతిపరులు, భూకబ్జాదారులపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర బీసీ యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు రాంశెట్టి నరేందర్, బీసీ సంక్షేమ సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు ఒడ్డెపల్లి మనోహర్, ముత్తోజు రమేశ్, జిల్లా కార్యదర్శి గుండోజు రమేశ్, నాయకుడు రాజన్న పాల్గొన్నారు. -
నిధులిస్తేనే నీళ్లు నిలిపేది!
సాక్షి, హైదరాబాద్: కృష్ణా జలాల ఆధారంగా చేపట్టిన పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టును పరుగులు పెట్టించే యత్నాలు మొదలుపెట్టిన ప్రభుత్వం అందులో అంతర్భాగమైన డిండి ఎత్తిపోతల పైనా ఒకట్రెండు రోజుల్లో పూర్తిస్థాయిలో సమీక్షకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది డిసెంబర్లో పాలమూరు ప్రాజెక్టును పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకోగా, డిండిని సైతం అదే సమయానికి సిద్ధం చేయాలని భావిస్తోంది. అయితే పాలమూరుకు ఉన్నట్లుగా డిండి ప్రాజెక్టుకు ఎలాంటి రుణాలు లేకపోవడంతో రాష్ట్ర నిధుల నుంచే కేటాయింపులు చేయాల్సి ఉంది. ముఖ్యంగా భూసేకరణ ప్రక్రియకు, ఆర్అండ్ఆర్ ప్రక్రియకు నిధుల చెల్లింపులో జరుగుతున్న జాప్యం ప్రాజెక్టుకు అవరోధాలు సృష్టిస్తోంది. నిధులే ప్రధాన సమస్య.. మొత్తం 3.61 లక్షల ఎకరాలకు నీళ్లిచ్చేలా రూ.6,190 కోట్లతో డిండి ఎత్తిపోతల ప్రాజెక్టును చేపట్టిన విషయం తెలిసిందే. పాలమూరులో భాగంగా ఉన్న వట్టెం రిజర్వాయర్ నుంచి నీటిని తీసుకునేలా ఇటీవలే అలైన్మెంట్ ఖరారు చేశారు. కొత్త అలైన్మెంట్తో కొన్ని రిజర్వాయర్లు కొత్తగా వస్తుండగా, వాటి నిర్మాణ పనులు మొదలు పెట్టాల్సి ఉంది. ఈ అలైన్మెంట్ ఖరారుకు ముందే సింగరాజుపల్లి, ఎర్రవల్లి, గొట్టిముక్కల, కిష్టరాంపల్లి, శివన్నగూడెం రిజర్వాయర్ల నిర్మాణాన్ని చేపట్టారు. మొత్తంగా ప్రాజెక్టు కింద 16,250 ఎకరాల మేర భూసేకరణ చేయాల్సి ఉండగా, 8,900 ఎకరాల మేర భూసేకరణ పూర్తి చేశారు. ఈ భూసేకరణకు సంబంధించి రూ.110 కోట్ల బిల్లులు చెల్లించాల్సి ఉంది. ఇక రిజర్వాయర్ల నిర్మాణంతో మొత్తంగా 8 గ్రామాలు ముంపునకు గురౌతుండగా, ఇందులో గొట్టిముక్కల కింద 2, సింగరాజుపల్లి కింద 2, కిష్టరాంపల్లి కింద మరో 4 ఉన్నాయి. ఈ ఆర్‌అండ్‌ఆర్‌కు సంబంధించి రూ.80 కోట్ల మేర నిధులు అవసరం ఉన్నాయి. వీటితో పాటు పెండింగ్ బిల్లులు మరో రూ.70 కోట్ల వరకు ఉన్నాయి. ఈ నిధుల విడుదలకై ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సి ఉంది. ఈ రిజర్వాయర్లలో గొట్టిముక్కల రిజర్వాయర్ నిర్మాణం పూర్తయింది. స్థానిక పరీవాహకం నుంచి వచ్చే నీటి ఆధారంగానే నీటిని నిల్వచేసే అవకాశమున్నా, రిజర్వాయర్ పరిధిలో 350 ఎకరాల మేర భూసేకరణ చేయాల్సి ఉండగా, 112 కుటుంబాలను తరలించాల్సి ఉంది. దీనికై మొత్తంగా రూ.30 కోట్ల మేర నిధులు తక్షణమే విడుదల చేయాల్సి ఉంది. వీటి విడుదలకు ప్రభుత్వ పెద్దలు హామీ ఇచ్చినా ఇంకా నిధుల విడుదల జరుగలేదు. ఈ నిధులు విడుదల చేసి భూసేకరణ ప్రక్రియ పూర్తి చేస్తే స్థానిక పరీవాహకం నుంచే దీనికింద 14 వేల ఎకరాల మేర ఆయకట్టుకు నీరిచ్చే అవకాశం ఉంది. సింగరాజుపల్లిలోనూ 71 ఎకరాల మేర భూసేకరణతో పాటు పనులకు సంబంధించిన పెండింగ్ బిల్లులు చెల్లించాల్సి ఉంది. ఇవి చెల్లిస్తే ఇక్కడ 5 నుంచి 6 వేల ఎకరాల ఆయకట్టుకు నీరిచ్చే అవకాశం ఉంది. ఇక ఈ రిజర్వాయర్లకు సంబంధించి రూ.34 కోట్ల మేర పెండింగ్ బిల్లులున్నాయి. ఈ నిధులకై ఆర్థిక శాఖ చుట్టూ చక్కర్లు కొడుతున్నా, ఫలితం లేదు. ఇక చింతపల్లి రిజర్వాయర్ పరిధిలో భూసేకరణకు తమకు అవార్డు ప్రకారం కాకుండా మల్లన్నసాగర్లో ఇచ్చిన మాదిరి పరిహారం ఇవ్వాలని కోరుతున్నారు. ఈ సమస్యలను పరిష్కరిస్తేనే ప్రాజెక్టు ముందుకు వెళ్లనుంది. ఈ నేపథ్యంలో ఒకట్రెండు రోజుల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ జరుపనున్న సమీక్షలో వీటికి ఓ పరిష్కారం లభిస్తుందని నీటిపారుదల వర్గాలు భావిస్తున్నాయి. -
సీఎం పరిశీలనలో డీఎస్సీ
సాక్షి, హైదరాబాద్: ఉపాధ్యాయుల నియామకం కోసం తెలంగాణలో త్వరలో డీఎస్సీ వేసే అంశం సీఎం పరిశీలన లో ఉందని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. బుధవారం శాసనసభలో పద్దులపై చర్చ సందర్భంగా సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు. లాక్డౌన్ కారణంగా గతేడాది పది, ఇంటర్ విద్యార్థులను పరీక్ష లేకుండానే పాస్ చేసినట్లు తెలిపారు. ఈ విద్యా సంవత్సరంలో దూరదర్శన్, డిజిశాట్ ద్వారా 85 శాతం విద్యార్థులకు పాఠాలు బోధించామన్నారు. ఇటీవల హైదరాబాద్ వరదల్లో సర్టిఫికెట్లు పోగొట్టుకున్న వారికి తిరిగి కొత్తవి ఇచ్చామన్నారు. రాష్ట్రంలో గురుకులాలు, మోడల్, కేజీబీవీ విద్యార్థులు అన్ని ప్రవేశపరీక్షల్లో జాతీయస్థాయిలో మంచి ప్రతిభ కనబరుస్తున్నారని తెలిపారు. వర్సిటీల్లో వీసీల నియామకాలు చేస్తామన్నారు. డీఎస్సీ అంశం సీఎం పరిధిలో ఉందని, ఆయన పరిశీలిస్తున్నారని అన్నారు. ప్రైవేటు టీచర్ల జీతాలపై తిరుపతిరావు కమిటీ నిర్ణయం తీసుకుంటుందన్నారు. కరోనా ముప్పు పోలేదు: ఈటల ‘ఆసుపత్రుల్లో ఖాళీల భర్తీ ప్రక్రియ ఇప్పటికే మొదలైంది. తప్పకుండా త్వరలోనే ఖాళీలను భర్తీ చేస్తాం. సిద్దిపేట, నల్లగొండ తదితర తొమ్మిది మెడికల్ కాలేజీల్లో నిమ్స్, గాంధీ ఆసుపత్రుల స్థాయి సేవలందిస్తాం. నేరుగా పెద్ద ఆసుపత్రులకు రాకుండా పీహెచ్సీ, జిల్లా తరువాత నిమ్స్, గాంధీకి వచ్చేలా ప్రణాళిక రూపొందిస్తున్నాం. దేశంలో కుటుంబ నియంత్రణలో ముందున్నాం. వ్యాక్సినేషన్లో 96 శాతంతో ముందంజలో ఉన్నాం. కోవిడ్ నియంత్రణలో దేశంలో తొలిమూడు స్థానాల్లో నిలిచిన రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి. కరోనా విషయంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. రెండోసారి సోకే ప్రమాదముంది. మాస్కులు, టెస్టులు, వెంటిలేటర్లు, మందులు దేనికీ కొరత లేదు. 5 వేలకు పైగా ఆక్సిజన్ బెడ్లు అందుబాటులో ఉన్నాయి’అని ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ సభ్యులకు సమాధానమిచ్చారు. డీఎస్సీ నిర్వహించాలి హైదరాబాద్:ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల పోస్టులు పెద్ద సంఖ్యలో ఖాళీగా ఉన్నాయని, విద్యా బోధనలో నాణ్యత పడి పోకుండా వచ్చే జూన్‌లోగా ప్రత్యేక డీఎస్సీ ద్వారా ఈ పోస్టులు భర్తీ చేయాలని టీఆర్ఎస్ సభ్యుడు సండ్ర వెంకట వీరయ్య, బీజేపీ సభ్యుడు రఘునందన్‌రావు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. పాఠశాలల్లో పారిశుధ్య సిబ్బందిని తిరిగి నియమించాలని సూచించారు. విద్య, వైద్యం, పురపాలక, ఆబ్కారీ, అటవీ, దేవాదాయ తదితర శాఖల 2021–22 వార్షిక బడ్జెట్ పద్దులపై బుధవారం శాసనసభలో జరిగిన చర్చలో పలువురు అధికార, విపక్ష పార్టీల సభ్యులు మాట్లాడారు. మధ్యాహ్న భోజనం పెండింగ్ బిల్లులు చెల్లించాలని సండ్ర కోరారు. జూనియర్ కళాశాలలు లేని మండల కేంద్రాల్లో వాటిని ఏర్పాటు చేయాలన్నారు. ప్రైవేటు పాఠశాలల ఉపాధ్యాయుల జీతాల చెల్లింపులపై ప్రభుత్వ నియంత్రణ ఉండే విధానం తీసుకురావాలన్నారు. ఎంఈఓ ఖాళీలు భర్తీ చేయాలన్నారు. జిల్లా, మండల కేంద్రాల్లో విలేకరులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని సోషల్ మీడియా, యూట్యూబ్ జర్నలిస్టులు వస్తున్నారని, ఎవరు జర్నలిస్టులనేది ప్రభు త్వం నిర్వచించాలన్నారు. టీఆర్టీ పోస్టులకు ఎంపికైన 250 మందిని పక్కనపెట్టారని, వీరిలో అర్హులను గుర్తించి ఉద్యోగాల్లో నియమించాలని రఘునందన్‌రావు కోరారు. ప్రతి నియోజకవర్గంలో ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటు చేయాలన్నారు. నియోజకవర్గ కేంద్రాల్లో 100 పడకల ఆస్పత్రుల నిర్మాణాన్ని సత్వరం పూర్తిచేసి స్పెషలిస్టు వైద్యులు, పారామెడికల్ సిబ్బందిని నియమించాలన్నారు. కరోనా నేపథ్యంలో గాంధీ, టిమ్స్, జిల్లా ఆస్ప త్రుల్లో నియమించిన తాత్కాలిక పారా మెడికల్ సిబ్బందికి ఉద్యోగ భద్రత కల్పించి వేతనాలు పెంచాలన్నారు.ధూపదీప నైవేద్యాల పథకం కింద ఇస్తున్న నిధులను పెంచాలన్నారు. ఇతరుల పేరుతో రిజిస్ట్రేషన్ చేసిన దేవాలయ, వక్ఫ్ భూములను తిరిగి ఆయా సంస్థలకు అప్పగిం చాలని సూచించారు. కిడ్నీ రోగుల అవసరాలను తీర్చడానికి డయాలసిస్ కేంద్రాల్లో పరికరాల సంఖ్య పెంచాలని సంజయ్ సూచించారు. -
సాగునీటి వ్యవస్థలను పటిష్టం చేయాలి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో సాగునీటి వ్యవస్థలను పటిష్టం చేయాలని, ఇందుకోసం ఇరిగేషన్ శాఖ ఓ అండ్ ఎం (ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్) విభాగాన్ని మరింత బలోపేతం చేయాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంతో రాష్ట్రంలో పంట పొలాలకు నిరంతరం నీరందిస్తున్నామని, రాష్ట్ర సాధన తర్వాత తెలంగాణలో సాగునీటి రంగానికి ప్రాధాన్యం పెరిగిందని ఆయన అన్నారు. పాలమూరు, కల్వకుర్తి, జూరాల అనుసంధానం, కాలువల నిర్మాణాలు, విస్తరణ మీద బుధవారం మూడో రోజు ప్రగతిభవన్‌లో సీఎం సమీక్షా సమావేశం నిర్వహిం చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, బ్యారేజీల నుంచి మొదలుకుని చివరి డిస్ట్రిబ్యూటరీ కెనాల్ దాకా.. నీటిని తీసుకెల్లే అన్ని వ్యవస్థలను పటిష్ట పరుచుకోవాలన్నారు. కాల్వలు, పంపులు, బ్యారేజీల గేట్లు, రిజర్వాయర్లు తదితర అన్నిరకాల వ్యవస్థలను నిరంతరం పర్యవేక్షిస్తుండాలన్నారు. సమస్యలను వెంటనే పరిష్కరించుకుంటూ నీటిపారుదలను సక్రమంగా నిర్వహించాలన్నారు. మరమతుల కోసం రెండు పంటల నడుమ ఖాళీ సమయాన్ని వినియోగించుకోవాలని సీఎం సూచిం చారు. ఓఅండ్‌ఎంకు ప్రత్యేక అధికారులను నియమించాలన్నారు. ప్రతి సాగునీటి కాల్వ చెత్తా, చెదారం లేకుండా అద్దంలా ఉండాలని అన్నారు. -
‘ఆ శాఖను బలవంతంగా రుద్దేవారు’
సాక్షి, హైదరాబాద్: గతంలో పశుసంవర్థక శాఖను బలవంతంగా అంటగట్టేవారంటూ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ అసెంబ్లీలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పద్దులపై చర్చకు ఆయన సమాధానాలు ఇచ్చే సందర్భంగా మాట్లాడుతూ.. ‘నేను 25 ఏళ్లుగా ఎమ్మెల్యేగా, సుదీర్ఘకాలం మంత్రిగా పనిచేశాను. ఎవరికో ఒకరికి ఓ మంత్రిత్వ శాఖ ఇవ్వాలి కాబట్టి ఇచ్చేవారు. అందులో కనీసం నిధులు కూడా ఉండేవి కావు. కానీ కేసీఆర్ సీఎం అయ్యాక దాని రూపురేఖలే మారిపోయాయి. భారీగా నిధులు ఇస్తున్నారు. ఇప్పుడు అది ప్రధాన శాఖగా మారింది’ అని తలసాని పేర్కొన్నారు. దేశానికి 1947లో స్వాతంత్య్రం వచ్చినా.. తెలంగాణ బడుగు బలహీన వర్గాలకు మాత్రం కేసీఆర్ సీఎం అయ్యాకే స్వాతంత్య్రం వచ్చినట్లని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. జీవాలకు ప్రత్యేకంగా అంబులెన్సులు ఏర్పాటు చేసిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. గతంలో ప్రభుత్వాలు విజయ డెయిరీని దివాలా తీయిస్తే ఇప్పుడు దాన్ని పటిష్టం చేసి ఆదాయాన్ని పెంచినట్లు చెప్పారు. -
రిటైర్మెంట్ వయసు పెంపుతో 43,811మందికి లబ్ధి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వోద్యోగుల రిటైర్మెంట్ వయసును ప్రభుత్వం 61 ఏళ్లకు పొడిగించడంతో 43,811 మందికి (2025 వరకు లెక్కిస్తే) ఉద్యోగంలో కొనసాగే అవకాశం దక్కింది. వివిధ శాఖల్లో జనవరిలో 440 మంది, ఫిబ్రవరిలో 444 మంది పదవీ విరమణ పొందారు. ఈ నెలలో మరో 563 మంది రిటైర్ కావాల్సి ఉండగా సీఎం ప్రకటనతో వారు సర్వీసులో కొనసాగే అవకాశం దక్కింది. వారితో సహా ఈ ఏడాది పదవీ విరమణ పొందే వారు 7,954 మంది మరో మూడేళ్లు కొలువులో కొనసాగనున్నారు. వచ్చే ఏడాది రిటైరయ్యే వారు, ఆ తరువాత ఏళ్లలో రిటైరయ్యే వారికి రిటైర్మెంట్ వయసు పెంపు ప్రయోజనం లభించనుంది. 2025 వరకు తీసుకుంటే మొత్తంగా 43,811 మందికి అదనంగా మూడేళ్లు ఉద్యోగంలో కొనసాగే అవకాశం దక్కనుంది. మరోవైపు ఉద్యోగులు రిటైరయ్యాక లభించే రూ. 12 లక్షల గ్రాట్యుటీని రూ. 16 లక్షలకు పెంచుతున్నట్లు సీఎం ప్రకటించారు. దీంతో ఆ ప్రయోజనాలు సర్వీసులో ఉన్న అందరికీ లభించనున్నాయి. పీఆర్సీని 12 నెలల ముందు నుంచే అమలు చేస్తామని సీఎం పేర్కొనడంతో 2020 ఏప్రిల్ 1 నుంచి మార్చి 21 వరకు రిటైరైన 7,080 మంది పెన్షనర్లకు కూడా గ్రాట్యుటీ ప్రయోజనాలు అందనున్నాయి. వారికి అదనంగా రూ. 4 లక్షల చొప్పున ప్రయోజనం చేకూరనుంది. వాస్తవానికి పీఆర్సీని 2018 జూలై 1 నుంచి అమలు చేయాల్సి ఉంది. అయితే కటాఫ్‌గా దానినే తీసుకున్నా.. 2020 ఏప్రిల్ 1 నుంచే అమలు చేస్తామని సీఎం ప్రకటించారు. అంటే అప్పటి నుంచి 2021 మార్చి 31 వరకు బకాయిలను పెన్షన్‌లో జమ చేయనున్నారు. దీంతో పీఆర్సీ అమలు చేయాల్సిన 2018 జూలై 1 నుంచి 2020 మార్చి 31లోగా రిటైర్ అయిన దాదాపు 12,500 మందికి గ్రాట్యుటీ పెంపు రూపంలో అందాల్సిన రూ. 4 లక్షల అదనపు నగదు ప్రయోజనాలు అందకుండా పోయే పరిస్థితి నెలకొంది. -
టీఆర్ఎస్లో సైలెంట్ వార్
వికారాబాద్: స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కొండల్‌రెడ్డి మధ్య కొనసాగుతున్ను గ్రూపు తగాదాలు మంత్రి సబితారెడ్డి ముందు మరోమారు బహిర్గతమయ్యాయి. పట్టణంలోని లైబ్రరీ ఆవరణలో రూ.కోటితో నిర్మించనున్న రీడింగ్ భవన నిర్మాణ శంకుస్థాపనకు జిల్లాలోని నలుగురు ఎమ్మెల్యేలు హాజరయ్యారు. అయితే స్థానిక ఎమ్మెల్యే ఆనంద్ వర్గీయులు ఎవరూ రాకపోవడం చర్చనీయాంశంగా మారింది. కొంత కాలంగా మర్పల్లి మండలంలో ఎమ్మెల్యే ఆనంద్, కొడంల్‌రెడ్డి వర్గాలు రెండుగా విడిపోయారు. రెండు నెలల క్రితం మర్పల్లిలో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరైన మంత్రి ఎదుటే కొంతమంది ప్రజాప్రతినిధులు వేదిక కింద కూర్చుని ఎమ్మెల్యే తీరుపై నిరసన చేశారు. దీంతో ఎమ్మెల్యే, కొండల్‌రెడ్డి వర్గాల మధ్య మరింత గ్యాప్ పెరిగింది. ఎమ్మెల్యే ఆనంద్ ఎక్కడికి వెళ్లినా ఆయన వెన్నంటి ఉండే ద్వితీయశ్రేణి నాయకులెవరూ గ్రంథాలయం వద్ద జరిగిన శంకుస్థాపనకు హాజరు కాలేదు. ఈ విషయాన్ని ముందే గ్రహించిన కొండల్‌రెడ్డి తన సొంత మండలమైన మర్పల్లి నుంచి పెద్దఎత్తున అనుచరులను రప్పించారు. సుమారు వంద తుఫాన్ వాహనాల్లో కార్యకర్తలను తెప్పించుకుని కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. -
జనవరి మొదటివారంలో యాదాద్రికి సీఎం కేసీఆర్?
-
మత్స్య రహస్యం!
‘‘ అధికారి గారు.. జిల్లాలో ఏ పథకం అమలవుతుంది..వాటి వివరాలు ఏమైనా చెబుతారా’’ అని అడిగితే..అన్ని పథకాలు అమలవుతున్నాయి’’ అన్న సమాధానం వస్తోంది. ‘‘ఏయే పథకాలో వివరంగా చెబుతారా’’..అని మళ్లీ అడిగితే..‘‘అన్ని పథకాలు అని చెప్పాముగా..ఇంకేం కావాలి.’’ అంటూ ఒకింత అసహనం వ్యక్తం చేస్తున్నారు ఇక్కడి అధికారులు, కిందిస్థాయి సిబ్బంది. ఇదండీ జిల్లా మత్స్యశాఖ పరిస్థితి. ఇక్కడ అంతా రహస్యమే. ఏ పథకం కింద ఎవరు లబ్ధిపొందుతున్నారో సమాచారం ఇవ్వరు. అసలు పథకంకింద లబ్ధిదారులను ఎంపిక చేస్తున్నారో..చేయడం లేదో తెలియని పరిస్థితి. నల్లగొండ టూటౌన్ : మత్స్యకారుల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ ఉచితంగా చేప పిల్లల పంపిణీకి శ్రీకారం చుట్టి వారికి అన్ని విధాలా మేమున్నామని రాష్ట్ర ప్రభుత్వం చెబుతుంటే.. అందుకు భిన్నంగా జిల్లా మత్స్యశాఖ అధికారులు వ్యవహరిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తరువాత మత్స్యకారుల సంక్షేమానికి కేసీఆర్ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తున్న విషయం తెలిసిందే. పలు సంక్షేమ పథకాలు ప్రవేశ పెడుతున్నా క్షేత్రస్థాయిలో ఉన్న మత్స్యకార్మికులకు తెలియజేయకుండా ఏ ఒక్క పథకంపైనా సంబంధిత అధికారులు నోరు విప్పకుండా వింత పోకడపోతున్నారనే ఆరోపణలున్నాయి. ప్రభుత్వాల నుంచి ఏయే పథకాలు వస్తున్నాయన్న వివరాలను కూడా మత్స్యకారులకు తెలియనీయకుండా కార్యాలయంలోని కొంతమంది అధికారులు తమకు నచ్చినవారికి మాత్రమే సమాచారం ఇచ్చి ‘చేతులు చాచుతున్నారు’ అనే విమర్శలు ఉన్నాయి. ఫలానా పథకం మంజూరైంది..ఇన్ని యూనిట్లు ఉన్నాయి..అర్హులు దరఖాస్తు చేసుకోవాలి అన్న సమాచారాన్ని కనీసం పత్రికల ద్వారా కూడా ప్రకటన జారీ చేయకుండా అంతా రహస్యంగా ఉంచుతున్నారు. దీంతో ఈ శాఖలో ప్రభుత్వ పథకాలు గడప దాటడంలేదు. ఎందుకింత రహస్యం? ప్రభుత్వ పథకాలపై క్షేత్రస్థాయిలో కా ర్మికులందరికి తెలియజేసే బాధ్యతను మత్స్యశాఖ అధికారులు విస్మరించడం పై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రతి పథకం గురించి మీడి యా ద్వారా ప్రచారం కల్పించాల్సి ఉన్నా ఆ విధంగా చేసిన దాఖలాలు ఒక్కటి కూడా లేవు. జిల్లాలో 147 మత్స్య పారిశ్రామిక సహకార సంఘాలు ఉండగా సభ్యులు 25 వేల మంది వరకు ఉన్నారు. మొత్తం మత్స్యకారుల సంఖ్య సుమారు 90 వేల పైబడే ఉన్న ట్లు తెలుస్తుంది. వీరి సంక్షేమానికి ప్ర భుత్వం టాటా ఏసీ ట్రాలీ వాహనాలు, టీవీఎస్ మోపెడ్ బైక్‌లు, చేపలు పట్టే వలలు, మహిళా సభ్యులకు స బ్సిడీ రుణాలు, ఐస్ బాక్సులు, త దితర వా టిని సబ్సిడీపై అందజేస్తుంది. ఆయా పథకాలపై సంబందిత అధికారులు మ త్స్యకారులకు తెలియకుండా గోప్యంగా ఉంచడంపై పలు అ నుమానాలు వ్యక్తం అవుతున్నాయి. త మకు నచ్చిన వారికి మాత్రమే తె లి సేలా సంఘం అధ్యక్షుడికి, లేదంటే వా రికి అనుకూలంగా ఉండే సభ్యులకు మాత్రమే సమాచారం చేరవేస్తున్నారనే పలువురు మత్స్యకార్మికులు ఆరోపిస్తున్నారు. మూలన పడిన బడ్జెట్ ... 2016–17 సంవత్సరానికి సంబంధించి మత్స్యకార్మికుల కోసం ప్రభుత్వం బడ్జెట్ విడుదల చేసింది. దాదాపు రూ.కోటికి పైగా బడ్జెట్ ఉన్నా అర్హులైన వారికి నేటికీ పథకాలు అందించలేదు. చేపల విక్రయానికి టాటా ఏసీ ట్రాలీ వాహనాలు, టీవీఎస్ మోపెడ్లు కార్మికులకు ఎంతో అవసరం ఉన్నా వాటి గురించి అధికారులు పట్టించుకున్న పాపాన పోవడంలేదనే కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రెండేళ్లు దాటినా పథకాలు అబ్ధిదారులకు ఇవ్వడానికి అధికారులకు తీరిక లేదా, వారికి కావాల్సినవి ముట్టలేదా అనే ఆరోపణలు వస్తున్నాయి. అలాంటిది ఏమీ లేదు ఈ విషయమై జిల్లా మత్స్యశాఖ అధికారిణి చరితను వివరణ కోరగా అలాంటిదేమీ లేదని సమాధానం ఇచ్చారు. మత్స్యకారులకు సబ్సిడీపై వాహనాలు అందించడానికి లబ్ధిదారుల జాబితా తయారు చేశామన్నారు. 2016–17 సంవత్సరంలో మాత్రమే వాహనాల బడ్జెట్ వచ్చిందని, సిబ్బంది ద్వారా మత్స్యకారులకు తెలియజేస్తున్నామని చెప్పారు. త్వరలోనే అందిస్తామని తెలిపారు. -
ఏళ్లుగా ఇలాగే..
కురవి(డోర్నకల్): రాష్ట్రంలోనే ప్రసిద్ధి చెందిన మండలకేంద్రంలోని వీరభద్రస్వామి ఆలయంలో పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులకు కొన్నేళ్లుగా మోక్షం లభించడంలేదు. దివంగత సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ఆలయ అభివృద్ధికి రూ.కోటిన్నర నిధులను కేటాయించిన విషయం తెలిసిందే. అయితే ఈ పనులను కాంట్రాక్టర్లు పూర్తి చేయకుండా అర్ధంతరంగా వదిలేశారు. ఇన్నేళ్లుగా పనులు సగంలో ఉన్నాయి. అయితే ఆలయానికి ఏటా భక్తుల సంఖ్యతోపాటు ఆదాయం కూడా పెరుగుతోంది. ఈమేరకు సౌకర్యాలు మెరుగుపడటం లేదు. 2015–2016 ఆర్థిక సంవత్సరంలో రూ.2,18,68,925 ఆదాయం రాగా, ఖర్చు రూ.2,16,61,101గా నమోదైంది. దీంతో ఆదాయంలో ఖర్చు మినహాయిస్తే ఆలయ అభివృద్ధికి మిగులు లేకపోయింది. గత మహాశివరాత్రి సందర్భంగా సీఎం కేసీఆర్ వీరభద్రస్వామి వారికి కోరమీసాలు సమర్పించి మొక్కు చెల్లించారు. ఇదే సమయంలో ఆలయ అభివృద్ధికి రూ.5 కోట్లు విడుదల చేస్తామని నిధులను మంజూరు చేశారు. ఏడాది కావస్తున్నా ఇందుకు సంబంధించిన అభివృద్ధి పనులు మాత్రం అలాగే ఉన్నాయి. దీంతో ఈ శివరాత్రికి కూడా భక్తులు ఇబ్బందులు పడే పరిస్థితి నెలకొంది. శివరాత్రిని పురస్కరించుకొని ఈనెల 12న కురవి జాతరకు అంకురార్పణ జరగనుంది. రెండుసార్లు టెండర్లు పిలువడానికే కొద్ది నెలలు సమయం పట్టగా, కాంట్రాక్టర్ పనులను నేటికీ మొదలు పెట్టలేదు. జనవరి 12న రాష్ట్ర మంత్రులు తన్నీరు హరీష్‌రావు, అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వర్రావు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. దీనికితోడు టెండర్ దక్కించుకున్న కాంట్రాక్టర్ నేటికీ ఒప్పందం కుదుర్చుకోలేదు. శంకుస్థాపన తర్వాత వెంటనే పనులు మొదలు పెట్టి ఉంటే ఈ 25 రోజుల్లో సత్రాల వద్ద బంజార సత్రం నిర్మాణం పూర్తయ్యేది. ఈ జాతరలో వేలాది మంది గిరిజన భక్తులు సేదతీరేవారు. కానీ మళ్లీ పాత ఇబ్బందులే ఉండనున్నాయి. పెండింగ్‌లో ఉన్న పనులు రూ.48లక్షలతో నిర్మించిన ప్రాకార మండపం 95శాతం పనులు పూర్తయ్యాయి. కాలక్షేప మండపానికి రూ.41.60లక్ష లు కేటాయించగా పనులు మాత్రం స్లాబ్ లెవల్ వరకు నిర్మించారు. ఆలయ ఆవరణ పూర్తిగా ఫ్లోరింగ్ చేసేందుకు రూ.30లక్షలు కేటాయించగా 1శాతం పనులు కాలేదు. ప్రాకార మండపంపై సాలారం కట్టాల్సి ఉంది. ఆ పనులు మొదలు పెట్టకపోవడంతోపాటు ప్రాకార మండపాన్ని సైతం పూర్తి చేయలేదు. దీంతో రెండు పనులను పూర్తి చేయాల్సి ఉంది. ఆలయ ఆవరణలో చేయాల్సిన గ్రానైట్ రాయితో చేయాల్సిన ఫ్లోరింగ్ పూర్తి కాలేదు. పనులు పెండింగ్‌లో ఉండడంతో అభివృద్ధి కనిపించడంలేదు. రూ.5కోట్ల పనుల వివరాలు వీరభద్రస్వామి ఆలయానికి సీఎం కేసీఆర్ మంజూరు చేసిన రూ.5కోట్ల అభివృద్ధి పనులను వివిధ పనులకు కేటాయించారు. ప్రాకార మండపానికి (బ్యాలెన్స్పని) రూ.75లక్షలు, ఆలయ ఆవరణలో గ్రానైట్ ఫ్లోరింగ్‌కు రూ.50లక్షలు, మూడు స్టోర్స్ రాజగోపురానికి రూ.30లక్షలు, మినీ రాజగోపురానికి రూ.10లక్షలు, యాగశాలకు రూ.10లక్షలు, రథశాలకు రూ.10.50లక్షలు, నవగ్రహ మండపానికి రూ.3.50లక్షలు, భద్రకాళీ ఆలయ ప్రాకారానికి రూ.13.50లక్షలు, బంజార సత్రానికి రూ.1కోటి, కల్యాణకట్ట పనులకు రూ.16లక్షలు, మరుగుదొడ్ల నిర్మాణాలకు రూ.17.50లక్షలు, కాలక్షేప మండపానికి రూ.25లక్షలు, వీరభద్రస్వామి సత్రానికి రూ.60లక్షలు, రెండవ బంజార సత్రానికి రూ.48లక్షలు, ఆంజనేయ స్వామి ఆలయానికి రూ.3.50లక్షలు, నాగమయ్య ఆలయానికి రూ.13లక్షలు, రథం నిలిపే స్థలానికి ప్రహరీకి రూ.14.50లక్షలు కేటాయించి టెండర్లు పూర్తి చేశారు. -
పేదల పాలిట వరం కళ్యాణలక్ష్మి
జనగామ ఎమ్మెల్యేముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి పలువురికి కళ్యాణలక్ష్మి, రిలీఫ్ ఫండ్ చెక్కు అందజేత జనగామ : రాష్ట్రంలోని పేదలు తమ పిల్లల పెళ్లిళ్లు చేయడంలో ఇబ్బంది పడొద్దనే భావనతోనే సీఎం కేసీఆర్ కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలను ప్రవేశపెట్టిందని జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి తెలిపారు. పట్టణంలోని ఎమ్మెల్యే నివాసంలో ఆర్డీఓ వెంకట్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన బచ్చన్నపేట, జనగామ టౌన్, రూరల్ పరిధిలోని లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులతో పాటు పలువురికి సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి మంజూరైన చెక్కులను యాదగిరిరెడ్డి పంపిణీ చేసి మాట్లాడారు. పేదల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ నిరంతరం ఆలోచిస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో తహసీల్దార్లు చెన్నయ్య, విజయభాస్కర్, వ్యవసాయ మార్కెట్ చైర్పర్సన్ బండ పద్మ, ఎంపీపీ బైరగోని యాదగరి, పస్తం మహేష్, జెడ్పీటీసీలు బాల్దె విజయ, వేముల స్వప్నతో పాటు నాగారపు వెంకట్, ఎండీ.అన్వర్, కొణ్యాల జనార్దన్‌రెడ్డి, దేవరాయ ఎల్లయ్య, కన్నారపు ఉపేందర్, మేడ శ్రీనివాస్, వెన్నెం శ్రీల త, గజ్జెల నర్సిరెడ్డి, వేమెళ్ల పద్మ, ఎజాజ్, బండ యాదగిరిరెడ్డి, బాల్దె సిద్దులు, కలింగరాజు, నల్లగోని బాలకిషన్, ఇర్రి రమనారెడ్డి, బోడిగం చంద్రారెడ్డి, వడ్డెపల్లి మల్లారెడ్డి, కనకయ్య, కొండయ్య, చొక్కం నర్సింహులు, వేముల విద్యాసాగర్, జావీద్, షబ్బీర్, వీఆర్వో రమేష్ ఉన్నారు. పెళ్లి రోజే కళ్యాణలక్ష్మి కానుక : ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య.. రఘునాథపల్లి/ లింగాల ఘణపురం (స్టేషన్‌ఘన్‌పూర్) : ఇక నుంచి పెళ్లి రోజే కళ్యాణలక్ష్మి కానుక అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య తెలిపారు. మండల కేంద్రంలోని తహసీల్ కా ర్యాలయంలో కళ్యాణలక్ష్మి పథకానికి దరఖాస్తు చేసుకున్న 49 మంది లబ్ధిదారులకు గురువారం ఆయన చెక్కులు పంపిణీ చేసి మాట్లాడారు. నిశ్చితార్థం జరిగిన తర్వాత ఆ పోటోలు అమ్మాయి తరపు పెద్దల సంతకాలతో తహసీల్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకుంటే ముహుర్తం నాటికి కళ్యాణలక్ష్మి చెక్కు అందజేస్తామన్నారు. కాగా, కళ్యాణలక్ష్మి పథకంలో ధరఖాస్తు చేసుకున్న పలువురు ఎస్టీలకు చెక్కులు మంజూరు కాకపోవడం పట్ల ఆ వర్గానికి చెందిన నాయకులు అసంతృప్తి వ్యక్తం చేశారు. అలాగే, లింగాలఘణపురం తహసీల్దార్ కార్యాలయం ఎదుట కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకంలో 55 మంది లబ్ధిదారులకు ఎమ్మెల్యే రాజయ్య చెక్కు లు అందజేసి మాట్లాడారు. కార్యక్రమాల్లో జెడ్పీటీసీలు బానోతు శారద, రంజిత్‌రెడ్డి, తహసీల్దార్లు కె.నారాయణ, రాజేందర్, ఎంపీపీ దాసరి అనిత, ఎంపీడీఓలు బానోతు సరిత, రవితో పాటు మల్కపురం లక్ష్మయ్య, రా జేందర్, సూర్య, జ్యోతి, రంజిత్, సుధాకర్, రాములు, శ్రీహరి, కొంరయ్య, నర్సింహ్మ, నాగేశ్వర్, యమున, రమాదేవి, స్వర్ణలత, కుమార్, పెండ్లి మల్లారెడ్డి, దొంగ అంజిరెడ్డి, సత్యనారాయణ, వెంకటయ్య, రాంబాబు, చెంచు రమేష్, లక్ష్మీనారాయణ, యాదయ్య, శ్రీనువాస్, మల్లారెడ్డి, సోమయ్య, విజయ్‌భాస్కర్, మదార్, స త్తమ్మ, మధు, రేగు అంజయ్య, చిట్ల ఉపేందర్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి, భాగ్యలక్ష్మి, మోహన్, రాజు పాల్గొన్నారు. -
ఏడాదిలోగా క్రైస్తవ భవన్
-
సామాజిక తెలంగాణ కోసమే పాదయాత్ర
సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తాండూర్/రెబ్బెన: సామాజిక తెలంగాణ సాధనే లక్ష్యంగా మహాజన పాదయాత్ర నిర్వహిస్తున్నట్లు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం స్పష్టం చేశారు. సీపీఎం ఆధ్వర్యంలో చేపట్టిన పాదయాత్ర మంగళవారం మంచిర్యాల జిల్లా తాండూర్, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండలాల్లో సాగింది. తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ జిల్లాలో అధిక శాతం గిరిజనులు ఉండగా సమస్యలు సైతం అదే స్థాయిలో ఉన్నాయ న్నారు. కేసీఆర్ అంటేనే తెలంగాణ అనే అపోహ యువకుల్లో ఉందని కాని ఎర్ర జెండా అంటేనే తెలంగాణ, తెలంగాణ అంటేనే ఎర్రజెండా అని చరిత్ర చెపుతోం దన్నారు. ఇప్పటికీ 65 రోజుల పాటు 1700 కి.మీ. పాదయాత్ర సాగిందన్నారు. మరోవైపు సిర్పూర్ పేపర్ మిల్లును తెరిపించేందుకు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని సీఎం కేసీఆర్‌కు రాసిన లేఖలో తమ్మినేని కోరారు. కంపెనీని బ్యాంకులు వేలం వేయనున్నాయనే వార్తల నేపథ్యంలో ప్రభుత్వమే దానిని స్వాధీనం చేసుకుని ప్రభుత్వ రంగంలోనే నడిచే విధంగా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. -
ఏడాదిలోగా క్రైస్తవ భవన్
- నాగోల్ చౌరస్తాలో రెండెకరాలు కేటాయిస్తున్నాం: సీఎం కేసీఆర్ - ప్రభుత్వ ఆధ్వర్యంలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు - పేద క్రైస్తవులకు దుస్తుల పంపిణీ సాక్షి, హైదరాబాద్: దక్షిణ భారత దేశానికే గర్వకారణంగా నిలిచేలా హైదరాబాద్‌లో క్రైస్తవ భవనాన్ని నిర్మిస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. గతేడాది క్రిస్టియన్ భవన నిర్మాణానికి ప్రయత్నించగా న్యాయపరమైన చిక్కులు వచ్చాయన్నారు. నాగోల్ చౌరస్తాలో క్రైస్తవ భవన నిర్మాణం కోసం తక్షణమే రెండెకరాలు కేటాయిస్తున్నట్లు చెప్పారు. తాను స్వయంగా పర్యవేక్షణ చేసి ఏడాదిలోగా క్రైస్తవ భవన్ నిర్మాణం పూర్తి చేస్తానని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో మైనారిటీ సంక్షేమ శాఖ మంగళవారం హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో క్రిస్మస్ ఉత్సవాలను ఘనంగా నిర్వహించింది. ఈ వేడుకకు సీఎం కేసీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. క్రైస్తవ సోదర, సోదరీమణులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో అన్ని మతాలకు చెందిన వారు సుఖంగా జీవించాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. గతంలో చర్చిల నిర్మాణానికి జిల్లా కలెక్టర్ల వద్ద అనుమతి తీసుకోవాల్సి వచ్చేదని, బిషప్‌ల విన్నపం మేరకు స్థానిక సంస్థల ద్వారానే చర్చిల నిర్మాణానికి అనుమతి మంజూరయ్యేలా ఆదేశాలిస్తానన్నారు. చర్చిల నిర్మాణం కోసం నామమాత్రపు ధరకు ప్రభుత్వ స్థలాలు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. పాత చర్చిలకు మరమ్మతులు చేసేందుకు కూడా ప్రభుత్వం నుంచి నిధులు మంజూరు చేస్తామన్నారు. శ్మశాన వాటికలు సహా ఇతర ఇబ్బందులను పరిష్కరించేందుకు త్వరలోనే బిషప్‌లతో సమావేశమై వారి సూచనల మేరకు తగిన చర్యలు చేపడతానని హామీనిచ్చారు. బంగారు తెలంగాణ అంటే పది మంది మాత్రమే బాగుపడేది కాదని, అన్ని వర్గాల వారు ఆనందంగా ఉంటేనే అది సార్థకమవుతుందని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఎక్కడైనా క్రిస్టియన్లపై దాడులు జరిగితే సహించేది లేదని, ఎక్కడైనా జరిగినట్లు తెలిస్తే ఉక్కుపాదంతో అణచి వేస్తానని సీఎం స్పష్టం చేశారు. ఈ సందర్భంగా పేద క్రైస్తవులకు సీఎం దుస్తులను పంపిణీ చేశారు. వివిధ రంగాల్లో విశేష ప్రతిభను, సామాజిక సేవాతత్పరతను కనబరిచిన ప్రముఖులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో అసెంబ్లీ స్పీకర్ మధుసూదనాచారి, మండలి చైర్మన్ స్వామిగౌడ్, ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, మంత్రులు నాయిని, తలసాని, పద్మారావు, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, బిషప్‌లు తుమ్మబాల, సాల్మన్, డేనియల్, మాజీ సీసీఎల్ఏ రేమండ్ పీటర్, మైనార్టీ సంక్షేమ విభాగం చైర్మన్ ఏకే ఖాన్, మైనార్టీ శాఖ కార్యదర్శి ఉమర్ జలీల్ తదితరులు పాల్గొన్నారు. -
లొసుగుల వల్లే ప్రధానికి లొంగుతున్నారు
చంద్రబాబు, కేసీఆర్‌పై సురవరం ఆరోపణ - రాజకీయ అభద్రతతో ఉన్నందునే ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారని ధ్వజం - రెండున్నరేళ్ల పాలనలో హామీల అమల్లో ఘోర వైఫల్యమని మండిపాటు - నేటి నుంచి సీపీఐ జాతీయ కార్యవర్గ భేటీ సందర్భంగా ‘సాక్షి’కి ఇంటర్వ్యూ సాక్షి, హైదరాబాద్: లొసుగులు ఉన్నందు వల్లే ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం కేసీఆర్ కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వా నికి లొంగిపోతున్నారని సీపీఐ ప్రధాన కార్య దర్శి సురవరం సుధాకర్‌రెడ్డి ఆరోపించారు. ప్రజలకిచ్చిన హామీల అమల్లో వైఫల్యాలతో పాటు వారి ఇతర బలహీనతలను కేంద్ర ప్రభుత్వం బ్లాక్మెయిల్ చేస్తోందా లేదా వారే లొంగి పోతున్నారా అన్నది తెలియాల్సి ఉందన్నారు. బాబు, కేసీఆర్ రాజకీయ అభద్రతాభావంతో ఉన్నారని, అందువల్లే ప్రతిపక్షాలు లేకుండా చేయాలని విపక్ష ఎమ్మెల్యేల ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారని దుయ్యబట్టారు. కానీ వారి తో రాజీనామా చేయించి ఉప ఎన్నికలకు వెళ్లే సాహసం చేయలేకపోతున్నారన్నారు. బుధవా రం నుంచి శుక్రవారం వరకు నగరంలో జరగ నున్న సీపీఐ జాతీయ, కౌన్సిల్ సమావేశాల సందర్భంగా సురవరం సాక్షి ప్రతినిధికి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. వివరాలు ఆయన మాటల్లోనే... రెండున్నరేళ్ల పాలనలో ఇద్దరిదీ ఘోర వైఫల్యం.. ‘చంద్రబాబు, కేసీఆర్ రెండున్నరేళ్ల పాలనలో ప్రజలకిచ్చిన హామీల్లో ప్రధానమైనవి అమలు కాలేదు. రైతు రుణాల రద్దు సహా ఇతర హామీ ల అమల్లో చంద్రబాబు ఘోరంగా విఫలమవ్వ గా దళితులకు మూడెకరాల భూపంపిణీ, పేద లకు డబుల్ బెడ్రూం ఇళ్లు, ఇంటింటికీ మంచి నీటి సరఫరా తదితర హామీల్లో ఒక్కశాతం కూడా కేసీఆర్ అమలు చేయలేదు. వైఫల్యా లను కప్పిపుచ్చుకునేందుకు పూజలు, పండు గలు, పబ్బాలు అంటూ ప్రభుత్వ నిధులను ఖర్చు చేసి కొందరు వ్యక్తులు రాజుకు మించిన రాజభక్తిని ప్రదర్శిస్తున్నారు. కేసీఆర్ ఆ కోవకు చెందినవారే. బీజేపీతో స్నేహం భవిష్యత్తులో ఉపయోగపడుతుందనే నగదురహిత లావాదే వీలు, డిజిటలైజేషన్ అంటూ చంద్రబాబు, కేసీఆర్ హడావుడి చేస్తున్నారు. దీని సాధ్యాసా ధ్యాలతో నిమిత్తం లేకుండా వ్యవహరిస్తు న్నారు. చుట్టూ వందిమాగధులు చేరి పొగడ్త లతో ముంచెత్తుతుండడంతో బాబు, కేసీఆర్ లకు రైతుల ఆర్తనాదాలు వినిపించడం లేదు. నయీం కేసే కేసీఆర్ అవగాహనకు కొలబద్ధ.. నయీం కేసును సీబీఐకు ఇచ్చేందుకు నిరాకరిం చడం ద్వారా కేసీఆర్ అవగాహనను కొలబద్ధ గా అర్థం చేసుకోవచ్చు. ఈ కేసులో ఎవరినీ వదలం అని చెప్పినా... తప్పు చేసిన వారు తమ పార్టీలో ఉంటే వారికి రక్షణ, లేని వారికి శిక్షణ అన్నట్లుగా విచారణకు నిరాకరిస్తున్నారు. పార్లమెంటు స్తంభన వారి వ్యూహరచనే... పార్లమెంటు సమావేశాలు సజావుగా జరగకుం డా కేంద్రం, బీజేపీ వ్యూహం పన్నాయి. బీజేపీ అగ్రనేత అద్వానీ అదే ఆవేదన వ్యక్తం చేశారు. లోక్‌సభలో మెజారిటీ ఉన్నా బీజేపీ కీలకాంశా లపై ఎందుకు చర్చించలేదు?’ అని అన్నారు. పెద్ద నోట్ల రద్దు అత్యంత తెలివితక్కువ నిర్ణయం... పెద్ద నోట్లను రద్దు చేస్తూ ప్రధాని మోదీ తీసుకున్న నిర్ణయం అత్యంత తెలివి తక్కువది. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయ కుండా ఈ నిర్ణయం తీసుకోవడం అర్థరహి తం. ఇప్పుడు పెద్ద నోట్ల రద్దు పక్కకుపోయి నగదు రహిత లావాదేవీలు, డిజిటలైజేషన్ అంటూ కొత్త పాట అందుకున్నారు. ఇది దేశ, కాల పరిస్థితులకు అనువైనది కాదు. ఈ నిర్ణయం వల్ల ఆశించిన మేర నల్లధనం బయటకు రాలేదు. దాచుకున్న డబ్బే బ్యాంకులకు వచ్చింది, దోచుకున్న డబ్బు మార్పిడి అయ్యిందనేది మా అంచనా. ఈ నిర్ణయంతో దేశ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా కుదేలైంది. కొంతైనా కోలుకునేందుకు, నోట్ల కష్టాలు కొంచెమైనా తీరేందుకు కనీసం 5, 6 నెలలు పట్టొచ్చు. సురవరంతో గద్దర్ భేటీ సురవరంతో ప్రజా గాయకుడు గద్దర్ సమావేశమయ్యారు. మంగళవారం మగ్దూం భవన్‌కు వచ్చిన ఆయన సురవరం తో చర్చించినట్లు సమాచారం. రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితులు, టీఆర్ఎస్ ప్రభుత్వ తీరు, ప్రజా సమస్య లపై ప్రభుత్వం స్పంది స్తున్న తీరు తదితర అంశాలపై వారిద్దరి మధ్య చర్చ జరిగినట్లు తెలుస్తోంది. సమా వేశంలో సీపీఐ రాష్ట్ర కార్య దర్శి చాడ వెంకట్‌రెడ్డి, సహాయ కార్యదర్శి పల్లా వెంకటరెడ్డి పాల్గొన్నారు. సీపీఐ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరగనుండటంతో సురవరంను అభినందిం చేందుకే వచ్చానని, తమ భేటీకి రాజకీయ ప్రాధాన్యత లేదని గద్దర్ తెలిపారు. -
అన్ని ప్రభుత్వ శాఖలు డిజిటల్‌కు వెళ్లాల్సిందే
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ శాఖలు డిజిటల్ రూపంలో చెల్లింపులు జరపాలని రాష్ట్ర ఐటీ, పరి శ్రమలు, పురపాలక శాఖ మంత్రి కె.తారకరామారావు కోరారు. సాధ్యమైనంత ఎక్కువగా నగదు రహిత చెల్లింపులను ప్రోత్సహించాలని, దశలవారీగా తెలం గాణను నగదు రహిత లావాదేవీల రాష్ట్రంగా తీర్చిదిద్దాలని సీఎం కేసీఆర్ ఆదేశించారని కేటీఆర్ పేర్కొన్నారు. నోట్ల రద్దు వల్ల తలెత్తిన పరిణామాలను ఒక అవకాశంగా మార్చుకుంటామని, నగదు రహిత విధా నంతో పాలనా వ్యవస్థలో పారదర్శకత, వేగాన్ని పెంచేందుకు చర్యలు తీసుకుం టామన్నారు. అన్ని శాఖలు అంతిమంగా డిజిటల్ చెల్లింపులకు వెళ్లాల్సిందేనని స్పష్టం చేశారు. రాష్ట్రంలో డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించేందుకు కేటీఆర్ నేతృత్వంలో మంత్రులు ఈటల రాజేందర్, జూపల్లి కృష్ణారావు, జగదీశ్‌రెడ్డి, మహేందర్‌రెడ్డిలతో ప్రభుత్వం నియమించిన కేబినెట్ సబ్ కమిటీ సోమవారం సచివాలయంలో సమా వేశమైంది. వివిధ శాఖల కార్యదర్శులు, బ్యాంకుల ప్రతినిధులు, టీ–వ్యాలెట్ సర్వీస్ ప్రొవైడర్లు సమావేశానికి హాజరయ్యారు. నగదు రహిత చెల్లింపుల ద్వారా ప్రజలకు సౌకర్యం పెరగాలన్నదే తమ ప్రాథమిక లక్ష్యమని కేటీఆర్ అన్నారు. నగదు రహిత లావాదేవీలను గ్రామీణ, పట్టణ ప్రాంతా ల్లోని ప్రజలకు సమాంతరంగా తీసుకెళ్తామ న్నారు. ఆర్థిక లావాదేవీలపై ప్రజల్లో, వ్యాపారుల్లో చైతన్యం పెంచేందుకు ఐటీ శాఖ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమా లను ఈ నెల 7 నుంచి ప్రారంభించామ న్నారు. ప్రజలు, ప్రభుత్వం మధ్య జరిగే అన్ని ఆర్థిక లావాదేవీలను టీ–వ్యాలెట్ ద్వారా ఉచితంగా అందుబాటులోకి తెస్తామన్నారు. ప్రజలు, ప్రైవేట్ సంస్థలు చేసే లావాదేవీలపై చార్జీల్లేకుండా పూర్తిగా ఉచితం చేయాలని కేంద్రాన్ని కోరతామ న్నారు. వివిధ సంస్థలు, బ్యాంకులు టీ– వ్యాలెట్‌తో కలసి పనిచేసేలా ప్రయత్ని స్తామన్నారు. టీ–వ్యాలెట్‌తో ఇతర వ్యాలె ట్లకు సైతం చెల్లింపుల సౌకర్యానికి అను మతించాలని కేంద్రాన్ని కోరుతామన్నారు. దీనిపై ముఖ్యమంత్రి నేరుగా ప్రధానితో మాట్లాడతానని చెప్పినట్లు పేర్కొన్నారు. టీ–వ్యాలెట్ మీద ఐటీ శాఖ కార్యదర్శి జయేశ్‌రంజన్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. టీ–వ్యాలెట్ అంతర్జాతీయ ప్రమా ణాలతో ఉంటుందని, భద్రత, సదుపాయం వంటి అంశాల్లో అత్యుత్తమంగా ఉంటుందని జయేశ్‌రంజన్ చెప్పారు. డిజిటల్ చెల్లిం పులపై ఏర్పాటైన సురేశ్‌చందా టాస్క్‌పోర్స్ కమిటీ అధ్యయన నివేదిక, సిఫారసులను కేబినెట్ సబ్ కమిటీకి సమర్పించింది. -
గిరిజన ప్రాంతాలను అభివృద్ధి చేయాలి
రాష్ట్ర ప్రభుత్వానికి సీపీఎం సూచన సాక్షి, హైదరాబాద్: గిరిజన ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు రూపొందించాలని రాష్ట్ర ప్రభుత్వానికి సీపీఎం సూచించింది. ఆదివాసీ, గిరిజన తెగల అభివృద్ధి లక్ష్యంగా ఉన్న ఐటీడీఏలు ఆయా తెగల సామాజిక అభివృద్ధితో పాటు వారు నివసిస్తున్న గ్రామాలు, తండాలలో కనీస మౌలిక వసతుల కల్పనలో విఫలమవుతున్నాయని పేర్కొంది. ఐటీడీఏ ద్వారా వివిధ పథకాల కింద ఇచ్చే ప్రభుత్వ రాయితీలు లబ్ధిదారులకు చేరుకోలేకపోతున్నాయని స్పష్టంచేసింది. గిరిజన తెగల్లోని సాంస్కృతిక వైవిధ్యాన్ని ప్రోత్సహించేందుకు ప్రత్యేక నిధులు కేటాయించాలని సీఎం కేసీఆర్‌కు సీపీఎం కార్యదర్శి తమ్మినేని వీరభద్రం లేఖ రాశారు. షెడ్యూల్డ్ ఏరియాల్లో ఉన్న పాఠశాలల్లో ఆయా తెగల మాతృభాషనే బోధనా భాష చేయాలని కోరారు. -
నగదు రహితమే స్ఫూర్తి
- ఈ తరహా లావాదేవీలను ప్రోత్సహించేందుకు చర్యలు - ప్రజలు డిజిటల్ చెల్లింపులను అలవాటు చేసుకోవాలి - వచ్చే బడ్జెట్లో కొత్త కలెక్టరేట్లకు నిధులు - అధికారులతో సమీక్షలో ముఖ్యమంత్రి కేసీఆర్ సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించేందుకు చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు. సిద్ధిపేట జిల్లాలోని ఇబ్రహీంపూర్ నగదు రహిత గ్రామంగా ఆదర్శంగా నిలిచిందని, సిద్ధిపేట అసెంబ్లీ నియోజకవర్గం కూడా త్వరలోనే ఈ ఘనత సాధిస్తుందని ముఖ్యమంత్రి చెప్పారు. ఇదే స్ఫూర్తితో తెలంగాణ అంతటా నగదు రహిత లావాదేవీలు జరగాలని సూచించారు. పెద్దనోట్ల రద్దుతో పాటు ఆర్థిక అంశాలపై కేంద్రం అమలు చేస్తున్న నిర్ణయాలకు అనుగుణంగా రాష్ట్రంలో అనుసరించాల్సిన వ్యూహంపై సోమవారం ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. మంత్రి హరీశ్‌రావు, అధికారులు నర్సింగ్‌రావు, రామకృష్ణారావు, నవీన్ మిట్టల్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. పైలెట్ ప్రాజెక్టు అమలవుతున్న సిద్ధిపేట నియోజకవర్గంలో అవసరమైనన్ని స్వైపింగ్ మిషన్లు, ఏటీఎం కార్డులు అందుబాటులో ఉంచాలని ముఖ్యమంత్రి సూచించారు. నగదు రహిత లావాదేవీలు నిర్వహించే క్రమంలో తలెత్తే ఇబ్బందులు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలని, వాటికి పరిష్కారాలు వెతకాలని అధికారులను ఆదేశించారు. ‘కరెన్సీ నిర్వహణ కేంద్రం పరిధిలోని అంశం. నగదు లావాదేవీలను కనిష్ఠ స్థాయికి తీసుకురావటం కేంద్రం ఉద్దేశమనిపిస్తోంది. కరెన్సీ కూడా పెద్ద మొత్తంలో అందుబాటులో లేదు. ఈ పరిస్థితిని ఎదుర్కునేందుకు ప్రజలు కూడా సిద్ధం కావాలి. నగదు రహిత లావాదేవీలు జరపాలి. మొబైల్ యాప్‌లు, ఏటీఎం కార్డులు, స్వైపింగ్ మిషన్లు వాడాలి. ఆన్లైన్ చెల్లింపులు పెరగాలి. ప్రజలకు అవగాహన కల్పించే ప్రచార కార్యక్రమాలను అధికారులు రూపొందించాలి. బ్యాంకులు తమ సేవలను విస్తరించాలి. సర్వర్లను డెవలప్ చేసుకోవాలి. అధికారులు బ్యాంకర్లతో ఎప్పటికప్పుడు మాట్లాడి తగిన చర్యలు తీసుకోవాలి. ఇంటర్నెట్ సౌకర్యం లేకున్నా లావాదేవీలు నిర్వహించే మొబైల్ యాప్‌లు అందుబాటులోకి వచ్చాయి. ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రజలకు చేరవేయాలి..’ అని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. రేపు జిల్లా కలెక్టర్ల సదస్సు.. ‘అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలులో జిల్లా కలెక్టర్లు క్రియాశీలక పాత్ర పోషించాలి. అన్ని జిల్లా కేంద్రాల్లో ఇంటిగ్రేటేడ్ కలెక్టరేట్లు నిర్మించాలి. కొత్త జిల్లా కేంద్రాల్లో కలెక్టరేట్లు, పోలీస్ కార్యాలయాలు నిర్మించేందుకు స్థలా లు ఎంపిక చేయాలి. వచ్చే బడ్జెట్లో వీటికి నిధులు కేటాయిస్తాం. కొత్త జిల్లాల ఏర్పాటు తో పరిపాలనా విభాగాలు ప్రజలకు అందు బాటులోకి వచ్చాయి. వాటి ఫలితాలు ప్రజల కు దక్కాలి. బుధవారం జరిగే కలెక్టర్ల సదస్సులో కొత్త జిల్లాల ద్వారా ప్రజలకు కలిగే ప్రయోజనాలపై చర్చ జరుగుతుంది. కలెక్టర్లు, ఇతర అధికారులు అన్ని విషయాలపై సమగ్ర సమాచారంతో రావాలి. నగదు రహి త లావాదేవీల నిర్వహణకు తీసుకుంటున్న చర్యలతో పాటు ప్రభుత్వం అమలు చేస్తున్న మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, నీటి పారుదల ప్రాజెక్టులు, ఆసుపత్రుల నిర్వహణ, రెసిడెన్షియల్ స్కూళ్లు, హరితహారం, సాదా బైనామా తదితర అంశాలపై కలెక్టర్ల సమావేశంలో చర్చిద్దాం..’ అని సీఎం కేసీఆర్ అధికారులతో చెప్పారు. -
2018 ఆగస్టుకి మెట్రో పూర్తి చేయండి
- ఎల్అండ్టీ మెట్రో, హెచ్ఎంఆర్ అధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశం - మెట్రో రైలు ప్రాజెక్టు పనుల పురోగతిపై ముఖ్యమంత్రి సమీక్ష సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టును 2018 ఆగస్టు నాటికి పూర్తి చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఎల్అండ్టీ మెట్రో, హైదరాబాద్ మెట్రో రైల్(హెచ్ఎంఆర్) అధికారులను ఆదేశించారు. ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉండే ఎల్బీనగర్-మియాపూర్(29 కి.మీ) మార్గంతోపాటు నాగోల్-శిల్పారామం(28 కి.మీ)మార్గాన్ని 2017 నవంబర్ నాటికి పూర్తి చేయాలని సూచించారు. బుధవారం సచివాలయంలో ఎల్బీనగర్-మియాపూర్, జేబీఎస్-ఫలక్ను మా, నాగోల్-రాయదుర్గం మూడు కారిడార్లలో 72 కి.మీ. మార్గంలో జరుగుతున్న మెట్రో రైలు ప్రాజెక్టు పనుల పురోగతిపై సీఎం కేసీఆర్ సమీక్షించారు. ఈ సమావేశంలో ఎల్అండ్టీ మెట్రో చైర్మన్ ఎస్ఎన్ సుబ్రహ్మణ్యన్, ఎండీ శివానంద్, హెచ్ఎంఆర్ ఎండీ ఎన్వీఎస్రెడ్డి, సీఎంఓ కార్యదర్శి నర్సింగ్‌రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాగోల్-బేగంపేట్, మియాపూర్-ఎస్ఆర్నగర్ రూట్లను 2017 మార్చి 28(ఉగాది) రోజు న ప్రారంభించే అంశంపైనా చర్చించినట్టు తెలిసింది. శిల్పారామం వరకే మెట్రో..? నాగోల్-రాయదుర్గం(కారిడార్-3) మార్గాన్ని శిల్పారామం వరకే పరిమితం చేయనున్నట్లు ఎల్అండ్టీ మెట్రో అధికారులు సీఎం దృష్టికి తీసుకొచ్చినట్లు తెలిసింది. తొలుత(2012లో) శిల్పారామం వరకే మెట్రో మార్గం ప్రతిపాదించినప్పటికీ పార్కింగ్, ప్రయాణీకుల వసతి సముదాయాల ఏర్పాటు కోసం శిల్పారామం నుంచి రహేజా ఐటీపార్క్ వరకు ఈ మార్గాన్ని 1.3 కి.మీ. మేర పొడిగించారు. తాజాగా ఈ ప్రాంతంలో ఎస్ఆర్డీపీ పథకంలో భాగంగా బహుళ వరుసల రహదారులు నిర్మించాలని సర్కారు సంకల్పించిన నేపథ్యంలో శిల్పారా మం వరకే మెట్రోను తొలుత పరిమితం చేస్తామని, ఎస్ఆర్డీపీ పనుల అనంతరం దీనిని పొడిగిస్తామని నిర్మాణ సంస్థ ప్రభుత్వానికి స్పష్టం చేసినట్లు తెలిసింది. పాతనగరానికి మెట్రో వెళ్లేనా..? జేబీఎస్-ఫలక్‌నుమా(కారిడార్-2) మార్గంలో ఎంజీబీఎస్ నుంచి ఫలక్‌నుమా వరకు 5.3 కి.మీ. మెట్రో మార్గం ఖరారుపై స్పష్టత లేకపోవడంతో పాతనగరానికి మెట్రో మార్గం వెళుతుందా? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. పాత అలైన్మెంట్ ప్రకారం ఇప్పుడు పనులు చేపట్టినా అది పూర్తయ్యేందుకు రెండేళ్ల సమయం పట్టే అవకాశం ఉంటుందని నిపుణులు చెపుతున్నారు. కాగా, మెట్రో ప్రాజెక్టు గడువు 2017 జూన్ నుంచి 2018 ఆగస్టుకు పెరగడం, ఆస్తుల సేకరణ ప్రక్రియ ఆలస్యం కావడంతో నిర్మాణ సంస్థపై రూ.3 వేల కోట్ల వరకు అదనపు భారం పడుతున్న నేపథ్యంలో ప్రభుత్వ పరంగా ఆర్థిక సహకారం అందించాలని ఎల్అండ్టీ మెట్రో వర్గాలు ముఖ్యమంత్రిని కోరినట్లు సమాచారం. ప్రభుత్వం సహకరిస్తోంది మెట్రో ప్రాజెక్టుకు ఎదురవుతున్న సవాళ్లను పరిష్కరించేందుకు ప్రభుత్వం తమకు పూర్తిగా సహకరిస్తోందని ఎల్అండ్టీ మెట్రో చైర్మన్ ఎస్ఎన్ సుబ్రమణ్యన్ ఒక ప్రకటనలో తెలిపారు. వివిధ దశల్లో మెట్రో మార్గాన్ని నిర్ణీత గడువులోగా పూర్తి చేస్తామన్నారు. మొత్తం 72 కి.మీ. మార్గానికిగానూ ఇప్పటివరకు 61.20 కి.మీ. మార్గంలో పునాదులు సిద్ధం చేశామని, 58.10 కి.మీ. మార్గంలో పిల్లర్ల ఏర్పాటు పూర్తరుు్యందన్నారు. ప్రస్తుతానికి 36.25 కి.మీ. మార్గంలో మెట్రో పట్టాలు పరుచుకున్నాయన్నారు. మొత్తం 65 స్టేషన్లకుగానూ 17 స్టేషన్లు పూర్తిగా సిద్ధమయ్యాయని, మరో 30 స్టేషన్లు తుది దశకు చేరు కున్నాయన్నారు. -
కేసీఆర్ ముక్కు నేలకు రాయాలి: తమ్మినేని
జోగిపేట: ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నిలబెట్టుకోని సీఎం కేసీఆర్ ముక్కు నేలకు రాయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రం కోసం ప్రతిపక్ష పార్టీలన్నీ కలిసి రావాలని, మహాజన పాదయాత్ర ఎజెండాకు అనుకూలంగా ఉన్న పార్టీలతోనే పొత్తు పెట్టుకుంటా మని, అడ్డదిడ్డంగా పెట్టుకునే ప్రసక్తే లేదని ఆయన ప్రకటించారు. జోగిపేటకు చేరుకున్న మహాజన పాదయాత్ర సందర్భంగా సోమవారం ఏర్పాటు చేసిన బహిరంగసభలో ఆయన మాట్లాడారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు అభివృద్ధి చెందితేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్నారు. కేజీ టు పీజీ విద్యను ప్రవేశపెడతానన్న కేసీఆర్ అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు కావస్తున్నా ఎక్కడా ప్రారంభించలేదన్నారు. వచ్చే సంవత్సరం జనవరి నుంచి ఇంగ్లిష్ విద్య అమలు కోసం గ్రామ గ్రామాన ఉద్యమాలు చేపడతామని ప్రకటించారు. విద్య, వైద్యం కోసం ప్రభుత్వం సరిగ్గా నిధులను కేటారుుంచడం లేదని ఆరోపించారు. పారిశ్రామిక అభివృద్ధిపై ఎలాంటి అవగాహన లేని కేటీఆర్‌ను పరిశ్రమల మంత్రిగా చేశారని, ఆయన ఎప్పుడూ అమెరికా, జపాన్, జర్మనీ దేశాలకు తిరగడమే సరిపోతుందని విమర్శించారు. కాగా, సంచార ముస్లిం తరగతుల కోసం సీఎంకు తమ్మినేని లేఖ రాశారు. వీరి కోసం ఫెడరేషన్‌ను ఏర్పాటు చేసి, దానికి రూ.వెరుు్య కోట్లు కేటారుుంచి ప్రత్యేకాధికారి ద్వారా నేరుగా రుణాలు అందించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. -
ఏపీ విద్యుత్ ప్లాంట్ల నిర్మాణంలో అక్రమాలు
మంత్రి జగదీశ్‌రెడ్డి ఆరోపణ సాక్షి, హైదరాబాద్: తెలంగాణతో పోల్చితే ఆంధ్రప్రదేశ్‌లో భారీ వ్యయంతో విద్యుత్ ప్రాజెక్టులను నిర్మిస్తున్నారని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జి.జగదీశ్‌రెడ్డి ఆరోపించారు. తెలంగాణలో 800 మెగావాట్ల కొత్తగూడెం థర్మల్ విద్యుత్ ప్లాంట్‌ను రూ.3,810 కోట్ల అంచనా వ్యయంతో నిర్మిస్తున్నామని... అదే 800 మెగావాట్ల చొప్పున సామర్థ్యం గల ఏపీలోని నార్ల తాతారావు థర్మల్ పవర్ ప్లాంట్‌ను రూ.4,606.87 కోట్లు, దామోదరం సంజీవయ్య థర్మల్ పవర్ స్టేషన్-2ను రూ.4,967 కోట్ల అంచనాతో నిర్మిస్తున్నారన్నారు. తెలంగాణతో పోల్చితే నార్ల తాతారావు ప్లాంట్‌పై రూ.796.87 కోట్లు, దామోదరం సంజీవయ్య ప్లాంట్‌పై రూ.1,157 కోట్లను ఏపీ అధికంగా ఖర్చు చేస్తోందన్నారు. ఈ డబ్బులను ఎవరికి ధారాదత్తం చేస్తున్నారో.. దీని వెను క ఏ మతలబు ఉందో తెలపాలని ఏపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అరుున బీహెచ్ఈఎల్ నుంచి కూడా వాటాలు పొందవచ్చని 30 ఏళ్ల రాజకీయ అనుభవంగల వారికే బాగా తెలుసని ఏపీ సీఎం చంద్రబాబుపై పరోక్ష ఆరోపణలు చేశారు. ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, తెలంగాణ ట్రాన్సకో, జెన్కో సీఎండీ డి.ప్రభాకర్‌రావు, డిస్కంల సీఎండీలు జి.రఘుమారెడ్డి, ఎ.గోపాలరావుతో కలసి మంగళవారం జగదీశ్‌రెడ్డి సచివాలయంలో విలేకరులతో మాట్లాడారు. తెలంగాణలో విద్యుత్ కొనుగోళ్లు, ప్రాజెక్టుల నిర్మాణంపై టీటీడీపీ కార్యనిర్వహక అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. ప్రైవేటు ఒప్పందం ఎందుకు? మిగులు విద్యుత్ సాధించామని ప్రకటించుకున్న ఏపీ ప్రభుత్వం మీనాక్షి నుంచి 200 మెగావాట్లు, సింహపురి నుంచి 400 మెగావాట్ల ప్రైవేటు విద్యుత్ కొనుగోళ్లకు ఒప్పందం ఎందుకు కుదుర్చుకుందని జగదీశ్‌రెడ్డి ప్రశ్నించారు. తెలంగాణకు 392 మెగావాట్ల మిగులు విద్యుత్‌ను ఇస్తామని ఆఫర్ ఇచ్చిన ఏపీ ఆ తర్వాత వెనక్కితగ్గి మరోసారి మోసం చేసిందన్నారు. రిటైర్డ్ అధికారులను సీఎండీలుగా నియమించడాన్ని కూడా తప్పుపడుతున్నారని, ఈ అధికారులే గత రెండేళ్లుగా రాత్రింబవళ్లు పనిచేయడంతో రాష్ట్రంలో విద్యుత్ సమస్య పరిష్కారమైందన్నారు. దేశ వ్యాప్తంగా 36 సబ్ క్రిటికల్ థర్మల్ విద్యుత్ ప్లాంట్లు నిర్మాణంలో ఉన్నాయని, మణుగూరులో నిర్మిస్తున్న భద్రాద్రి 1,080 మెగావాట్ల సబ్‌క్రిటికల్ ప్లాంట్‌కు సైతం కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ నుంచి అనుమతులు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రజల కోసం పనిచేసేవారు జైలుకెందుకు వెళతారు? భద్రాద్రి ప్లాంట్ విషయంలో జరిగిన వ్యవహారాల్లో అధికారులు జైలుకు వెళ్లే పరిస్థితులు ఉత్పన్నమయ్యాయని కొందరు ఆరోపిస్తున్నారని, ప్రజల కోసం పనిచేస్తున్న అధికారులు జైలుకు వెళ్లాల్సిన అవసరం ఏముంటదని మంత్రి ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ ప్రైవేటు కొనుగోళ్లు, విద్యుత్ ప్రాజెక్టుల నిర్మాణాన్ని అత్యంత పారదర్శకంగా చేపట్టామని వెల్లడించారు. వీటిపై చర్చకు సీఎండీలు, డీఈలు అవసరం లేదని, తమ లైన్మెన్లు సరిపోతారని, వారితో చర్చకు విపక్షాలు ముందుకు రావాలని సవాలు విసిరారు. పెద్ద నోట్ల రద్దు వల్ల రాష్ట్రంపై పడే ప్రభావాన్ని సీఎం కేసీఆర్ సమీక్షిస్తున్నారని, పూర్తి స్థారుులో అవగాహనకు వచ్చిన తర్వాత స్పందిస్తామన్నారు. -
సాగుకు ప్రాధాన్యత ఏదీ?
‘రైతు నేస్తం’ వార్షికోత్సవంలో కేంద్ర మంత్రి వెంకయ్య ఆవేదన - ఉత్తమ రైతులు, శాస్త్రవేత్తలు, జర్నలిస్టులకు పురస్కారాలు - సినీ, రాజకీయాలకున్న ప్రాధాన్యం వ్యవసాయానికి లేదని వ్యాఖ్య - ‘సాక్షి’ సాగుబడికి రైతు నేస్తం అవార్డు బహూకరణ సాక్షి, హైదరాబాద్: సినిమాలు, రాజకీయాలకు ఉన్నంత ప్రాధాన్యం వ్యవసాయానికి లేదని కేంద్ర పట్టణాభివృద్ధి, సమాచార, ప్రసారశాఖ మంత్రి ఎం. వెంకయ్య నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. కానీ సినిమా తాత్కాలికమని... వ్యవసాయమే శాశ్వతమని పేర్కొన్నారు. ఈ పరిస్థితిలో మార్పు తెచ్చేందుకు వ్యవసాయ రంగంపై మీడియా దృష్టిపెట్టాలని సూచించారు. రైతు నేస్తం పత్రిక వార్షికోత్సవం సందర్భంగా ఆదివారం హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో ఉత్తమ రైతులు, శాస్త్రవేత్తలు, జర్నలిస్టులకు ఆయన పురస్కారాలు అందజేశారు. ఈ సందర్భంగా వెంకయ్య మాట్లాడుతూ సరైన పంట దిగుబడులు రాక, ప్రకృతి అనుకూలించక రైతులు అప్పులపాలై ఆత్మహత్యలు చేసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. లాభసాటిగా లేనందువల్ల వ్యవసాయం అంతరించి పోతోందని... రైతులు వ్యవసాయాన్ని వదిలేసి ఇతర రంగాలవైపు వెళ్లిపోతున్నారన్నారు. ఈ పరిస్థితుల్లో వ్యవసాయ రంగం లాభసాటిగా మారాలంటే సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి దిగుబడులు పెంచాల్సిన అవసరం ఉందన్నారు. ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయ రంగానికి అనుసంధానించాలని యోచిస్తున్నామని వెంకయ్య తెలిపారు. వ్యవసాయానికి 10 గంటల నాణ్యమైన విద్యుత్ అవసరమని, గ్రామీణ ప్రాంతాల్లో రహదారులు నిర్మించి ప్రధాన రహదారులకు అనుసంధానించడం వల్ల వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్ రైతులకు మరింత సులభతరమవుతుందన్నారు. ఇందులో భాగంగానే కేంద్రం 2019 నాటికి 65 వేల నివాస ప్రాంతాలకు రహదారుల నిర్మాణానికి ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన కింద రూ. 19 వేల కోట్లను ఈ ఏడాది బడ్జెట్లో కేటాయించిందన్నారు. ప్రస్తుతం దేశంలో యూరియా కొరత లేదని... వేపపూత యూరియా అందుబాటులోకి తేవడం వల్ల కొరతను నివారించగలిగామన్నారు. దీనదయాళ్ ఉపధ్యాయ గ్రామజ్యోతి యోజన కింద 2018 మే 1కల్లా మిగిలిన 18,452 గ్రామాలకు విద్యుత్ సౌకర్యం కల్పిస్తామన్నారు. కేసీఆర్ తెలుగులోనే మాట్లాడతారు.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ హైదరాబాద్‌ను తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నారని వెంక య్య ప్రశంసించారు. చాలా మందికి ఇంగ్లిష్ జబ్బు పట్టుకుందని...అందువల్ల తెలుగు అంతరిస్తోందన్నారు. అయితే కేసీఆర్ తెలుగులోనే మాట్లాడతారని కితాబిచ్చారు. తెలంగాణ మాండలికాన్ని కాపాడుకోవాలని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రం విడిపోయినా భాష ఒక్కటేనన్నారు. రాష్టంలో 44 మార్కెట్ యార్డుల్లో ఈ-మార్కెటింగ్ అమలు చేస్తున్నామని... వచ్చే ఏడాది అన్ని యార్డుల్లోనూ అమలు చేస్తామని రాష్ట్ర భారీ నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు తెలిపారు. రైతుల ఇబ్బందులను గమనించే ‘మిషన్ కాకతీయ’ ద్వారా చెరువులు బాగు చేస్తున్నామన్నారు. రైతులకు ‘సాక్షి’ సేవలు భేష్ రైతులకు సలహాలు, సూచనలు ఇవ్వడంలోనూ... వ్యవసాయ కథనాల ద్వారా ‘సాక్షి’ సాగుబడి ఎన్నో సేవలు అందిస్తోందని నిర్వాహకులు కొనియాడారు. అందుకే రైతు నేస్తం అవార్డుకు ‘సాక్షి’ సాగుబడిని ఎంపిక చేశామన్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి వెంకయ్య, మంత్రి హరీశ్‌రావుల చేతుల మీదుగా అవార్డు, జ్ఞాపికను సాక్షి సాగుబడి తరఫున డెస్క్ ఇన్చార్జి పంతంగి రాంబాబు అందుకున్నారు. మాజీ ఎంపీ యలమంచిలి శివాజీకి జీవన సాఫల్య పురస్కారాన్ని, మాజీ ఎమ్మెల్యే ఎం.కోదండరెడ్డికి విశిష్ట పురస్కారాన్ని అందజేశారు. తెలంగాణ రాష్ట్ర విత్తన, సేంద్రియ ధ్రువీకరణ సంస్థ డెరైక్ట ర్ డాక్టర్ కేశవులు, వెంకట రామన్నగూడెం ఉద్యాన కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ ఎ.సుజాత, రాజేంద్రనగర్ పశు వైద్య కళాశాల ప్రొఫెసర్ కె.కొండల్‌రెడ్డి తదితరులకు పురస్కారాలు అందించారు. -
కేసీఆర్ దిష్టిబొమ్మ దహనం
మెట్పల్లి : మెదక్ జిల్లా కొండపాక మండలం ఎర్రవల్లిలో మల్లన్నసాగర్ ముంపు బాధితులపై పోలీసులు లాఠీచార్జీ చేయడాన్ని నిరసిస్తూ యూత్ కాంగ్రెస్ నాయకులు సోమవారం పట్టణంలోని జాతీయ రహదారిపై సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. నాయకులు మాట్లాడుతూ శాంతియుతంగా నిరసన తెలుపుతున్న నిర్వాసితులపై లాఠీచార్జీ చేయడం అమానుషమన్నారు. ప్రభుత్వం ఈ సంఘటనపై విచారణ జరిపి బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నాయకులు ఎండీ రైసుద్దీన్, ఆకుల ప్రవీణ్, దోమకొండ రమేశ్, పొట్ట ప్రేమ్, కోట అనిల్, బత్తుల దీక్షిత్, సద్దాం, నదీం మోరెపు తేజ ఉన్నారు. నిర్వాసితులపై లాఠీచార్జి అమానుషం మల్లన్నసాగర్ భూ నిర్వాసితులపై పోలీసుల లాఠీచార్జి అమానుషమని కాంగ్రెస్ మండల అధికార ప్రతినిధి బోయిని హన్మాండ్లు అన్నారు. సోమవారం మండలంలోని పాతదాంరాజుపల్లిలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. పోలీసులు లాఠీచార్జిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం మెండిగా వ్యవహరిస్తూ మల్లన్నసాగర్ ప్రాజెక్టుకోసం రైతుల వద్ద నుంచి బలవంతంగా భూ సేకరణ చేయడం దారుణమన్నారు. ఘటనపై విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆయన వెంటన స్థానిక నాయకులు ఉన్నారు. -
చండీయాగం ఫలాలు దక్కాలంటే..జోగుళాంబ జిల్లా చేయాలి
- సీఎం కేసీఆర్‌కు ఎమ్మెల్యే డీకే అరుణ విజ్ఞప్తి - లేకుంటే అమ్మవారి ఆగ్రహానికి గురవుతారని హెచ్చరిక సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్ : ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఆయుత చండీయాగం ఫలాలు దక్కాలంటే.. జోగుళాంబ జిల్లాగా గద్వాలను ప్రకటించాలని స్థానిక ఎమ్మెల్యే డీకే అరుణ కోరారు. గద్వాల కేంద్రంగా జోగుళాంబ జిల్లాను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ఎమ్మెల్యే డీకే అరుణ మహబూబ్‌నగర్ జిల్లా గద్వాల మండలం జమ్ములమ్మ ఆలయం నుంచి అలంపూర్ జోగుళాంబ ఆలయం వరకు పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. మంగళవారం స్థానిక జమ్ములమ్మ ఆలయంలో పూజలు నిర్వహించి, అలంపూర్ ఎమ్మెల్యే సంపత్‌కుమార్‌తో కలసి పాదయాత్రను ప్రారంభించారు. మొదటిరోజు 14 కిలోమీటర్ల పాదయాత్ర గద్వాల నుంచి ఎర్రవల్లి చౌరస్తా వరకు సాగింది. ప్రజలనుద్దేశించి ఆమె మాట్లాడుతూ ఒక వ్యక్తి ప్రయోజనాల కోసం జిల్లాలను ఏర్పాటు చేసే ఆలోచన మానుకోవాలని కోరారు. అర్హత ఉన్న ప్రాం తాలను జిల్లా కేంద్రాలుగా చేయాలని సూచించారు. నడిగడ్డ ప్రజల త్యాగాలు, ఈ ప్రాంత వెనుకబాటు, వనరులను దృష్టిలో ఉంచుకొని జిల్లాను ఏర్పాటు చేయాలని కోరారు. అలంపూర్ ఎమ్మెల్యే సంపత్‌కుమార్ మాట్లాడుతూ గద్వాల, అలంపూర్ నియోజకవర్గాలపై సీఎం కేసీఆర్ వివక్ష చూపుతున్నారని విమర్శించారు. ఎర్రవల్లి చౌరస్తాలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బస్సులో డీకే అరుణ బస చేశారు. -
ప్రజాహితం కోసం మొక్కలు నాటాలి
పిలుపునిచ్చిన శాసనసభ స్పీకర్ సాక్షి, హైదరాబాద్ : ప్రజా హితం కోసం ప్రజలందరూ మొక్కలు నాటాలని శాసనసభ స్పీకర్ ఎస్. మధుసూదనాచారి పిలుపునిచ్చారు. ‘ మొక్కలు నాటాలి.. అడవులను ప్రేమించాలి. సాంకేతికత పెరిగే కొద్దీ ప్రజాహితాన్ని మరిచిపోతున్నారు..’ అని ఆయన అన్నారు. శాసనసభ, శాసనమండలి ఆవరణలో మంగళవారం ఆయన మండలి చైర్మన్ స్వామిగౌడ్‌తో కలిసి హరితహారం కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటారు. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి కొనసాగించడానికే సీఎం కేసీఆర్ హరితహారం చేపట్టారని, ప్రజల సంక్షేమం కోసం చేపట్టిన ఈ కార్యక్రమంలో ప్రజలంతా భాగస్వాములు కావాలని ఆయన కోరారు. వెయ్యేళ్ల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని సీఎం హరిత హారం ప్రారంభించారని, ఇలాంటి గొప్ప కార్యక్రమాన్ని చేపట్టడం ప్రపంచంలో తొలిసారని కొనియాడారు. కార్యక్రమంలో ప్రజలంతా భాగ స్వాములు కావాలని కోరారు. హరితహారంలో డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, ఎమ్మెల్సీలు బోడకుంటి వెంకటేశ్వర్లు, పొంగులేటి సుధాకర్‌రెడ్డి తదిరులు పాల్గొని మొక్కలు నాటారు. -
మేక్ ఇన్ తెలంగాణ
- పెట్టుబడులకు రాష్ట్రంలో అనువైన వాతావరణం - ఢిల్లీలో వివిధ దేశాల ప్రతినిధులను కలసి వివరించిన కేటీఆర్ సాక్షి, న్యూఢిల్లీ : ‘మేక్ ఇన్ తెలంగాణ’లో భాగంగా రాష్ట్రంలో పారిశ్రామిక పెట్టుబడులను భారీగా ఆకర్షించే లక్ష్యంతో రెండ్రోజుల హస్తిన పర్యటనకు శ్రీకారంచుట్టిన ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కె.తారక రామారావు మంగళవారం తొలి రోజు వివిధ దేశాల ప్రతినిధులను కలుసుకున్నారు. తమ ప్రభుత్వం తెచ్చిన నూతన పారిశ్రామిక విధానం, రాష్ట్రంలో పెట్టుబడులకు కల్పిస్తున్న అనువైన వాతావరణం తదితర అంశాల గురించి వారికి వివరించారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేలా ఆయా పారిశ్రామిక వర్గాలను ప్రోత్సహించాలని విజ్ఞప్తి చేశారు. ఉదయం 9.30 గంటలకు జపాన్ ఎంబసీలో ఉప రాయబారి యుపక కికుటను కేటీఆర్ కలసి తెలంగాణ పారిశ్రామిక విధానాలు, పెట్టుబడులకు అనువైన వాతావరణం, సులభతరమైన పెట్టుబడి విధానాలను వివరించారు. మేక్ ఇన్ తెలంగాణలో భాగంగా జపాన్ నుంచి పెట్టుబడులను ఆకర్షించేందుకు కేటీఆర్ అక్కడ పర్యటించనున్న నేపథ్యంలో ఈ సమావేశం జరిగింది. అనంతరం మలేసియా ఉప ప్రధాని డాక్టర్ అహ్మద్ జహీద్ హమీదితో కేటీఆర్ సమావేశమయ్యారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు నెలకొన్న అనువైన వాతావరణం గురించి ఆయనకు వివరించారు. ఆ తర్వాత భారతీ ఎయిర్టెల్ చైర్మన్ సునీల్ మిట్టల్‌తో భేటీ అయిన కేటీఆర్...హైదరాబాద్‌లో డేటా సెంటర్ క్యాంపస్ ఏర్పాటులో భాగస్వామిగా ఉండాలని కోరారు. అనంతరం వరల్డ్ ఎకనమిక్ ఫోరం ఆధ్వర్యంలో జరిగిన డిజిటల్ సమ్మిట్‌లో కేటీఆర్ పాల్గొన్నారు. తెలంగాణలో డిజిటైజేషన్ కార్యక్రమాలను ఈ సదస్సులో వివరించారు. ఆపై తైవాన్ రాయబారి చుంగ్ కవాంగ్ తైన్, దక్షిణ కొరియా రాయబారి హ్యున్ ఛోతో వేర్వేరుగా సమావేశమయ్యారు. తెలంగాణ పారిశ్రామిక విధానాలను వివరిస్తూ రాష్ట్రంలో పెట్టుబడులకు ఆయా దేశాల పారిశ్రామిక వర్గాలను ప్రోత్సహించాలని కోరారు. ఈ సమావేశాలు ముగిశాక కేంద్ర చిన్న, మధ్య తరహా పరిశ్రమలశాఖ మంత్రి కల్రాజ్ మిశ్రాను కలసి తెలంగాణలో ఆయా పరిశ్రమల్లో నెలకొన్న సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. పూర్తి సహకారానికి జపాన్ హామీ... తొలి రోజు పర్యటన వివరాలను కేటీఆర్ మీడియాకు వివరిస్తూ ‘‘ఈ రోజు తెలంగాణ ప్రభుత్వ పక్షాన ఐటీ, పారిశ్రామిక సంస్థల ప్రతినిధులను కలిశా. మేక్ ఇన్ తెలంగాణ కార్యక్రమంలో భాగంగా ఎలక్ట్రానిక్ హార్డ్‌వేర్ రంగాన్ని రాష్ట్రానికి తీసుకొచ్చే క్రమంలో జపాన్‌కు సంబంధించిన పెద్ద సంస్థలను ఆహ్వానించేందుకు ఆ దేశంలో పర్యటించాలనుకుంటున్నాం. అందుకు సహకరించాలని కోరేందుకు జపాన్ ఎంబసీలో హైకమిషన్ అధికారిని కలిశాను. పూర్తి స్థాయిలో సహకరిస్తామని చెప్పారు. మన విధానాలు, పెట్టుబడులకుగల అవకాశాలను వివరించాం. అలాగే దక్షిణ కొరియా, తైవాన్ దేశాల ప్రతినిధులు, మలేసియా ఉప ప్రధానితోనూ సమావేశమయ్యాను. హైదరాబాద్‌లో ఏర్పాటు చేయాలనుకుంటున్న డేటా సెంటర్ క్యాంపస్‌లో భాగస్వామిగా ఉండాలని భారతీ ఎయిర్టెల్ అధినేత సునీల్ మిట్టల్‌ను కలసి విజ్ఞప్తి చేయగా త్వరలోనే ఒక బృందాన్ని పంపి సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తామన్నారు. హడ్కో, నేషనల్ హౌసింగ్ బోర్డు సీఈవోను కలిశాం. తెలంగాణకు సంబంధించి మిషన్ భగీరథ, హైదరాబాద్ ఫార్మా సిటీకి రూ. 745 కోట్ల రుణం కావాలని అడిగాం. సానుకూలంగా స్పందించారు. త్వరలోనే వస్తుందని ఆశిస్తున్నాం. డిజైనింగ్ ఏ స్మార్ట్ నేషన్ అనే అంశంపై వరల్డ్ ఎకనమిక్ ఫోరం నిర్వహించిన సదస్సులో డిజిటైజేషన్లో ఐటీ పాత్రపై చర్చ జరిగింది. తెలంగాణలో తీసుకుంటున్న వివిధ కార్యక్రమాలను వివరించాం. మంత్రి కల్రాజ్ మిశ్రాను కలిశాం. చిన్న, మధ్యతరహా పారిశ్రామికవేత్తల సమస్యలను చర్చించాం. కేంద్ర మంత్రులు వెంకయ్య నాయుడు, స్మృతీ ఇరానీని బుధవారం కలసి తెలంగాణకు అవసరమైన సాయాన్ని కోరుతాం’’ అని చెప్పారు. ప్రధాని పర్యటన ఖరారు కాలేదు... తెలంగాణలో ప్రధాని పర్యటనకు సంబంధించి మీడియా ప్రశ్నకు కేటీఆర్ బదులిస్తూ ప్రధాని పర్యటన ఇంకా ఖరారు కాలేదన్నారు. ‘‘తెలంగాణలో పర్యటించాలని ప్రధాని మోదీని ముఖ్యమంత్రి కేసీఆర్ నిన్న (సోమవారం) ఆహ్వానించారు. ఇంకా తేదీలు ఖరారు కాలేదు. ప్రధాని వస్తారని ఆశిస్తున్నా. సుహృద్భావ వాతావరణంలో ప్రధానితో సీఎం సమావేశం జరిగింది’’ అని వివరించారు. ఐటీఐఆర్‌ను మళ్లీ కేబినెట్‌కు తీసుకెళ్లి రీ డిజైన్ చేస్తామని ఐటీ మంత్రి రవిశంకర్ ప్రసాద్ గతంలో చెప్పారని ఓ ప్రశ్నకు కేటీఆర్ బదులిచ్చారు. -
బంగారు తెలంగాణకు సహకరించాలి
- డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి - అట్టహాసంగా ప్రపంచ తెలంగాణ మహాసభలు ప్రారంభం - అలరించిన రసమయి ఆటాపాటా రాయికల్ (కరీంనగర్) : సీఎం కేసీఆర్ కలలుకంటున్న బంగారు తెలంగాణ సాధనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి అన్నారు. అమెరికాలోని డెట్రాయిట్లో అమెరికా తెలంగాణ సంఘం(ఆటా) ఆధ్వర్యంలో ప్రథమ ప్రపంచ తెలంగాణ మహాసభలు శనివారం ప్రారంభమయ్యాయి. శ్రీహరి మాట్లాడుతూ హైదరాబాద్‌లో పెట్టుబడులు పెట్టేం దుకు వివిధ దేశాలు పోటీ పడుతున్నాయన్నారు. ప్రవాస తెలంగాణవాదులు తెలంగాణలో పెట్టుబడులు పెట్టి నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలని కోరారు. ముఖ్యఅతిథిగా హాజరైన ఎంపీ కవితకు నిర్వాహకులు బతుకమ్మలతో ఘనంగా స్వాగతం పలికారు. కడియం శ్రీహరి, తెలంగాణ శాసన మండలి చైర్మన్ స్వామిగౌడ్‌లతో కలసి ఆమె తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించారు. రసమయి ఆటాపాటా అలరించింది. ప్రవాస తెలంగాణవాదులు తెలంగాణ పాటలపై స్టెప్పులేశారు. కరీంనగర్ జెడ్పీ చైర్పర్సన్ తుల ఉమ కళాకారులతో కలసి బతుకమ్మ ఆట ఆడారు. కార్యక్రమంలో చీఫ్‌విప్ కొప్పుల ఈశ్వర్, ఎంపీ జితేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీలు లక్ష్మణ్‌రావు, భానుప్రసాద్‌రావు, ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు, టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ, నిర్వాహకులు రాంమోహన్, వినోద్‌కుమార్, నాగేందర్, కరుణాకర్ పాల్గొన్నారు. తెలుగు రాష్ట్రాలు విస్తరించాయి: యార్లగడ్డ దేశంలో హిందీ మాట్లాడే రాష్ట్రాలు ఐదు, ఆరు ఉండగా తెలుగు మాట్లాడే రాష్ట్రాలు రెండు ఉండడంలో తప్పు లేదని, తెలుగు రాష్ట్రాలు విస్తరించాయే తప్ప... విడిపోలేదని రాజ్యసభ మాజీ సభ్యులు, పద్మభూషణ్ ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ అన్నారు. ఇద్దరు సీఎంలు ఒకరింటికి మరొకరు వెళ్లి వారి వ్యక్తిగత కార్యకలాపాల్లో పాల్గొంటున్నట్లే ఇరు రాష్ట్రాల మధ్య చిన్నచిన్న సమస్యలు సామరస్యంగా పరిష్కరించుకోవాలని కోరారు. బంగారు తెలంగాణ వద్దని, దాశరథి ఆశించినట్లు కోటి రతనాల వీణగా బాసిల్లే తెలంగాణ కావాలని ఆకాంక్షించారు. -
ఏడు రోజులు.. ఏడు రంగులు
- ఆస్పత్రుల్లో రోజుకో రంగు బెడ్‌షీట్ - పరిశుభ్రత కోసం ప్రతిరోజూ మార్చేలా ఈ విధానం - రాష్ట్రంలో 20 వేల పడకలకు రెండు సెట్ల రంగు దుప్పట్లు సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఆస్పత్రుల్లోని పడకలపై ఇక నుంచి రంగు రంగుల దుప్పట్లు దర్శనమివ్వనున్నాయి. ప్రస్తుతం తెల్లరంగు బెడ్షీట్లు మాత్రమే వాడుతుండగా... ఇకనుంచి వారంలో ఏడు రోజులు ఏడు రంగుల దుప్పట్లు కనిపించనున్నాయి. ఆస్పత్రుల్లో తెల్ల రంగు దుప్పట్లను ఉతక్కుండానే రోజుల తరబడి ఉపయోగిస్తున్నారు. దీంతో ఇతర రోగులు వాడిన దుప్పట్లనే మరో రోగి వాడుతోన్న పరిస్థితి నెలకొంది. ఫలితంగా రోగులు అంటువ్యాధులకు గురవుతున్నారు. ఈ పరిస్థితికి చరమగీతం పాడాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. ప్రతిరోజూ ఆస్పత్రుల్లోని పడకలపై బెడ్షీట్లను మార్చేలా కొత్త విధానానికి శ్రీకారం చుట్టాలని ఆయన ఆదేశించారు. ఇందులో భాగంగా వైద్య ఆరోగ్యశాఖ చర్యలు చేపట్టింది. వారంలో ఏడు రోజులు ఏడు రంగుల దుప్పట్లు వాడితే తప్పనిసరిగా దుప్పట్లను ఉతికి ఆరేస్తారని.. రోజుకో రంగు దుప్పటి వాడాలన్న నిర్ణయం వల్ల పర్యవేక్షణ కూడా సులువుగా ఉంటుందని భావిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా వారంలో ఏ రోజు ఏ రంగు దుప్పటి వాడాలో నిర్ణయిస్తారు. ఆ ప్రకారమే ఆస్పత్రి సిబ్బంది దుప్పట్లను ప్రతిరోజూ మార్చుతూ... మార్చిన వాటిని ఉతికించి మరో వారానికి సిద్ధంగా ఉంచుతారు. 20 వేల పడకలకు రంగుల దుప్పట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ఇప్పటికే ఈ విధానాన్ని దేశంలోని 19 ప్రధాన ఆస్పత్రుల్లో అమలు చేస్తోంది. ఢిల్లీలోని ఎయిమ్స్, సఫ్దర్‌జంగ్ ఆస్పత్రి, ఛండీగఢ్‌లోని పోస్ట్‌గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకే షన్ అండ్ రీసెర్చ్, పాండిచ్చేరిలోని జిప్‌మర్‌లోనూ ఈ విధానం అమలవుతోంది. ఆయా ఆస్పత్రుల్లో సోమవారం తెల్ల దుప్పటి, మంగళవారం గులాబీ, బుధవారం ఆకుపచ్చ, గురువారం పసుపుపచ్చ, శుక్రవారం ఊదా లేదా మరో రెండు రంగులు, శనివారం నీలం, ఆదివారం లేత బూడిదరంగు లేదా మరో రంగును వాడుతున్నారు. కొద్దిపాటి మార్పులు చేసి ఆ ప్రకారమే రాష్ట్రంలోనూ అమలు చేస్తారని వైద్యాధికారులు చెబుతున్నారు. రాష్ట్రంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సామాజిక ఆరోగ్య కేంద్రాలు, ఏరియా ఆస్పత్రులు, జిల్లా ఆస్పత్రులు, రాష్ట్రస్థాయిలో ఉస్మానియా, నిలోఫర్, నిమ్స్, ఎంఎన్‌జే సహా అనేక పెద్దాసుపత్రులున్నాయి. వాటన్నింటిలో దాదాపు 20 వేల వరకు పడకలున్నాయి. టెండర్ల ప్రక్రియ మొదలు అన్ని ఆస్పత్రుల్లోనూ ఏడు రోజులు ఏడు రంగుల బెడ్షీట్లను రెండు సెట్లు అందుబాటులో ఉండేలా చూడాలని నిర్ణయించారు. ఒక సెట్ ఎప్పుడూ రిజర్వులో ఉంచుతారు. రంగు బెడ్షీట్లను కొనుగోలు చేసేందుకు వైద్య ఆరోగ్యశాఖ టెండర్ల ప్రక్రియ ప్రారంభించింది. తక్కువ కోట్ చేసిన కంపెనీ నుంచి బెడ్షీట్లను కొనుగోలు చేస్తారు. చర్లపల్లి జైలులో ఖైదీలు బెడ్షీట్లు తయారు చేస్తున్నందున వారి నుంచి ఎన్ని వీలైతే అన్ని కొనుగోలు చేయాలని కూడా నిర్ణయించారు. రాష్ట్రవ్యాప్తంగా ఒక్కో పడకకు ఏడు దుప్పట్లు రెండు సెట్ల చొప్పున 20 వేల పడకలకు 2.80 లక్షల రంగు దుప్పట్లను కొనుగోలు చేసే అవకాశం ఉందని అంటున్నారు. -
కేసీఆర్‌కు ధన్యవాదాలు: బాలకృష్ణ
హైదరాబాద్: కేన్సర్ వ్యాధిగ్రస్తులకు అందిస్తున్న సేవలను గుర్తించి ప్రభుత్వానికి ఆస్పత్రి చెల్లించాల్సిన రుసుమును మాఫీ చేసిన ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుకు ధన్యవాదాలు తెలుపుతున్నట్లు ప్రముఖ నటుడు, బసవతారకం ఇండో అమెరికన్ ఆస్పత్రి చైర్మన్ బాలకృష్ణ పేర్కొన్నారు. బుధవారం ఆస్పత్రి 16వ వార్షికోత్సవం సందర్బంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని కేక్ కట్ చేశారు. కేన్సర్ వ్యాధిపై పోరాడి అజేయులుగా నిలిచిన పలువురిని సత్కరించారు. కుల, మత, ప్రాంత తారతమ్యం లేకుండా అందరికీ అంతర్జాతీయస్థాయి వైద్య సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని నిర్వహించిన క్రీడల్లో విజేతలకు ఏపీ స్పీకర్ కోడెల శివప్రసాద్‌రావు బహుమతులు అందజేశారు. రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆస్పత్రి సీఈవో ఆర్పీ సింగ్, ట్రస్ట్ సభ్యులు నామా నాగేశ్వరరావు, ఎంవీఎస్ఎస్ మూర్తి, జేఎస్ఆర్ ప్రసాద్, మెడికల్ డెరైక్టర్ టీఎస్ రావు, మెడికల్ సూపరింటెండెంట్ సత్యనారాయణ, వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు. -
అటకెక్కిన సంక్షేమ పథకాలు
వైఎస్సార్ సీపీ అధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డి సాక్షిప్రతినిధి, ఖమ్మం: దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి కాంగ్రెస్ పాలనలో ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్మెంట్, పింఛన్లు, రేషన్, 108, 104, ఇంది రమ్మ ఇళ్ల పథకాలను ఈ ప్రభుత్వం అటకెక్కించిందని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, అధికార ప్రతి నిధి కొండా రాఘవరెడ్డి విమర్శించారు. ఖమ్మంలోని ప్రెస్‌క్లబ్‌లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కమీషన్లు దండుకోవడానికే సీఎం కేసీఆర్ ప్రాజెక్టులకు రీ డిజైన్ చేయిస్తున్నారని, రాష్ర్టంలో ఈ రెండేళ్లలో ఒక్క ప్రాజెక్టునైనా పూర్తిచేసి సాగునీటిని అందించారా? అని ప్రశ్నించారు. మాటల గారడీ చేస్తూ.. పూటకోమాట చెబుతున్న కేసీఆర్ పాలనకు కాలం చెల్లే రోజులు దగ్గర పడ్డాయన్నారు. ఒక్క సంక్షేమ పథకం కూడా క్షేత్రస్థాయిలో అమలు కావడం లేదని, ఇప్పటికే ప్రజల్లో దీనిపై నిరసనలు వ్యక్తం అవుతున్నాయన్నారు. ఇప్పుడు కొత్త జిల్లాలంటూ మళ్లీ ప్రజలను మభ్యపెడుతున్నారని విమర్శించారు. ముందుగా జలయజ్ఞంలో చేపట్టిన సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయాలని డిమాం డ్ చేశారు. మంత్రి తుమ్మల ఏనాడూ తెలంగాణ ఉద్యమంలో పాల్గొనలేదని, తుమ్మలను పాలేరు ఎన్నికలో పోటీలోకి దించడాన్ని ప్రజలు వ్యతిరేకిస్తున్నారన్నారు. వైఎస్సార్ సీపీ, టీడీపీ మద్దతునిచ్చిన కాంగ్రెస్ అభ్యర్థి రాంరెడ్డి సుచరితారెడ్డి విజయం ఖాయమన్నారు. -
బాబు, కేసీఆర్ విలువల్ని పతనం చేశారు
వైఎస్సార్ సీపీ కేంద్ర పాలకమండలి సభ్యుడు నల్లా సూర్యప్రకాశ్ శాలిగౌరారం: ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులు చంద్రబాబు, కేసీఆర్ కలసి రాజకీయ విలువలను పూర్తిగా పతనం చేశారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర పాలకమండలి సభ్యుడు నల్లా సూర్యప్రకాశ్ అన్నారు. నల్లగొండ జిల్లా శాలిగౌరారం మండలం అంబారిపేటలో శుక్రవారం జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం ఇక్కడ విలేకరులతో మాట్లాడారు. రాజకీయ స్వార్థం కోసం ప్రతిపక్షం లేకుండా చేసేందుకు దిగజారుడుతనానికి పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. ప్రజాప్రతినిధులు ప్రజాభిప్రాయానికి విరుద్ధంగా పార్టీలు మారడం సరికాదని, పదవికి, పార్టీకి రాజీనామా చేసి ఇతర పార్టీలలో చేరాలన్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ తొలి ముఖ్యమంత్రిని దళితుడిని చేస్తానని హామీ ఇచ్చారని, అధికారం చేతికందగానే ఆ హామీని విస్మరించారన్నారు. ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్, ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు మూడు ఎకరాల భూమి పంపిణీ, డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణం తదితర పథకాలపై ఆచరణ తక్కువ.. ప్రచారం ఎక్కువ అన్న చందంగా మారిందన్నారు. పాలేరు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ స్వార్ధ రాజకీయాన్ని తిప్పికొట్టి, కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధిని గెలిపించి ప్రజాస్వామ్య విలువలను కాపాడాలని పాలేరు ప్రజలకు పిలుపునిచ్చారు. -
ఓట్లు, సీట్ల కోసం టీఆర్ఎస్ ఆవిర్భవించలేదు
పాలమూరు గోస తీరుస్తాం: కవిత సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: ఓట్లు, సీట్ల కోసం టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించలేదని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత అన్నారు. యావత్ తెలంగాణ ప్రజల ఉద్యమ ఆశీస్సులతో ఇచ్చిన అధికారాన్ని పాలమూరు కరువు గోసను తీర్చడానికి వినియోగిస్తామని, చదువుల జిల్లాగా మార్చే వరకు సీఎం కేసీఆర్ విశ్రమించబోరన్నారు. శని వారం రాత్రి మహబూబ్‌నగర్‌లో ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ అధ్యక్షతన జరిగిన టీఆర్ఎస్ నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశంలో ఆమె మాట్లాడు తూ ఇంటింటికి తాగునీరు ఇవ్వకపోతే ఓట్లే అడగనని ప్రజలకు స్పష్టంచేసిన రాజకీయ నేత కేసీఆర్ తప్ప దేశంలో మరెవరూ లేరని, ఇందుకు ఏ చరిత్ర పుస్తకాలైనా తిరగేయవచ్చని అన్నారు. పాలమూరు ఎంపీగా కేసీఆర్ ఉన్నప్పుడే తెలంగాణ రావడం ఒక మహత్కార్యంగా భావిస్తున్నామని కవిత పేర్కొన్నారు. పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని కేసీఆర్ పర్యవేక్షిస్తున్నారని, డిజైన్, టెండర్ల ప్రక్రియ ఏకకాలంలో పూర్తి చేసి ఈ జిల్లాపై తనకున్న మక్కువను చాటార న్నారు. తెలంగాణ ప్రజల అభివృద్ధి తప్ప మరేమీ అవసరం లేదని, పైసల, ప్రాణాలు, పదవులపై ఏనా డో ఆశలు వదులుకున్నామని, వాటి కోసం రాజకీ యం చేయాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. -
కార్మికుల పిల్లలకు కొత్త పథకం
♦ హోంగార్డులు, జర్నలిస్టులు, ఆటోడ్రైవర్ల ప్రమాద బీమా రూ.6లక్షలకు పెంపు ♦ మేడే ఉత్సవాల సమీక్షలో సీఎం కేసీఆర్ నిర్ణయాలు సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ కార్మిక దినం ‘మేడే’ రోజున రాష్ట్ర ప్రభుత్వం కార్మిక లోకానికి వరాలు ప్రకటించనుంది. కార్మికుల సామాజిక భద్రత పథకం కింద హోంగార్డులు, జర్నలిస్టులు, ఆటో డ్రైవర ్లకు అమలు చేస్తున్న రూ.5 లక్షల ప్రమాద బీమాను రూ.6 లక్షలకు పెంచనుంది. కార్మికశాఖ ఆధ్వర్యంలో కార్మికుల పిల్లలకు మంజూరు చేస్తున్న ఉపకార వేతనాలకు బదులు మరో కొత్త పథకాన్ని ప్రవేశపెట్టనుంది. మేడే ఉత్సవాల నిర్వహణపై క్యాంపు కార్యాలయంలో శనివారం కార్మిక, హోంశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి, కార్మికశాఖ కార్యదర్శి నదీం అహ్మద్‌లతో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సమీక్షించారు. ఈ సమీక్షలో కార్మికుల సంక్షేమం విషయంలో ఆయన కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలిసింది. అయితే వివరాలను మేడే రోజున ప్రకటించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలిసింది. ప్రస్తుతం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సంక్షేమశాఖల ద్వారా అన్ని వర్గాల పేద విద్యార్థులు ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను అందుకుంటున్నారు. అయితే ఒకే ఉపకార వేతనం తీసుకోవాలన్న నిబంధన ఉండటంతో కార్మికశాఖ అందిస్తున్న ఉపకార వేతనాలను కార్మికుల పిల్లలు అందుకోలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో ఈ పథకం స్థానంలో కొత్త పథకాన్ని తీసుకొస్తే కార్మికుల పిల్లలకు లబ్ధి కలుగుతుందని సమీక్షలో సీఎం పేర్కొన్నట్లు తెలిసింది. ఈ మేరకు కొత్త పథకానికి రూపకల్పన చేయాలని కార్మికశాఖను ఆదేశించినట్లు సమాచారం. -
తెలంగాణలో ప్రాంతీయ తీవ్రవాదం: రావెల
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ప్రాంతీయ తీవ్రవాదం రాజ్యమేలుతోందని ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి రావెల కిశోర్‌బాబు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. టీఆర్ఎస్ ప్రాంతీయ తీవ్రవాదానికి భయపడే టీడీపీ శాసనసభ్యులు ఆ పార్టీలో చేరుతున్నారని ఆరోపించారు. హైదరాబాద్‌లో సచివాలయంలోని తన చాంబర్లో శనివారం మంత్రి రావెల విలేకరులతో మాట్లాడారు. ఏపీలో సీఎం చంద్రబాబు చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులయ్యే వైఎస్సార్సీపీ శాసనసభ్యులు టీడీపీలో చేరుతున్నారని తెలిపారు. తెలంగాణలో టీడీపీ శాసనసభ్యులూ సీఎం కేసీఆర్ చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులయ్యే టీఆర్ఎస్లో చేరుతున్నారా అన్న విలేకరులకు ప్రశ్నకు మంత్రి రావెల స్పందిస్తూ ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో ప్రాంతీయ తీవ్రవాదం రాజ్యమేలుతోందని, సీఎం కేసీఆర్‌తోపాటూ ఆయన కుటుంబ సభ్యులు దీన్ని పెంచి పోషిస్తున్నారని ఆరోపించారు. టీఆర్ఎస్కు తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. రాష్ట్రంలో ప్రభుత్వ పనితీరును మెరుగుపర్చడానికే సర్వే నిర్వహించి మంత్రులకు ర్యాంకులు కేటాయిస్తున్నారని మరో ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. వాటిని పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం లేదన్నారు. ర్యాంకులను పరిగణనలోకి తీసుకోనప్పుడు కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని వెచ్చించి సర్వేలు నిర్వహించడం ఎందుకని విలేకరులు ప్రశ్నించగా మంత్రి రావెల నీళ్లు నమిలారు. సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లో చదువుతోన్న విద్యార్థులకు గ్రేడింగ్ ఇస్తున్నామని చెప్పారు.