
కేసీఆర్ ముక్కు నేలకు రాయాలి: తమ్మినేని
జోగిపేట: ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నిలబెట్టుకోని సీఎం కేసీఆర్ ముక్కు నేలకు రాయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రం కోసం ప్రతిపక్ష పార్టీలన్నీ కలిసి రావాలని, మహాజన పాదయాత్ర ఎజెండాకు అనుకూలంగా ఉన్న పార్టీలతోనే పొత్తు పెట్టుకుంటా మని, అడ్డదిడ్డంగా పెట్టుకునే ప్రసక్తే లేదని ఆయన ప్రకటించారు. జోగిపేటకు చేరుకున్న మహాజన పాదయాత్ర సందర్భంగా సోమవారం ఏర్పాటు చేసిన బహిరంగసభలో ఆయన మాట్లాడారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు అభివృద్ధి చెందితేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్నారు.
కేజీ టు పీజీ విద్యను ప్రవేశపెడతానన్న కేసీఆర్ అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు కావస్తున్నా ఎక్కడా ప్రారంభించలేదన్నారు. వచ్చే సంవత్సరం జనవరి నుంచి ఇంగ్లిష్ విద్య అమలు కోసం గ్రామ గ్రామాన ఉద్యమాలు చేపడతామని ప్రకటించారు. విద్య, వైద్యం కోసం ప్రభుత్వం సరిగ్గా నిధులను కేటారుుంచడం లేదని ఆరోపించారు. పారిశ్రామిక అభివృద్ధిపై ఎలాంటి అవగాహన లేని కేటీఆర్‌ను పరిశ్రమల మంత్రిగా చేశారని, ఆయన ఎప్పుడూ అమెరికా, జపాన్, జర్మనీ దేశాలకు తిరగడమే సరిపోతుందని విమర్శించారు. కాగా, సంచార ముస్లిం తరగతుల కోసం సీఎంకు తమ్మినేని లేఖ రాశారు. వీరి కోసం ఫెడరేషన్‌ను ఏర్పాటు చేసి, దానికి రూ.వెరుు్య కోట్లు కేటారుుంచి ప్రత్యేకాధికారి ద్వారా నేరుగా రుణాలు అందించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.