
సాక్షి,కొత్తగూడెం: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ఫ్రీ అండ్ ఫెయిర్‌గా జరిగేందుకు ఎన్నికల కమిషన్ అన్ని చర్యలు తీసుకుంటోంది. ఎంతటివారి వాహనాన్ని అయినా అధికారులు ఆపి చెక్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆదివారం కొత్తగూడెంలో బీఆర్‌ఎస్ ప్రజాఆశీర్వాద సభ కోసం వచ్చిన సీఎం కేసీఆర్ ప్రయాణించే ప్రగతిపథం వాహనాన్ని ఎన్నికల అధికారులు తనిఖీ చేశారు.
ఇటీవలే మంత్రి కేటీఆర్‌తో పాటు హోం మంత్రి మహమూద్ అలీల వాహనాలను కూడా ఎన్నికల అధికారులు తనిఖీలు చేసిన విషయం తెలిసిందే. తాజాగా సీఎం వాహనం తనఖీ చేయడం చర్చనీయాంశంగా మారింది. ఏదైనా సమాచారం మేరకు సీఎం బస్సును తనిఖీ చేశారా రొటీన్ చెకింగ్‌లో భాగంగా చేశారా అన్నది ప్రశ్నార్థకంగా మారింది.
Comments
Please login to add a commentAdd a comment