సాక్షి, హైదరాబాద్: ప్రపంచదేశాలను వణికిస్తున్న కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ విషయంలోనైనా ముందస్తు జాగ్రత్తలు తీసుకుని ప్రజల ప్రాణాలను కాపాడాలని వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
‘వాస్తవానికి కరోనా కష్టకాలంలో ఆస్పత్రుల్లో పడకల కొరత ఉంది. పడకలున్న చోట ఆక్సిజన్ సదుపాయం లేక ప్రజలు అనేక కష్టాలు ఎదుర్కొన్నారు. ఆ సమయంలో ప్రజ ల ప్రాణాలను దొరగారు గాలికొదిలేశారు. కనీసం ఇప్పుడైనా ప్రజల ప్రాణాలను కాపాడండి. సీఎం కేసీఆర్ ముందస్తు జా గ్రత్తలు తీసుకోవాలి’అని ఆమె సోమవారం ట్విట్టర్ వేదికగా పే ర్కొన్నారు.
ఇలాంటి కష్టకాలంలో ఆరోగ్యశ్రీ కార్డు సద్వినియోగపడేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మంచి ఉద్దేశంతో వైఎస్సార్ ప్రారంభించిన ఈ పథకాన్ని నీరుగారుస్తున్నారని కేసీఆర్‌పై మండిపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment