
గిరిజన ప్రాంతాలను అభివృద్ధి చేయాలి
రాష్ట్ర ప్రభుత్వానికి సీపీఎం సూచన
సాక్షి, హైదరాబాద్: గిరిజన ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు రూపొందించాలని రాష్ట్ర ప్రభుత్వానికి సీపీఎం సూచించింది. ఆదివాసీ, గిరిజన తెగల అభివృద్ధి లక్ష్యంగా ఉన్న ఐటీడీఏలు ఆయా తెగల సామాజిక అభివృద్ధితో పాటు వారు నివసిస్తున్న గ్రామాలు, తండాలలో కనీస మౌలిక వసతుల కల్పనలో విఫలమవుతున్నాయని పేర్కొంది.
ఐటీడీఏ ద్వారా వివిధ పథకాల కింద ఇచ్చే ప్రభుత్వ రాయితీలు లబ్ధిదారులకు చేరుకోలేకపోతున్నాయని స్పష్టంచేసింది. గిరిజన తెగల్లోని సాంస్కృతిక వైవిధ్యాన్ని ప్రోత్సహించేందుకు ప్రత్యేక నిధులు కేటాయించాలని సీఎం కేసీఆర్‌కు సీపీఎం కార్యదర్శి తమ్మినేని వీరభద్రం లేఖ రాశారు. షెడ్యూల్డ్ ఏరియాల్లో ఉన్న పాఠశాలల్లో ఆయా తెగల మాతృభాషనే బోధనా భాష చేయాలని కోరారు.