బాపూ.. నాకీ చదువులొద్దంటే విన్నావా! | intermediate student died in Mancherial district | Sakshi
Sakshi News home page

ఫెయిలవుతానన్న భయంతో ఇంటర్‌ విద్యార్థిని ఆత్మహత్య

Published Tue, Mar 4 2025 11:19 AM | Last Updated on Tue, Mar 4 2025 1:42 PM

intermediate student died in Mancherial district

జైపూర్‌: ఇంటర్‌ పరీక్షలు ఇంకా మొదలవ్వలేదు. కానీ, అప్పుడే ఫెయిల్‌ అవు­తా­నన్న భయంతో ఓ ఇంటర్‌ విద్యా­ర్థి అఘాయిత్యానికి పాల్పడింది. ఈ సంఘటన మంచిర్యాల జిల్లా జైపూర్‌ మండలం షెట్‌పల్లి గ్రామంలో సోమవారం చోటుచేసుకుంది. 

స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. మండలంలోని షెట్‌పల్లి గ్రామానికి చెందిన తుంగపిండి రాజేశంకు కుమారుడు, కూతురు హాసిని (18) ఉన్నారు. భార్య గతంలోనే మృతిచెందింది. కుమారు­డికి పెళ్లి కాగా సీసీసీలో నివాసం ఉంటున్నాడు.రాజేశం కూలీ పనులు చేస్తూ కూతురిని చదివిస్తున్నాడు. చెన్నూర్‌ కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయంలో హాసినిని ఇంటర్‌లో చేర్పించాడు. అయితే.. 

చదవడం ఇష్టం లేక బాలిక మధ్యలోనే మానేసి ఇంట్లోనే ఉంది. ఆ విద్యాసంవత్సరం వృథా కావడంతో కూతురుని ఒప్పించి మళ్లీ ఈ విద్యాసంవత్సరం మంచిర్యాలలోని ప్రైవేటు కళాశాలలో చేర్పించాడు. ఈ క్రమంలో ఇంటర్‌ పరీక్షలు సమీపిస్తుండటంతో ఫెయిల­వుతాననే భయంతో హాసిని సోమ­వారం వేకువజామున ఇంట్లోనే ఉరేసు­కుంది. కేసు దర్యాప్తు చేస్తున్నామని ఏఎస్సై బాలయ్య తెలిపారు.

ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్‌ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. 
ఫోన్‌ నెంబర్లు: 040-66202000/040-66202001
మెయిల్: roshnihelp@gmail.com

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement