intermediate student suicide
-
విషాదం: మార్కులు తక్కువ వచ్చాయని విద్యార్థిని ఆత్మహత్య
సాక్షి, నల్గొండ: నల్గొండ జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఇంటర్లో మార్కులు తక్కువగా వచ్చాయని జాహ్నవి అనే విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. మార్కులు తక్కువగా వచ్చాయని మనస్థాపానికి గురైన జాహ్నవి రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడింది. తెలంగాణలో ఇంటర్ మొదటి ఏడాది పరీక్ష ఫలితాలు గురువారం విడుదలైన విషయం తెలిసిందే. -
శ్రీచైతన్యలో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య
కంకిపాడు: ఇంటర్మీడియెట్ విద్యార్థి ఉరి వేసుకుని బలవన్మరణం చెందిన ఘటన కృష్ణా జిల్లా ఈడుపుగల్లులో బుధవారం చోటుచేసుకుంది. కంకిపాడు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తెలంగాణలోని ఖమ్మం పట్టణానికి చెందిన ఎం.స్నేహిత్ వర్మ (17) కంకిపాడు మండలం ఈడుపుగల్లులోని శ్రీచైతన్య శ్రీప్రభ క్యాంపస్‌లో సీనియర్ ఇంటర్ (బైపీసీ) చదువుతున్నాడు. బుధవారం మధ్యాహ్నం హాస్టల్ భవనంలో ఖాళీగా ఉన్న ఓ గదిలో ఫ్యాన్‌కు ఉరి వేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి వివరాలు సేకరించి కేసు నమోదు చేశారు. (చదవండి: టమాటా ధర పైపైకి.. కిలో రూ.42) -
ఇప్పటిదాకా తమిళం.. ఇంగ్లీష్ మీడియం కష్టమని..
చెన్నై: ఇంటర్మీడియట్ విద్యార్థి ఆండిపట్టిలో శుక్రవారం ఆత్మహత్య చేసుకున్నాడు. తేని జిల్లా ఆండిపట్టి సమీపంలోని ముత్తనంపట్టికి చెందిన ఈశ్వరన్ కుమారుడు విజయకుమార్ (17) ప్లస్‌టూ చదివాడు. ఇతన్ని ధర్మపురిలోని ఒక ఫార్మసి కళాశాలలో చేర్చేందుకు తండ్రి దరఖాస్తు చేశాడు. విజయకుమార్ ఇప్పటి వరకు తమిళ మాధ్యమంలో చదవడంతో ఆంగ్ల మాధ్యమం కష్టంగా ఉంటుందని భావించాడు. అతని తండ్రి విజయకుమార్‌కు ఎంతో నచ్చజెప్పాడు. అయినప్పటికీ మానసికంగా ఆవేదనకు గురైన విజయకుమార్ శుక్రవారం ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. చదవండి: ప్రాంక్ వీడియోలంటూ.. లైంగిక వేధింపులు -
విద్యార్థుల ఆత్మహత్యలపై రాష్ట్రపతికి ఫిర్యాదు
సాక్షి, న్యూఢిల్లీ : తెలంగాణలో ఇంటర్ విద్యార్ధుల ఆత్మహత్యలపై రాష్ట్ర బీజేపీ నేతలు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు ఫిర్యాదు చేశారు. విద్యార్థుల ఆత్మహత్యలకు గల కారణాలపై విచారణ జరిపించాలని రాష్ట్రపతికి విజ్ఞప్తి చేశారు. అనంతరం తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ మీడియాతో మాట్లాడుతూ.. విద్యార్థుల ఆత్మహత్యలపై రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చాలా బాధపడ్డారని తెలిపారు. విద్యార్థుల ఆత్మహత్యకు గల కారణాలపై విచారణ జరిపించాలన్న తమ విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించారన్నారు. ఇంటర్ విద్యార్థులవి ఆత్మహత్యలు కావని, అవి ప్రభుత్వ హత్యలని ఆరోపించారు. రాష్ట్రంలో 27 మంది విద్యార్థులు చనిపోతే ప్రభుత్వం వారి కుటుంబాలను పట్టించుకోలేదన్నారు. ఫలితాల అవకతవకలకు కారణమైన గ్లోబరినా సంస్థపై చర్యలు తీసుకోకుండా మళ్లీ ఆ సంస్థకే రీ వెరిఫికేషన్ ప్రాజెక్టు ఇవ్వడం దుర్మార్గమైన చర్యని మండిపడ్డారు. ఆత్మహత్యలకు బాధ్యత వహిస్తూ సంబంధిత మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేసినా ప్రభుత్వం పట్టించుకోలేదని ఆరోపించారు. ఆత్మహత్యలు చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు న్యాయం జరిగేవరకూ బీజేపీ తన పోరాటాన్ని కొనసాగిస్తుందని లక్ష్మణ్ పేర్కొన్నారు. -
ధర్నాచౌక్‌లో విద్యార్థుల స్మారకస్థూపం
సాక్షి, హైదరాబాద్ : ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలు రాష్ట్రంలో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ వైఫల్యం వల్లే విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారని విపక్షాలు మండిపడుతున్నాయి. ప్రభుత్వ తీరుకు నిరసనగా.. ఇందిరాపార్కు ధర్నాచౌక్‌లో అఖిలపక్షం నిరసన దీక్షలు చేపట్టింది. ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల స్మృతిగా స్మారకస్థూపాన్ని ఏర్పాటు చేసి నివాళులు అర్పించారు. టీజేఎస్ అధ్యక్షుడు కోదండరామ్, సీపీఐ కార్యదర్శి చాడ వెంకటరెడ్డి, సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు కె.నారాయణ ఎల్.రమణ హాజరై నిరసన తెలిపారు. -
టీవీ చానల్ మార్చినందుకు గొడవ.. ఆత్మహత్య
హైదరాబాద్ : తనకు ఇష్టమైన టీవీ చానల్ చూసే విషయంలో తల్లి మందలించిందని మనస్తాపానికి గురైన ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్ఐ కురుమూర్తి తెలిపిన వివరాల ప్రకారం.. ఎస్పీఆర్హిల్స్ సమీపంలోని సంజయ్‌నగర్‌లో నివసించే షహానాబేగం(16) నిమ్రా కాలేజిలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతోంది. గత ఆదివారం ఇంట్లో టీవీ చూస్తుండగా తమ్ముడు సమీర్ తనకు ఇష్టమైన చానల్ మారుస్తూ షహానాను ఇబ్బంది పెట్టాడు. దీంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. చానల్ మార్చిందంటూ కోపం పట్టలేక సమీర్ అక్క షహానాను కొట్టాడు. దీనిపై తల్లి కూడా.. టీవీ చూస్తూ కాలక్షేపం చేయకపోతే ఇంట్లో పని చేయవచ్చు కదా అంటూ కోప్పడింది. దీంతో మనస్తాపానికి గురైన షహానా తన గదిలోకి వెళ్లి చున్నీతో ఉరి వేసుకొంది. కొద్దిసేపటి తర్వాత మరో సోదరి ఆ గదిలోకి వెళ్లగా ఉరికి వేలాడుతున్న చెల్లెలు కనిపించింది. వెంటనే తల్లిదండ్రులు ఆమెను ఎర్రగడ్డలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ షహానాబేగం సోమవారం చనిపోయినట్లు పోలీసులు తెలిపారు.