
సాక్షి, హైదరాబాద్ : ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలు రాష్ట్రంలో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ వైఫల్యం వల్లే విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారని విపక్షాలు మండిపడుతున్నాయి. ప్రభుత్వ తీరుకు నిరసనగా.. ఇందిరాపార్కు ధర్నాచౌక్‌లో అఖిలపక్షం నిరసన దీక్షలు చేపట్టింది. ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల స్మృతిగా స్మారకస్థూపాన్ని ఏర్పాటు చేసి నివాళులు అర్పించారు. టీజేఎస్ అధ్యక్షుడు కోదండరామ్, సీపీఐ కార్యదర్శి చాడ వెంకటరెడ్డి, సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు కె.నారాయణ ఎల్.రమణ హాజరై నిరసన తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment