
అతని తండ్రి విజయకుమార్‌కు ఎంతో నచ్చజెప్పాడు. అయినప్పటికీ మానసికంగా ఆవేదనకు గురైన విజయకుమార్ శుక్రవారం ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
చెన్నై: ఇంటర్మీడియట్ విద్యార్థి ఆండిపట్టిలో శుక్రవారం ఆత్మహత్య చేసుకున్నాడు. తేని జిల్లా ఆండిపట్టి సమీపంలోని ముత్తనంపట్టికి చెందిన ఈశ్వరన్ కుమారుడు విజయకుమార్ (17) ప్లస్‌టూ చదివాడు. ఇతన్ని ధర్మపురిలోని ఒక ఫార్మసి కళాశాలలో చేర్చేందుకు తండ్రి దరఖాస్తు చేశాడు. విజయకుమార్ ఇప్పటి వరకు తమిళ మాధ్యమంలో చదవడంతో ఆంగ్ల మాధ్యమం కష్టంగా ఉంటుందని భావించాడు. అతని తండ్రి విజయకుమార్‌కు ఎంతో నచ్చజెప్పాడు. అయినప్పటికీ మానసికంగా ఆవేదనకు గురైన విజయకుమార్ శుక్రవారం ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
చదవండి: ప్రాంక్ వీడియోలంటూ.. లైంగిక వేధింపులు