
హీరోయిన్ పై కేటీఆర్ ట్వీట్
హైదరాబాద్: చేనేతను ప్రోత్సహించేలా హీరోయిన్ సమంత ముందుడుగు వేయడం పట్ల తెలంగాణ ఐటీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు(కేటీఆర్) హర్షం వ్యక్తం చేశారు. చేనేత కార్మికులు ఎదుర్కొంటున్న వాస్తవ పరిస్థితులను తెలుసుకునేందుకు దుబ్బాక, పోచంపల్లిలో సమంత పర్యటించడం మంచి పరిణామమని ట్విటర్ లో కేటీఆర్ పేర్కొన్నారు.
తెలంగాణ చేనేత ప్రచారకర్తగా ఉన్న సమంత గత శుక్రవారం(మార్చి 10) సిద్దిపేటలో పర్యటించారు. పలు చేనేత సహకార సంఘాలను సందర్శించారు. చేనేత కార్మికులను కలసి వారి కష్టసుఖాల గురించి ఆరా తీశారు. తర్వాత దుబ్బాక చేనేత సహకార సంఘానికి వెళ్లి మగ్గాల మీద తయారు చేస్తున్న వస్త్రాలను పరిశీలించారు.
ఈ నెల 15న యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్‌పోచంపల్లి మండల కేంద్రంలోని హ్యాండ్లూమ్ పార్క్‌ను సందర్శించారు. మగ్గాలపై తయారు చేసిన వివిధ రకాల ఇక్కత్ వస్త్రాలను, డిజైన్లను పరిశీలించారు. చేనేత సంఘం పనితీరు, నేత కార్మికుల నైపుణ్యాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకు వెళ్తానని చెప్పారు.
చేనేత వస్త్రాల వాడకాన్ని ప్రోత్సహించే దిశగా మంత్రి కేటీఆర్, రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చేపట్టిన కార్యక్రమానికి మద్దతు పలకడంతో సమంతకు గతంలో ఆయన ధన్యవాదాలు తెలిపారు. పోచంపల్లి చీర, శాలువాను ఆమెకు బహూకరించారు.
Good start @Samanthaprabhu2 Understanding the nuances & real issues faced by Handloom weavers with your field tours to Dubbak & Pochampalli pic.twitter.com/y3dcWk0tcf
— KTR (@KTRTRS) 17 March 2017