
అనారోగ్యం కారణంగా సినిమాల సంఖ్య తగ్గించిన సమంత(Samantha).. ఇటీవల మళ్లీ పుంజుకుంది. వరుస ప్రాజెక్టులతో దూసుకెళ్తోంది. అయితే షూటింగ్ పరంగా ఎంత బిజీగా ఉన్నా.. సోషల్ మీడియాకు మాత్రం దూరంగా ఉండలేదు. తన సినిమా అప్‌డేట్స్‌తో పాటు పర్సనల్ విషయాలను కూడా షేర్ చేసుకుంటుంది. కొన్నిసార్లు ఆరోగ్య చిట్కాలు, ధైర్యాన్ని నింపే విషయాలను కూడా తన ఫాలోవర్స్‌తో పంచుకుంటుంది. తాజాగా ఈ టాలెంటెడ్ బ్యూటీ తన విహారయాత్రకు సంబంధించి ఆసక్తికర విషయాలను షేర్ చేసుకుంది. మూడు రోజుల పాటు ఫోన్‌కి దూరంగా ఉండి..ఒంటరి జీవితాన్ని గడిపానని చెబుతూనే ఎలాంటి అనుభూతి పొందిందో వివరించింది.
(చదవండి: భారీ రెమ్యునరేషన్.. అమ్మకి ఖరీదైన గిఫ్ట్‌గా ఇచ్చిన మోనాలిసా!)
‘మూడు రోజులు మౌనంగా ఉన్నాను. ఫోన్ లేదు. ఎవరితో కమ్యూనికేషన్ లేదు. నాతో నేను మాత్రమే ఉన్నాను. మనతో మనం ఒంటరిగా ఉండడం కష్టమైన పనుల్లో ఒకటి. కానీ, ఇలా మౌనంగా ఉండడాన్ని నేను ఇష్టపడతాను. మిలియన్‌సార్లు ఇలా ఒంటరిగా గడపమని చెప్పినా ఉంటాను. మీరు కూడా ఇలా ఉండటానికి ప్రయత్నించండి’ అని సమంత తన అభిమానులకు సూచించింది.
సమంత సినిమాల విషయాలకొస్తే..అటు వెబ్ సిరీస్‌లతో పాటు ఇటు విభిన్నమైన సినిమాలతో అలరించేందుకు రెడీ అవుతోంది. ఆమె ప్రధాన పాత్రలో నటించిన ‘సిటడెల్ : హనీ బన్నీ’ వెబ్ సిరీస్ ఇటీవల అమెజైప్ ప్రైమ్‌లో రిలీజై సూపర్ హిట్‌గా నిలిచింది. ఉత్తమ వెబ్‌సిరీస్‌గా అవార్డు కూడా గెలుచుకుంది. ప్రస్తుతం ‘రక్త్‌బ్రహ్మాండ్’ వెబ్ సిరీస్‌లో నటిస్తోంది. ఇందులో ఆదిత్య ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు. ప్రముఖ దర్శక నిర్మాతలు రాజ్ అండ్ డీకే నిర్మిస్తున్న ఈ చిత్రానికి ‘తుంబాడ్’ ఫేమ్ రాహి అనిల్ బార్వే దర్శకత్వం వహిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment