హైదరాబాద్ : తెలంగాణ టీడీపీలో వలసలు జోరు నేపథ్యంలో ఆపార్టీ సీనియర్ నేతలు గురువారం సమావేశమయ్యారు. ఈ సమావేశానికి ఎల్. రమణ, ఎర్రబెల్లి దయాకరరావు, ఉమా మాధవరెడ్డి, మండవ వెంకటేశ్వరరావు, కృష్ణయాదవ్ తదితరులు హాజరయ్యారు. ఈ భేటీలో ఎమ్మెల్యేల వలసలతో పాటు కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీమంత్రి ముఖేష్ గౌడ్ చేరికపై చర్చించినట్లు సమాచారం.
కాగా ఇప్పటికే తెలంగాణలో పలువురు టీడీపీ నేతలు టీఆర్ఎస్లో చేరిన విషయం తెలిసిందే. కాగా ముఖేష్ గౌడ్ పార్టీలో చేరే అంశంపై తెలుగు తమ్ముళ్ల మధ్య ఏకాభిప్రాయం తీసుకు వచ్చేందుకే ఈ సమావేశం నిర్వహించినట్లు సమాచారం.