
సాక్షి, యాదగిరిగుట్ట: సీఎం కేసీఆర్ యాదాద్రి పర్యటన నేపథ్యంలో పలుచోట్ల టీడీపీ నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. యాదగిరిగుట్ట మండలం కాచారంలో టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బండ్రు శోభారాణి, మల్లాపురంలో టీడీపీ ఉమ్మడిజిల్లా కార్యదర్శి పల్లెపాటి బాలయ్య, పలువురు టీడీపీ నాయకులను పోలీసులు హౌస్ అరెస్టు చేశారు.
దందమల్ల నీటి తరలింపు విషయంలో కేసీఆర్ స్పష్టత ఇవ్వకపోతే సీఎం పర్యటనను అడ్డుకుంటాని ఇటీవల శోభారాణి ప్రకటించారు. కాగా, సీఎం కేసీఆర్ కుటుంబ సమేతంగా లక్ష్మీనరసింహ స్వామివారిని దర్శించుకున్నారు. అక్కడ జరుగుతున్నఆలయ అభివృద్ధి పనులను పరిశీలించారు.
Comments
Please login to add a commentAdd a comment