
సాక్షి, హైదరాబాద్: యాదాద్రి దేవాలయాన్ని అపవిత్రం చేసి, హిందువుల మనోభావాలు గాయపరిచినందుకు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు మోకాళ్లపై వచ్చి క్షమాపణ చెప్పాలని బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి కె.కృష్ణసాగర్ రావు డిమాండ్ చేశారు. ఆలయ స్తంభాలపై సీఎం తన రూపాన్ని, పార్టీ చిహ్నాన్ని, ప్రభుత్వ పథకాలను చెక్కించుకున్న వైచిత్రి దేశ చరిత్రలో ఎక్కడా లేదని మండిపడ్డారు. వారంలోగా ఆయా స్తూపాలను దేవాలయాన్ని పరిరక్షించేవిగా, శాస్త్రానుగుణంగా మళ్లీ నిర్మించాలన్నారు. కేసీఆర్ నిర్వాకాన్ని తెలంగాణ ప్రజలు సహించరని, ఆయన చరిత్ర హీనులయ్యారని ఓ ప్రకటనలో ధ్వజమెత్తారు.
Comments
Please login to add a commentAdd a comment