
సీఎం జగన్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేస్తున్న వెంకట్రామిరెడ్డి, వీఆర్వోలు
కడప కోటిరెడ్డిసర్కిల్: నాటి ప్రతిపక్ష నేతగా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాదయాత్రలో ఇచ్చిన హామీకి కట్టుబడి వీఆర్వోలకు సీనియర్ అసిస్టెంట్లుగా పదోన్నతులు కల్పిస్తూ జీవో నంబరు 154 జారీ చేయడాన్ని స్వాగతిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఎంప్లాయీస్ ఫెడరేషన్ చైర్మన్ వెంకట్రామిరెడ్డి తెలిపారు. శనివారం వైఎస్సార్ జిల్లా కడప నగరంలోని నూర్జహాన్ కల్యాణ మండపంలో వీఆర్వోలకు పదోన్నతుల కల్పనపై ముఖ్యమంత్రి చిత్రపటానికి క్షీరాభిషేకం నిర్వహించారు.
వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ..దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి మరణంతో ఆగిపోయిన వీఆర్వోల పదోన్నతి.. తిరిగి ఆయన కుమారుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత నెరవేరడం అభినందనీయమన్నారు. ముఖ్యమంత్రి ఉద్యోగుల పట్ల అభిమానంతో అధికారం చేపట్టిన వెంటనే 27 శాతం ఐఆర్ ఇచ్చారన్నారు.
Comments
Please login to add a commentAdd a comment