
ఉద్యోగులకు సేవలందించిన వైద్యులను అభినందిస్తున్న అసోసియేషన్ సభ్యులు
సాక్షి, అమరావతి: రాష్ట్ర సచివాలయంలో ఉద్యోగుల ఆరోగ్య సంరక్షణకు గురువారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. సచివాలయ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో మణిపాల్ ఆస్పత్రి వైద్యులు ఉద్యోగులకు వైద్య పరీక్షలు చేశారు.
కార్డియాలజీ, ఆర్థోపెడిక్స్, జనరల్ ఫిజిషియన్ స్పెషలిస్ట్, క్యాన్సర్ వైద్య పరీక్షలతో పాటు, ఈసీజీ, 2డీ ఎకో ఇతర వైద్య పరీక్షలు చేశారు. మొత్తం 750 మంది వైద్య సేవలు పొందారు. శిబిరంలో డాక్టర్ వేణు గోపాల్‌రెడ్డి, డాక్టర్ ప్రియాంక, డాక్టర్ శివ, ఏపీ సచివాలయ ఉద్యోగుల అసోసియేషన్ అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి, అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment