venu gopal reddy
-
రాష్ట్ర సచివాలయంలో ఉచిత వైద్య శిబిరం
సాక్షి, అమరావతి: రాష్ట్ర సచివాలయంలో ఉద్యోగుల ఆరోగ్య సంరక్షణకు గురువారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. సచివాలయ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో మణిపాల్ ఆస్పత్రి వైద్యులు ఉద్యోగులకు వైద్య పరీక్షలు చేశారు. కార్డియాలజీ, ఆర్థోపెడిక్స్, జనరల్ ఫిజిషియన్ స్పెషలిస్ట్, క్యాన్సర్ వైద్య పరీక్షలతో పాటు, ఈసీజీ, 2డీ ఎకో ఇతర వైద్య పరీక్షలు చేశారు. మొత్తం 750 మంది వైద్య సేవలు పొందారు. శిబిరంలో డాక్టర్ వేణు గోపాల్‌రెడ్డి, డాక్టర్ ప్రియాంక, డాక్టర్ శివ, ఏపీ సచివాలయ ఉద్యోగుల అసోసియేషన్ అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి, అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు. -
వైఎస్ఆర్సీపీ నేతపై పోలీసుల దాష్టీకం
-
సమన్వయంతోనే సాఫల్యం
సందర్భం మనిషికి కూడు, గుడ్డ, గూడు కల్పించి, భౌతిక అవసరాలను తీర్చడమే ఆదర్శ పాలనగా ప్రపంచం భావిస్తున్న రోజుల్లో మనిషికి కేవలం శరీరమే కాక బుద్ధి, మనసు, ఆత్మ ఉన్నాయని, వాటిని కూడా తృప్తి పరచే మార్గంతో పాటు సమస్త జీవులకు సంపూర్ణ కల్యాణాన్ని సమకూర్చే దిశగా పాలకుల ఆలోచన సాగాలని, ‘ఏకాత్మ మానవ దర్శనం’ పేరిట దీనదయాళ్జీ ప్రపంచ రాజకీయాలకు నూతన దిశా నిర్దేశనం చేశారు. ఆ ఆలోచననే నేటి భారతీయ జనతాపార్టీ తన మౌలిక సిద్ధాంతంగా స్వీకరించింది. స్వాతంత్య్రోద్యమ కాలం నుంచి దేశ ప్రజలను, ప్రత్యేకించి వారి ఆలోచనా విధానాన్ని రెండు భిన్న భావజాల స్రవంతులు బలంగా ప్రభావితం చేస్తూ వస్తున్నాయి. వాటిలో ఒకటి పాశ్చాత్య, పారిశ్రామిక సమాజంలో పుట్టి, పెరిగి మన దేశంలో వేళ్లూనుకున్నది కాగా, మరొకటి నేటికీ సజీవంగా నిలి చిన ప్రాచీన భారత నాగరికత, సంస్కృతులలో వేళ్లూనుకుని వృద్ధి చెందినది. మార్క్సిజం, కమ్యూనిజంగా ఒకటి ప్రచారంలో ఉంటే, మరొకటి భారత జాతీయతావాదంగా ప్రాచుర్యం పొందింది. దేశ ప్రజలనే గాక ప్రపంచ ప్రజ లను సైతం ప్రభావితం చేసిన, చేస్తున్న 20వ శతాబ్దపు రెండు సిద్ధాంతాలతో స్థూల పరిచయమైనా లేకుండానే అతి తరచుగా ఇరు పక్షాల విమర్శకులు, సమర్థకులు కూడా వాదోపవాదాలకు, ఖండనమండనలకు దిగుతుంటారు. అందువల్ల ఈ రెండింటిని తులనాత్మకంగా పరిశీలించి, చర్చించడం నేటి యువతరానికే గాక, భావితరాలకు సైతం ఉపయోగకరం. మార్క్సిజం జననం పశ్చిమ దేశాల్లో స్వేచ్ఛ, సమానత్వం, సహోదర భావం వంటి ప్రజాస్వామిక భావనలకు ఆదరణ లభిస్తున్న తరుణంలో కార్ల్ మార్క్స్ వర్గకలహ సిద్ధాం తాన్ని ముందుకు తెచ్చారు. రాజ్య విహీన సమాజం అనే అనివార్య గమ్యాన్ని వర్గకలహ సాధనంతో త్వరితం చేసి, శ్రామిక నియంతృత్వం నెలకొల్పి, సమసమాజ నిర్మాణం జరపాలని సూచించారు. ఆయన ప్రవచించిన సిద్ధాంతం మార్క్సిజం కాగా, దాన్ని అనుసరించే వారు మార్క్సిస్టులయ్యారు. వారు స్థాపించిన రాజకీయ పార్టీ కమ్యూనిస్టు పార్టీ. లెనిన్ నాయకత్వంలో 1917లో సోవియట్ రష్యాలో, మావో నాయకత్వంలో 1949లో చైనాలో కమ్యూనిస్టు ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. రష్యా విప్లవ స్ఫూర్తితో 1920లో కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (సీపీఐ) ప్రారంభమైంది. రష్యా, చైనాల మార్గాల్లో దేన్ని అనుసరించాలి అనే సిద్ధాంత విభేదంతో 1964లో సీపీఐలో వచ్చిన తొలి చీలికతో కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్టు) ఏర్పడి, íసీపీఎంగా ప్రసిద్ధమైంది. ఆ తరువాత సీపీఎం నుంచి నక్సలైట్లు చీలిపోయారు. వారిలో సైతం మరెన్నో చీలిక వర్గాలు ఏర్పడ్డాయి. మార్క్సిజం – భారతీయత తమదే సత్యమని, తద్విరుద్ధ విశ్వాసాలు, సిద్ధాంతాలు, వ్యక్తులను తమ దారి లోకి తెచ్చుకోవాలని, సమస్త ప్రకృతి మానవుని కోసమే కనుక దానిపై ఆధిపత్యం వహించడం మానవునికి లభించిన హక్కుగా మార్క్సిస్టులు భావిస్తారు. ప్రకృతిలోని లక్షలాది జీవరాశుల్లో మానవుడు కూడా ఒక జీవి మాత్రమే అని, జీవరాశులన్నీ సుఖసమృద్ధులతో జీవించాలి అనేది భారతీయ దృక్పథం. ఆయుధాలే అధికారానికి ఆధారమనేది మార్క్సిస్టు భావన కాగా, సత్సంకల్పంతో కూడిన శక్తే ప్రపంచ శ్రేయస్సుకు ఆలంబన కాగలదని భారతీయత భావిస్తుంది. ఫలితం పెట్టుబడిదారుదా, ప్రభుత్వానిదా అనే తేడా మినహా, ప్రకృతిని కొల్లగొట్టడంలో తప్పు లేదని మార్క్సిస్టులు భావిస్తారు. ప్రకృతిని తల్లిగా భావిస్తూ మనిషి మనుగడ సాగించాలన్నదే భారతీయ భావన. ఆర్.ఎస్.ఎస్ ఆవిర్భావం 1925 అక్టోబరులో విజయదశమి నాడు నాగపూర్‌లోని ఒక మైదానంలో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్.ఎస్.ఎస్) ప్రారంభమైంది. వైద్యవిద్యలో పట్టభద్రుడైన కేశవరావ్ బలీరావ్ు హెడ్గేవార్ అనే యువకుడు పిడికెడు యువకులతో కలసి వ్యాయామం, ఆట పాటల అనంతరం దేశ రాజకీయాలు, సామాజిక పరిస్థితులపై చర్చలు జరుపుకోవడంగా సంస్థ కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. భారతదేశం మన మాతృభూమి దీని మేలు కోరే వారందరూ నాకు మిత్రులు, నాశనం కోరే వారందరూ నాకు శతృవులు, అనే ఒకే శతృ, మిత్ర భావన కలిగి, ఈ దేశ సంస్కృతిని, ఇక్కడ జన్మించిన మహా పురుషుల వారసత్వాన్ని సగర్వంగా స్వీకరించడమే ‘జాతీయత’ అని అది భావించింది. ఆస్తికుడైనా, నాస్తికుడైనా, మతమేదైనాసరే, భారతదేశంలో పుట్టి ఈ మౌలిక సత్యాన్ని అంగీకరించి, ఆచరించే వారందరూ హిందువులు, భారతీయులేననే అవగాహనతో ముందుకు సాగింది. ఆర్.ఎస్.ఎస్ వికాసం హిందువుల అనైక్యతే భారత్ పరాధీనతకు కారణమని, గత వైభవాన్ని ప్రాప్తింపజేయడానికి వారిని ఐక్యం చేయడమే ఏకైక మార్గమని నమ్మి, స్వచ్ఛందంగా ఈ కార్యాన్ని స్వీకరించిన వారిని ‘స్వయంసేవక్’లని, వారితో కూడిన సంఘాన్ని ‘రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్’(సంఘం) అని పిలుస్తారు. సమస్త ప్రాణులన్నీ సుఖంగా జీవించాలని ఆకాంక్షించే హిందువులు శక్తిశాలురైనప్పుడే ప్రపంచం అంతటా శాంతి సౌభాగ్యాలు, సహోదర భావం వెల్లివిరుస్తాయనే భావన సిద్ధాంతంగా సంఘం రూపుదిద్దుకొన్నది. సమయ పాలన, స్వయం ప్రేరిత అనుశాసనం నియమాలు అయ్యాయి. సంఘం ఒక సామాజిక సంస్థగా రూపుదిద్దుకోవడంలోనూ, ఒక సిద్ధాంతాన్ని, కార్యాచరణను ఏర్పరచుకోవడంలోనూ డాక్టర్జీగా ప్రసిద్ధులైన కేశవరావు బలీరావ్ హెడ్గేవార్ కేవలం నిమిత్త మాత్రులయ్యారు. అప్పటి వరకు జరిగిన నిర్ణయాలన్నీ స్వయం సేవకులు చర్చించి అందరి ఆమోదంతో తీర్మానించినవే. హిందూ సంస్కృతికి ప్రతీక అయిన కాషాయ పతాకాన్ని సంఘానికి గురువుగా చేసుకున్నారు. సంఘశిబిరాల్లో శిక్షణ పొంది, సంఘ కార్యానికి పూర్తి సమయం స్వయం సేవకులుగా పనిచేస్తామని, స్వచ్ఛందంగా ముందుకు వచ్చిన కార్యకర్తలతో ‘ప్రచారక్’ వ్యవస్థ ప్రారంభమైంది. 1940లో డాక్టర్జీ మరణానంతరం గురూజీగా ప్రసిద్ధులైన మాధవ సదాశివ గోళ్వల్కర్ సంఘ్ అధ్యక్ష (సర్సంఘ్చాలక్) బాధ్యతలను చేపట్టారు. వివిధ క్షేత్రాలలో సంఘ ప్రవేశం భరతమాత సర్వాంగీణ ఉన్నతి కోసం అన్ని రంగాలు భారతీయ సంస్కృతికి అనుగుణంగా ప్రగతి సాధించాలన్న డాక్టర్జీ ఆకాంక్షల బీజాలు గురూజీ నేతృత్వంలో సాకారం కావడం మొదలైనాయి. విద్యార్థి రంగంలో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్, కార్మిక రంగంలో భారతీయ మజ్దూర్ సంఘ్, ధార్మిక రంగంలో విశ్వహిందూ పరిషత్, కర్షక రంగంలో భారతీయ కిసాన్ సంఘ్, రాజకీయ క్షేత్రంలో డా. శ్యామ్‌ప్రసాద్ ముఖర్జీ ప్రారంభించిన భారతీయ జనసంఘ్ తదితర సంస్థలతో పాటు వివిధ రంగాల్లో సేవా సంస్థలు కూడా ప్రారంభమయ్యాయి. జనసంఘ్‌తో సహా ఈ సంస్థలన్నీ స్వీయ నిబంధనావళి, ప్రత్యేక సభ్యత్వం, కార్య నిర్వాహక వర్గం వంటి ఏర్పాట్లతో స్వయం ప్రతిపత్తి కలిగినవే. ఇవేవీ సంఘ్‌కు అనుబంధ సంస్థలు కావు. దత్తో పంత్ ఠేగ్డే, భారతీయ మజ్దూర్ సంఘ్ వ్యవస్థాపక అధ్యక్షులుగా కార్మిక రంగంలో విశేష సేవలను అందించారు. దేశ ప్రగతి సాధన జాతీయకరణ ద్వారా పూర్తిగా ప్రభుత్వ పెత్తనంలోనూ, పెట్టుబడులతోనూ జరగాలా? లేదా ప్రయివేటీకరణతో పూర్తిగా పెట్టుబడిదారీ తరహాలో జరగాలా? అని మల్లగుల్లాలు పడుతున్న దశలో సామాజికీకరణ ద్వారా దేశ ప్రగతి జరగాలనే నూతన ఆలోచనను వారు ప్రపంచానికి అందించారు. మనిషికి కూడు, గుడ్డ, గూడు కల్పించి, భౌతిక అవసరాలను తీర్చడమే ఆదర్శపాలనగా భావిస్తున్న రోజుల్లో మనిషికి కేవలం శరీరమే కాక బుద్ధి, మనసు, ఆత్మ ఉన్నాయని, వాటిని కూడా తృప్తి పరచడంతో పాటు సమస్త జీవులకు కల్యాణాన్ని సమకూర్చే దిశగా పాలకుల ఆలోచన సాగాలని, ‘ఏకాత్మ మానవ దర్శనం’ పేరిట దీనదయాళ్జీ ప్రపంచ రాజకీయాలకు నూతన దిశా నిర్దేశనం చేశారు. ఆ ఆలోచననే నేటి భారతీయ జనతాపార్టీ తన మౌలిక సిద్ధాంతంగా స్వీకరించింది. సేవా కార్యాలలో సంఘం సంఘ కార్యకర్తలు వివిధ సందర్భాలలో దేశానికి, సమాజానికి తమ సేవలు అందిస్తూనే వచ్చారు. 1948లో నాటి హోం మంత్రి పటేల్ అభ్యర్థన మేరకు గురూజీ కశ్మీర్ వెళ్లి, మహారాజుతో మాట్లాడి భారత్‌లో విలీనానికి ఒప్పిం చారు. 1962 నాటి చైనా యుద్ధ సమయంలో సంఘ స్వయం సేవకుల సేవలను గుర్తించి ప్రధాని నెహ్రూ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొనమని స్వయం సేవకులను ఆహ్వానించారు. 1965లో నాటి ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి కోరిక మేరకు గురూజీ పశ్చిమ సరిహద్దు ప్రాంతాల్లో పర్యటించి యుద్ధ సమయంలో సైన్యానికి తోడ్పాటు అందించడానికి ప్రజలను సమాయత్తం చేశారు. ఆంధ్ర ప్రాంతంలో దివిసీమను తుపాను ముంచెత్తినప్పుడూ, గుజ రాత్లో మోర్వీ వరదల సమయంలోనూ స్వయం సేవకులు సేవలను అందించారు. ప్రధాని ఇందిరాగాంధీ రష్యా వెళ్ళినప్పుడు తడుముకోకుండా ‘ఆర్.ఎస్.ఎస్. భారత్‌లో అతి పెద్ద స్వచ్ఛంద సంస్థ’ అని చెప్పారు. అది సేవా సంస్థగా సంఘ నిబద్ధతకు కితాబు. కమ్యూనిస్టులది, హనుమంతునిది కూడా ఎర్రజెండానే అని, కమ్యూనిస్టులు కూడా హిందువులేనని, వారు కూడా రేపటి స్వయం సేవకులేననే గురూజీ చింతనలో పూర్తి సమన్వయ దృక్పథం వెల్లడవుతుంది. ఈ సమన్వయ దృక్పథమే క్రింది స్థాయి సంఘ కార్యకర్తలదాకా వ్యాపించింది. సంఘం మార్క్సిజం కమ్యూనిస్టుల్లో ఆర్థిక పరాధీనత ఒక బలహీనత. వారిని బలోపేతం చేయడానికి తోడ్పడే ప్రజా సంఘాలు పార్టీకి అనుబంధం కావడము, అధికార ప్రాప్తితో భ్రష్టమైనప్పుడు సరిదిద్దే నైతిక శక్తిగల కేంద్రం లేకపోవడమూ మరో పెద్ద లోపం. ఆరెస్సెస్‌కు ఆర్థిక పరాధీనత లేకపోవడమూ, అధికారానికి అది దూరంగా ఉండటమూ, సంఘ సిద్ధాంత స్ఫూర్తితో వివిధ క్షేత్రాల్లో పనిచేస్తున్న సంస్థలు స్వతంత్రమైనవే అయినా నైతికత విషయంలో సంఘం వాటిని సరిదిద్దడంతో అవి సజావుగా ముందుకు సాగుతున్నాయి. ఒక్కసారి సంఘశాఖకు వచ్చి భగవధ్వజం ముందు నిలబడి ప్రణామం చేస్తే అతడు స్వయంసేవక్ అయి, సంఘ కుటుంబంలో సభ్యుడై పోతాడు. సభ్యత్వం రద్దు, బహిష్కరణ లాంటివేవీ సంఘంలో ఉండవు. కారణాంతరాల వల్ల కార్యక్రమాలకు రాలేక పోయినా వారిని సంఘ బంధువులుగానే భావించి, స్నేహాన్ని కొనసాగిస్తూ, వివిధ సందర్భాలలో సంఘం వారి సహకారాన్ని పొందుతూనే ఉంటుంది. సభ్యత్వం సంపాదించడం కూడా కష్టమైన కమ్యూనిస్టు పార్టీలో మాత్రం మాజీ కమ్యూనిస్టును తమ మొదటి శతృవుగా భావిస్తున్నారు. నానాటికి సంఘ శక్తి పెరగడానికి, మార్క్సిస్టుల శక్తి తరగడానికి తగిన కారణాలను విశ్లేషించుకోవడం అవసరం. ప్రపంచ చరిత్రలో వంద సంవత్సరాలు అతి తక్కువ సమయమే కావచ్చు. కానీ, అనుభవాలను సమీక్షించుకొని, తప్పొప్పులను సవరించుకొని ముందుకు సాగడం ప్రజా శ్రేయస్సుకు ఎంతైనా అవసరం. పి. వేణుగోపాల్‌రెడ్డి వ్యాసకర్త ఏకలవ్య ఫౌండేషన్ అధ్యక్షులు, హైదరాబాద్ మొబైల్ : 94904 70064 (ఈ విజయదశమి రోజు ఆర్.ఎస్.ఎస్. 92వ వ్యవస్థాపక దినం సందర్భంగా) -
పాల ఉత్పత్తి పెంచుతాం..
పశువులకు మెరుగైన వైద్య సేవలు అందించడం, దూడల సంరక్షణ, కృత్రిమ గర్భధారణ ద్వారా మేలుజాతి దూడల అభివృద్ధికి కృషి చేయడం పశు సంవర్ధక శాఖ విధి. ఆ శాఖ సంయుక్త సంచాలకులు డాక్టర్ ముత్యాల వేణుగోపాల్‌రెడ్డి వీటితో పాటు పశుగ్రాసాల సాగు తదితర వాటిపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. పశువులు, గొర్రెలు, మేకలకు వ్యాధులు దరి చేరకుండా ముందు జాగ్రత్తగా వ్యాధి నిరోధక టీకాలు వేయిస్తున్నారు. పథకాల అమలును పారదర్శకంగా నిర్వహిస్తూ.. పశు సంవర్ధక శాఖకు ప్రత్యేక గుర్తింపును తీసుకువచ్చారు. పశువైద్య శాలలకు సొంత భవనాలు నిర్మించడంలో విజయవంతం అయ్యారు. ఆయన ‘సాక్షి’ తరపున వీఐపీ రిపోర్టర్‌గా మారి పశు సంపదకు, పాల ఉత్పత్తికి పెట్టింది పేరైన కల్లూరు మండలం తడకనపల్లి గ్రామంలో పశుపోషణ, పాల ఉత్పత్తిలో మహిళలు, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, ఇబ్బందులను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. పశు సంపదను రక్షించడం, పాల ఉత్పత్తిని పెంచడమే తన లక్ష్యమని ఆయన చెప్పారు. జేడీ: ఏమ్మా..! అందరూ బాగున్నారా.. పశు పోషణ, పాల ఉత్పత్తి ఎలా ఉంది ? మహిళలు : బాగున్నాం సార్.. పశుపోషణ బాగుంది. ఇప్పటి వరకు పాల ఉత్పత్తి ఆశాజనకంగానే ఉంది. మాకు ప్రధాన ఆధారం పాడి పరిశ్రమనే. జేడీ : అమ్మా నీ పేరు ఏమిటి? సమస్య ఉందా? మహిళ: సార్ నా పేరు సకినాబీ. కొద్ది రోజులుగా మా దూడల కళ్ల నుంచి ఒకటే నీళ్లు కారుతున్నాయి. ఏమైనా అనారోగ్యమా? జేడీ : వాతావరణంలో వచ్చిన మార్పుల వల్ల ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల కళ్లలో నీరు కారుతాయి. దీనికి భయపడాల్సిన అవసరం లేదు. అయినప్పటికీ చికిత్స చేయిస్తాం. ధనలక్ష్మి : సార్.. మేము రెయిన్బో రకం కోళ్లు పెంచుకుంటున్నాం. గుడ్లు బాగా పెడుతున్నాయి. కోళ్లు గుడ్లను పొదగడం లేదు. జేడీ : రెయిన్బో కోళ్లు గుడ్లు ఎక్కువగా పెడతాయి. అయితే అవి పొదగవు. వాటిని నాటుకోళ్ల ద్వారా పొదిగించవచ్చు. ఈ కోళ్లు ఎక్కువ బరువు వస్తాయి. మాంసానికి, గుడ్లకు రెండింటికి ఉపయోగపడుతాయి. ధనలక్ష్మి : కోళ్లకు ఏఏ రోగాలు వస్తాయి.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ? జేడీ : ప్రతి కుటుంబంలో పాడి-పంట ఉండాలి. దీనికి కోళ్ల పెంపకం ఉంటే అదనపు ఆదాయం వస్తుంది. కోళ్లకు మసూచి, కొక్కెర తెగుళ్లు వచ్చే ప్రమాదం ఉంది. వీటికి కూడా టీకాలు వేస్తాం. పెరటి కోళ్ల పెంపకం లాభసాటిగా ఉంటుంది. పద్మావతమ్మ : సార్ పాల ప్రగతి కేంద్రాల కింద తమిళనాడు నుంచి పాడి గేదెలు తెచ్చి ఇచ్చారు. ఇవి చూలు కట్టడం లేదు.. జేడీ : చూలు కట్టకపోవడానికి పలు కారణాలు ఉన్నాయి. గర్భకోశ సమస్యలతో చూలు కట్టకపోయే ప్రమాదం ఉంది. మీ గ్రామంలో ప్రత్యేకంగా ఉచిత పశువైద్య శిబిరం నిర్వహించి గర్భకోశ వ్యాధులకు చికిత్స చేయిస్తాం. మహిళ : సార్..నా పేరు లతీఫాబీ. దూడ చనిపోయింది. ఇందువల్ల పాల ఉత్పత్తి తగ్గిపోయింది. కంతులు కట్టడం కష్టంగా ఉంది. జేడీ : దూడ లేకపోయినా పశు పోషణకు ఇబ్బంది లేదు. అయితే పచ్చిమేత, దాణా తగినంత ఇవ్వాలి. అప్పుడు యథావిధిగా పాలు ఇస్తాయి. దూడల పరిరక్షణకు సునందిని పథకాన్ని అమలు చేస్తున్నాం. దీనివల్ల దూడల మరణాలను తగ్గించవచ్చు. తిప్పన్న : సార్, మా గ్రామంలో గొర్రెలు ఎక్కువగా ఉన్నాయి. వర్షాకాలంలో ఎక్కువగా చనిపోతున్నాయి. గొర్రెలకు రాత్రి బస షెడ్లు ఏర్పరచాలి. జేడీ : వర్షాకాలంలో గొర్రెలు తడుస్తుండటం, కలుషితమైన మేత తినడం, నీరు తాగడం వల్ల మరణాలు ఎక్కువగా ఉంటాయి. గొర్రెలకు బీమా సౌకర్యం కల్పించుకోవాలి. అప్పుడు చనిపోయినా పరిహారం లభిస్తుంది. గొర్రెలకు సామూహిక బీమా పథకం ఉంది. దీనిని సద్వినియోగం చేసుకోవాలి. గొర్రెలకు రాత్రి బస షెల్టర్లు ఏర్పాటు చేసే ప్రతిపాదన ఉంది. రాముడు : సార్, గొర్రెలకు వ్యాధి నిరోధక టీకాలు వేయించాలి. ఈ దిశగా చర్యలు తీసుకోండి. జేడీ : గొర్రెలకు అన్ని రకాల వ్యాధి నిరోధక టీకాలు వేస్తున్నాం. ప్రస్తుతం పీపీఆర్ వ్యాక్సిన్ వేయడం జరుగుతోంది. కొత్తగా పుట్టిన జీవాలు, ఆరు నెలల క్రితం వేయని జీవాలకు ఈ వ్యాక్సిన్ వేయించాలి. నట్టల నివారణ మందు కూడా ఉచితంగా తాపుతున్నాం. వీటిని సద్వినియోగం చేసుకోవాలి. ఎంపీటీసీ సభ్యుడు శేఖర్ : సార్.. మా గ్రామం పశు సంపదకు నిలయం. కానీ గ్రామంలో నీటి సమస్య ఎక్కువగా ఉంది. పాడి పశువు పేయి కడగడానికి, వాటికి నీళ్లు తాపడానికి దూరం మంచినీళ్లు తెచ్చుకోవాల్సి ఉంది. నీటి సమస్యను తీర్చాలి. జేడీ: పశు పోషణలో నీటి అవసరం ఎక్కువగా ఉంటుంది. పశువులు పరిశుభ్రంగా ఉంటేనే పాలు పరిశుభ్రంగా ఉంటాయి. అయితే నీటి సమస్య పరిష్కారం మా చేతిలో లేదు. అయినప్పటికీ నీటి సమస్య కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించే ప్రయత్నం చేస్తాను. ఎంపీటీసీ సభ్యుడు : సార్.. మహిళలకు పాడి గేదెలు ఇచ్చి వారి అభ్యున్నతికి దోహదపడ్డారు. ఎద్దుల బండ్లు ఇస్తే సౌకర్యంగా ఉంటుంది. చెరువులో నీళ్లు ఉన్నాయి. ఎద్దుల బండ్ల ద్వారా డ్రమ్ముల్లో తెచ్చుకోవచ్చు. జేడీ : ఎద్దుల బండ్లు ఇవ్వడం కూడా పశుసంవర్ధక శాఖ చేపట్టడం లేదు. వీటిని సబ్సిడీపైన వ్యవసాయ శాఖ పంపిణీ చేస్తోంది. అవసరమైన వారికి ఎద్దుల బండ్లను వ్యవసాయ శాఖ జేడీ దృష్టికి తీసుకెళ్లి పంపిణీ చేసే విధంగా చూస్తాం. జేడీ : ఏమ్మా.. పాల ఉత్పత్తి అధికంగా ఉంది కదా.. వీటికి మార్కెటింగ్ ఉందా ? జుబేదాబీ : సార్.. గ్రామం పాలకోవకు ప్రసిద్ధి. ఇక్కడ ఉత్పత్తి చేసిన కోవాను వివిధ ప్రాంతాలకు తరలిస్తాం. ఉత్పత్తి అయిన పాలను బయటికి అమ్మం. కోవకు వినియోగిస్తాం. వచ్చిన పాలకోవకు వినియోగిస్తుండటం వల్ల పాలకు మంచి ధర వచ్చినట్లు అవుతోంది. జేడీ : పాడి పశువులకు అజొల్లా మంచి పోషక విలువతో కూడిన దాణాగా ఉపయోగపడుతుంది. దీనివల్ల దాణా ఖర్చు తగ్గుతుంది. అజొల్లా యూనిట్లను సబ్సీడీపై ఇస్తున్నాం. వినియోగించుకున్నారా ? ధనలక్ష్మి : సార్... చిన్న టేకూరు పశువైద్యాధికారి నాగరాజు అజొల్లా యూనిట్ల గురించి చెప్పారు. వాటిని వినియోగించుకున్నాం. ఇదిగో అజొల్లాను చూడండి. దీనిని దాణాలో కలిపి పాడి పశువులకు ఇస్తాం. దీనివల్ల పాల ఉత్పత్తి పెరుగుతోంది. వెన్నశాతం కూడా పెరిగింది. జేడీ : ఏమ్మా నీ పేరేంటి?ఈ బర్రెలు ఎక్కడి నుంచి వచ్చాయి.. ఎలా పోషిస్తున్నారు? మహిళ : సార్, నా పేరు జుబేదాబేగం. మేము స్వయం సహాయక సంఘాల్లో రాణిస్తున్నాం. మా గ్రామానికి డీఆర్డీఏ ద్వారా 15 గ్రూపులకు పాల ప్రగతి కేంద్రాలు మంజూరు చేశారు. ఒకసారి 5, మరోసారి 3 గ్రేడెడ్ ముర్రా జాతి పాడి గేదెలు మంజూరు చేశారు. జేడీ : మరి వీటి ఆరోగ్య సంరక్షణపై అవగాహన ఉందా? పచ్చిమేత ఇస్తున్నారా? గేదెలకు వ్యాధి నిరోధక టీకాలు ఇస్తున్నారా? జూబేదాబేగం : సార్.. ఈ గేదెలను తమిళనాడులో కొని మాకు పంపిణీ చేశారు. మొదట ఇవి ఈ వాతావరణానికి అనువుగా ఉంటాయో లేదోనని భయపడ్డాం. కానీ కొద్ది రోజుల్లోనే అలవాటు పడ్డాయి. వీటి కోసం ప్రత్యేకంగా ఏపీబీఎన్ గడ్డిని పెంచుతున్నాం. అజొల్లాను కూడా పెంచుతూ దాన్ని దాణాలో కలిపి ఇస్తున్నాం. క్రమం తప్పకుండా వ్యాధి నిరోధక టీకాలు ఇస్తున్నాం. పశువుల్లో ఏమైనా అనారోగ్య సమస్యలు కనిపిస్తే వెంటనే చిన్న టేకూరు పశువైద్యాధికారికి చెబుతాం. వెంటనే వచ్చి చికిత్స చేస్తున్నారు. జేడీ : పశుగ్రాసం వృథా చేసుకోకుండా ఉండేందుకు చాప్ కట్టర్లు ఇస్తున్నాం. మీరు తీసుకున్నారా ? చంద్రకళ : తీసుకున్నాం సార్... యూనిట్ కాస్ట్ రూ.26 వేలు అయితే 50 శాతం సబ్సిడీతో తీసుకున్నాం. పశుగ్రాసాన్ని చిన్న చిన్న ముక్కలు చేసి వినియోగిస్తున్నాం. ఇందువల్ల పశుగ్రాసం దుర్వినియోగం కావడం లేదు. ధనలక్ష్మి : కొన్ని పాడి గేదెల్లో ఎద లక్షణాలు కనిపించడం లేదు. ఇందువల్ల ఈతకు ఎడం పెరుగుతోంది. జేడీ : గేదెల్లో ఎద లక్షణాలు ఉంటాయి. ఈ లక్షణాలు దాదాపు 48 గంటలు ఉంటాయి. కొన్ని పశువులో మూగ ఎద లక్షణాలు ఉంటాయి. వీటిని గుర్తించడం కష్టం. ఎద లక్షణాలు కనిపించిన 12 గంటల తర్వాత కృత్రిమ గర్భధారణ సూది వేయించాలి. జేడీ : సునందిని, క్షీర సాగర్ పథకాల గురించి తెలుసా...? మహిళలు : తెలుసు సార్.. మా డాక్టరు వీటి గురించి చెప్పారు. జేడీ: సునందిని పథకం దూడలకు ఉద్దేశించింది. యూనిట్ కాస్ట్ రూ.5 వేలు. ఇందులో లబ్ధిదారుని వాటా రూ.950 ఉంటుంది. దూడలకు మూడు విడతలుగా 237 కిలో దాణా ఇస్తాం. దూడలకు బీమా సౌకర్యం ఉంది. దీనివల్ల దూడలు త్వరగా పెరుగుతాయి. అదే విధంగా క్షీరసాగర్ పథకాన్ని అమలు చేస్తున్నాం. దీనివల్ల చాల ఉపయోగలు ఉన్నాయి. వీటిని వినియోగించుకోవాలి. మహిళలు : జీవనాధారం కోసం పొట్టేళ్లు, గొర్రెల యూనిట్లు కావాలి. సార్.. ఇప్పించండి.? జేడీ : పొట్టేళ్ల యూనిట్ల గొర్రెల యూనిట్ పంపిణీ చేయాలనే ప్రతిపాదన ఉంది. ఇది అమలులోకి వచ్చినప్పుడు తప్పకుండా ప్రాధాన్యం ఇస్తాం. మిహ ళలు: సార్ ఈ గ్రామం పాలకోవాకు ప్రసిద్ధి చెందింది. దీనిని మరింత లభివృద్ధి చేసేందుకు ప్రొత్సాహం లేదు. తగిన చేయూత ఇవ్వాలి. జేడీ : పాలకోవా తయారీని చిన్న తరహా పరిశ్రమగా గుర్తించి బ్యాంకుల ద్వారా చేయూత ఇచ్చే విధంగా చర్యలు తీసుకుంటాం. -
ఎట్టకేలకు కౌన్సెలింగ్..
ఖమ్మం: గత మూడు నెలలుగా కౌన్సెలింగ్ కోసం ఎదురుచూస్తున్న ఎంసెట్ విద్యార్థులకు ఊరట కలిగింది. ఎంసెట్ నిర్వహణకు మార్గం సుగమం చేస్తున్నట్లు ఉన్నత విద్యామండలి కమిషనర్ వేణుగోపాల్‌రెడ్డి సోమవారం ప్రకటించారు. ఆగస్టు 7 నుంచి సర్టిఫికెట్లు పరిశీస్తామని, ఈ లోపు ఇతర విషయాలపై మార్గదర్శకాలు విడుదల చేస్తామని ప్రకటించడంతో విద్యార్థులతో పాటు ఇంజనీరింగ్ కళాశాలల యాజమాన్యాలు ఊపిరి పీల్చుకున్నాయి. అయితే తెలంగాణలోని అన్ని జిల్లాలకు ఒక పరిస్థితి ఉంటే.. ఖమ్మం జిల్లాకు మరో పరిస్థితి నెలకొనడంతో మార్గదర్శకాలు ఎలా ఉంటాయో.. అడ్మిషన్ల ప్రక్రియ ఎలా ఉంటుందో, ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై ఎలాంటి ఆంక్షలు ఉంటాయోననేది చర్చనీయాంశంగా మారింది. మార్గదర్శకాలు ఎలా ఉంటాయో..? ఎంసెట్ కౌన్సెలింగ్ ప్రక్రియకు శ్రీకారం చుడుతున్నామని ఉన్నవిద్యాఖ అధికారులు ప్రకటించినా.. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలు ఎలా ఉంటోయో.. ? అన్నదానిపై జిల్లా విద్యార్థులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. మే 22న జరిగిన ఎంసెట్‌కు 14,458 మంది విద్యార్థులు హాజరయ్యారు. వీరితోపాటు హైదరాబాద్, విజయవాడ, వరంగల్ ప్రాంతాల్లో చదువుతున్న జిల్లా విద్యార్థులు కూడా ఆయా ప్రాంతాల్లో ప్రవేశ పరీక్షలు రాశారు. ఇందులో సుమారు 10 వేల పైచిలుకు విద్యార్థులు ఇంజనీరింగ్, మెడికల్ తదితర విద్యను అభ్యసించేందుకు అర్హత సాధించారు. అయితే ఫలితాలు వచ్చిన వెంటనే కౌన్సెలింగ్ నిర్వహించాల్సిన ప్రభుత్వం.. నూతన రాష్ట్ర ఆవిర్భావం, విద్యార్థులకు అందించే ఫీజు రీయింబర్స్మెంట్, సీట్ల కేటాయింపుపై కసరత్తు ప్రారంభించింది. దీంతో కౌన్సెలింగ్ ఆలస్యమైంది. ఇప్పుడు ఈ ప్రక్రియను ప్రారంభిస్తున్నామని, త్వరలోనే మార్గదర్శకాలు విడుదల చేస్తామని అధికారులు చెప్పారు. అయితే ఆంధ్రకు సరిహద్దులో ఉన్న మన జిల్లా విద్యార్థులు మార్గదర్శకాల కోసం ఎదురు చూడాల్సి వస్తోంది. 1956కు పూర్వం స్థానికత, పోలవరం ముంపు ప్రాంతాల విద్యార్థులకు ఏ ప్రభుత్వం రీయింబర్స్మెంట్ ఇస్తుంది.. ఎక్కడ చదివితే లాభం, సీట్ల కేటాయింపులో స్థానికతకు ప్రాధాన్యత మొదలైన అంశాలతో వారి భవితవ్యం ముడిపడి ఉంది. జిల్లాలో ప్రత్యేక పరిస్థితి... జిల్లాలో ప్రతి సంవత్సరంనిర్వహించే ఎంసెట్ కౌన్సెలింగ్‌కు మన విద్యార్థులతోపాటు, పరిసర ప్రాంతాలైన వరంగల్ జిల్లా మరిపెడ, డోర్నకల్, మహబూబాబాద్, కురవి, నల్గొండ జిల్లా కోదాడ, సూర్యాపేట, తూర్పు, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాలకు చెందిన విద్యార్థులు కూడా హాజరవుతారు. ఇక జిల్లాలో ఉన్న 23 ఇంజనీరింగ్ కళాశాలల్లో 9 వేల సీట్లు ఉన్నాయి. ఈ సీట్లలో ఆయా ప్రాంతాలకు చెందిన విద్యార్థులు కూడా చేరుతారు. అయితే ఉన్నత విద్యామండలి చైర్మన్ వేణుగోపాల్‌రెడ్డి నిర్ణయానికి ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు ఏ మేరకు కట్టుబడి ఉంటాయో, సుప్రింకోర్టు ఆదేశాలు ఎలా ఉంటోయోననే చర్చ జరుగుతోంది. ముంపు ప్రాంత విద్యార్థులకు ఏ ప్రభుత్వం రీయింబర్స్మెంట్ ఇవ్వాలి, తెలంగాణలో చదివే విద్యార్థులకు ఇచ్చేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందుకొస్తుందా..? అసలు ఏపీ విద్యార్థులను తెలంగాణ ఇంనీరింగ్ కళాశాల యాజమాన్యాలు చేర్చుకుంటాయా.. ? అనేది సందిగ్దంగా మారింది. దీనికి తోడు 1956 స్థానికత నిబంధన పెడితే హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల తర్వాత అత్యధికంగా స్థానికేతరులు ఉన్న జాబితాలో ఖమ్మం జిల్లా ఉంది. ఇటువంటి పరిస్థితిలో తెలంగాణ ప్రభుత్వం తీసుకునే నిర్ణయం ఎలా ఉంటుందోని విద్యార్థులు, కళాశాలల యాజమాన్యాలు ఎదురుచూస్తున్నాయి. -
రాష్ట్రవ్యాప్తంగా ఎంసెట్ ప్రారంభం
హైదరాబాద్ : రాష్ట్ర వ్యాప్తంగా గురువారం ఎంసెట్ పరీక్ష ప్రారంభమైంది. ఇంజినీరింగ్ పరీక్ష ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, అగ్రికల్చర్-మెడిసిన్ పరీక్ష మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల జరగనున్నాయి. ఈసారి రాష్ట్రవ్యాప్తంగా 3,95,650 మంది విద్యార్థులు ఎంసెట్‌కు దరఖాస్తు చేయగా, ఇందులో ఇంజినీరింగ్ విభాగానికి 2,82,799 మంది, అగ్రికల్చర్, మెడిసిన్ పరీక్షకు 1,12,851 మంది విద్యార్థులు ఉన్నారు. ఎంసెట్ ఇంజినీరింగ్ పరీక్షకు 523 పరీక్ష కేంద్రాలు, అగ్రికల్చర్, మెడిసిన్ పరీక్షకు 227 కేంద్రాలను ఏర్పాటు చేశారు. కాగా ఇంజినీరింగ్ పరీక్షకు 'క్యూ' కోడ్ ప్రశ్నాపత్రాన్ని ఉన్నత విద్యామండలి ఛైర్మన్ వేణుగోపాల్ రెడ్డి గురువారం ఉదయం ఎంపిక చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒక్క నిమిషం ఆలస్యమైనా విద్యార్థులను ఎంసెట్ట్ పరీక్షకు అనుమతించేది లేదని స్పష్టం చేశారు. పరీక్షా కేంద్రాల్లోకి ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలు అనుమతించేది లేదని తెలిపారు. పరీక్ష కేంద్రానికి విద్యార్థులు ఓ గంట ముందే రావాలని సూచించారు. ఈ నెల 24న ప్రాథమిక కీ విడుదల కానుంది. 31 వరకు విద్యార్థుల నుంచి అభ్యంతరాలు స్వీకరిస్తారు. జూన్ 9న ఎంసెట్ ర్యాంకులు విడుదల చేస్తారు. -
మున్సిపాలిటీ ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు
నల్లగొండ టుటౌన్, న్యూస్‌లైన్ : పురపాలక సంఘం ఎన్నికల కౌంటింగ్ కోసం అధికార యంత్రాంగం ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తుంది. కౌంటింగ్ కోసం అవసరమైన సదుపాయాలు కల్పించడానికి అధికారులు చర్యలు చేపట్టారు. ఈ నెల 12న కౌంటింగ్ చేపట్టడానికి సర్వం సిద్ధం చేస్తున్నారు. నల్లగొండ పురపాలక సంఘం ఓట్ల లెక్కింపునకు 7టేబుళ్లు, సూర్యాపేట, మిర్యాలగూడ, భువనగిరి, కోదాడ పురపాలక సంఘాలు, దేవరకొండ, హుజూర్నగర్ నగర పంచాయతీలకు 5 టేబుళ్ల చొప్పున ఏర్పాటు చేసేందుకు ప్రణాళిక రూపొందించారు. జిల్లాలోని అన్ని పురపాలక సంఘాలు, నగరపంచాయతీల ఎన్నికల కౌంటింగ్‌ను నల్లగొండ పట్టణ సమీపంలోని ఎస్ఎల్బీసీ దగ్గర ఉన్న డాన్ బోస్కో స్కూల్లో నిర్వహిస్తారు. ప్రతి పురపాలక సంఘానికి ఒక ఒక ఆర్డీఓను ఎన్నికల అబ్జర్వర్‌గా కలెక్టర్ నియమించారు. నల్లగొండకు ట్రైనీ ఐఏఎస్ సత్యనారాయణ, కోదాడకు అదనపు జేసీ వెంకట్రావు, హుజూర్‌నగర్‌కు జేడీఏ నర్సింహారావును అబ్జర్వర్లుగా నియమించారు. మిగతా వాటికి ఆయా పరిధిలో ఉన్న ఆర్డీఓలు అబ్జర్వరులుగా వ్యవహరించనున్నారు. నల్లగొండ పురపాలక సంఘానికి సంబంధించి 7టేబుళ్లలో ఏడు వార్డుల కౌంటింగ్ మొదలు పెట్టనున్నారు. మితగా వాటిలో 5 టేబుళ్లలో ఒకేసారి 5 వార్డుల కౌంటింగ్ మొదలు పెట్టడానికి నిర్ణయించారు. ఒక వార్డులో ఉన్న పోలింగ్ కేంద్రాలు దాదాపు 10 నుంచి 15 నిమిషాలలో కౌంటింగ్ పూర్తయ్యే అవకాశం ఉంది. ఒక టేబులుకు ముగ్గురు చొప్పున సిబ్బందిని నియమించారు. కౌంటింగ్‌ను జిల్లా కలెక్టర్ టి. చిరంజీవులు, జేసీ హరిజవహర్‌లాల్ పర్యవేక్షంచనున్నారు. ఉదయం 7.30 గంటలకు మొదట కౌంటింగ్ చేపట్టే వార్డుల సంబంధించిన పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కిస్తారు. ఆ తరువాత ఈవీఎంల ఓట్లను లెక్కించడానికి ప్రణాళిక తయారు చేశారు. అదేవిధంగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్కించే సమయంలో కౌన్సిలర్ అభ్యర్థులతో పాటు ఒక ఏజంటును లోపలికి అనుమతిస్తారు. ఈవీఎంల ఓట్ల లెక్కింపు సమయంలో ఒక ఏజంటును మాత్రమే లోపలికి అనుమతి ఇస్తారు. వార్డుల ఫలితాలను ప్రకటించడానికి మైకులు ఏర్పాటు చేయనున్నారు. అదేవిధంగా స్కూల్ బయట బారికేడ్లు ఏర్పాటు చేసి గట్టి బందోబస్తు ఏర్పాటు చేయనున్నారు. దీంతో ఒక్కో మున్సిపాలిటీ వారిగా టెంట్లు ఏర్పాటు చేసి తాగునీటి సౌకర్యం కల్పించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభమై మధ్యాహ్నం 2 గంటల లోపు మొత్తం కౌంటింగ్ పూర్తి కానుంది. ఏర్పాట్లు చేస్తున్నాం : వేణుగోపాల్‌రెడ్డి, నల్లగొండ మున్సిపల్ కమిషనర్ కలెక్టర్ ఆదేశాల మేరకు పురపాలక సంఘం ఎన్నికల కౌంటింగ్‌కు నల్లగొండ పట్టణ సమీపంలో ఉన్న డాన్‌బోస్కో స్కూల్లో అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. అభ్యర్థులతో పాటు వచ్చే వారి కోసం కూడా పకడ్బందీగా ఏర్పాట్లు చేశాం. కేంద్రం వద్ద బారీకేడ్లు, తాగునీటి సౌకర్యం ఇతర అన్ని వసతులు కల్పించడానికి చర్యలు చేపట్టాం. పనులు చురుగ్గా సాగుతున్నాయి. -
వైఎస్సార్సీపీలోకి వంటేరు
సాక్షి ప్రతినిధి, నెల్లూరు : తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ శాసనసభ్యుడు వంటేరు వేణుగోపాల్‌రెడ్డి బుధవారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖరరెడ్డి, ఆత్మకూరు సమన్వయకర్త మేకపాటి గౌతమ్‌రెడ్డి ఆయన్ను వైఎస్ జగన్మోహన్రెడ్డికి పరిచయం చేసి పార్టీ కండువా కప్పించారు. వంటేరు రాకతో ఉదయగిరి, కావలి నియోజక వర్గాల్లో వైఎస్సార్సీపీకి అదనపు బలం తోడైంది. తెలుగుదేశం పార్టీ నుంచి 1999లో కావలి ఎమ్మెల్యేగా ఎన్నికైన వేణుగోపాల్‌రెడ్డి తొలి నుంచి పార్టీకి విధేయుడిగా పనిచేస్తూ వచ్చారు. నియోజకవర్గాల పునర్విభజన తర్వాత కాంగ్రెస్ అభ్యర్థి మేకపాటి రాజమోహన్‌రెడ్డి మీద నెల్లూరు లోక్‌సభ స్థానానికి పోటీ చేయడానికి అభ్యర్థి దొరకని సమయంలో వేణుగోపాల్‌రెడ్డి టీడీపీ తరఫున బరిలోకి దిగారు. ఆ తర్వాత జరిగిన ఉప ఎన్నికలో సైతం టీడీపీకి వంటేరే దిక్కయ్యారు. ఆ తర్వాత పార్టీలో చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో ఆయన అంటీముట్టనట్లుగా వ్యవహరిస్తూ వచ్చారు. కాంగ్రెస్ నుంచి టీడీపీలోకి వచ్చిన సర్వేపల్లి శాసనసభ్యుడు ఆదాలప్రభాకర్రెడ్డి నెల్లూరు లోక్‌సభకు బరిలోకి దిగాలని నిర్ణయించారు. దీంతో కావలి, ఉదయగిరి నియోజకవర్గాల్లో ఆయనకు, పార్టీకి తన అవసరం ఉండటంతో వంటేరుకు తగిన ప్రాధాన్యత దక్కుతుందని భావించారు. పార్టీ అధినేత చంద్రబాబు పెత్తనం మొత్తం ఆదాలకే అప్పగించడాన్ని వంటేరు జీర్ణించుకోలేకపోయారు. ఇదే సమయంలో ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖరరెడ్డి స్వయంగా వంటేరును కలసి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలో తగిన గౌరవం కల్పిస్తామని ఆయన హామీ ఇచ్చారు. దీంతో ఆయన వైఎస్సార్సీపీలో చేరాలని నిర్ణయించుకున్నారు. ఈ విషయం తెలిసి టీడీపీ ముఖ్యనేతలు వంటేరును నిలువరించే ప్రయత్నం చేసినా ఆయన ససేమిరా అన్నారు. ఈ నేపథ్యంలో బుధవారం వైఎస్ జగన్ చేతులమీదుగా ఆయన వైఎస్సార్సీపీ తీర్థం పుచ్చుకున్నారు. వంటేరుకు ఉదయగిరి నియోజకవర్గంలోని కలిగిరి, జలదంకి మండలాల్లోను, కావలినియోజకవర్గంలోని కావలి, బోగోలు మండలాల్లోను అనుచరవర్గం, జనంలో పట్టు ఉంది. ఈయన రాకతో వైసీపీకి రెండు నియోజకవర్గాల్లో అదనపు బలం చేకూరనుంది. -
వేర్వేరు చోట్ల రూ. 6.45 లక్షలు పట్టివేత
పరిగి/చేవెళ్ల రూరల్, న్యూస్‌లైన్: జిల్లాలో గురువారం వేర్వేరు రెండు ఘటనల్లో రూ. 6.45 లక్షలు పట్టుబడ్డాయి. పరిగి మండలం రాఘవాపూర్ చెక్‌పోస్టు వద్ద బస్సులోంచి రూ. 4 లక్షలు, చేవెళ్ల మండలం ముడిమ్యాల చెక్‌పోస్టు దగ్గర కారులో తరలిస్తున్న రూ. 2.45 లక్షలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పరిగి పోలీసుల కథనం ప్రకారం.. మండలంలోని రాఘవాపూర్ చెక్ పోస్టు వద్ద గురువారం మధ్యాహ్నం సీఐ వేణుగోపాల్‌రెడ్డి, ఎస్ఐలు షేక్‌శంషొద్దీన్, జానకిరాంరెడ్డిలు వాహనాల తనిఖీలు చేపట్టారు. ఇదే సమయంలో షాద్‌నగర్ నుంచి పరిగి వస్తున్న ఆర్టీసీ బస్సు(ఏపీ 28 వై 3190)లో సూర్య(21), అర్జున్‌రావు(21) అనే ఇద్దరు యువకులు వస్తున్నారు. పోలీసుల తనిఖీల్లో వారి వద్ద ఉన్న బ్యాగులో రూ. 4 లక్షలు పట్టుబడ్డాయి. ఈమేరకు వారిని అదుపులోకి తీసుకుని పరిగి ఠాణాకు తరలించారు. యువకులు పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలు నివాసులుగా గుర్తించారు. వికారాబాద్‌లోని ఇండియా ఇన్ఫ్లెన్స్ లిమిటెడ్ సంస్థలో తాము కాల్ కస్టమర్ ఎగ్జిక్యూటీవ్లుగా పని చేస్తున్నట్లు తెలిపారు. వారు డబ్బులకు సంబంధించిన ఆధారాలు చూపకపోవడంతో సదరు నగదును ఇన్‌కం ట్యాక్స్ అధికారులకు అప్పగిస్తామని సీఐ వేణుగోపాల్‌రెడ్డి తెలిపారు. మరో ఘటనలో రూ. 2.45 లక్షలు.. చేవెళ్ల మండలంలోని ముడిమ్యాల చెక్‌పోస్టు వద్ద గురువారం మారుతీ జెన్ కారు(ఏపీ 28 ఏడీ 9451)లో తరలిస్తున్న రూ. 2. 45 లక్షలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. శంషాబాద్ మండలం కవ్వగూడెంవాసి మెరుగు సిద్దేశ్వర్ వికారాబాద్‌కు వెళ్తున్నాడు. ఆయన కారులో ఉన్న రూ.2.45 లక్షలకు సరైన ఆధారాలు లేకపోవడంతో స్వాధీనం చేసుకున్నామని, సదరు నగదును ఆదాయ శాఖ అధికారులకు అప్పగించనున్నట్లు ఎస్ఐ లక్ష్మీరెడ్డి చెప్పారు. ఎన్నికల కోడ్ నేపథ్యంలో ప్రజలు రూ. 50 వేలకు మించి తీసుకెళ్తే దానికి సంబంధించిన ఆధారాలు చూపించాల్సి ఉంటుందని పోలీసులు తెలిపారు. -
నెరవేరిన ఆశయం
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : మలిదశ తెలంగాణ ఉద్యమంలో ప్రత్యేక రాష్ట్రం కోసం ఆత్మ బలిదానం చేసుకున్న పెన్‌పహాడ్ మండలం దోసపహాడ్ గ్రామానికి చెందిన కొండేటి వేణుగోపాల్‌రెడ్డి ఆశయం నెరవేరింది. తెలంగాణ రాష్ట్రం కోసం ఆయన చేసుకున్న ఆత్మ బలిదానం మరిచిపోలేని ఘట్టం. దోసపహాడ్ గ్రామానికి చెందిన కొండేటి కోటిరెడ్డి-లక్ష్మమ్మల చిన్నకుమారుడు వేణుగోపాల్‌రెడ్డి హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు కళాశాలలో ఎంసీఏ ఫైనల్ ఇయర్ చదువుతున్నారు. తెలంగాణ రాష్ట్రం కోసం జరిగే ఉద్యమాలను చూసి చలించాడు. 2010, జనవరి 18న యూనివర్సిటీలోని లైబ్రరీకి వెళ్తున్నానని చెప్పి ఇంట్లోనుంచి బయటకు వెళ్లాడు. ఠాగూర్ ఆడిటోరియం సమీపంలో అర్ధరాత్రి 11.30 గంటల సమయంలో శరీరంపై కిరోసిన్ పోసుకొని ఆత్మాహుతికి పాల్పడ్డాడు. ఉదయం అటుగా వెళ్లిన విద్యార్థులు గుర్తించడంతో వెలుగులోకి వచ్చింది. ‘సోనియాగాంధీ గారూ.. తెలంగాణ బిల్లు పార్లమెంటులో ప్రవేశపెట్టండి’ అంటూ సూసైడ్ నోట్ రాసి పెట్టాడు. 19న మొత్తం వేణుగోపాల్‌రెడ్డి శవాన్ని యూనివర్సిటీలోనే ఉంచి విద్యార్థులు ఆందోళన చేయడంతో తెలంగాణ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులంతా యూనివర్సిటీకి చేరుకొని వేణుగోపాల్‌రెడ్డి శవం వద్ద ఇక మాజీలమని ప్రమాణాలు చేశారు. జిల్లాకు చెందిన మంత్రి జానారెడ్డితో పాటు మరోమంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, ఎమ్మెల్యేలు రాంరెడ్డి దామోదర్‌రెడ్డి, నాగం జనార్ధన్‌రెడ్డిలు అక్కడే ఉన్నారు. శవాన్ని గన్‌పార్క్ దాకా ర్యాలీగా తీసుకెళ్లాలని విద్యార్థులు ప్లాన్ చేస్తే అనుమతివ్వకుండా లాఠీచార్జి చేసి రబ్బర్ బుల్లెట్లు, భాష్పవాయువు ప్రయోగించారు. ఇదే సమయంలో ఆంధ్రా ప్రజాప్రతినిధులు ఇది తెలంగాణ కోసం జరిగిన ఆత్మహత్య కాదని.. ఎవరో చంపేశారని ఆరోపణలు చేయడంతో కుటుంబ సభ్యులు, ఉస్మానియా విద్యార్థులంతా ఇక్కడే పోస్టుమార్టం చేయాలని పట్టుపట్టారు. దీంతో పోస్టుమార్టం చేసి ఊపిరితిత్తుల్లో పొగ ఉండడంతో కిరోసిన్ పోసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లుగా డాక్టర్లు నివేదిక ఇచ్చారు. 20న హైదరాబాద్ నుంచి దోసపహాడ్‌కు శవాన్ని తీసుకొచ్చేందుకు అడుగడుగునా పోలీసులు నాటకీయంగా వ్యవహరించి ప్రధాన రహదారిపై తీసుకురాకుండా రాంగ్ రూట్లో తీసుకొస్తుంటే గ్రామగ్రామానా ప్రజలు పోలీసుల తీరును నిరసించారు. దీంతో చౌటుప్పల్, నకిరేకల్‌లో లాఠీఛార్జి చేశారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్‌రావు, ఏనుగు రవీందర్‌రెడ్డి, సూర్యాపేట ఎమ్మెల్యే రాంరెడ్డి దామోదర్‌రెడ్డి, రాజ్యసభ సభ్యుడు ఆకారపు సుదర్శన్ సూర్యాపేటకు చేరుకున్నారు. సూర్యాపేట పట్టణంలో పెద్ద ఎత్తున వీధుల గుండా ర్యాలీ నిర్వహించి సాయంత్రం దోసపహాడ్ గ్రామంలో అంత్యక్రియలు నిర్వహించారు. అంత్యక్రియల్లో అన్ని పార్టీల నాయకులు పెద్దఎత్తున పాల్గొని వేణుగోపాల్‌రెడ్డి కుటుంబాన్ని ఆదుకుంటామని ప్రకటించారు. కుటుంబ నేపథ్యం.. కొండేటి కోటిరెడ్డి-లక్ష్మమ్మ దంపతులకు శ్రీనివాసరెడ్డి, వేణుగోపాల్‌రెడ్డి ఇరువురు సంతానం. గ్రామంలో నాలుగు ఎకరాల పొలం, రూ.2లక్షల విలువ చేసే ఇల్లు ఉండేది. చదువుల కోసం రెండు ఎకరాలతో పాటు ఇల్లు కూడా అమ్మి హైదరాబాద్‌లో నివసిస్తురు. పెద్ద కుమారుడు శ్రీనివాసరెడ్డి పీహెచ్డీ స్కాలర్‌షిప్‌తో ఇరువురు చదువుకునేవారు. నేటికీ అందని సాయం : సిద్ధారెడ్డి, వేణుగోపాల్‌రెడ్డి మేనమామ ఓ తెలంగాణ నేత రూ.5 లక్షలు ఇస్తానని ప్రకటించారు. తర్వాత ఆయనను కలిస్తే ‘ప్రత్యేక పరిస్థితుల్లో ప్రకటించాల్సి వచ్చింది, చాలామంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.. అందరికీ ఇవ్వలేమని’ చెప్పారు. ఓ ఎమ్మెల్యే రూ.5 లక్షలు ఇస్తానని ప్రకటించారు. కానీ రూ.లక్ష మాత్రమే అందజేశారు. రెండో వర్ధంతి సందర్భంగా టీఆర్ఎస్ పోలిట్ బ్యూరో సభ్యుడు జగదీశ్వర్‌రెడ్డి రూ.లక్ష, టీడీపీ నాయకుడు పటేల్ రమేష్‌రెడ్డి రూ.లక్ష అందజేశారు. భువనగిరి సభలో కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు రూ.లక్ష అందజేశారు. కుమారుని దిగులుతో మరణించిన తండ్రి.. వేణుగోపాల్‌రెడ్డి మరణంతో తండ్రి కోటిరెడ్డి దిగులు చెంది సంవత్సరన్నర తర్వాత మృతి చెందాడు. ప్రస్తుతం తల్లి లక్ష్మమ్మ దోసపహాడ్‌లోనే ఒంటరిగా నివసిస్తుంది. -
లోకమంతా సంరంభం
అరవై ఏళ్ల కల.... లోక్‌సభ సాక్షిగా సాకారమైన వేళ... నల్లగొండ నగారై మోగింది... ఊరూవాడా...ఎక్కడ చూసినా... జై తెలంగాణ....జైజై తెలంగాణ త్యాగాల బాటలో..పోరు కె రటాలై.. మలి ఉద్యమ తొలి అమరుడు శ్రీకాంతచారి.. ఉస్మానియాలో ఊపిరొదిలిన వేణుగోపాలరెడ్డి.. మంత్రి పదవినే వదులుకున్న కోమటిరెడ్డి.. నిత్య నిర్బంధాలను (పీడీ యాక్టు) లెక్కచేయని చెరుకు సుధాకర్.. ఎందరో...ఇంకెందరో పోరుబిడ్డలు... నా తెలంగాణ...ఇప్పుడు కోటి సంబురాల వీణ సాక్షిప్రతినిధి, నల్లగొండ: ‘ప్రాణమివ్వడం.. అంటే .. పొద్దూ పొడవడమాని..’ అన్న కవి వాక్కులను అక్షర సత్యం చేస్తూ అగ్నికీలలతో పునీతుడైన శ్రీకాంతచారి తెలంగాణ తొలిపొద్దు పొడుపు. 2009 డిసెంబరు ప్రకటన అనంతరం వెనక్కితగ్గిన కేంద్రం తీరుకు నిరసనగా నిలువెల్లా కాలిపోయిన కాసోజు శ్రీకాంతచారి పొడిచేడు పేరును తెలంగాణ ఉద్యమ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించాడు. వేణుగోపాల్‌రెడ్డి ఆత్మత్యాగం .. తెలంగాణ ప్రజాప్రతినిధులను కదలించిన వైనం.. పదవులు పూచిక పుల్లలతో సమానమంటూ అమాత్య పదవిని అమాంతం వదిలేసుకున్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి.. ప్రభుత్వ నిరంకుశ విధానానికి బాధితునిగా పీడీ యాక్టు కింద జైలుపాలైన డాక్టర్ చెరుకు సుధాకర్.. ఇలా.. తెలంగాణ త్యాగాల చరిత్రలో జిల్లాదే ప్రధానముద్ర. తెలంగాణ చరిత్రలో జిల్లాకు ఓ ప్రత్యేకమైన పేజీ ఉంటుంది . ఇపుడు తెలంగాణ బిల్లు లోక్‌సభలో ఆమోదం పొంది కొత్త రాష్ట్రం ఏర్పాటుకు అన్ని అడ్డంకులూతొలిగిపోయిన వేళ, మంగళవారం జిల్లా అంతటా సంబరాలు అంబరాన్ని అంటాయి. లోక్‌సభలో బిల్లుప్రవేశ పెట్టినప్పుటి నుంచే అంతా టీవీల ముందు కదలకుండా కూర్చున్నారు. సీమాంధ్ర నేతల గొడవలతో లోక్‌సభ సమావేశాలకు అంతరాయం కలగడం, వరసగా వాయిదా పడుతుండడంతో ఆవేశానికి లోనయ్యారు. తీరా బిల్లు ఆమోదం పొందాక పట్టరాని సంతోషంతో రోడ్లపైకి వచ్చారు. మహిళలు, పురుషులు, పిల్లలు, వృద్ధులు, ఉద్యోగులు, కార్మికులు, విద్యార్థులు అన్న తారతమ్యం లేదు. అంతా ఒక్క చోట చేరి సంబరాలు చేసుకున్నారు. గడిచిన ఆరునెలలుగా ఎన్నో పరిణామాలను చూస్తున్న తెలంగాణవాదులు ఉత్కంఠగా గడుపుతున్నారు. యూపీఏ ప్రభుత్వం తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించిన జూలై 30వ తేదీ నుంచి ఎంతో సంయమనంతో వేచి చూసిన జిల్లా ప్రజానీకం మంగళవారం కట్టలు తె ంచుకున్న ఆనందంతో ఒక్కసారిగా రోడ్లెక్కారు. టీఆర్ఎస్ ఆవిర్భావం తర్వాత నుంచి ఊపందుకున్న తెలంగాణ ఉద్యమంలో గడచిన పధ్నాలుగున్నరేళ్లలో జిల్లా తెలంగాణవాదులు పోషించిన పాత్ర తక్కువేం కాదు. పలు ప్రధాన ఘట్టాలకు నల్లగొండ వేదికంగా నిలిచింది. టీఆర్ఎస్ ఎమ్మెల్యేల మూక్కుమ్మడి రాజీనామాలు, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఉద్యమ కార్యక్రమాలు, శ్రీకాంతచారి అమరత్వం, తెలుగు సమాజం ఆలోచించేలా శంకర్ దర్శకత్వంలో వచ్చిన ‘జై బోలో తెలంగాణ’ సినిమా, సకల జనుల సమ్మె కాలంలో దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించిన జాతీయరహదారుల దిగ్బంధం ఇలా.. ఎన్నో ప్రధానమైన పోరాటాలకు, త్యాగాలకు జిల్లా చిరునామాగా నిలిచింది. ఈ కారణంగానే బిల్లు ఆమోదం పొందగానే.. అనూహ్యమైన స్పందన ప్రజల్లో కనిపించింది. నా త్యాగం.. వృథా కాలేదు : కోమటిరెడ్డి వెంకటరెడ్డి, నల్లగొండ ఎమ్మెల్యే ‘తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం అలవోకగా ప్రాణత్యాగం చేసిన యువతీ యువకుల సాహసం కదిలించింది. స్ఫూర్తిగా నిలిచింది. యువత తమ విలువైన ప్రాణాలనే తృణప్రాయం అనుకుంటుంటే.. ఇక నా పదవేం గొప్ప, దానికేం విలువ లేదనుకున్నా. పదవులు పట్టుకు వేలాడడం ఆత్మవంచనే అనిపించింది. అందుకే మంత్రి పదవిని వదులుకున్నా. ఇపుడు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కల సాకరమవుతుంటే .. అమరుల ప్రాణత్యాగానికి గౌరవం లభించిందనిపిస్తోంది. నా పదవీ త్యాగం.. వృథా కాలేదు అని అనిపిస్తోంది..’ అని మాజీ మంత్రి, నల్లగొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యానించారు. దశాబ్దాల పోరాటం ఫలించింది చెరుకు సుధాకర్, టీఆర్ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యుడు దశాబ్దాల పోరాటం ఫలించింది. 1200మంది అమరవీరుల త్యాగాలతో తెలంగాణ బిల్లుకు ఆమోదం లభించింది. త్వరలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుంది. లాఠీ తూటాలను, అక్రమ అరెస్టులను, సీమాంధ్ర ద్రోహుల కుట్రలను ఎండగట్టి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ సాధించుకున్నాం. ఇకపై తెలంగాణను పునర్నిర్మించుకుందాం. -
పండుగపూట దారుణం
పరిగి, న్యూస్‌లైన్: పండుగపూట దారుణం చోటుచేసుకుంది. గుర్తుతెలియని ఓ మహిళను దుండగులు దారుణంగా హత్య చేశారు. ఆమెపై అత్యాచారం చేసి చంపేసి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ సంఘటన పరిగి సమీపంలోని తుంకలగడ్డ వాగులో సోమవారం వెలుగుచూసింది. పోలీసుల కథనం ప్రకారం.. సోమవారం ఉదయం బహిర్భూమికి వెళ్లిన కొందరు పట్టణవాసులకు ఓ మహిళ మృతదేహం తుంకులగడ్డ వాగులో కనిపించింది. అర్ధనగ్నంగా ఉంది. సమాచారం అందుకున్న పరిగి సీఐ వేణుగోపాల్‌రెడ్డి, చేవెళ్ల డీఎస్పీ శ్రీధర్, ఎస్ఐ లకా్ష్మరెడ్డి సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. హతురాలి మెడకు చిన్న టవల్ బిగించి ఉంది. తలపై గాయాలు ఉన్నాయి. అర్ధనగ్నంగా పడిఉన్న ఆనవాళ్లను బట్టి ఆమెపై దుండగులు అత్యాచారం జరిపి హత్య చేసి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. పోలీసు జాగిలం పరిగి పట్టణంలోకి వచ్చి కాసేపు తెలుగుతల్లి విగ్రహం చౌరస్తాలో ఆగింది. అక్కడి నుంచి అంబేద్కర్ చౌరస్తాకు వెళ్లింది. దీనిని బట్టి.. దుండగులు మహిళను హత్య చే సిన తర్వాత పరిగి వరకు నడుచుకుంటూ వచ్చి అంబేద్కర్ చౌరస్తా నుంచి ఏదైనా వాహనంలో ఎక్కి వెళ్లి పోయి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. హతురాలు ఆకపచ్చరంగు జాకెట్టు, పసుపురంగు చీర ధరించి ఉంది. ఆమెకు 40-45 ఏళ్లు ఉండొచ్చని భావిస్తున్నారు. ఈమేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పరిగి పోలీసులు తెలిపారు. -
ఏసీబీ వలలో ఏఈఈ
గండేడ్, న్యూస్‌లైన్: ఓ కాంట్రాక్టర్ చేసిన పనికి ఎంబీ (మేజర్మెంట్ బుక్) ఇచ్చేందుకు డబ్బు లు తీసుకున్న పంచాయతీ రాజ్ ఏఈఈ (అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్)ను ఏసీబీ అధికారులు వలపన్ని పట్టుకున్నా రు. రూ.15వేలు లంచం తీసుకున్న గం డేడ్ పంచాయతీరాజ్ ఏఈఈ వేణుగోపాల్‌రెడ్డి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. ఏసీబీ డీఎస్పీ ప్రభాకర్ తెలిపిన వివరా ల ప్రకారం.. మహబూబ్‌నగర్ జిల్లా కోస్గి మండలం బలభద్రాయపల్లి గ్రా మానికి చెందిన వేణుగోపాల్‌రెడ్డి మహబూబ్‌నగర్‌లో నివాసముంటూ కుల్కచర్ల మండల పీఆర్ ఏఈఈగా విధులు నిర్వహిస్తున్నారు. గండేడ్ మం డలంలో ఏఈగా పనిచేసిన ప్రభాకర్ పదవీ విరమణ పొందడంతో ఆయన గండేడ్ ఇన్చార్జి బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 10 పర్సెంట్ ఇవ్వాల్సిందే.. గండేడ్ మండలం రంగారెడ్డిపల్లి అనుబంధ గ్రామం కప్లాపూర్ గ్రామానికి చెందిన కాంట్రాక్టర్ బాలవర్ధన్‌రెడ్డి గతేడాది నవంబర్‌లో జిల్లా పరిషత్ నిధుల నుంచి రూ. 1.5 లక్షలతో కప్లాపూర్- గోవింద్‌పల్లి తండా ఫార్మేషన్ రోడ్డు నిర్మాణానికి కాంట్రాక్టు దక్కించుకున్నారు. ఆయన సకాలంలో పని పూర్తి చేశారు. దీనికి సంబంధించి ఎంబీ రికార్డు చేసి ఇవ్వాలని ఏఈఈ వేణుగోపాల్‌రెడ్డిని కోరారు. ఇటీవల రోడ్డును పరిశీలించిన అధికారి తనకు కాంట్రాక్టు సొమ్ములో 10 శాతం లంచంగా ఇవ్వాలని డిమాండ్ చేశారు. తనకు కాంట్రాక్టులో ఏమీ మిగల్లేదు.. ఐదు శాతం తీసుకోవాలని కాంట్రాక్టర్ బాలవర్ధన్‌రెడ్డి ఏఈఈని కోరారు. ఎంతకూ అధికారి ససేమిరా అన్నారు. దీంతో కాం ట్రాక్టర్ మూడు రోజుల క్రితం ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. అధికారు ల పథకం ప్రకారం వారి నుంచి రూ.15 వేలు తీసుకున్నారు. ఏఈఈకి ఫోన్ చేసి శుక్రవారం గండేడ్ వస్తే మీరు అడిగిన ప్రకారమే రూ.15 వేలు ఇస్తానని.. ఎంబీ ఇవ్వాలని కోరారు. శుక్రవారం మధ్యాహ్నం మహబూబ్‌నగర్ నుంచి కారులో ఏఈఈ వేణుగోపాల్‌రెడ్డి వచ్చారు. కాంట్రాక్టర్ నుంచి రూ.15 వెయ్యి నోట్లు తీసుకుని కారులో కుల్కచర్ల వైపు వెళ్తుండగా ఏసీబీ అధికారులు వెంబడించి మండల కేంద్రంలోనే పట్టుకున్నారు. సమీపంలోని విశ్వభారతి కళాశాలలోకి ఏఈఈని తీసుకువెళ్లి తనిఖీలు చేశారు. పూర్తి ఆధారాలతో ఏఈఈ నుంచి తామిచ్చిన డబ్బును స్వాధీనం చేసుకున్నారు. అధికారులు ఆయనను సుమారు మూడు గంటల పాటు విచారణ జరిపారు. మహబూబ్‌నగర్‌లో ఇల్లు, హైదరాబాద్‌లో ఓ ఫ్లాట్, ఇతర ఆస్తులు ఉన్నట్లు ఏఈఈ అంగీకరించారని ఏసీబీ అధికారులు తెలిపారు. అనంతరం ఏఈఈని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు. వేలిముద్రలను నిర్ధారణ చేశాక ఏఈఈ ఆస్తులపై రైడింగ్ చేస్తామని ఏసీబీ అధికారులు తెలిపారు. ఏసీబీ దాడిలో రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల ఏసీబీ సీఐలు సి. రాజు, ఎన్. తిరుపతిరాజు, సిబ్బంది ఉన్నారు. చాలా వేధించాడు.. నేను కొన్నేళ్లుగా కాంట్రాక్టర్‌గా కొనసాగుతున్నాను. పీఆర్ ఏఈఈ వేణుగోపాల్‌రెడ్డి పర్సెంటేజీల పేరుతో నన్ను బాగా ఇబ్బందికి గురిచేశాడు. దీంతో నేను చాలా కాంట్రాక్టులు వదులుకున్నాను. ఆయన డిమాండ్ చేసిన మేర డబ్బులు ఇవ్వకుంటే నెలల తరబడి బిల్లు నిలిపేసేవాడు. దీంతో చాలా మంది కాంట్రాక్టర్లు పనులు చేయడం లేదు. ఆయన వేధింపులు తట్టుకోలేకే నేను ఏసీబీని ఆశ్రయించాను. - బాలవర్ధన్‌రెడ్డి, కాంట్రాక్టర్ -
పశుసంవర్ధక శాఖకు నాబార్డు నిధులు
కర్నూలు(కలెక్టరేట్), న్యూస్‌లైన్: పశు సంవర్ధక శాఖపై నాబార్డు నిధులను గుమ్మరించింది. జిల్లాలో కొత్తగా పశు వ్యాధి నిర్ధారణ కేంద్రాలు, నియోజకవర్గ స్థాయి శిక్షణ, విస్తరణ కేంద్రాలు ఏర్పడనున్నాయి. రెండేళ్ల క్రితం పలు గ్రామీణ పశువైద్యశాలలకు డాక్టర్ పోస్టులు మంజూరయ్యాయి. ఈ పశువైద్య శాలలను అభివృద్ధికి నిధులు మంజూరయ్యాయి. రాబోయే రెండేళ్లలో జిల్లాలో పశువైద్య సేవలు మరింత విస్తరించనున్నాయి. 2009లో వచ్చిన వరదల్లో మునిగిపోయిన బహుళార్ధ పశు వైద్యశాలను ఆధునాతనంగా నిర్మించడానికి నాబార్డు రూ.5 కోట్లు మంజూరు చేసింది. ఇందులో భవన నిర్మాణానికి రూ.4 కోట్లు, ఎక్విప్మెంటు రూ.కోటి వినియోగిస్తారని జిల్లా పశు సంవర్ధక శాఖ జేడీ వేణుగోపాల్ రెడ్డి తెలిపారు. * జిల్లా స్థాయిలో గోపాలమిత్ర శిక్షణా కేంద్రాన్ని ఇదే ప్రాంగణంలో రూ.65 లక్షలతో నిర్మించనున్నారు. ఇందులోనే రైతుల సమాచార, శిక్షణ కేంద్రాన్ని రూ.60 లక్షలతో నిర్మించనున్నారు. * డోన్, బనగానపల్లి, ఆళ్లగడ్డ, ఆత్మకూరు, శ్రీశైలం, ఆదోనిల్లో పశువ్యాధి నిర్ధారణ కేంద్రాలు ఏర్పాటు కానున్నాయి. ఒక్కో కేంద్రాన్ని నిర్మించేందుకు రూ.23.10 లక్షలు మంజూరయ్యాయి. * ఎమ్మిగనూరు, ఆళ్లగడ్డ, బనగానపల్లి, డోన్, ఆత్మకూరు, శ్రీశైలంలలో నియోజకవర్గ స్థాయిలో రైతు శిక్షణ, విస్తరణ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. వీటి నిర్మాణాలకు రూ.65 లక్షల ప్రకారం నాబార్డు నిధులు విడుదల చేసింది. * డివిజన్ స్థాయిలో కర్నూలు, నంద్యాలలో నాబార్డు నిధులతో శిక్షణా కేంద్రాలను నిర్మించనున్నారు. ఒక్కో దానికి రూ.64 లక్షలు వ్యయం చేయనున్నారు. 51 గోపాల మిత్ర సెంటర్లను నిర్మించనున్నారు. ఒక్కో దానికి రూ.7.50 లక్షలు వ్యయం చేయనున్నారు. * యు.కొత్తపల్లి, సీతారామాపురం, పెంచికలపాడు, మాలపల్లి, వెలమకూరు, గాజులపల్లి,పి.చింతకుంట, పశువైద్య శాలలకు కాంపౌండు వాల్ నిర్మాణాలకు రూ.18 లక్షల ప్రకారం మంజూరయ్యాయి. పారుమంచాల, ప్యాలకుర్తి, కందుకూరు, కరివేన, వేంపెంట, కొరటమద్ది, జి.సింగవరం, కలుగొట్ల పశువైద్యశాలలకు డాక్టర్ పోస్టులు రెండేళ్ల క్రితం మంజూరయ్యాయి. ఇందులో ఆసుపత్రుల్లో అదనపు గది నిర్మాణం, ఎక్విప్మెంట్కు రూ.6.60 లక్షలు మంజూరయ్యాయి. పంచాయతీరాజ్ ద్వారా ఈ అభివృద్ధి పనులు చేపడుతారు. జిల్లాకు పశువ్యాధి నిర్ధారణ కేంద్రాలు, శిక్షణా కేంద్రాలు మంజూరయ్యాయని, వీటి నిర్మాణానికి నాబార్డు నిధులు మంజూరు చేసిందని జేడీ వేణుగోపాల్ రెడ్డి తెలిపారు. త్వరలోనే వీటికి కొత్త పోస్టులు మంజూరవుతాయని వివరించారు.