పరిగి, న్యూస్‌లైన్: పండుగపూట దారుణం చోటుచేసుకుంది. గుర్తుతెలియని ఓ మహిళను దుండగులు దారుణంగా హత్య చేశారు. ఆమెపై అత్యాచారం చేసి చంపేసి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ సంఘటన పరిగి సమీపంలోని తుంకలగడ్డ వాగులో సోమవారం వెలుగుచూసింది. పోలీసుల కథనం ప్రకారం.. సోమవారం ఉదయం బహిర్భూమికి వెళ్లిన కొందరు పట్టణవాసులకు ఓ మహిళ మృతదేహం తుంకులగడ్డ వాగులో కనిపించింది. అర్ధనగ్నంగా ఉంది. సమాచారం అందుకున్న పరిగి సీఐ వేణుగోపాల్‌రెడ్డి, చేవెళ్ల డీఎస్పీ శ్రీధర్, ఎస్‌ఐ లకా్ష్మరెడ్డి సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. హతురాలి మెడకు చిన్న టవల్ బిగించి ఉంది. తలపై గాయాలు ఉన్నాయి.
అర్ధనగ్నంగా పడిఉన్న ఆనవాళ్లను బట్టి ఆమెపై దుండగులు అత్యాచారం జరిపి హత్య చేసి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. పోలీసు జాగిలం పరిగి పట్టణంలోకి వచ్చి కాసేపు తెలుగుతల్లి విగ్రహం చౌరస్తాలో ఆగింది. అక్కడి నుంచి అంబేద్కర్ చౌరస్తాకు వెళ్లింది. దీనిని బట్టి.. దుండగులు మహిళను హత్య చే సిన తర్వాత పరిగి వరకు నడుచుకుంటూ వచ్చి అంబేద్కర్ చౌరస్తా నుంచి ఏదైనా వాహనంలో ఎక్కి వెళ్లి పోయి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. హతురాలు ఆకపచ్చరంగు జాకెట్టు, పసుపురంగు చీర ధరించి ఉంది. ఆమెకు 40-45 ఏళ్లు ఉండొచ్చని భావిస్తున్నారు. ఈమేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పరిగి పోలీసులు తెలిపారు.
పండుగపూట దారుణం
Published Tue, Jan 14 2014 2:24 AM | Last Updated on Sat, Aug 25 2018 4:51 PM
Advertisement
Advertisement