ఏసీబీ వలలో ఏఈఈ | Panchayat raj AEE in ACB trap | Sakshi
Sakshi News home page

ఏసీబీ వలలో ఏఈఈ

Published Sat, Jan 4 2014 12:01 AM | Last Updated on Fri, Aug 17 2018 12:56 PM

Panchayat raj AEE in ACB trap

 గండేడ్, న్యూస్‌లైన్: ఓ కాంట్రాక్టర్ చేసిన పనికి ఎంబీ (మేజర్‌మెంట్ బుక్) ఇచ్చేందుకు డబ్బు లు తీసుకున్న పంచాయతీ రాజ్ ఏఈఈ (అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్)ను ఏసీబీ అధికారులు వలపన్ని పట్టుకున్నా రు. రూ.15వేలు లంచం తీసుకున్న గం డేడ్ పంచాయతీరాజ్ ఏఈఈ వేణుగోపాల్‌రెడ్డి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. ఏసీబీ డీఎస్పీ ప్రభాకర్ తెలిపిన వివరా ల ప్రకారం.. మహబూబ్‌నగర్ జిల్లా కోస్గి మండలం బలభద్రాయపల్లి గ్రా మానికి చెందిన వేణుగోపాల్‌రెడ్డి మహబూబ్‌నగర్‌లో నివాసముంటూ కుల్కచర్ల మండల పీఆర్ ఏఈఈగా విధులు నిర్వహిస్తున్నారు. గండేడ్ మం డలంలో ఏఈగా పనిచేసిన ప్రభాకర్ పదవీ విరమణ పొందడంతో ఆయన గండేడ్ ఇన్‌చార్జి బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
 
 10 పర్సెంట్ ఇవ్వాల్సిందే..
 గండేడ్ మండలం రంగారెడ్డిపల్లి అనుబంధ గ్రామం కప్లాపూర్ గ్రామానికి చెందిన కాంట్రాక్టర్ బాలవర్ధన్‌రెడ్డి గతేడాది నవంబర్‌లో జిల్లా పరిషత్ నిధుల నుంచి రూ. 1.5 లక్షలతో కప్లాపూర్- గోవింద్‌పల్లి తండా ఫార్మేషన్ రోడ్డు నిర్మాణానికి కాంట్రాక్టు దక్కించుకున్నారు. ఆయన సకాలంలో పని పూర్తి చేశారు. దీనికి సంబంధించి ఎంబీ రికార్డు చేసి ఇవ్వాలని ఏఈఈ వేణుగోపాల్‌రెడ్డిని కోరారు. ఇటీవల రోడ్డును పరిశీలించిన అధికారి తనకు కాంట్రాక్టు సొమ్ములో 10 శాతం లంచంగా ఇవ్వాలని డిమాండ్ చేశారు. తనకు కాంట్రాక్టులో ఏమీ మిగల్లేదు.. ఐదు శాతం తీసుకోవాలని కాంట్రాక్టర్ బాలవర్ధన్‌రెడ్డి ఏఈఈని కోరారు. ఎంతకూ అధికారి ససేమిరా అన్నారు. దీంతో కాం ట్రాక్టర్ మూడు రోజుల క్రితం ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. అధికారు ల పథకం ప్రకారం వారి నుంచి రూ.15 వేలు తీసుకున్నారు. ఏఈఈకి ఫోన్ చేసి శుక్రవారం గండేడ్ వస్తే మీరు అడిగిన ప్రకారమే రూ.15 వేలు ఇస్తానని.. ఎంబీ ఇవ్వాలని కోరారు.
 
 శుక్రవారం మధ్యాహ్నం మహబూబ్‌నగర్ నుంచి కారులో ఏఈఈ వేణుగోపాల్‌రెడ్డి వచ్చారు. కాంట్రాక్టర్ నుంచి రూ.15 వెయ్యి నోట్లు తీసుకుని కారులో కుల్కచర్ల వైపు వెళ్తుండగా ఏసీబీ అధికారులు వెంబడించి మండల కేంద్రంలోనే పట్టుకున్నారు. సమీపంలోని విశ్వభారతి కళాశాలలోకి ఏఈఈని తీసుకువెళ్లి తనిఖీలు చేశారు. పూర్తి ఆధారాలతో ఏఈఈ నుంచి తామిచ్చిన డబ్బును స్వాధీనం చేసుకున్నారు. అధికారులు ఆయనను సుమారు మూడు గంటల పాటు విచారణ జరిపారు. మహబూబ్‌నగర్‌లో ఇల్లు, హైదరాబాద్‌లో ఓ ఫ్లాట్, ఇతర ఆస్తులు ఉన్నట్లు ఏఈఈ అంగీకరించారని ఏసీబీ అధికారులు తెలిపారు. అనంతరం ఏఈఈని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు. వేలిముద్రలను నిర్ధారణ చేశాక ఏఈఈ ఆస్తులపై రైడింగ్ చేస్తామని ఏసీబీ అధికారులు తెలిపారు. ఏసీబీ దాడిలో రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల ఏసీబీ సీఐలు సి. రాజు, ఎన్. తిరుపతిరాజు, సిబ్బంది ఉన్నారు.
 
 చాలా వేధించాడు..
 నేను కొన్నేళ్లుగా కాంట్రాక్టర్‌గా కొనసాగుతున్నాను. పీఆర్ ఏఈఈ వేణుగోపాల్‌రెడ్డి పర్సెంటేజీల పేరుతో నన్ను బాగా ఇబ్బందికి గురిచేశాడు. దీంతో నేను చాలా కాంట్రాక్టులు వదులుకున్నాను. ఆయన డిమాండ్ చేసిన మేర డబ్బులు ఇవ్వకుంటే నెలల తరబడి బిల్లు నిలిపేసేవాడు. దీంతో చాలా మంది కాంట్రాక్టర్లు పనులు చేయడం లేదు. ఆయన వేధింపులు తట్టుకోలేకే నేను ఏసీబీని ఆశ్రయించాను.
 - బాలవర్ధన్‌రెడ్డి, కాంట్రాక్టర్  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement