Former Deccan Chronicle Chairman Venkatarami Reddy Arrested By ED, Details Inside - Sakshi
Sakshi News home page

డెక్కన్‌ క్రానికల్‌ వెంకట్రామ్‌రెడ్డి అరెస్ట్‌

Published Wed, Jun 14 2023 9:25 AM | Last Updated on Wed, Jun 14 2023 10:53 AM

Former DC Chairman Venkatarami Reddy arrested By ED - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: డెక్కన్‌ క్రానికల్‌ మాజీ చైర్మన్‌ వెంకట్రామ్‌రెడ్డిని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) అరెస్ట్‌ చేసింది. కెనరా బ్యాంక్‌, ఐడీబీఏ బ్యాంక్‌లను మోసం చేసిన కేసులో ఈడీ అదుపులోకి తీసుకుంది. వెంకట్రామ్‌రెడ్డితో సహా మరో ఇద్దరిని అరెస్ట్‌ చేసింది. వీరిని నేడు కోర్టులో హాజరుపచిన అనంతరం రిమాండ్‌కు పంపనున్నారు. కాగా  రూ. 8 వేల కోట్ల బ్యాంక్‌ ఫ్రాడ్‌ కేసులో వెంకట్రామ్‌రెడ్డిపై ఈడీ అభియోగాలు మోపింది.

పెద్ద మొత్తంలో రుణాలు మళ్లించారనే ఆరోపణలు ఉన్నాయి. రుణాలు ఎగవేసిన ఆరోపణలపై గతంలో సీబీఐ కేసు నమోదు చేసింది. తీసుకున్న రుణాలను వ్యక్తిగత ప్రయోజనాల కోసం వినియోగించుకున్నారని ఆరోపించింది. సీబీఐ కేసు ఆధారంగా వెంకట్రామ్‌రెడ్డిపై ఈడీ కేసు ఫైల్‌ చేసి దర్యాప్తు జరుపుతోంది. గతంలో వెంకట్రామ్‌రెడ్డికి చెందిన రూ,3,300 కోట్లకు పైగా ఆస్తులను ఈడీ అటాచ్‌ చేసింది. ఆయన పలు బ్యాంకుల్లో 8,800 కోట్ల రుణాలు తీసుకోగా.. వాటిని తిరిగి కట్టకుండా ఎగవేయడంతో ఈడీ దాడులు చేసింది. 
చదవండి: బీఆర్‌ఎస్‌ ఎంపీ, ఎమ్మెల్యేల నివాసాల్లో ఐటీ సోదాలు.. 70 బృందాలతో


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement