ఎన్నికల కమిషనా.. ఎన్‌డీఏ కమిషనా? | After TDP and Jana Sena alliance with BJP attitude of EC has changed | Sakshi
Sakshi News home page

ఎన్నికల కమిషనా.. ఎన్‌డీఏ కమిషనా?

Published Tue, May 7 2024 4:53 AM | Last Updated on Tue, May 7 2024 4:54 AM

After TDP and Jana Sena alliance with BJP attitude of EC has changed

చంద్రబాబు చెప్పినట్టల్లా ఆడితే ఇక ప్రజాస్వామ్యమెక్కడ?.. ఇళ్ల వద్ద పింఛన్లు అడ్డుకుని వృద్ధుల క్షోభకు కారణమయ్యారు

ఇపుడు విద్యాదీవెన, ఇన్‌పుట్‌ సబ్సిడీ విడుదలకూ అడ్డంకులు.. ఆఖరికి సబ్సిడీపై విత్తనాలు సరఫరా చేయటానికీ బ్రేకులే

ఎన్నికలయ్యేవరకూ ఇవ్వరాదని కేంద్ర ఎన్నికల సంఘం ఆంక్షలు.. పథకమూ పాతదే.. లబ్ధిదారులూ పాతవారే.. అయినా ఏంటిది?

ఐదేళ్ల నుంచీ కొనసాగుతున్న పథకాలకు కోడ్‌ వర్తించదని తెలీదా?.. ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు రూ.610 కోట్ల మేర ఆగిన విద్యా దీవెన నిధులు

6,95,897 మంది రైతులకు నిలిచిపోయిన రూ.847.22 కోట్ల ఇన్‌పుట్‌ సబ్సిడీ

ఆసరా, చేయూత, ఈబీసీ నేస్తం నిధులపైనా మౌనమే..

అనుమతి కోసం అడిగినా నోరెత్తని ఎన్నికల కమిషన్‌.. 

రైతులు, విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్న బాబు

అధికారం కోసం ఎంతకైనా దిగజారొచ్చుననే రీతిలో ‘రాజకీయం

2019లో బాబు సీఎంగా ఉండగా పసుపుకుంకుమకు అనుమతి 

అది కొత్త పథకం; పైగా ఎన్నికలకు 3 రోజుల ముందు ఖాతాల్లో జమ

వచ్చే 2 రోజులూ తెలంగాణలో రైతుల ఖాతాల్లోకి ‘రైతు భరోసా’ నిధులు.. తెలంగాణలో పంట నష్టపోయిన 

రైతుల ఇన్‌పుట్‌ సబ్సిడీకీ ఓకే

జగన్‌ టార్గెట్‌గా... ఏపీలో మాత్రం పూర్తి భిన్నంగా ఈసీ నిర్ణయాలు

ఇక్కడ బీజేపీతో టీడీపీ, జనసేన పొత్తు తరువాత ఈసీ వైఖరిలో మార్పు  

సాక్షి, అమరావతి: ఐదేళ్లుగా కొనసాగుతున్న పథకాలను ఎన్నికల కోడ్‌ ఉందన్న కారణంతో ఆపేస్తే ఆ లబ్ధిదారుల పరిస్థితేంటి? కొనసాగుతున్న పథకాలను ఆపాల్సిన పనిలేదని ఎన్నికల నిబంధనల్లో స్పష్టంగా ఉన్నా కూడా... ఎన్నికల కమిషన్‌ ఎందుకిలా చేస్తోంది? ఎన్‌డీఏ కూటమితో చంద్రబాబు నాయుడు జతకట్టినంత మాత్రాన ఎన్నికల కమిషన్‌ ఈ రాష్ట్రాన్ని ‘టార్గెట్‌’ చేయాల్సిన అవసరం లేదు కదా? ఏ రాష్ట్రానికీ వర్తించని నిబంధన ఇక్కడే ఎందుకట? పంట నష్టపోయిన రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ ఇవ్వటమనేది వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ క్రమం తప్పకుండా చేస్తున్నారు. 

ఇప్పటిదాకా ఎలాంటి ఇబ్బందీ లేదు కూడా. కానీ ఎన్నికల కోడ్‌ సాకుగా చూపించి ఇపుడు ఏకంగా 6,95,857 మంది రైతుల ఖాతాల్లోకి డబ్బులు వెళ్లకుండా నిలిపేయటం దుర్మార్గం కాదా? పంట వేసుకునే సమయంలో రైతుకు అవసరమనే కదా ప్రభుత్వం రూ.847.22 కోట్ల ఇన్‌పుట్‌ సబ్సిడీని విడుదల చేసింది!!. మరి ఆ సబ్సిడీని నిలిపేస్తే రైతులు ఇబ్బందులు పడరా? రైతుల ఇబ్బందులు ఈ ఎన్‌డీఏ కూటమికి గానీ..ఎన్నికల కమిషన్‌కు గానీ పట్టవా? ఎవరేమైపోయినా మాకు రాజకీయాలే ముఖ్యమనుకుంటే ఎలా చంద్రబాబూ? 

విత్తన సబ్సిడీ అందకపోతే ఎలా? 
నిజానికి రబీ కోతలు పూర్తి కావడంతో ఖరీఫ్‌ సాగుకు సన్నద్ధమవుతున్న అన్నదాతలు విత్తనాల కోసం ఎదురుచూస్తున్నారు. అలాంటి విత్తన సబ్సిడీపై ఎన్నికల కమిషన్‌ ఆంక్షలు విధించటం వారికి మింగుడుపడటం లేదు. నిజానికి గతంలో మాదిరే సీజన్‌కు ముందే సబ్సిడీపై పంపిణీ కోసం 6.19 లక్షల క్వింటాళ్ల విత్తనాన్ని సిద్ధం చేసి...  కోడ్‌ నేపథ్యంలో పంపిణీకి అనుమతినివ్వాల్సిందిగా ఈసీకి అధికారులు లేఖ రాశారు. ఐదేళ్లుగా ఏ విత్తనాలు ఏయే తేదీల్లో పంపిణీ చేసారో ఆ లేఖలో స్పష్టంగా పేర్కొన్నారు. ఏటా కోతలు పూర్తయిన వెంటనే పచ్చిరొట్ట విత్తనాలను సబ్సిడీపై పంపిణీ చేస్తున్నామని, అదును దాటి పోయాక పంపిణీ చేస్తే రైతులు తీవ్రంగా నష్టపోతారని అధికారులు లేఖలో పేర్కొన్నా... ఈసీ తిరస్కరించింది. 

రబీ కరువు పంట నష్టం అంచనాలకూ బ్రేకు 
వర్షాభావ పరిస్థితుల కారణంగా రబీ సీజన్‌లో 84 మండలాలను కరువు మండలాలను ప్రకటిస్తూ మార్చి రెండోవారంలో ప్రభుత్వం గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది. తాజాగా ఎన్నికల కోడ్‌ అమల్లోకి రావడంతో పంట నష్టం అంచనా వేసేందుకు అనుమతివ్వాలని కోరుతూ ఈసీకి అధికారులు లేఖ రాశారు. ఇన్నాళ్లూ మిన్నకున్న ఈసీ... నష్టం అంచనాపై ఆంక్షలు విధించింది. అనుమతి ఇవ్వలేమని తేచ్చిచెప్పేసింది. దీంతో రబీ కరువు సాయం  అందుతుందో లేదో అనే ఆందోళన రైతుల్లో వ్యక్తమవుతోంది. 

‘విద్యా దీవెన’ నిధులపైనా విషమే! 
పేద విద్యార్ధులకు చెల్లించే ‘విద్యా దీవెన’ నిధులనూ చంద్రబాబు కూటమి నిలుపు చేయించింది. ఈసీకి పదేపదే ఫిర్యాదులు చేయటంతో... ఎన్‌డీఏ భాగస్వామి కనక బాబుకు అనుకూలంగానే ఈసీ నిర్ణయం తీసుకుంది. ఈ నిధుల చెల్లింపునూ నిలిపేసింది. నిజానికి విద్యార్థులు ఇప్పుడు కాలేజీలు మారాల్సి ఉంటుంది. విద్యా దీవెన నిధులు చెల్లిస్తే గానీ కాలేజీలు వారికి సర్టిఫికెట్లు ఇవ్వలేమని చెబుతున్నాయి.

ప్రభుత్వం ఇప్పటికే రూ.610.79 కోట్లు విడుదల చేసినా... కూటమి కుట్ర కారణంగా పేద విద్యార్దులు బయట అప్పులు చేసి కాలేజీలకు చెల్లింపులు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. లేదంటే వారి భవిష్యత్తు ప్రమాదంలో పడుతుంది. ఇన్ని దారుణాలు జరుగుతున్నా... చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ నీరో చక్రవర్తుల మాదిరి తమాషా చూస్తున్నారు తప్ప రైతుల గురించి గానీ, విద్యార్థుల గురించి గానీ ఆలోచిస్తే ఒట్టు. ఇప్పుడు రైతులు, విద్యార్థులు అప్పుల పాలైతే నీ కళ్లు చల్లబడతాయా చంద్రబాబూ? 

ఈసీపై ఒత్తిళ్లు... ఎన్‌డీఏ భాగస్వామి కనక ఓకే 
నిజానికి ఇన్‌పుట్‌ సబ్సిడీ, విద్యా దీవెన చెల్లింపులు గత ఐదేళ్ల నుంచీ అమలవుతున్నాయి. ఇవేమీ కొత్తవి కావు. లబ్దిదారుల ఎంపిక కూడా ఎప్పుడో చేశారు. ఎన్నికల షెడ్యూల్‌ వచ్చాక చేసిందేమీ లేదు. కొనసాగుతున్న పథకాలకు ఎన్నికల కోడ్‌ వర్తించదని నియమావళిలో స్పష్టంగా ఉంది. కాబట్టి వీటికి కేంద్ర ఎన్నికల సంఘం సహజంగానే అనుమతివ్వాలి. మరో చిత్రమేంటంటే మిగతా రాష్ట్రాల్లో ఇలా ఏ పథకాన్నీ అడ్డుకోవటం లేదు కూడా. 

ఉదాహరణకు తెలంగాణలో పంటలు దెబ్బతిన్న రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ ఇచ్చేందుకు గత నెల 23వ తేదీన కేంద్ర ఎన్నికల సంఘం అనుమతించింది. దీంతో తెలంగాణ ప్రభుత్వం ఈ నెల 4న ఇన్‌పుట్‌ సబ్సిడీని విడుదల చేస్తూ జీవో ఇచ్చింది. అంతేకాదు. రైతు బంధు నిధులను విడుదల చేస్తూ సోమవారమే జీవో ఇచ్చింది. మంగళ, బుధ వారాల్లో ఇవి రైతుల ఖాతాల్లోకి పడతాయని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి స్వయంగా చెప్పారు కూడా. 

నిజానికి 2019 ఎన్నికల్లో చూసుకున్నా... అప్పుడు అధికారంలో ఉన్న చంద్రబాబు నాయుడు ఎన్నికలకు కేవలం మూడు రోజుల ముందు ‘పసుపు కుంకుమ’ పేరిట మూడో విడత నిధులను మహిళల ఖాతాల్లో వేశారు. అప్పుడు చంద్రబాబు ప్రభుత్వానికి గానీ, ఇప్పుడు రేవంత్‌రెడ్డి ప్రభుత్వానికి గానీ లేని నిబంధన ఒక్క వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ప్రభుత్వానికే ఎందుకు వర్తింపజేస్తున్నారు? దీన్నిబట్టి చంద్రబాబు తనకు అలవాటైన కుట్రను ఎంత లోతుగా కొనసాగిస్తున్నారో... ఈసీపై తన ‘బీజేపీ మిత్రుల’ ద్వారా ఎంత ఒత్తిడి చేయిస్తున్నారో ఈజీగానే అర్థం చేసుకోవచ్చు.  

పింఛన్లపైనా ఇలాంటి దారుణాలే... 
కేంద్ర ఎన్నికల కమిషన్‌పై అటు చంద్రబాబు, బీజేపీలోని ఆయన మిత్రులు, ఎల్లో మీడియా, నిమ్మగడ్డ రమేశ్‌... ఇలా పచ్చ మంద మొత్తం కలిసి దారుణంగా ఒత్తిడి తెచ్చి సామాజిక పింఛన్లు తీసుకునే అవ్వా తాతలను, దివ్యాంగులను రాచిరంపాన పెట్టారు. వృద్ధులు, వికలాంగులు, వితంతవుల ఇంటికి పింఛను రాకుండా అడ్డుకుని... వాల్లను మండుటెండల్లో సచివాలయాల చుట్టూ, బ్యాంకులు చుట్టూ తిప్పుతూ కొంత మంది వృద్దులు మరణానికి కూడా కారణమయ్యిందీ ముఠా. 

మొదటి నెల సచివాలయాల ద్వారా ప్రభుత్వం పంపిణీ చేయగా.. ప్రతి ఊరికీ సచివాలయం ఉండటంతో వృద్ధులు కొంత ఊపిరి పీల్చుకున్నారు. కానీ అది కూడా నచ్చని పచ్చ ముఠా... నిధుల్ని నేరుగా వారి ఖాతాల్లో వెయ్యాలని ఈసీపై ఒత్తిడి తెచ్చాయి. ఈసీ అలాగే చేయటంతో... బ్యాంకులకు వెళ్లలేక, ఏటీఎంల వద్ద ఎండల్లో నిల్చోలేక వృద్ధులు నరకయాతన అనుభవించారు. చంద్రబాబును ప్రతి ఒక్కరూ నోరారా తిట్టుకున్నారు. జనం ఆగ్రహం తమ మీదకు మళ్లుతోందని భయపడ్డ బాబు... అదంతా వైఎస్‌ జగన్‌ వల్లే అయిందంటూ తన రామోజీరావు చేత దుర్మార్గపు కథనాలు రాయించాడు. ఈ కుట్రలన్నిటికీ ప్రజలే జబాబు చెబుతారు బాబూ!!.   

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement