అంబులెన్సు రోడ్డు ప్రమాదానికి గురై అందులోని రోగి మృతి చెందాడు.
ఆస్పత్రి నుంచి రోగి, అతని కుటుంబసభ్యులతో వెళ్తున్న అంబులెన్సు రోడ్డు ప్రమాదానికి గురై అందులోని రోగి మృతి చెందాడు. మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. మహబూబ్‌నగర్ జిల్లా మానవపాడు వద్ద మంగళవారం ఉదయం ఆరు గంటల సమయంలో చోటుచేసుకుంది. కర్నూలు జిల్లా ప్యాపిలికి చెందిన జి.సాయిప్రసాద్(69) అనారోగ్యంతో హైదరాబాద్ యశోద ఆస్పత్రిలో చికిత్స పొందారు. తిరిగి మంగళవారం వేకువజామున భార్య, కుమారుడితో కలసి అంబులెన్సులో స్వగ్రామానికి బయలుదేరారు. వారి వాహనాన్ని మానవపాడు వద్ద ఎదురుగా వస్తున్న కారు ఢీకొట్టింది. దీంతో తీవ్రంగా గాయపడిన సాయిప్రసాద్ చనిపోయారు. ఆయనతోపాటు ఉన్న భార్య పుష్పవతమ్మ(60)కు తీవ్రగాయాలయ్యాయి. కుమారుడు సత్యనారాయణ, డ్రైవర్‌కు స్వల్పగాయాలయ్యాయి.క్షతగాత్రులను వెంటనే మానవపాడు ఆస్పత్రికి తరలించారు.