నివేదికను ఎందుకు బయటపెట్టలేదు? | Mydukur MLA Raghurami Reddy Satirical Comments On TDP | Sakshi
Sakshi News home page

గ్రాఫిక్స్‌ చూపించి మభ్యపెట్టారు: రఘురామిరెడ్డి

Published Tue, Dec 31 2019 2:33 PM | Last Updated on Tue, Dec 31 2019 2:55 PM

Mydukur MLA Raghurami Reddy Satirical Comments On TDP - Sakshi

సాక్షి, అమరావతి: ఎవరైతే హేళన చేశారో వాళ్ల నోళ్లు మూయించేలా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాలన సాగుతోందని మైదుకూరు ఎమ్మెల్యే రఘురామిరెడ్డి అన్నారు. సీఎం జగన్‌ గెలిచాక ప్రకృతి కూడా సహకరిస్తుందన్నారు. రాష్ట్రంలో వాగులు, వంకలు, ప్రాజెక్టులు అన్నీ జలకళను సంతరించుకున్నాయన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ హయాంలో రాయలసీమ ప్రాజెక్టులను నిర్వీర్యం చేశారని మండిపడ్డారు. గత ఐదేళ్లలో చంద్రబాబు ప్రజలకు గ్రాఫిక్స్‌ చూపించి మభ్యపెట్టారని వ్యాఖ్యానించారు. శివరామకృష్ణన్‌ ఇచ్చిన నివేదికను టీడీపీ ఎందుకు బయట పెట్టలేదని, వాళ్ల సూచనలను ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించారు.

చంద్రబాబు పాలన మొత్తం నామమాత్ర బిల్డింగుల నిర్మాణానికే సరిపోయిందని రఘురామిరెడ్డి విమర్శించారు. ఆయన పాలనలో చేపట్టిన నిర్మాణాల్లో ఒక్కటీ శాశ్వత నిర్మాణం లేదని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అమరావతిలోని అసెంబ్లీ, సచివాలయం అసౌకర్యాల మధ్య ఉన్నాయన్నారు. అన్ని సౌకర్యాలతోపాటు అభివృద్ధి చెందిన విశాఖను పరిపాలన రాజధానిగా ప్రకటించడంపై ప్రజలు హర్షిస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో త్వరలో జరగనున్న పంచాయతీ, మున్సిపల్‌ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీకి ప్రజలు పట్టం కడతారని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement