దువ్వూరు హైవేలో రాస్తారోకో చేస్తున్న ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు
వైఎస్‌ఆర్ జిల్లా, దువ్వూరు/చాపాడు: ప్రజల తిరస్కారానికి గురైన చంద్రబాబుకు ఇంకా బుద్ధి రాలేదని మైదుకూరు ఎమ్మెల్యే శెట్టిపల్లె రఘురామిరెడ్డి విమర్శించారు. అమరావతిలో మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై టీడీపీ కార్యకర్తల దాడి, హత్యాయత్నాన్ని నిరసిస్తూ దువ్వూరు హైవే కూడలిలోని వైఎస్ విగ్రహం వద్ద ఎమ్మెల్యే ఆధ్వర్యంలో వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ చంద్రబాబు పద్దతి మార్చుకోవాలని, రాజకీయంగా ఎదుర్కొలేక వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలపై దాడులు చేయిస్తున్నారన్నారు. అమరావతిలో ఎమ్మెల్యేలకే రక్షణ లేదని అలాంటి చోట అసెంబ్లీ ఎలా పెట్టాలని అన్నారు. అసెంబ్లీని విశాఖలోనే ఏర్పాటు చేయాలని శాసనసభ్యులందరికీ చెబుతామన్నారు. అక్కడ ఏ అభివృద్ది చేయలేదని కేవలం రాజకీయ బినామీలకు 4 వేల ఎకరాల్లో స్థలాలను కట్టబెట్టి కోట్ల రూపాయలు ఆర్జించాలని చూశారని, అందుకే టీడీపీ నేతలు ప్రజల తిరస్కారానికి గురయ్యారన్నారు.
పాదయాత్ర సందర్భంగా విశాఖ ఎయిర్‌పోర్టుకు వచ్చిన వైఎస్‌జగన్‌పై కత్తితో దాడి చేసి చంపాలని చూసింది కూడా చంద్రబాబే అన్నారు. ఎందుకంటే జగన్ సీఎం అవుతాడని బాబు ముందే తెలుసునని అందుకే అలాంటి కుట్ర పన్నాడన్నారు. అమరావతి అన్ని విధాల అభివృద్ది చేస్తామని చెబుతున్నా అక్కడ మాత్రమే అభివృద్ది చేయాలని, మిగిలిన జిల్లాల్లో అభివృద్ది వద్దన్న విధంగా చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్‌లు ఆందోళన పేరుతో ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తున్నారన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నాయకులు దువ్వూరు కానాల జయంద్రారెడ్డి, గుర్రాల మునిరెడ్డి, నడిపి ఓబయ్య, అంకిరెడ్డి, రామసుబ్బారెడ్డి, వీవీ స్వామి, ఓబుళ్‌రెడ్డి, శ్రీనివాసులరెడ్డి, రాజశేఖరరెడ్డి, వెంకటసుబ్బారెడ్డి, సుదర్శన్‌రెడ్డి, వీరారెడ్డి, కిరన్‌రెడ్డి, గౌస్, అమీ ర్, నాయభ్, మైదుకూరుకు చెందిన జ్వాలా నరసింహాశర్మ, మాచనూరు చంద్ర, కటారి వీరన్న, చాపాడు మండలం మాజీ జెడ్పీటీసీ బాలనరసింహారెడ్డి, లక్షుమయ్య, నరసింహారెడ్డి, జయరామిరెడ్డి, వెంకటసుబ్బారెడ్డి, జైనుల్లా, గంగులయ్య, ఖాజీపేటకు చెందిన గంగాధర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment