సీమలో తాగునీటి సమస్య తీరనుంది: ఎంపీ అవినాష్‌ | MP Avinash Said Water Problem Will Sloved In Rayalaseema | Sakshi
Sakshi News home page

రాయలసీమలో తాగునీటి సమస్య తీరనుంది: ఎంపీ అవినాష్‌

Published Mon, Dec 23 2019 2:48 PM | Last Updated on Mon, Dec 23 2019 3:19 PM

MP Avinash Said Water Problem Will Sloved In Rayalaseema - Sakshi

సాక్షి, వైఎస్సార్‌ కడప : కేసీ, తెలుగుగంగ ఆయకట్ట స్థిరీకరణ చారిత్రాత్మకమని కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌ రెడ్డి పేర్కొన్నారు. కడప జిల్లాలో సోమవారం కుందు నదిపై మూడు రిజర్వాయర్ల నిర్మాణానికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. అలాగే మైదుకురు నియోజకవర్గంలో మౌలిక సదుపాయల కల్పన, జొలదరాసి వద్ద 0.8 టీఎంసీల సామర్థ్యంలో రిజర్వయర్‌, రాజోలి ఆనకట్టకు ఎగువన 2.95 టీఎంసీల సామర్థ్యంతో రిజర్వాయర్‌, జొన్నవరం వద్ద ఆనకట్ట నిర్మాణం చేపట్టారు. 

కరువు ప్రాంతాలపై సీఎం వైఎస్‌ జగన్‌ ప్రత్యేక దృష్టి సారిస్తున్నారని, రాయలసీమను సస్యశ్యామలం చేసేందుకు ముఖ్యమంత్రి చిత్తశుద్ధితో పనిచేస్తున్నారని ఎంపీ అవినాష్‌ తెలిపారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి కన్న కలలను వైఎస్‌ జగన్‌ సాకారం చేస్తున్నారని,  రాయలసీమ ప్రాజెక్టులపై చంద్రబాబు నిర్లక్ష్యంగా వ్యవహరించారని, అనేక ఉద్యమాలు చేసినా టీడీపీ ప్రభుత్వం పట్టించుకోలేదని విమర్శించారు. రాజోలి, జలదరాసి, కందు ప్రాజెక్టులు చరిత్రలో నిలిచిపోతాయని, రాయలసీమలో తాగునీటి సమస్యలు తీరనున్నాయని ఆయన అన్నారు. 

చదవండి : రాయలసీమ రుణం తీర్చుకునే అవకాశం: సీఎం జగన్‌

సీఎం జగన్‌కు జీవితాంతం రుణపడి ఉంటా
ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌కు జీవితాంతం రుణపడి ఉంటానని బనగానపల్లి ఎమ్మెల్యే రామిరెడ్డి పేర్కొన్నారు. తమ నియోజకవర్గంలో నెలకొన్న తాగు, సాగు నీటి కష్టాలను వైఎస్‌ జగన్‌ గుర్తించారని, జలదరాసి ప్రాజెక్టు వల్ల రైతులకు మేలు జరుగుతందని అన్నారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ రైతుల పక్షపాతి అని, 2400 కోట్లతో కుందూ నదిపై  మూడు రిజర్వాయర్ల నిర్మాణం హర్షనీయమని ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్‌రెడ్డి పేర్కొన్నారు. చంద్రబాబు పాలనలో అవినీతి రాజ్యమేలిందని, వైఎస్సార్‌ చేపట్టిన ప్రాజెక్టులను చంద్రబాబు నిర్లక్ష్యం చేశారని మైదుకురు ఎమ్మెల్యే రుఘురామిరెడ్డి దుయ్యబట్టారు. ఈ ప్రాజెక్టుల వల్ల మైదుకురు, బద్వేలు, ప్రొద్దుటూరులో తాగునీటి సమస్య తీరనుందని ఆయన స్పష్టం చేశారు.

మూడేళ్లలో నిర్మాణం పూర్తి చేస్తాం : సీఎం జగన్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement