kundu river
-
YSR జిల్లా పెద్దముడియం లో కుందూనది ఉదృతి
-
ప్రేమించి పెళ్లి చేసుకొని.. నదిలో తోశాడు
సాక్షి, కర్నూలు: ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. కొంతకాలం పాటు బాగానే చూసుకున్నాడు. తర్వాత మనస్పర్ధలు రావడంతో భార్యను కుందూ నదిలోకి తోసి కడతేర్చేందుకు యత్నించాడు. ఈ ఘటన సోమవారం కోవెలకుంట్ల మండలం గుళ్లదూర్తి సమీపంలో చోటుచేసుకుంది. కోవెలకుంట్ల ఎస్ఐ చంద్రశేఖర్‌రెడ్డి కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. ఆళ్లగడ్డ మండలం మర్రిపల్లెకు చెందిన లక్ష్మినరసయ్య, పుల్లమ్మ కుమారుడు పత్తి భాస్కర్ హైదరాబాదులోని ఇంటెలిజెన్స్ విభాగంలో హోంగార్డుగా విధులు నిర్వర్తిస్తున్నాడు. అదే నగరంలో రామలక్ష్మి అనే అనాథ యువతి బ్యూటీపార్లర్ నిర్వహిస్తోంది. వీరిద్దరూ ప్రేమించుకుని 2016వ సంవత్సరంలో వివాహం చేసుకున్నారు. వీరి సంసారం కొన్ని నెలల పాటు సజావుగా సాగింది. ఆ తర్వాత మనస్పర్ధలు వచ్చాయి. దీంతో భార్యను వదిలించుకోవాలని భాస్కర్ పథకం రచించాడు. ఇందులో భాగంగా ఈ నెల 16న భార్యను తీసుకుని స్వగ్రామం వచ్చాడు. సోమవారం ఉదయం కోవెలకుంట్ల మండలం గుళ్లదూర్తిలో ఉన్న బంధువుల ఇంటికి వెళదామంటూ ఆమెను తీసుకుని బైక్‌పై బయలుదేరాడు. గ్రామ సమీపంలోని కుందూనది వంతెనపైకి చేరుకున్న తర్వాత బైక్ ఆపాడు. సెల్ఫీ తీసుకుంటున్నట్లు నాటకమాడి భార్యను ఉధృతంగా ప్రవహిస్తున్న నదిలోకి తోసేశాడు. దీన్ని ప్రమాదంగా చిత్రీకరించేందుకు తను కూడా బైక్‌తో సహా నదిలోకి దూకాడు. అతనికి ఈత రావడంతో కొంతదూరం తర్వాత ఒడ్డుకు చేరుకున్నాడు. ఉధృతంగా ప్రవహిస్తున్న నదిలో రామలక్ష్మి కేకలు వేస్తూ సుమారు నాలుగు కిలోమీటర్ల దూరం కొట్టుకుపోయింది. (హైవేపై డ్రాగర్ చూపుతూ యువతి హల్చల్) గమనించిన రైతులు నదిలోకి దూకి ఆమెను రక్షించారు. తర్వాత చికిత్స నిమిత్తం ఉయ్యాలవాడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు పీహెచ్‌సీకి చేరుకుని వివరాలు ఆరా తీయగా కసాయి భర్త భాగోతం బయటపడింది. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు భాస్కర్‌పై హత్యాయత్నంతో పాటు 498ఏ, 201 రెడ్‌విత్ 34 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. -
ఎమ్మెల్యే స్పందన; ఇద్దరు యువకులు సేఫ్
సాక్షి, బొమ్మలసత్రం/కర్నూలు: కుందూనది వంతెనపై సరదాగా సెల్ఫీ దిగేందుకు వెళ్లిన ఇద్దరు స్నేహితులు ప్రాణాలమీదకు తెచ్చుకున్న ఘటన నంద్యాల పట్టణంలో శనివారం చోటుచేసుకుంది. రూరల్ సీఐ దివాకర్‌రెడ్డి తెలిపిన వివరాలు.. స్థానిక కల్పన సెంటర్లో నివాసముంటున్న ప్రవీణ్.. కర్నూలు పుల్లారెడ్డి కళాశాలలో ఇంజినీరింగ్ చదువుతున్నాడు. శని, ఆది వారాలు సెలవు దినాలు కావటంతో వెలుగోడు మండలం అబ్దుల్లాపురం గ్రామనికి చెందిన స్నేహితుడు విష్ణువర్ధన్ రెడ్డితో కలిసి ఆర్టీసీ బస్టాండ్ వెనుక ఉన్న కుందూనది వంతెన వద్దకు వెళ్లారు. సరదాగా సెల్ఫీ దిగేందుకు వంతెన చివరి భాగంలో నిలబడ్డారు. సెల్ఫీ దిగుతుండగా ప్రవీణ్ ప్రమాదవశాత్తూ నదిలో పడిపోయాడు. ప్రవీణ్‌ను కాపాడేందుకు విష్ణువర్ధన్ రెడ్డి దూకే క్రమంలో అదుపు తప్పి రాళ్లపై పడ్డాడు. అదే సమయంలో అటుగా వెళ్తున్న ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిశోర్‌రెడ్డి వాహనం నిలిపి తన అనుచరులతో యువకులను కాపాడారు. ప్రమాదంలో ఇద్దరు స్నేహితులు తీవ్రంగా గాయప డ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం 108 వాహనంలో స్థానిక ఆస్పత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన విష్ణువర్ధన్ రెడ్డిని వైద్యులు కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఇదిలా ఉండగా.. కళాశాలలో ఓ యువతి ప్రేమ పేరుతో ప్రవీణ్‌నను మోసం చేయడంతో తట్టుకోలేక కుందూలో దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడని.. అతన్ని కాపాడే క్రమంలో స్నేహితుడు విష్ణువర్ధన్ రెడ్డి గాయపడ్డాడని స్థానికులు చెబుతున్నారు. సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్న ఎమ్మెల్యే శిల్పా రవి -
సీమలో తాగునీటి సమస్య తీరనుంది: ఎంపీ అవినాష్
సాక్షి, వైఎస్సార్ కడప : కేసీ, తెలుగుగంగ ఆయకట్ట స్థిరీకరణ చారిత్రాత్మకమని కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి పేర్కొన్నారు. కడప జిల్లాలో సోమవారం కుందు నదిపై మూడు రిజర్వాయర్ల నిర్మాణానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శంకుస్థాపన చేశారు. అలాగే మైదుకురు నియోజకవర్గంలో మౌలిక సదుపాయల కల్పన, జొలదరాసి వద్ద 0.8 టీఎంసీల సామర్థ్యంలో రిజర్వయర్, రాజోలి ఆనకట్టకు ఎగువన 2.95 టీఎంసీల సామర్థ్యంతో రిజర్వాయర్, జొన్నవరం వద్ద ఆనకట్ట నిర్మాణం చేపట్టారు. కరువు ప్రాంతాలపై సీఎం వైఎస్ జగన్ ప్రత్యేక దృష్టి సారిస్తున్నారని, రాయలసీమను సస్యశ్యామలం చేసేందుకు ముఖ్యమంత్రి చిత్తశుద్ధితో పనిచేస్తున్నారని ఎంపీ అవినాష్ తెలిపారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి కన్న కలలను వైఎస్ జగన్ సాకారం చేస్తున్నారని, రాయలసీమ ప్రాజెక్టులపై చంద్రబాబు నిర్లక్ష్యంగా వ్యవహరించారని, అనేక ఉద్యమాలు చేసినా టీడీపీ ప్రభుత్వం పట్టించుకోలేదని విమర్శించారు. రాజోలి, జలదరాసి, కందు ప్రాజెక్టులు చరిత్రలో నిలిచిపోతాయని, రాయలసీమలో తాగునీటి సమస్యలు తీరనున్నాయని ఆయన అన్నారు. చదవండి : రాయలసీమ రుణం తీర్చుకునే అవకాశం: సీఎం జగన్ సీఎం జగన్‌కు జీవితాంతం రుణపడి ఉంటా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు జీవితాంతం రుణపడి ఉంటానని బనగానపల్లి ఎమ్మెల్యే రామిరెడ్డి పేర్కొన్నారు. తమ నియోజకవర్గంలో నెలకొన్న తాగు, సాగు నీటి కష్టాలను వైఎస్ జగన్ గుర్తించారని, జలదరాసి ప్రాజెక్టు వల్ల రైతులకు మేలు జరుగుతందని అన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రైతుల పక్షపాతి అని, 2400 కోట్లతో కుందూ నదిపై మూడు రిజర్వాయర్ల నిర్మాణం హర్షనీయమని ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్‌రెడ్డి పేర్కొన్నారు. చంద్రబాబు పాలనలో అవినీతి రాజ్యమేలిందని, వైఎస్సార్ చేపట్టిన ప్రాజెక్టులను చంద్రబాబు నిర్లక్ష్యం చేశారని మైదుకురు ఎమ్మెల్యే రుఘురామిరెడ్డి దుయ్యబట్టారు. ఈ ప్రాజెక్టుల వల్ల మైదుకురు, బద్వేలు, ప్రొద్దుటూరులో తాగునీటి సమస్య తీరనుందని ఆయన స్పష్టం చేశారు. మూడేళ్లలో నిర్మాణం పూర్తి చేస్తాం : సీఎం జగన్ -
కుందూపై మూడు జలాశయాలు
సాక్షి, అమరావతి: కుందూ నదిపై మూడు జలాశయాలను నిర్మించి కేసీ (కర్నూలు–కడప) కెనాల్, తెలుగుగంగ ఆయకట్టు స్థిరీకరణ పనులకు రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. కుందూ నదిపై కర్నూలు జిల్లా కోయిలకుంట్ల మండలం జోలదరాశి వద్ద 0.8 టీఎంసీల సామర్థ్యం కలిగిన రిజర్వాయర్‌ను రూ.312.3 కోట్లతో నిరి్మంచనున్నారు. చాగలమర్రి మండలం రాజోలి ఆనకట్టకు ఎగువన 2.95 టీఎంసీల సామర్థ్యం కలిగిన మరో రిజర్వాయర్‌ను రూ.1357.10 కోట్లతో నిరి్మంచనున్నారు. వీటికి పరిపాలన అనుమతులు మంజూరు చేస్తూ జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌దాస్ ఉత్తర్వులు జారీ చేశారు.ఈ జలాశయాల ద్వారా కేసీ కెనాల్ ఆయకట్టును స్థిరీకరించనున్నారు. మరోవైపు కుందూనది నుంచి ఎనిమిది టీఎంసీలను తెలుగుగంగ ప్రాజెక్టులో అంతర్భాగమైన అనుబంధ జలాశయం(ఎస్సార్)–1 జలవిస్తరణ ప్రాంతం వద్దకు ఎత్తిపోసి ఆయకట్టు స్థిరీకరించే పనులకు కూడా రూ.564.60 కోట్లతో పరిపాలనా అనుమతి మంజూరైంది. కేసీ కెనాల్ ఆయకట్టుకు మంచి రోజులు.. ►తుంగభద్ర–పెన్నా నదులపై కర్నూలు జిల్లా సుంకేశుల వద్ద డచ్ సంస్థ 1873లో ఆనకట్ట నిర్మించింది. అక్కడి నుంచి పెన్నా వరకు కాలువ తవ్వకం పనులను 1880 నాటికి పూర్తి చేసింది. బ్రిటిష్ ప్రభుత్వం అదే ఏడాది దీన్ని రూ.3.02 కోట్లకు కొనుగోలు చేసింది. 1933 నుంచి ఈ కాలువ సాగునీటి ప్రాజెక్టుగా మారింది. 140 ఏళ్ల చరిత్ర కలిగిన కేసీ కెనాల్ ఆయకట్టు కింద 2,65,628 ఎకరాల ఆయకట్టు ఉంది. కర్నూలు జిల్లాలో 1,73,627 ఎకరాలు, వైఎస్సార్ జిల్లాలో 92,001 ఎకరాల ఆయకట్టు ఉంది. ►బచావత్ ట్రిబ్యునల్ కేసీ కెనాల్‌కు 39.9 టీఎంసీలను కేటాయించింది. సుంకేశుల బ్యారేజీ వద్ద 29.9 టీఎంసీలు లభ్యమవుతాయని, మిగతా పది టీఎంసీలు తుంగభద్ర జలాశయం నుంచి విడుదల చేయాలని పేర్కొంది. వర్షాభావ పరిస్థితులు నెలకొన్నప్పుడు తుంగభద్రలో సుంకేశుల వద్ద నీటి లభ్యత కనిష్ట స్థాయికి పడిపోవటంతో కేసీ కెనాల్ ఆయకట్టుకు సక్రమంగా నీళ్లందని దుస్థితి నెలకొంది. ►కుందూ వరద ప్రవాహాన్ని ఒడిసిపట్టడం ద్వారా కేసీ కెనాల్ ఆయకట్టును స్థిరీకరించడంతోపాటు ప్రొద్దుటూరు పరిసర ప్రాంతాల్లో తాగునీటి ఇబ్బందులను అధిగమించాలని దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎంగా ఉండగా ►నిర్ణయించారు. ఆ క్రమంలో కుందూ నదిపై రాజోలి, జోలదరాశి జలాశయాల నిర్మాణానికి 2008 డిసెంబర్ 23న పరిపాలన అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. రాజోలి ఆనకట్టకు దిగువన 84,686 ఎకరాలకు కుందూ వరద ద్వారా నీళ్లందించి మిగతా 1,80,942 ఎకరాలకు సుంకేశుల బ్యారేజీ నుంచి తుంగభద్ర జలాలను అందించడం ద్వారా కేసీ కెనాల్ ఆయకట్టును సస్యశ్యామలం చేయాలని భావించారు. వైఎస్సార్ హఠాన్మరణంతో రాజోలి, జోలదరాశి జలాశయాలకు గ్రహణం పట్టింది. ►కేసీ కెనాల్ ఆయకట్టును సస్యశ్యామలం చేసేందుకు ఆ రెండు జలాశయాల నిర్మాణం చేపట్టాలని ముఖ్యమంత్రి జగన్ నిర్ణయించారు. రిజర్వాయర్ల నిర్మాణంతో రాజోలి జలాశయంలో 6 గ్రామాలు, 9,938 ఎకరాలు ముంపునకు గురవుతాయి. జోలదరాశి జలాశయంలో ఒక గ్రామం, 2,157 ఎకరాల భూమి ముంపునకు గురవుతుంది. బ్రహ్మం సాగర్‌కు కుందూ జలాలు ►తెలుగుగంగ ప్రాజెక్టులో బ్రహ్మంసాగర్ రిజర్వాయర్ సామర్థ్యం 17.73 టీఎంసీలు. కానీ నీటిని సరఫరా చేసే లింక్ కెనాల్ సక్రమంగా లేకపోవడంతో బ్రహ్మంసాగర్‌ను నింపలేని దుస్థితి నెలకొంది. ఫలితంగా తెలుగుగంగ ఆయకట్టుకు సరిగా నీళ్లందడం లేదు. మైదుకూరు, బద్వేలు నియోజకవర్గాల్లో తాగునీటి అవసరాలకు కూడా నీటిని సరఫరా చేయలేని పరిస్థితి ఏర్పడింది. ►ఈ పరిస్థితిని అధిగమించేందుకు కుందూ నదిపై వైఎస్సార్ జిల్లా దువ్వూరు మండలం జొన్నవరం వద్ద ఆనకట్ట నిరి్మస్తారు. నదికి వరదలు వచ్చే 65 రోజుల్లో నిత్యం 1,425 క్యూసెక్కుల చొప్పున ఎనిమిది టీఎంసీలను దువ్వూరు చెరువులోకి ఎత్తిపోస్తారు. అక్కడి నుంచి తెలుగుగంగ ప్రధాన కాలువ 107 కి.మీ వద్ద అనుబంధ జలాశయం–1 (ఎస్సార్–1) జల విస్తరణ ప్రాంతం వద్దకు ఎత్తిపోస్తారు. ఆ జలాశయాన్ని నింపి బ్రహ్మంసాగర్‌కు తరలించి తెలుగుగంగ ఆయకట్టుకు నీళ్లందించే పనులకు రూ.564.60 కోట్లతో రాష్ట్ర ప్రభుత్వం పరిపాలన అనుమతి ఇచి్చంది. ►దీనిద్వారా తెలుగుగంగ ఆయకట్టు స్థిరీకరణతోపాటు మైదుకూరు, బద్వేలు నియోజకవర్గాల ప్రజల దాహార్తి తీరనుంది. -
వణుకుతున్న నంద్యాల
సాక్షి, నంద్యాల: నంద్యాల ప్రజలను వరద భయం వెంటాడుతోంది. కుండపోతగా కురుస్తున్న వర్షాలు కంటి మీద నిద్ర లేకుండా చేస్తున్నాయి. నాలుగు రోజుల పాటు కురిసిన వరుణుడు తెరిపిస్తున్నట్లు కనిపించాడు. వరద తగ్గుముఖం పడుతుంది... పట్టణం, చుట్టు పక్కల గ్రామాల్లో చేరిన నీరు ఇప్పుడిప్పుడు బయటకు వెళ్లిపోతుంది.. అని ప్రజలు అనుకుంటున్న సమయంలో శుక్రవారం మరోసారి వరదనీరు నంద్యాల పట్టణాన్ని ముంచెత్తింది. ఐదు రోజులుగా నంద్యాలలో కురుస్తున్న వర్షాలకు తోడు నల్లమలలోని ఫారెస్ట్ అడవుల్లో భారీ వర్షాలు కురుస్తుండటం, ఆ నీరు నంద్యాల పట్టణంలోని శ్యామకాల్వ, మద్దిలేరువాగు, కుందూకు చేరుకుంది. వరద నీటి చేరికతో ఇబ్బందులు పడుతున్న వాహనదారులు దీంతో నంద్యాల పట్టణాన్ని వరదనీరు చుట్టుముట్టింది. పట్టణంలోని శ్యామకాల్వ, మద్దిలేరువాగు, కుందూనది ఉప్పొంగి ప్రవహించడంతో పీవీనగర్, హరిజనపేట, అరుం«ధతినగర్, బైటిపేట, ఘట్టాల్‌నగర్, గాంధీనగర్, బొగ్గులైన్, గుడిపాటిగడ్డ, సలీంనగర్, శ్యాంనగర్, టీచర్స్‌కాలనీ, విశ్వనగర్, ఎన్జీఓ కాలనీ, ఎస్బీఐ కాలనీ, హౌసింగ్‌బోర్డు, తదితర కాలనీలు జలమయమయ్యాయి. పైనుంచి వస్తున్న వరదనీరు అంతా నంద్యాలలోని కుందూనదిలో కలుస్తుండటంతో నది ఉప్పొంగి ప్రవహిస్తుంది. మద్దిలేరు వాగు ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో పీవీనగర్, హరిజనపేటను నీళ్లు చుట్టు ముట్టాయి. పెద్దకొట్టాల, దీబగుంట్ల గ్రామాల్లో వర్షపునీరు చేరి ఇళ్లు అని జలమయమయ్యాయి. దీంతో ఏ క్షణంలోనైనా వరదనీరు లోతట్టు ప్రాంతాలను ముంచేసే అవకాశం ఉందని నది తీర గ్రామాలైన భీమవరం, చాపిరేవుల, పుసులూరు, గుంతనాల, తేళ్లపురి, కూలూరు, రాయపాడు ప్రజలకు రెవెన్యూ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. వరుణుడు శాంతించక పోవడంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ఇప్పటికే నంద్యాల రెవెన్యూ డివిజన్లో ఐదు రోజులుగా కురుస్తున్న వర్షాలతో భారీగా పంట నష్టం వాటిల్లింది. వరద బాధితులు శిబిరాలకు తరలింపు పట్టణంలోని శ్యాంమకాల్వ, మద్దిలేరువాగు, కుందూనదిలకు భారీగా వరదనీరు వస్తుండటంతో వరదముంపు ఉన్న ప్రజలను పట్టణంలో ఏర్పాటు చేసిన ఏడు వరద బాధిత శిబిరాలకు తరలించారు. పక్కిర్‌పేట, హరిజనపేట, సాయిబాబానగర్, శ్యామకాల్వ వద్ద ఉన్న బాధితులను కేంద్రాలకు తరలించి భోజన సౌకర్యాలు, బస వసతి ఏర్పాటు చేశారు. పట్టణంలోని పక్కిర్‌పేట, సాయిబాబానగర్, దేవనగర్, శ్యామకాల్వ ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు వారిని అప్రమత్తం చేశారు. మహానంది ఆలయంలోకి మళ్లీ వరద నీరు ముఖమండపం వరకు చేరిన వరద నీరు మహానంది: మహానంది పుణ్యక్షేత్రంలోని ముఖమండపం వరకు మళ్లీ వరద నీరు చేరింది. మండలంలో శుక్రవారం తెల్లవారుజాము నుంచి కురిసిన భారీ వర్షానికి ఆలయం బయట ఉన్న రెండు చిన్నకోనేరులు నీట మునిగాయి. నల్లమలలో సైతం భారీగా వర్షం కురవడంతో వరద నీరు రాజగోపురం నుంచి ముఖమండపం వరకు నీళ్లు ప్రవహించడంతో పాటు ఆలయంలోని రెండు చిన్న కోనేరులు కనిపించకుండా నీటితో నిండిపోయాయి. తెల్లవారు జామున 5.30 గంటల నిమిషాల నుంచి వర్షపునీరు ఆలయంలోకి చేరింది. వర్షం తగ్గడంతో ఉదయం పది గంటల నుంచి నీటి చేరిక తగ్గుముఖం పట్టింది. చదవండి : బోటు ప్రమాదంలో నంద్యాల వాసులు -
వైఎస్సార్ జిల్లాలో విషాదం...
సాక్షి, కడప: వైఎస్సార్ జిల్లాలో విషాదం నెలకొంది. కొల్లూరు వద్ద కుందునదిలోకి దూకి ఓ కుటుంబం గురువారం ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటనలో భార్యా, భర్తతో పాటు కుమార్తె కూడా మృతి చెందింది. మృతులు రాజుపాలెం మండలం గాదెగూడురుకు చెందిన తిరుపతిరెడ్డి, వెంకట లక్ష్మమ్మ, ప్రవళికగా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. కుటుంబ కలహాలే ఈ ఘటనకు కారణమని తెలుస్తోంది. కాగా ప్రవళిక ప్రేమ వ్యవహారమే ఈ విషాదానికి కారణమని తెలుస్తోంది. చిన్న కుమార్తె ప్రేమను తల్లిదండ్రులు అంగీకరించకపోవడంతో పాటు మనసు మార్చుకోవాలని సూచించారు. అయితే కుమార్తె ప్రవర్తనలో రాకపోవడంతో తిరుపతి రెడ్డి మనస్తాపం చెంది, భార్య, కుమార్తెతో ప్రాణాలు తీసుకున్నట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
వరదలో ఆటో బోల్తా.. ఆరుగురు జలసమాధి
అనుకోని విషాదం ఇంటిల్లిపాదినీ పొట్టనబెట్టుకుంది. వరద రూపంలో కాటేసింది. నిశిరాత్రి..చుట్టూ నీళ్లు.. ముందుకు సాగని ఆటో.. చూస్తుండగానే పెరిగిపోయిన ప్రవాహం..ఏం జరుగుతుందో తెలిసేలోగానే జలం చుట్టుముట్టేసింది. రెక్కాడితే డొక్కాడని ఓపేద కుటుంబాన్ని ఛిద్రం చేసింది. ఆటో నడుపుతున్న వ్యక్తితోపాటు అతని తల్లి..భార్య..ముగ్గురు పిల్లలు వరదనీటిలో గల్లంతైన సంఘటన పోట్లదుర్తి దళిత వాడను కుదిపేసింది. కుందూనది వరద ఉధృతికి కామనూరు వంక వద్ద ఆరుగురు జలసమాధి అయిన సమాచారం విషాద సంద్రంలో ముంచింది. సాక్షి, కడప: సంతోషంగా సాగిపోతున్న వారి జీవన నావ వరదలో చిక్కుకుంది. కుటుంబమంతా జలసమాధి అయింది. అనూహ్యంగా పెరిగిన వరద ఉధృతి ఆరుగురిని కబళించింది. అందులో ముగ్గురు చిన్నారులు..అనుకోని సంఘటనతో గల్లంతైన ఆ కుటుంబం గురించి ఊరంతా కన్నీరు పెడుతున్నారు. ఎర్రగుంట్ల మండలం పోట్లదుర్తి దళితవాడకు చెందిన మల్లుగాళ్ల రామాంజనేయులు(30) చాలా కాలంగా ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. భార్య పెంచలమ్మ(25), పిల్లలు అంజలి(6) కార్తీక్(10 నెలలు) మేఘన(4)లతోపాటు అతని తల్లి సుబ్బమ్మ(60) కూడా వారితోనే ఉండేది. చిన్న మిద్దె ఇంటిలో వీరు నివాసం ఉంటున్నారు. అంజలి ప్రభుత్వ పాఠశాలలో 1వ తరగతి చదువుతుండగా, మేఘనను సమీపంలోని అంగన్వాడీ కేంద్రానికి పంపేవారు. ఆర్థ్ధిక పరిస్థితులు ఇబ్బందికరంగా తయారవ్వడంతో ఫైనాన్స్ వ్యాపారి వద్ద వడ్డీకి రుణం తీసుకుని రెండు వారాల క్రితం ఆటో కొనుక్కున్నాడు. కొత్త ఆటో వచ్చిందని నలుగురికీ చెప్పి సంతోషపడేవాడు. ఈ నేపథ్యంలో దువ్వురు మండలం గొల్లపల్లెలోని మేనత్త ఇంట సోమవారం సీమంతం జరిగింది. శుభకార్యక్రమానికి సొంత ఆటోలో కుటుంబసభ్యులను తీసుకు వచ్చాడు. చీకటి పడినా అక్కడే కుటుంబ సభ్యులతో సరదాగా గడిపారు. ఈ రాత్రి ఇంటిలోనే ఉండిపోవాల్సిందిగా మేనత్త కుటుంబీకులు కోరారు. కానీ పొద్దున్నే మళ్లీ ఆటో తీసుకుపోకపోతే గాని నాలుగు డబ్బులు రావని భావించిన రామాంజనేయులు ఇంటికి వెళ్లిపోవాలనే నిర్ణయించుకున్నాడు. రాత్రి 11గంటలు దాటిన తర్వాత తన కుటుంబ సభ్యులను ఆటో ఎక్కించుకుని ఇంటికి బయలుదేరాడు. అప్పటికే కొంత వర్షం పడుతోంది. ఒకపక్క చిమ్మచీకటి..మరోపక్క వర్షం జోరు. ఇంటికి తొందరగా వెళ్లిపోదామనే ధీమాతో రామాంజనేయులు ఆటో పోనిచ్చాడు. సమీపంలోని గ్రామస్తులు ఆటోలో వెళ్తున్న వీరిని ముందుకు పోవద్దని వారించినట్లు తెలిసింది. ప్రొద్దుటూరు సమీపంలోని కామనూరు వంక వద్ద రాగానే వరద నీటిలో ఆటో చిక్కుకొని బోల్తా పడింది. సుబ్బమ్మ, చిన్నారితో పాటు పసికందు నీళ్లలో పడిపోయి కనిపించకుండా పోయారు. కుమార్తెను ఎత్తుకొని రామాంజనేయులు, అతని భార్య పెంచలమ్మ వరద నీటిలో ఎటూ కదల్లేకపోయారు. ఆటో బోల్తా పడిన విషయం తెలియడంతో స్థానికులు వేగంగా అక్కడికి చేరుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులుకూడా వచ్చారు. చీకటిలో ఏమీ కనిపించడం లేదు. వంక దిగువ నుంచి కాపాడండి.. అనే శబ్దంతో పాటు చిన్నారి ఏడుపు వినిపించిందని ఆ గ్రామస్తులు చెబుతున్నారు. పోలీసులు లైట్లు వేసి చూడగా దూరంగా చిన్నారిని ఎత్తుకొని ఒక వ్యక్తి కనిపించారు. మోటారు పైపును పట్టుకొని మరో మహిళ నీళ్లలో చిక్కుకుంది. కుమార్తెనైనా బతికించుకోవాలనే తాపత్రయంతో అతను నీటి ఉధృతిలోనే సుమారు రెండున్నర గంటల పాటు ఎదురొడ్డి పోరాడాడని స్థానికులు చర్చించుకుంటున్నారు. క్రమంగా వరద ఉధృతి పెరిగిపోయింది. చిన్నారితో పాటు భార్యాభర్తలు కనిపించలేదు. వారిని కాపాడేందుకు పోలీసులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. తొలుత ఆటో గల్లంతు అయిన సంఘటన బయటపడినా అందులో ఉన్నవారెవరో తెలియలేదు. ముగ్గురు గల్లంతయ్యారని భావించారు. రామాంజనేయులు అత్తగారి ఊరు మైదుకూరు మండలం ఉత్సలవరం. సోమవారం రాత్రికి వారి ఆటో పోట్లదుర్తికి రాకపోవడంతో ఉత్సలవరానికి వెళ్లింటారని ఊళ్లో బంధువులు భావించారు. బుధవారం బంధువులు అనుమానంతో గొల్లపల్లెలోని తెలిసినవారికి ఫోన్ చేశారు. సోమవారం రాత్రే ఆటోలో వెళ్లిపోయారని చెప్పారు. రామాంజనేయులు అన్న రామకృష్ణతో పాటు బంధువులు రూరల్ పోలీసులను సంప్రదించడంతో ఆరుగురు గల్లంతైన విషయం తెలిసింది. రామాంజనేయులుకు నలుగురు సంతానం . మొదటి కుమారుడు ప్రమాదశాత్తూ ఆరేళ్ల క్రితం గోడకూలి మృతి చెందాడు. కూలి పని చేసుకుని జీవించే కుటుంబం జలసమాధి కావడం అందరినీ కలచివేసింది. పోట్లదుర్తిలోని దళితవాడలో వారి ఇంటి వద్ద పెద్ద సంఖ్యలో ప్రజలు చేరి కన్నీమున్నీరుగా విలపించారు. రబ్బరు బోట్లు, ఎస్డీఆర్ఎఫ్ దళాలతో గాలింపు కామనూరు వంకలో గల్లంతైన వారి కోసం రెండో రోజు గాలింపు చర్యలు చేపట్టారు. రబ్బరు బోట్లతో అగ్నిమాపక రెస్క్యూ టీం ఒక వైపు, కర్నూలు నుంచి వచ్చిన ఎస్డీఆర్ఎఫ్ దళాలు మరో వైపు గాలిస్తున్నారు. మంగళవారం చీకటి పడే వరకు వెతికినా వారి ఆచూకి తెలియలేదు. డీఎస్పీ సుధాకర్ ఆధ్వర్యంలో సీఐ విశ్వనాథ్‌రెడ్డి, ఎస్ఐలు, అగ్నిమాపక శాఖ అధికారి రఘునాథ్ గాలిస్తున్నారు. కుందూ తీరప్రాంతాల్లో గాలింపు చర్యలు చేపట్టారు. వద్దురా అంటున్నా వినలేదు... రాత్రి అయింది ..పొద్దున్నే పోదులేరా అని చెప్పినా.. ఏముందిలే అక్క ..బస్సులో కాదు కాద.. మన ఆటోలో పోతాంలే అంటూ బయలు దేరాడు. వరద నీటిలో గల్లంత అయినారు అని విషయం తెలిసింది. మేం ఒక ఆటోలో సీమంతానికి వెళ్లాం..రాతిర నీళ్లొచ్చాయి.. అని కూడా చెప్పాం. వినకుండా వెళ్లారు. భగవంతుడు ఇలా విషాదాన్ని మిగులుస్తాడని అనుకోలేదు. – సుభాషిణి .. రామంజనేయులు సోదరి, పోట్లదుర్తి -
వరదలతో అపార నష్టం
సాక్షి, కర్నూలు: నంద్యాల రెవెన్యూ డివిజన్లో ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాలు తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి. ప్రభుత్వ, ప్రజల ఆస్తులు ధ్వంసం కావడంతో రూ.వందల కోట్ల మేర నష్టం వాటిల్లింది. మొత్తం 17 మండలాల్లోని 95 గ్రామాల పరిధిలో ఆదివారం అర్ధరాత్రి నుంచి బుధవారం వరకు భారీ వర్షాలు కురిశాయి. ప్రభుత్వం తీసుకున్న ముందస్తు, అప్రమత్త చర్యల కారణంగా ఎక్కడా ప్రాణ నష్టం వాటిల్లలేదు. లోతట్టు ప్రాంతాలు, వంకలు, వాగులు, చెరువుల్లో చిక్కుకున్న ప్రజలను తక్షణమే కాపాడడంతో పాటు వారిని సహాయక శిబిరాల్లో ఉంచి తగిన సేవలు అందించడంలో అధికార యంత్రాంగం సఫలమైంది. భారీ వర్షాలతో జరిగిన నష్టాన్ని అధికారులు ప్రాథమిక అంచనా వేశారు. ఈ మేరకు నివేదికను ప్రభుత్వానికి పంపారు. నంద్యాల పట్టణంలో ముంపు ప్రాంతాలను పరిశీలిస్తున్నకలెక్టర్ వీరపాండియన్, ఎస్పీ ఫక్కీరప్ప తదితరులు భారీగా పంట నష్టం నంద్యాల డివిజన్లోని 15 మండలాల్లో 29,847 హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నాయి. అత్యధికంగా వరి 16,228 హెక్టార్లలో, పత్తి 5,195 హెక్టార్లలో దెబ్బతిన్నట్లు వ్యవసాయ యంత్రాంగం తేల్చింది. పంటలకు దాదాపు రూ.70 కోట్ల మేర నష్టం జరగ్గా.. పెట్టుబడి రాయితీ కింద రూ.41.44 కోట్లు విడుదల చేయాలని జిల్లా యంత్రాంగం ప్రతిపాదించింది. ఉద్యాన పంటలకు సంభవించిన నష్టం రూ.55.14 కోట్లు ఉండగా..ఇన్పుట్ సబ్సిడీ రూ.3.02 కోట్లు విడుదల చేయాలని ఉద్యానశాఖ ప్రతిపాదించింది. అలాగే రూ.5 లక్షల విలువ చేసే పశుసంపద మృత్యువాత పడింది. నందిపల్లి, తమ్మడపల్లి, బుక్కాపురం, తిమ్మాపురం, మసీదుపురం, ఎర్రగుంట్ల, యూళ్లూరు, గోవిందపల్లె గ్రామాల్లో పశుగ్రాసం పూర్తిగా నీట మునిగి పనికిరాకుండా పోయింది. వరద నీటి నుంచి బయట పడిన మహానంది ఆలయం 13,827 ఇళ్లలోకి వరద నీరు భారీ వర్షాలతో గ్రామాలు చెరువులను తలపించడంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. గోస్పాడు, నంద్యాల, మహానంది మండలాలతో పాటు మిగిలిన 14 మండలాల్లో దాదాపు 13,827 ఇళ్లలోకి వర్షపు నీరు చేరింది. ఇందులో 417 ఇళ్లు దెబ్బతిన్నాయి. 95 గ్రామాల్లో వరద నీరు చేరినా ఎక్కడా ప్రాణ నష్టం జరగకుండా అధికారులు చర్యలు తీసుకున్నారు. లోతట్టు ప్రాంతాలు, వంకలు, వాగులు, చెరువుల వద్దకు ప్రజలు వెళ్లకుండా ముందస్తు చర్యలు తీసుకోవడంతో ప్రాణనష్టం తప్పింది. అలాగే అధికారులు సకాలంలో స్పందించి వరదలో చిక్కుకున్న 30 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. గోస్పాడు మండలం దీబగుంట్ల గ్రామాన్ని వీడని నీరు దెబ్బతిన్న రోడ్లు భారీ వర్షాలు, వరదల వల్ల నంద్యాల డివిజన్లోని 10 మండలాల్లో దాదాపు 59.13 కిలోమీటర్ల మేర పంచాయతీరాజ్ రోడ్లు దెబ్బతిన్నాయి. ఇదే శాఖ పరిధిలో 45 ప్రాంతాల్లో కల్వర్టులు సైతం దెబ్బతిన్నాయి. అలాగే జిల్లా వ్యాప్తంగా దాదాపు 638 కిలోమీటర్ల మేర ఆర్అండ్బీ రోడ్లకు నష్టం వాటిల్లింది. వీటి మరమ్మతులు, శాశ్వత నిర్మాణాల కోసం ప్రతిపాదనలు సిద్ధం చేయడంలో అధికారులు నిమగ్నమయ్యారు. మునిసిపాలిటీలకు భారీ నష్టం భారీ వర్షాలతో నంద్యాల, ఆళ్లగడ్డ మునిసిపాలిటీలకు భారీ నష్టం వాటిల్లింది. వాటి పరిధిలో మంచినీటి పైపులైన్లు, మురుగు కాల్వలు ధ్వంసం కావడంతో రూ.33.76 కోట్ల నష్టం వాటిల్లినట్లు అధికారులు అంచనా వేశారు. అలాగే నంద్యాల డివిజన్లో విద్యుత్ శాఖకు రూ.5 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు ప్రాథమిక అంచనా వేశారు. 152 విద్యుత్ స్తంభాలు, 25 ఎల్టీ లైన్లు, 500 సర్వీసులు దెబ్బతిన్నట్లు గుర్తించారు. అర్డబ్ల్యూఎస్ శాఖకు కూడా రూ.1.8 కోట్ల నష్టం వాటిల్లింది. ఆలూరులో పొంగిపొర్లుతున్న వాగు సహాయక చర్యలు భేష్ భారీ వర్షాల బారిన పడిన ప్రజల కోసం ప్రభుత్వం చేపట్టిన సహాయక చర్యలు పలువురి ప్రశంసలను అందుకున్నాయి. 45 క్యాంపులను ఏర్పాటు చేయడంతో పాటు 24,730 మంది ప్రజలకు మంచినీరు, ఆహారం, ఇతర సదుపాయాలను సమకూర్చింది. అక్కడక్కడ వరదలో చిక్కుకున్న ప్రజలను కాపాడేందుకు నాలుగు బోట్లు ఏర్పాటు చేశారు. 40 ఫైరింజన్లను నిత్యం అందుబాటులో ఉంచారు. సహాయక చర్యల కోసం రూ.45 కోట్లు ఖర్చు చేశారు. మరోవైపు 15 మెడికల్ క్యాంపులను నిర్వహించి.. రోగాల బారిన పడిన వారికి ఉచితంగా వైద్య పరీక్షలతోపాటు మందులను పంపిణీ చేశారు. చదవండి : నీళ్లల్లో మహానంది -
ప్రొద్దుటూరులో భారీ వర్షం,ముగ్గురు గల్లంతు
-
జల దిగ్బంధం
సాక్షి, నంద్యాల: భారీ వర్షాలతో నంద్యాల రెవెన్యూ డివిజన్ అతలాకుతలమైంది. వాగులు, వంకలు, పంట కాల్వలు పొంగి పొర్లాయి. రహదారులు కోతకు గురై రాకపోకలు నిలిచిపోయాయి. పలు గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకొని జనజీవనం స్తంభించి పోయింది. ఆదివారం రాత్రి నుంచి సోమవారం ఉదయం వరకు ఎడతెరపి లేకుండా కుండపోత వర్షం కురిసింది. తెల్లవారు జామున ప్రజలు నిద్రలేచే సమయానికి ఇళ్లలోకి నీరు వచ్చింది. బయటకు వెళ్లి చూస్తే కనుచూపు మేర నీళ్లే కనిపించాయి. ప్రజలను అప్రమత్తం చేస్తూ జిల్లా అధికార యంత్రాంగం వేగంగా స్పందించింది. ఇన్చార్జి కలెక్టర్ రవి పట్టన్‌శెట్టి..గ్రామాల్లో పర్యటించి పరిస్థితిని సమీక్షించారు. రెవెన్యూ, పోలీసు యంత్రాంగం ముమ్మరంగా సహాయక చర్యలు చేపట్టంది. ప్రధానంగా ఎనిమిది మండలాల్లో కుంభవృష్టి కురిసింది. వివిధ గ్రామాల్లో పాఠశాలలు నీటిలో చిక్కుకపోవడంతో స్థానిక సెలవు ప్రకటించారు. ఉయ్యాలవాడ మండలం ఆర్.పాంపల్లె సమీపంలో నీట మునిగిన పత్తి పంట జలవలయంలో చిక్కుకున్న గ్రామాలు.. ఆళ్లగడ్డ మండలంలో వక్కిలేరు, నల్లవాగు పొంగిపొర్లాయి. పడకండ్ల, నల్లగట్ల, బత్తులూరు, నందింపల్లి, బృందావనం, గూబగుండం, జి.కంబలదిన్నె గ్రామాలు జలమయం అయ్యాయి. వందాలాది ఇళ్లలోకి నీరు వెళ్లడంతో ఆహార ధాన్యాలు తడిసిపోయాయి. చాగలమర్రి మండలంలో బ్రాహ్మణపల్లి, కొలుగొట్లపల్లి, రాంపల్లి, అవులపల్లి గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. చాగలమర్రిలోని చెంచుకాలనీ, కంచెపురికాలనీల్లో అనేక ఇళ్లను వర్షపు నీరు ముంచెత్తింది. గోస్పాడు మండలంలోని యూళ్లూరు, జిల్లెల్ల, నెహ్రూనగర్ పసురపాడు, చింతకుంట, గోస్పాడు గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. గోస్పాడు మండలం జిల్లెల్ల గ్రామంలో ఇంటిలోకి చేరిన వరద నీరు మహానంది మండలం తిమ్మాపురం, అబ్బీపురం, గోపవరం, గాజులపల్లి గ్రామాల్లోని వర్షపునీరు ముంచెత్తింది. రుద్రవరం మండలంలోని నాయుడుపల్లి, ఆర్.కొత్తూరు, మాచినేనిపల్లి, వరికొట్టూరు, చిన్మయస్వామి చెంచుగూడెం జలదిగ్బంధంలో చికుక్కున్నాయి. కుందూ నదీ, వాగులు వంకల నీరు ఉయ్యలవాడ మండలాన్ని ముంచెత్తాయి. దీంతో బోడెమ్మనూరు, హరివరం, ఉయ్యలవాడతోపాటు మరో 12 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. శిరువెళ్ల మండలంలోని అత్యధిక గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకపోయాయి. నంద్యాల మండలంలోని పలు గ్రామాలు జలమయం అయ్యాయి. గోస్పాడు మండలంలో ముంపు పరిస్థితిపై ఇన్చార్జీ కలెక్టర్ రవి పట్టన్‌శెట్టి సమీక్షించారు. కుండపోత వర్షాలు పడిన మండలాల్లో పంట నష్టంపై పూర్తి స్థాయిలో సర్వే చేయాలని ఇన్చార్జీ కలెక్టర్ వ్యవసాయ యంత్రాంగాన్ని ఆదేశించారు. వివిధ గ్రామాల్లో బాధితులకు వైఎస్ఆర్సీపీ నేతలు చేయూత ఇచ్చారు. గోస్పాడు మండలం నెహ్రూనగర్ వద్ద వరదనీటితో తెగిపోయిన రహదారి బాధితులకు భోజన సౌకర్యం.. వరద ప్రాంతాల్లో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చూడాలని అధికారులకు నంద్యాల ఎమ్మెల్యే శిల్పారవి చంద్రకిశోర్‌రెడ్డి ఆదేశించారు. గ్రామస్థాయి నాయకులు కూడా ప్రజలకు సహకరించాలని సూచించారు. దీంతో వరద ప్రాంతాల్లో వైఎస్సార్సీపీ నాయకులు స్పందించారు. గ్రామాల్లో ఎక్కడికక్కడ ఆ పార్టీ నాయకులు, అధికారుల ఆధ్వర్యంలో భోజన సౌకర్యం కల్పించారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకున్నారు. అప్రమత్తంగా ఉండాలి: ఇన్చార్జి కలెక్టర్ రానున్న మూడు రోజులలో రాయలసీమలో, కర్నూలు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపినందున జిల్లాలోని అన్ని మండలాల, మున్సిపాలిటీలోని అన్ని శాఖల అధికారులు, వారు పని చేస్తున్న కేంద్రాల్లో ఉండి ప్రజలను అప్రమత్తం చేయాలని ఇన్చార్జి కలెక్టర్ రవిపట్టన్ శెట్టి పేర్కొన్నారు. జిల్లా అధికారులందరూ డీఆర్ఓ, కలెక్టరేట్ కమాండ్ కంట్రోల్ రూంతో అనుసంధానమై అప్రమత్తంగా ఉంటూ విపత్తుల నిర్వహణ మార్గదర్శకాల ప్రకారం ఆయా శాఖల ద్వారా చేపట్టాల్సిన సమాయక చర్యలను వెంటనే చేయాలన్నారు. రైతులూ..ఆందోళన చెందవద్దు.. పంట నష్టం జరిగిన రైతులు ఎలాంటి ఆందోళన చెందవద్దని జిల్లా ఇన్చార్జ్ కలెక్టర్ భరోసాను ఇచ్చారు. యాళ్లూరు గ్రామంలో వరద ప్రాంతంలో పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామాల్లో డీఎంఅండ్‌హెచ్‌ఓ ఆధ్వర్యంలో మెడికల్ క్యాంపును ఏర్పాటు చేయడంతో పాటు, గ్రామీణ నీటి సరఫరా శాఖ ద్వారా వెంటనే తాగునీటిని పునరుద్ధరిస్తామన్నారు. ప్రస్తుతం నీరు అధికంగా ప్రవహిస్తున్నందున వాగులు, వంకలు, నదులు దాటే ప్రయత్నం ఎవరూ చేయవద్దని సూచించారు. భారీ వర్షం సమయంలో చెట్లకింద, పాత గోడలు, పిట్టగోడలు సమీపంలో ఎవరూ ఉండకుండా సురక్షిత ప్రాంతాల్లో ఉండాలన్నారు. -
జంట పథకాలతో రైతన్నకు పంట
కరువు కష్టాలనుంచి గట్టెక్కించేందుకు జగన్ సర్కార్ సమాయత్తమైంది. అవకాశమున్నంత మేర జిల్లాలో సాగునీటి వనరుల ఏర్పాటుకు అన్ని చర్యలు తీసుకుంటోంది. కేసీ కెనాల్ ఆయకట్టు స్థిరీకరణ కోసం రాజోలి వద్ద కొత్తగా రిజర్వాయర్ నిర్మాణంతోపాటు తెలుగుగంగ ఆయకట్టు స్థిరీకరణకు కుందూనదినుంచి ఎత్తిపోతల పథకం ఏర్పాటుకు సర్వం సిద్ధం చేస్తోంది. రెండు పథకాలకు డిసెంబర్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ శంకుస్థాపన చేయనున్నారు. కలెక్టర్ సి.హరికిరణ్ ఇరిగేషన్ అధికారులతో కలిసి శుక్రవారం రాజోలి రిజర్వాయర్ నిర్మాణంతోపాటు కుందూ ఎత్తిపోతల పథకం నిర్మాణ ప్రాంతాలను పరిశీలించారు. ఇవ్వని హామీలను సైతం నెరవేర్చేందుకు ప్రభుత్వం పూనుకోవడాన్ని జిల్లా రైతాంగం స్వాగతిస్తోంది. సాక్షి, కడప : వరుస కరువులతో అల్లాడిపోతున్న రైతాంగానికి ఇది తీపి కబురు. సాగునీటి వనరులపై వైఎస్ జగన్ ప్రభుత్వం మరో అడుగు వేయనుంది. కేసీ ఆయకట్టును స్థిరీకరించేందుకు పథకం సిద్ధం చేస్తోంది. ఇందుకోసం కుందూనదిపై కర్నూలు జిల్లా చాగలమర్రి మండలం రాజోలి సమీపంలో రిజర్వాయర్ నిర్మించాలని నిర్ణయించింది. 2.95 టీఎంసీల సామర్ద్యంతో నిర్మించే ఈ ప్రాజెక్టుకు రూ. 830.47 కోట్లు వెచ్చించనుంది. డిసెంబరులో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయనున్నారు. కేసీ కెనాల్ కింద అధికారికంగా 83,489 ఎకరాల ఆయకట్టు ఉంది. కృష్ణా జలాలపై ఆధారపడిన ఈ ఆయకట్టుకు అడపా దడపా మాత్రమే నీరు చేరుతోంది. ఎగువన భారీ వర్షాలు కురిసి శ్రీశైలం ప్రాజెక్టు నిండితే తప్ప కేసీ ఆయకట్టుకు నీరు వదిలే పరిస్థితి లేదు. దీంతో కుందూనదిపై రాజోలు రిజర్వాయర్‌ను బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌గా నిర్మించాలని చాలాకాలంగా కేసీ ఆయకట్టు రైతాంగం కోరుతోంది. గత ప్రభుత్వం అన్నదాతల గోడు పట్టించుకోలేదు. కానీ జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మరుక్షణమే ఈ ప్రాంత రైతాంగం శ్రేయేస్సును దృష్టిలో ఉంచుకుని రాజోలి రిజర్వాయర్ నిర్మాణానికి తలపెట్టింది. ప్రాజెక్టు నిర్మించి 2.95 టీఎంసీల నీటిని నిల్వ ఉంచితే కేసీ ఆయకట్టు స్థిరీ కరించినట్లు అవుతుంది. దీంతోపాటుగా ప్రొద్దుటూరు పట్టణ ప్రజలకు తాగునీరు కూడా ప్రాజెక్టు ద్వారా అందించనున్నారు. కలెక్టర్ హరి కిరణ్, స్పెషల్ కలెక్టర్ సతీష్‌చంద్ర, తెలుగుగంగ కడప ఎస్ఈ శారద, నంద్యాల ఎస్ఈ శ్రీనివాసరెడ్డి, ఈఈ మాధవరావు, డీఈ రమణ తదితరులు శుక్రవారం ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతాన్ని పరిశీలించారు. భూ సేకరణతోపాటు టెండర్ల ప్రక్రియ వేగవంతం చేయాలని కలెక్టర్ ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. త్వరలోనే ప్రాజెక్టు నిర్మాణానికి సం బంధించి అన్ని కార్యక్రమాలను అధికారులు పూర్తి చేయనున్నారు. రాజోలి రిజర్వాయర్ నిర్మాణంతో కేసీ ఆయకట్టుకు మరింత ఉపయోగం చేకూరనుండడంతో రైతాంగం హర్షం వ్యక్తం చేస్తోంది. కుందూ నుండి ఎత్తిపోతల మరోవైపు 1.58 లక్షల ఎకరాల తెలుగుగంగ ప్రాజెక్టు ఆయకట్టును స్థిరీకరించేందుకు కుందూఎత్తిపోతల పథకానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. దువ్వూరు మండలం జొన్నవరం క్రాసింగ్ వద్ద ఎత్తిపోతల పథకాన్ని ఏర్పాటు చేయనున్నారు. దీని ద్వారా ఐదు టీఎంసీల నీటిని కుందూ నదినుంచి తెలుగుగంగ మెయిన్ కెనాల్ ద్వారా బ్రహ్మంసాగర్ రిజర్వాయర్‌కు తరలించనున్నారు. తొలి అంచెగా ఎనిమిది మోర్టార్లు ఏర్పాటు చేసి ఆరు కిలోమీటర్ల పొడవుతో నాలుగు వరుసల పైపులైన్లు వేసి దువ్వూరు ట్యాంకుకు నీటిని తరలిస్తారు. తర్వాత అక్కడి నుంచి మరో ఎనిమిది మోర్టార్లతో రెండు కిలోమీటర్ల మేర పైపులైన్ వేసి తెలుగుగంగ ప్రధాన కాలువలోకి కుందూ నీటిని తరలిస్తారు. బ్రహ్మంసాగర్‌కు ఐదు టీఎంసీల నీటిని తరలించడం వల్ల బద్వేలు, మైదుకూరు నియోజకవర్గాల్లో ఆయకట్టుకు సాగునీరు అందించడంతోపాటు బద్వేలు, మైదుకూరు పట్టణాలకు తాగునీరు అందించే అవకాశం ఉంటుంది. ఈ పథకానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి డిసెంబరులోనే శంకుస్థాపన చేయనున్నారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ సి.హరి కిరణ్ అటు రాజోలి రిజర్వాయర్ నిర్మాణ ప్రాంతంతోపాటు దువ్వూరు వద్ద కుందు ఎత్తిపోతల పథకం నిర్మాణ ప్రాంతాన్ని సైతం పరిశీలించారు. కుందూ ఎత్తిపోతల పథకానికి సంబంధించి భూ సేకరణతోపాటు టెండర్ ప్రక్రియను వేగవంతం చేయాలని ఇరిగేషన్ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. రాజోలి రిజర్వాయర్ నిర్మాణంతో 83,489 ఎకరాల కేసీ ఆయకట్టుతోపాటు కుందూ ఎత్తిపోతల పథకంతో 1,58,000 ఎకరాలు తెలుగుగంగ ఆయకట్టుకు సైతం నీరు చేరనుంది. పై రెండు పథకాల నిర్మాణానికి ప్రభుత్వం రూ. 1270.47 కోట్లు ఖర్చు చేయనుంది. ప్రభుత్వ నిర్ణయంతో ఈ ప్రాంత రైతాంగం హర్షం వ్యక్తం చేస్తోంది -
కుందూ నది పరవళ్లు
సాక్షి, జమ్మలమడుగు : పెద్దముడియం మండలంలో కుందూ నది పరవళ్లు తొక్కుతోంది. నాలుగు రోజుల నుంచి నీరు ఉధృతంగా ప్రవహిస్తూ పరివాహక గ్రామాలలో పంటలను ముంచెత్తుతోంది. ప్రస్తుతం కుందూలో 16వేల క్యూసెక్కుల నీరు ప్రవహిస్తోంది. నాగరాజుపల్లి, పాలూరు, పెద్దముడియం, చిన్నముడియం, గరిశలూరు, నెమళ్లదిన్నె, బలపనగూడురు ప్రాంతాల ప్రజలు నది ఉధృతిపై ఆందోళన చెందుతున్నారు. పైన విపరీతమైన వర్షాలు కురవడంతో కృష్ణ, తుంగభద్ర నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ఫలితంగా కుందూ ప్రవాహం కూడా పెరిగిపోయింది. నది పరివాహక ప్రాంతాల ప్రజలను రెవెన్యూ, పోలీసు అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. నెమళ్లదిన్నె బ్రిడ్జిపై రెండు అడుగుల ఎత్తు మేర నీరు ప్రవహిస్తోంది. దీనివల్ల రాకపోకలు నిలిచిపోయాయి. పెద్దముడియం బ్రిడ్జి దిగువ వరకు నీరు ప్రవహిస్తుంది. కుందూ నీటి ఉధృతి గురించి ఎమ్మెల్యే డాక్టర్‌మూలే సుధీర్‌రెడ్డి ఎప్పటికప్పుడు అధికారులను అడిగి తెలుసుకుంటున్నారు. సోమవారం ఆయన నెమళ్లదిన్నె ప్రాంతాలలో పర్యటించారు. నీట మునిగిన పత్తి, వరి పంటలను పరిశీలించారు. ముంపు గ్రామాల ప్రజలను అప్రమత్తం చేయడంతోపాటు సహాయ చర్యలు చేపట్టడానికి సిద్ధంగా ఉండాలంటూ అధికారులకు సూచనలిచ్చారు. సీతారామాపురం వద్ద చాపాడు: కుందూనది ఉధృతి పెరిగింది. మంగళవారం ఉదయం నుంచి వరద నీరు ప్రవహిస్తుండగా మంగళ, బుధవారాల్లో కురిసే వర్షాలతో ఉధృతి మరింత పెరగనుంది. ఇప్పటికే మండలంలోని సీతారామాపురం వద్ద గల కుందూనది వంతెనను తాకుతూ నీరు ప్రవహిస్తోంది. కుందూ పరివాహక రైతులు అప్రమత్తంగా ఉండాలని రెవెన్యూ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. కుందూనదికి రోజు రోజుకు వరద నీరు పెరుగుతోంది. ఈ నేపథ్యంలో మైదుకూరు నియోజకవర్గంలోని రైతాంగం వ్యవసాయ పనుల్లో నిగ్నమైంది. -
కుందూ‘లిఫ్ట్’.. రైతులకు గిఫ్ట్
బద్వేలు నియోజకవర్గ రైతాంగానికి ప్రాణాధారమైన బ్రహ్మంసాగర్ ప్రాజెక్టుకు నీటి గలగలలు కరువయ్యాయి. నీరొస్తే పండించుకోవచ్చనే అన్నదాత ఆశ నెరవేరడం లేదు. తీవ్ర వర్షాభావ పరిస్థితులు, శ్రీశైలం నుంచిఅవసరమైన స్థాయిలో నీటి విడుదల లేకపోవడంతో ప్రాజెక్టు ఉన్నా నీటి కష్టాలు తప్పడం లేదు. ప్రాజెక్టు పూర్తి నీటి మట్టం 17 టీఎంసీలు అయినా నాలుగేళ్లుగా కనీసం సగం స్థాయిలో కూడా నీరు చేరడం లేదు. చెంతనే ప్రాజెక్టు ఉన్నా సాగు మాత్రం సున్నా అన్నట్లు రైతుల పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో కుందూ నది నుంచి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ఏర్పాటు చేస్తామని సీఎం జగన్ మోహన్‌రెడ్డి సోమవారం జిల్లా పర్యటనలో ప్రకటించారు. ఆయన ప్రకటన ఈ ప్రాంత రైతులకెంతో ఆనందం కలిగించింది సాక్షి, బద్వేలు : జిల్లాలోని బద్వేలు నియోజకవర్గంలో సాగు, తాగునీటి ఇక్కట్లు దశాబ్దాల తరబడి ఉన్నాయి. వీటిని గమనించి మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ బ్రహ్మంగారి మఠంలో బ్రహ్మంసాగర్ రిజర్వాయర్‌కు శంకుస్థాపన చేశారు. అనంతరం ఈ ప్రాజెక్టుపై తదుపరి ప్రభుత్వాలు తీవ్ర నిర్లక్ష్యం వహించాయి. ఎట్టకేలకు 1995లో డ్యాం నిర్మాణం పూర్తయింది. చంద్రబాబు హయాంలో కాలువల నిర్మాణానికి నిధులు కేటాయించలేదు. దీంతో రైతులకు నీరు అందని పరిస్థితి. రెండు పర్యాయాలు ఆయన సీఎం అయినా జిల్లాపై శీతకన్ను వేయడంతో అన్నదాతల అవస్థలు తీరలేదు. జిల్లాకు చెందిన పలువురు నేతలు ఎన్నో పర్యాయాలు ఆయన్ను కలిసి బ్రహ్మంసాగర్‌ను పూర్తి చేయాలని కోరినా ప్రయోజనం మాత్రం సున్నా. దీనిపై మాజీ మంత్రి వీరారెడ్డి కూడా పలుమార్లు తీవ్ర అంసతృప్తి వ్యక్తం చేశారు. అధికారంలోకి రాగానే... వైఎస్ రాజశేఖర్‌రెడ్డి 2004లో సీఎం కాగానే ఆయన మొదటి బడ్జెట్లోనే రూ.450 కోట్లు కేటాయించారు. ఈ నిధులతో సబ్సిడీ రిజర్వాయర్–1, సబ్సిడీ రిజర్వాయర్–2లతో పాటు ఎడమకాలువ, కుడి కాలువ నిర్మాణాలను పూర్తి చేశారు. కేవలం 15 నెలల వ్యవధిలో ఈ పనులన్నింటినీ యుద్ధప్రాతిపదికన పూర్తి చేయించారు. ఇందుకు గాను కంట్రాక్టరుతో కూడా ప్రతివారం సమీక్ష నిర్వహించారు. 2006 సెప్టెంబరులో సోనియాగాంధీతో ప్రాజెక్టును ప్రారంభించి నీటిని విడుదల చేయించారు. ఆనందంలో రైతులు బ్రహ్మంసాగర్ పూర్తయితే 1.50 లక్షల ఎకరాలు సాగులోకి వస్తుంది. వైఎస్ ప్రాజెక్టు పూర్తి చేయడంతో 1.40 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరు అందింది. సబ్సిడి రిజర్వాయర్–1, సబ్సిడి రిజర్వాయర్–2 పూర్తి చేసి వాటిలో 4.50 టీఎంసీల నీటిని నిల్వ చేశారు. ఈ నీటితో దువ్వూరు, మైదుకూరు మండలాల్లో 20 వేల ఎకరాలు సాగులోకి వచ్చింది. బద్వేలు నియోజకవర్గంలోని కాశినాయన, కలసపాడు, పోరుమామిళ్ల, బి,కోడూరు, బద్వేలు, గోపవరం, అట్లూరు మండలాల్లోని 1.20 లక్షల ఎకరాలు ఆయకట్టులోకి వచ్చింది. శ్రీశైలం నుంచి బ్రహ్మంసాగర్‌కు తెలుగుగంగ జలాలను కాలువల ద్వారా అందిస్తారు. వైఎస్ పాలనాకాలంలో 2007లో ఒక్క పర్యాయమే 13.48 టీఎంసీల నీటిని ప్రాజెక్టులో నిల్వ చేశారు. 2008లో 11.56 టీఎంసీలు, 2011లో 11.834, 2012లో 9.835, మరోసారి 12 టీఎంసీల నీటిని ప్రాజెక్టులోకి తీసుకురాగలిగారు. తదుపరి ఏడెనిమిదేళ్లుగా ఐదారు టీఎంసీలకే పరిమితం. 2018లో 4.482, 2017 6.49 టీఎంసీల నీళ్లు మాత్రమే వచ్చాయి. తీవ్ర వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో కృష్ణాజలాలు తీసుకురాలేని పరిస్థితి నెలకొంది. డీసీ గోవిందరెడ్డి ఆకుంఠిత కృషి నాడు వైఎస్ సీఎంగా ఉన్న సమయంలో ఎమ్మెల్యేగా ఉన్న డీసీ గోవిందరెడ్డి బ్రహ్మంసాగర్ ప్రాజెక్టు పూర్తిలో కొంతమేర కృషి చేశారు. వైఎస్‌కు విన్నవించగా ఆయన తక్షణమే స్పందించి యుద్ధప్రాతిపదికన పనులు పూర్తి చేయించారు. కానీ ప్రాజెక్టు నిర్మించినా నికరజలాలు లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. దీన్ని గమనించిన ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి సమీపంలో ఉన్న కుందూ నది నుంచి వరద జలాలు వృథాగా పోతున్నాయని, వీటిని వినియోగించుకుంటే కొంత మేర ఇబ్బందులు తప్పుతాయని గ్రహించారు. ఇదే విషయాన్ని ఆయన వైఎస్ జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. ప్రజాసంకల్పయాత్రలో దువ్వూరు వద్ద రైతులు కూడా జగన్‌ను కలిసి విన్నవించారు. కుందూ నది నుంచి వృథాగా పోతున్న వరదనీటిని లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా బ్రహ్మంసాగర్లోకి ఎత్తి పోయడం ద్వారా కొంతైనా నీటి ఇక్కట్లు తీరతాయి. జగన్ అధికారం చేపట్టగానే నాటి సంకల్పయాత్రలో విన్నపాలపై దృష్టి సారించారు. అందులో భాగంగానే ఈ ప్రాజెక్టుకు డిసెంబరు 26న శంకుస్థాపన చేస్తామని సోమవారం జమ్మలమడుగులో జరిగిన రైతు సదస్సులో ప్రకటించారు. దీంతో నియోజకవర్గ రైతాంగంలో ఆనందం వ్యక్తమవుతోంది. తండ్రికి తగ్గ తనయుడు వైఎస్ రాజశేఖర్‌రెడ్ది ఆపరభగీరథుడికి ప్రతిరూపం. ఆయన చొరవతోనే బ్రహ్మంసాగర్ పూర్తయింది. రైతుల రెండు దశాబ్దాల కల నెరవేరింది. ఆయనకు తగ్గ కుమారుడిగా నేడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి రైతుల దుస్థితి గమనించి కుందూ లిఫ్ట్ ఇరిగేషన్ ఏర్పాటు చేస్తామని ప్రకటించడం చాలా సంతోషకరం. ప్రాజెక్టు పూర్తయిన పదేళ్లకు... 1995లో డ్యాం నిర్మాణం పూర్తయినా రైతులకు నీళ్లు మాత్రం అందలేదు. అప్పటి సీఎం చంద్రబాబు ప్రాజెక్టుకు నిధులు కేటాయించలేదు. దీంతో రైతులు ఆశలు నెరవేరలేదు. వైఎస్ సీఎం కాగానే ప్రాజెక్టును పూర్తి చేశారు. ఆయనకు రైతులపై ఉన్న ప్రేమ అంతులేనిది. ఆయన మాదిరే జగన్ కూడా అపరభగీర«థుడిగా పేరు తెచ్చుకుంటారు. -
తరలుతున్న జలం
కోవెలకుంట్ల: ఎగువ ప్రాంతాల్లో మంచి వర్షాలు కురవడంతో శ్రీశైలం జలాశయానికి భారీగానే వరద నీరు చేరింది. ఈ నీటితో కర్నూలు, వైఎస్సార్ జిల్లాల రైతుల అవసరాల నిమిత్తం ఈ జిల్లాల్లోని రిజర్వాయర్లు నింపకుండానే రాష్ట్ర ప్రభుత్వం నీటి తరలింపునకు శ్రీకారం చుట్టింది. ముఖ్యంగా నెల్లూరు జిల్లాకు తరలించేందుకు సిద్ధం కావడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. కుందూ నది ద్వారా శుక్రవారం నుంచి రోజుకు రెండు వేల క్యూసెక్కుల చొప్పున నీటిని తరలిస్తోంది. దీనివల్ల రానున్నరోజుల్లో రెండు జిల్లాల రైతులకు సాగునీరు ప్రశ్నార్థకంగా మారనుంది. గోరుకల్లు, అవుకు నింపకుండానే.. జిల్లాలోని గోరుకల్లు రిజర్వాయర్ సామర్థ్యం 13 టీఎంసీలు, అవుకు రిజర్వాయర్ సామర్థ్యం 4.8 టీఎంసీలు. శ్రీశైలం జలాశయంలో 854 అడుగుల సాధారణ నీటిమట్టం చేరితే ఎస్సార్బీసీ, కేసీ కెనాల్‌కు నీటిని విడుదల చేస్తారు. ఎస్సార్బీసీకి 19 టీఎంసీలు, కేసీ కెనాల్‌కు 39.9 టీఎంసీల నీటిని కేటాయించారు. ప్రస్తుతం రిజర్వాయర్‌లో 870 అడుగులకు పైగా నీరు చేరడంతో పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి బనకచెర్ల క్రాస్ ద్వారా నీటి విడుదల జరుగుతోంది. ఇక్కడి నుంచి ఎస్సార్బీసీకి 1,300 క్యూసెక్కుల నీరు విడుదల అవుతుండగా.. 400 క్యూసెక్కులు అవుకు రిజర్వాయర్‌కు, 100 క్యూసెక్కులు గోరుకల్లుకు చేరుతున్నాయి. బైపాస్ కెనాల్ ద్వారా 1,200 క్యూసెక్కుల నీరు విడుదలవుతుండగా.. ఈ నీరు కుందూనదిలో చేరుతోంది. నది ద్వారా నెల్లూరు జిల్లాకు తరలిపోతోంది. పంట పొలాలకు సాగునీటి పేరుతో ఎస్సార్బీసీ ద్వారా నీటి విడుదల జరుగుతుండగా ప్రస్తుతం రైతులు కొద్దిమేర మాత్రమే వినియోగించుకుంటున్నారు. ఈ నీరంతా తిరిగి కుందూలో చేరి నెల్లూరు తరలిపోతోంది. గోరుకల్లు, అవుకు రిజర్వాయర్లు నింపకుండా పంట పొలాలకు సాగునీటి పేరుతో నెల్లూరుకు తరలిస్తుండటంతో రాబోయే రోజుల్లో ఈ రిజర్వాయర్లలో నీరు లేక సాగునీటి సమస్య తలెత్తుతుందని రైతులు వాపోతున్నారు. ప్రస్తుతం గోరుకల్లులో 1.2 టీఎంసీల(డెడ్ స్టోరేజీ) నీరు మాత్రమే ఉంది. రబీ సీజన్లో ఆరుతడి పంటలకు సాగునీరు అందించేందుకు ఎస్సార్బీసీకి నీటి కేటాయింపులు జరగ్గా.. ఇప్పటి నుంచే నీటిని విడుదల చేసి ¯ð నెల్లూరు జిల్లాకు తరలిస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. కుందూ నది ద్వారా దాదాపు 10 టీఎంసీల నీటిని నెల్లూరు జిల్లాకు తరలించాలన్న దిశగా.. రోజుకు రెండువేల క్యూసెక్కుల చొప్పున విడుదల చేస్తున్నారు. గోరుకల్లు, అవుకు రిజర్వాయర్లు నింపాలి: శ్రీశైలం జలాశయంలో నీరు పుష్కలంగా ఉన్నందున జిల్లాలోని గోరుకల్లు, అవుకు రిజర్వాయర్లు నింపిన తర్వాతే నెల్లూరుకు తరలించాలి. ఈ రిజర్వాయర్లు నింపకుండా నీటిని తరలిస్తే రైతులకు అన్యాయం జరుగుతుంది. గోరుకల్లులో కనీసం ఐదు టీఎంసీలు, అవుకులో మూడు, వైఎస్సార్ జిల్లా గండికోట రిజర్వాయర్‌లో ఐదు, మైలవరంలో నాలుగు టీఎంసీల నీరు నింపితే రెండు జిల్లాల రైతులకు ఉపయుక్తంగా ఉంటుంది. కామని వేణుగోపాల్‌రెడ్డి,రాయలసీమ జాయింట్ యాక్షన్ కమిటీకోఆర్డినేటర్, కోవెలకుంట్ల -
అదుపు తప్పితే అంతే మరి
సీతారామాపురం(చాపాడు) : మండలంలోని అల్లాడుపల్లె దేవళాలు వద్దకు వెళ్లే సీతారామాపురం–అల్లాడుపల్లె మధ్యగల కుందూనదిపై ఉన్న పాత వంతెనకు ఇరువైపులా రక్షణ కరువైంది. ఏ క్షణాన ఎలాంటి ప్రమాదం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి అక్కడ నెలకొంది. దీంతో వంతెనపై ప్రయాణించే వాహనంలోని వారు అదుపు తప్పితే పెద్ద ప్రమాదం జరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం వంతెన ఇరువైపులా రక్షణగా చిన్నపాటి పోస్ట్‌లు(సిమెంట్ దిమ్మెలు) మాత్రం ఏర్పాటు చేశారు. ఒక దిమ్మెకు మరో దిమ్మెకు ఖాళీ వ్యత్యాసం ఎక్కువగా ఉంది. వీటిలో కూడా చాలా వరకు దిమ్మెలు దెబ్బతిన్నాయి. సైకిల్, ద్విచక్ర వాహనదారులకు, ఆటోల వారికి ఇవి ఏ విధంగాను రక్షణగా లేవనటంలో సందేహం లేదు. ఇప్పటికే పలు రకాలైన వాహనాలు ఢీ కొనటంతో దిమ్మెలు దెబ్బతిన్నాయి. ఈ వంతెనపై బస్సులు, ట్రాక్టర్లు, ఎద్దుల బండ్లు, ఆటోలు ఎక్కువగా తిరుగుతూ ఉంటాయి. మండలంలోని అల్లాడుపల్లె, సీతారామాపురం, చిన్నగురువళూరు, పెద్ద గురువళూరు, గ్రామాలతో పాటు ఖాజీపేట మండలంలోని సన్నుపల్లె, మిడుతూరు, ఏటూరు, కమలాపురం మండలంలోని పలు గ్రామాలకు చెందిన ప్రజలు కూడా ఎక్కువగా ఈ దారిన ప్రయాణిస్తుంటూరు. ఏ మాత్రం అదుపు తప్పినా వాహనం కుందూనదిలో పడిపోయే ప్రమాదం ఉంది. కుందూనదిలో ఏడాదిలో అధిక రోజులు నీటి ప్రవాహం ఉంటుంది. నీరు లేకపోయినా వంతెనపై 10 అడుగులకు పైగా లోతు ఉండటంతో ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని వంతెనపై రక్షణ గోడ ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు. -
కుందూనదిలో ముగ్గురు మహిళల గల్లంతు
సాక్షి, కర్నూలు: కర్నూలు జిల్లా కుందూ నదిలో ముగ్గురు మహిళలు గల్లంతయ్యారు. ఈ విషాద సంఘటన మంగళవారం చోటు చేసుకుంది. రెండు రోజులుగా కర్నూలు జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాగులు, వంకలు పొంగిపొర్లడమేగాక నదుల్లోకి కూడా భారీగా వరద నీరు వస్తోంది. దీంతో గడివేముల మండలం గడిగరేవుల దగ్గర కుందూనదిలో ప్రమాదవశాత్తూ ముగ్గురు మహిళలు గల్లంతయ్యారు. వీరిలో ఓ మహిళ మృతదేహం లభ్యం కాగా మిగతా ఇద్దరి కోసం గాలిస్తున్నారు. సమాచారమందుకున్న అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని మిగతా ఇద్దరి కోసం విస్తృతంగా గాలింపు పడుతున్నారు. -
కుందూ నది దాటుతుండగా ప్రమాదం
-
కుందూ నది దాటుతుండగా ప్రమాదం
సాక్షి, కర్నూలు: కుందు నది దాటుతూ ముగ్గురు గల్లంతైన సంఘటన సోమవారం కర్నూలు జిల్లాలో చోటుచేసుకుంది. భారీ వర్షంతో జిల్లాలోని కుందూ నది ఉధృతంగా ప్రవహిస్తుంది. గడివేముల మండలం గడిగరేవుల వద్ద వ్యవసాయ కూలీలు తాడు సాయంతో నది అవతల వైపు వెళ్లేందుకు ప్రయత్నించిగా వారిలో తొలుత 12 మంది గల్లంతయ్యారు. దీంతో అప్రమత్తమైన స్థానికులు తీవ్రంగా శ్రమించి 9 మందిని రక్షించారు. మరో ముగ్గురి జాడ తెలియాల్సి ఉంది. వీరి కోసం స్థానికులు గాలిస్తున్నారు. అధికారులు సంఘటనా స్థలికి చేరుకోని పరిశీలిస్తున్నారు. -
ఆరిపోయిన ఇంటి దీపం
సీతారామాపురం(చాపాడు): ఆ యువకులు దీపావళి పర్వదినాన్ని ఆనందంగా జరుపుకోవాలనుకున్నారు. అందరూ కలిసి కుందూనది ఒడ్డున విందు ఏర్పాటు చేసుకున్నారు. ఆ తర్వాత సరదాగా ఈత కొట్టేందుకు నదిలోకి దిగారు. వీరిలో ఓ యువకుడు నీటి గుంతలో ఇరుక్కోగా.. అతన్ని రక్షించేందుకు మరో యువకుడు ప్రయత్నించాడు. ఇద్దరూ నీటిలో గల్లంతయ్యారు. సోమవారం మధ్యాహ్నం ఓ యువకుడి మృతదేహం లభ్యం కాగా, మరో యువకుడి కోసం గాలింపు కొనసాగుతోంది. సెల్ఫీ తీసుకున్నారు.. గల్లంతయ్యారు.. చాపాడు మండలంలోని సీతారామాపురం గ్రామానికి చెందిన ఉండేల శ్రీనాథరెడ్డి, బొర్రా తరుణ్‌రెడ్డి, వీరి తమ్ముళ్లు సురేంద్ర, వంశీలతో పాటు రాజా, సునీల్, సురేష్, లోకేశ్వర్‌రెడ్డి, ప్రసాద్, చాపాడుకు చెందిన ఉప్పలూరి వినోద్, చియ్యపాడుకు చెందిన ఓంకార్‌లతో పాటు మరొకరు కలసి 12 మంది కుందూనది ఒడ్డున ఆదివారం విందు ఏర్పాటు చేసుకున్నారు. మధ్యాహ్నం 2గంటలకు అందరూ కలిసి భోజనం చేస్తూ ’సెల్ఫీ’ తీసుకున్నారు. తర్వాత నదిలో ఈత కొట్టాలనుకున్నారు. తొలుత ఐదారు మంది నదిలో దిగి అవతలి ఒడ్డుకు చేరుకున్నారు. ఈ క్రమంలో వరుణ్‌కుమార్‌రెడ్డి ముందు వెళుతుండగా, వెనకాలే వస్తున్న సరిగా ఈత రాని శ్రీనాథరెడ్డి నదిలో ఇరుక్కున్నాడు. దీన్ని గమనించిన వరుణ్ స్నేహితుడి కోసం వెనక్కు వెళ్లి రక్షించే క్రమంలో ఇద్దరూ నదిలో గల్లంతయ్యారు. ఒడ్డున ఉండి గమనించిన వీరిద్దరి తమ్ముళ్లు సురేంద్ర, వంశీలు గట్టిగా కేకలు వేశారు. నది అవతలవైపు ఉన్న వారందరూ నదిలోకి వచ్చి గాలించినా ఫలితం లేదు. సోమవారం ఉదయం నుంచి గ్రామస్తులు నదిలో వెతకగా మ«ధ్యాహ్నం 12గంటల ప్రాంతంలో శ్రీనాథ్‌రెడ్డి మృత దేహం కనిపించింది. వరుణ్‌కుమార్ రెడ్డి ఆచూకి లభ్యం కాలేదు. చాపాడు ఎస్ఐ శివశంకర్ కేసు నమోదు చేసుకున్నారు. తహసీల్దార్ పుల్లారెడ్డి, వీఆర్వో మాబుహుస్సే పరిస్థితిని ఆరా తీశారు. ఆ ఇద్దరూ రెండు కుటుంబాల్లో పెద్ద కుమారులే.. నదిలో గల్లంతైన ఇద్దరు యువకులిద్దరూ వారి కుటుంబాల్లో పెద్ద కొడుకులు. ఉండేల రమణారెడ్డి కుమారుడు శ్రీనాథరెడ్డి మైదుకూరులోని కడప రోడ్డులో సెల్ పాయింట్ నిర్వహిస్తూ కుటుంబానికి ఆసరాగా ఉన్నాడు. బొర్రు వెంకటేశ్వర్‌రెడ్డి పెద్ద కుమారుడైన వరుణ్‌కుమార్‌రెడ్డి ఇటీవల ఎంబిఏ పూర్తి చేసుకుని నాలుగు నెలల క్రితమే బెంగళూరులో ఓ సాప్‌్టవేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. దీపావళి పండుగ కోసం స్వగ్రామానికి వచ్చాడు. వారి తమ్ముళ్ల కళ్ల ముందే వీరు నదిలో గల్లంతు కావడంతో ఆ రెండు కుటుంబాలతో పాటు గ్రామం శోకసంద్రంలో నిండిపోయింది. -
వర్షపు నీటితో రాజోలికి జలకళ
రాజుపాళెం: కర్నూలు జిల్లాలో కురిసిన భారీ వర్షం నీరంతా మండలంలోని రాజోలి ఆనకట్టకు చేనడంతో జలకళ సంతరించుకుంది. ఆ నీరంతా కుందూనదికి పోతుండటంతో ఉధృతంగా ప్రవహిస్తోంది. శుక్రవారం ఆనకట్ట నుంచి కుందూనదికి 3900, కేసీ ప్రధాన కాలువకు 200, కేసీ చాపాడు కాలువకు 160 క్యూసెక్కులు నీరు పోతున్నట్లు కేసీ కెనాల్ అధికారులు తెలిపారు. -
ఉద్ధృతంగా కుందూ
– నది తీరంలో వెయ్యి ఎకరాల్లో నీట మునిగిన వరి కోవెలకుంట్ల: డివిజన్లోని పై ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండటంతో వాగులు, వంకల్లోని నీరంతా కుందూ నదిలోకి చేరుతోంది. బుధవారం కూడా నది ఉద్ధృతంగా ప్రవహించింది. కోవెలకుంట్ల, వల్లంపాడు, కలుగొట్ల, గుళ్లదూర్తి, కంపమల్ల, క్రిష్టిపాడు, అల్లూరు, హరివరం, నర్శిపల్లె, మాయలూరు, పెద్దయమ్మనూరు, బోడెమ్మనూరు, ఒంటెద్దుపల్లె, ప్రాంతాల్లోని వంతెనలపై కుందూ నీరు ప్రవహిస్తోంది. ఆయా గ్రామాల పరిధిలోని నదీతీరంలో సుమారు వెయ్యి హెక్టార్లలో వరి పైరు నీట మునిగింది. ఎకరాకు రూ.5వేలు వెచ్చించి వరినాట్లు వేయగా భారీ వర్షాల కారణంగా వరద నీటిలో కలిసిపోయి భారీ నష్టం జరిగిందని రైతులు వాపోతున్నారు. రెండు రోజులుగా వరిమడులలో నీరు నిల్వడంతో పైరుపై ఆశలు వదులుకున్నారు. -
కుందూ నదిలో మృతదేహం
చాపాడు : వైఎస్సార్ జిల్లా చాపాడు మండలం సీతారాంపురం గ్రామం వద్ద కుందూ నదిలో ఓ గుర్తు తెలియని మృతదేహం శనివారం వెలుగు చూసింది. మూటలో కట్టి ఉన్న మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఎవరో హత్య చేసి మృతదేహాన్ని వదిలేసి వెళ్లి ఉంటారని భావిస్తున్నారు. -
ఉద్ధృతంగా ప్రవహిస్తున్న కుందూ
కర్నూలు: ఎగువన కురిసిన భారీ వర్షాల కారణంగా కర్నూలు జిల్లా మిడుతూరు మండలం చింతల వద్ద కుందూ నది ఉద్ధృతంతో ప్రవహిస్తుంది. ఆ ఉద్ధృతికి చింతల పరిసర ప్రాంతాల్లోని లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమైనాయి. నదిలో నీరు రహదారులపైకి భారీగా వచ్చి చేరడంతో కాజీపేటకు రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. -
తల్లిని నదిలో తోసేసిన ప్రబుద్ధుడు
కర్నూలు: కర్నూలు జిల్లా కోవెలకుంట్లలో దారుణం చోటు చేసుకుంది. ఆస్తి కోసం కన్నతల్లిని కుందూనదిలోకి తోసేశాడు ఓ ప్రబుద్ధుడు. దాంతో ఆమె కుందూనదిలో పడిపోయింది. అనంతరం కొడుకు అక్కడి నుంచి పరారైయ్యాడు. ఆ విషయాన్ని గమనించిన స్థానికలు వెంటనే నదిలో నుంచి ఆమెను ఒడ్డుకు తీసుకువచ్చారు. అనంతరం స్థానికులు ఆమెను సమీపంలోని ఆసుపత్రికి తీసుకువెళ్లి... ప్రాధమిక చికిత్స అందించారు. ఈ ఘటనపై స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆస్తిని తన పేరిట రాయాలని గత కొంత కాలంగా కొడుకు.... కన్న తల్లిని వేధించసాగాడు. ఆ క్రమంలో తరచుగా ఇంట్లో గొడవలు చోటు చేసుకున్నాయి. అయితే ఈ రోజు ఉదయం పని ఉంది రమ్మంటూ తనను బయటకు తీసుకువెళ్లాడని .... కుందూనది వద్దకు చేరుకోగానే ... ఒక్కసారిగా తనను నదిలోకి తోసేశాడని ఆమె పోలీసులకు వెల్లడించింది. పోలీసులు పరారైన కోడుకు కోసం గాలింపు చర్యలు చేపట్టారు. -
కుందూ నదికి భారీ వరద