తల్లిని నదిలో తోసేసిన ప్రబుద్ధుడు | Man threw his mother into a Kundu River | Sakshi
Sakshi News home page

తల్లిని నదిలో తోసేసిన ప్రబుద్ధుడు

Published Thu, Oct 30 2014 9:29 AM | Last Updated on Sun, Sep 2 2018 4:37 PM

తల్లిని నదిలో తోసేసిన ప్రబుద్ధుడు - Sakshi

తల్లిని నదిలో తోసేసిన ప్రబుద్ధుడు

కర్నూలు: కర్నూలు జిల్లా కోవెలకుంట్లలో దారుణం చోటు చేసుకుంది. ఆస్తి కోసం కన్నతల్లిని కుందూనదిలోకి తోసేశాడు ఓ ప్రబుద్ధుడు. దాంతో ఆమె కుందూనదిలో పడిపోయింది. అనంతరం కొడుకు అక్కడి నుంచి పరారైయ్యాడు. ఆ విషయాన్ని గమనించిన స్థానికలు వెంటనే నదిలో నుంచి ఆమెను ఒడ్డుకు తీసుకువచ్చారు.  అనంతరం  స్థానికులు ఆమెను సమీపంలోని ఆసుపత్రికి తీసుకువెళ్లి... ప్రాధమిక చికిత్స అందించారు. ఈ ఘటనపై స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.

పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆస్తిని తన పేరిట రాయాలని గత కొంత కాలంగా కొడుకు.... కన్న తల్లిని వేధించసాగాడు. ఆ క్రమంలో తరచుగా ఇంట్లో గొడవలు చోటు చేసుకున్నాయి. అయితే ఈ రోజు ఉదయం పని ఉంది రమ్మంటూ తనను బయటకు తీసుకువెళ్లాడని .... కుందూనది వద్దకు చేరుకోగానే ... ఒక్కసారిగా తనను నదిలోకి తోసేశాడని ఆమె పోలీసులకు వెల్లడించింది. పోలీసులు పరారైన కోడుకు కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement