ఎగువన కురిసిన భారీ వర్షాల కారణంగా కర్నూలు జిల్లా మిడుతూరు మండలం చింతల వద్ద కుందూ నది ఉద్ధృతంతో ప్రవహిస్తుంది.
కర్నూలు: ఎగువన కురిసిన భారీ వర్షాల కారణంగా కర్నూలు జిల్లా మిడుతూరు మండలం చింతల వద్ద కుందూ నది ఉద్ధృతంతో ప్రవహిస్తుంది. ఆ ఉద్ధృతికి చింతల పరిసర ప్రాంతాల్లోని లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమైనాయి. నదిలో నీరు రహదారులపైకి భారీగా వచ్చి చేరడంతో కాజీపేటకు రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.