overflow
-
భద్రాచలం: గోదావరి ఉగ్రరూపం.. పోటెత్తుతున్న వరద
సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చుతోంది. ఉదయo 10 గంటలకు 37.7 అడుగులకు గోదావరి నీటి మట్టం చేరుకుంది. దీంతో 7 లక్షల క్యూసెక్కుల నీరును దిగువకు విడుదల చేస్తున్నారు. 43 అడుగులకు చేరితే మొదటి ప్రమాద హెచ్చరికను అధికారులు జారీ చేయనున్నారు.పర్ణశాల వద్ద నారా చీరల ప్రాంతం నీట మునిగింది. తెలంగాణాతో పాటు ఎగువ ప్రాంతంలో ఉన్న సరిహద్దు రాష్ట్రలైన ఛత్తీస్గడ్, మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఏజెన్సీ గ్రామాల్లోని వాగులు పొంగి గోదావరిలోకి భారీగా వర్షపు నీరు చేరుతుండటంతో క్రమంగా గోదావరి నీటి మట్టం పెరుగుతోంది. ఇప్పటికే భారీ వరదల కారణంగా అనేక చోట్ల రవాణకీ తీవ్ర అంతరాయం కాగా, పలుగ్రామాల్లో విద్యుత్ సరాఫరా నిలిచిపోయింది. అధికారులు అప్రమతంగా ఉండాలని జిల్లా కలెక్టర్ జితేష్ ఆదేశాలు జారీ చేశారు.భారీ వర్షాల ప్రభావంతో గోదావరిలో వరద నీటిమట్టం పెరుగుతుంది. ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ నుంచి ఐదు లక్షల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. ఏజెన్సీ విలీన మండలాల్లో భారీ వర్షాల ప్రభావంతో కొండవాగులు ఉదృతంగా ప్రవహిస్తున్నాయి సోకిలేరు వాగు, అన్నవరం వాగు కొండరాజుపేట, వాగు చీకటి వాగు, అత్త కోడళ్ళ వాగు ఉదృతంగా ప్రవహించడంతో రహదారులపైకి వరద నీరు చేరుకుంది దీంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. మరోవైపు శబరి నది కూడా పోటెత్తి ప్రవహిస్తోంది. శబరి గోదావరి సంగమ ప్రాంతం సముద్రాన్ని తలపిస్తోంది. -
పెన్నా నది పరవళ్లు.. సువర్ణముఖి చిందులు
సాక్షి, రామగిరి(శ్రీ సత్యసాయి జిల్లా): ఎగువ ప్రాంతం కర్ణాటకలో కురుస్తున్న భారీ వర్షాలకు పెన్నమ్మ పరవళ్లు తొక్కుతూ పేరూరు చేరింది. దీంతో డ్యాం పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరుకుంటుండటంతో అధికారులు గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదిలారు. ఇప్పటి వరకూ ఒకటిన్నర టీఎంసీ దిగువకు వదిలినా పేరూరు డ్యాంకు ఇన్‌ఫ్లో ఏమాత్రం తగ్గలేదని, అందుకే నీటిని ఏకధాటిగా వదలుతున్నట్లు డీఈ వెంకటరమణ తెలిపారు. భారీ వర్షాలతో మూడు దశాబ్దాల తర్వాత పేరూరు డ్యాం నిండుకుండను తలపించగా... గత నెలలో తొలిసారి పేరూరు డ్యాం గేట్లు ఎత్తారు. తాజాగా సోమవారం మరోసారి గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదులుతుండగా.. ఈ సుందర దృశ్యాన్ని తిలకించేందుకు పలు గ్రామాల ప్రజలు డ్యాం వద్దకు వస్తున్నారు. సువర్ణముఖి చిందులు నాలుగు దశాబ్దాల తర్వాత తొలిసారి మరువ పారిన చెరువులు అగళి: 20 రోజులుగా కర్ణాటక ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షానికి సువర్ణముఖి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. వరద నీరు అగళి మండలంలోని మధూడి, ఇరిగేపల్లి, కోడిపల్లి, రావుడి, వడగుంటనపల్లి చెరువుల్లో చేరడంతో నాలుగు దశాబ్దాల తర్వాత అవన్నీ మరువ పారాయి. దీంతో స్థానికులు తండోపతండాలుగా వచ్చి మరువపారుతున్న ప్రాంతాల్లో జలకాలాటలు ఆడారు. (క్లిక్: ప్రాణం పోసుకుంటున్న నల్ల రాతి శిలలు!) -
తొణికిసలాడుతున్న జలాశయాలు
నంద్యాల: ఖరీఫ్ సీజన్ ప్రారంభంలోనే జిల్లాలోని జలాశయాలు నీటితో కళకళలాడుతున్నాయి. మునుపెన్నడూ లేని విధంగా శ్రీశైలం ప్రాజెక్టు జూలై నెలలోనే నిండింది. శ్రీశైలం పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 880.70అడుగులు నీటిమట్టం ఉంది. శ్రీశైలం జలాశయం గరిష్ట నీటి నిల్వ 215.807 టీఎంసీలు కాగా ప్రస్తుతం నీటి నిల్వ 191.6512టీఎంసీలకు చేరింది. శ్రీశైలం ప్రాజెక్టులోకి 50,927 క్యూసెక్కుల వరద నీరు వస్తుండగా సగటున 80వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి దిగువకు నీరు వదలడంతో వివిధ జలాశయాలు నీటితో కళకళలాడుతున్నాయి. రైతులు ఆలస్యం చేయకుండా ఖరీఫ్ పంటలు వేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. కళకళలాడుతున్న రిజర్వాయర్లు.. నంద్యాల జిల్లాలోని గోరుకల్లు, అవుకు, వెలుగోడు రిజర్వాయర్లు నీటితో కళకళలాడుతున్నాయి. బానకచర్ల క్రాస్ రెగ్యులేటర్ నుంచి లింకు ఛానల్ ద్వారా వెలుగోడు రిజర్వాయర్‌కు 14వేల క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుంది. వెలుగోడు రిజర్వాయర్ నీటి నిల్వ సామర్థ్యం 16.95 టీఎంసీలు కాగా ప్రస్తుతం 8.418 టీఎంసీలు నీరు రిజర్వాయర్‌లోకి చేరింది. ఎస్సార్బీసీ చరిత్రలోనే ఇప్పటి వరకు జూలై నెలలో కాల్వలకు నీటిని విడుదల చేయలేదు. అయితే గోరుకల్లు రిజర్వాయర్ నీటి సామర్థ్యం 10 టీఎంసీలు . ప్రస్తుతం 5 టీఎంసీలు పైగా నీరు నిల్వ ఉంది. శ్రీశైలం రిజర్వాయర్‌కు పూర్తిస్థాయి నీటి మట్టం వచ్చాక, గేట్లు ఎత్తిన తర్వాతనే ఎస్సార్బీసీ కాల్వలకు నీరు వదిలేవారు. అయితే, శ్రీశైలం ప్రాజెక్టు గేట్లు ఎత్తకముందే రిజర్వాయర్‌లో 5 టీఎంసీల నీరు నిల్వ ఉండటంతో జూలై మొదటి వారంలోనే కాల్వలకు నీటిని విడుదల చేశారు. ప్రస్తుతం శ్రీశైలం ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో బానకచర్ల నుంచి గోరుకల్లు రిజర్వాయర్‌కు 9వేల క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. అవుకు రిజర్వాయర్ నీటి సామర్థ్యం 4.184 టీఎంసీలు కాగా ప్రస్తుతం 2.184టీఎంసీల నీరు నిల్వ ఉంది. అవుకు రిజర్వాయర్ కింద అధికారికంగా, అనధికారికంగా 10వేల ఎకరాల ఆయకట్టు ఉంది. ప్రస్తుతం ఈ రిజర్వాయర్‌లోకి వరద నీరు భారీగా వస్తుండటంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కేసీ కెనాల్, కుందూకు సమృద్ధిగా నీరు.. సుంకేసుల ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వస్తుండటంతో దిగువకు నీరు వదులుతున్నారు. దీంతో కేసీ కెనాల్, కుందూనదిలో పుష్కలంగా సాగునీరు ప్రవహిస్తోంది. అధికారులు కేసీ కెనాల్ కు వారం క్రితం 14వేల క్యూసెక్కులు నీరు వదలగా ప్రస్తుతం 800 క్యూసెక్కులు నీరు వదులుతున్నారు. కుందూనదిలో ప్రస్తుతం 1250 క్యూసెక్కుల నీరు ప్రవహిస్తుంది. (క్లిక్: ఆగస్టు 7న టీటీడీ ఆధ్వర్యంలో ఉచిత వివాహాలు) సాగునీటికి ఇబ్బంది ఉండదు ఈ ఏడాది జిల్లాలో ఖరీఫ్ పంటలకు సంవృద్ధిగా నీరు అందజేస్తాం. గత మూడు సంవత్సరాలుగా రైతులకు సాగునీరుకు ఎలాంటి ఇబ్బంది లేదు. ఈ ఏడాది శ్రీశైలం ప్రాజెక్టుకు జూలై నెలలోనే భారీగా వరద నీరు రావడంతో దిగువకు నీరు విడుదల చేశారు. దీంతో రిజర్వాయర్లను నీటితో నింపుతున్నాం. ఖరీఫ్ పంటలు వేసే రైతులు ఏ మాత్రం ఆలస్యం చేయకుండా పంటలు వేసుకోవాలి. ఈ ఏడాది సాగునీటికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. – శేఖర్‌రెడ్డి, జలవనరుల శాఖ ఎస్ఈ, నంద్యాల -
Photo Feature: అలుగు దుంకిన అందం
సాక్షి, హైదరాబాద్: ఎడతెరిపి లేని వర్షాలతో ఊరూ వాడా.. వాగూ వంకా.. ఏరులై పారుతున్నాయి. కొన్నిచోట్ల అలుగు దుంకుతున్న చెరువులతో అందాలు జాలువారుతున్నాయి. మరికొన్ని కట్టలు తెగి ఊళ్లను, చేలను ముంచెత్తుతున్నాయి. కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో మంగళవారం నాటికి రాష్ట్రంలో 49 చెరువులు పూర్తిగా తెగిపోయాయి. మరో 43 చెరువులకు గండ్లు పడ్డాయని అధికారులు చెబుతున్నారు. అలాగే, 25 కాల్వలకు సైతం గండ్లు పడ్డాయి. -
ఘట్కేసర్లో పొంగి పొర్లుతున్న వాగులు
-
పొంగిపొర్లుతున్న చెరువులు
భూదాన్‌పోచంపల్లి : మండలంలో బుధవారం తెల్లవారుజాము నుంచి ఎడతెరపిలేకుండా కురుస్తున్న వర్షాలకు రోడ్లన్నీ జలమయమయ్యాయి. మండల కేంద్రంలోని సినిమా థియేటర్ వద్ద వర్షపునీరు నిలవడంతో మెయిన్‌రోడ్డు మడుగును తలపించింది. కనుముకుల చెరువు అలుగు పోస్తుండటంతో 50 ఎకరాలు, ముక్తాపూర్‌లో సుమారు 20 ఎకరాలపైన వరినీటి మునిగింది. రేవనపల్లి, గౌస్‌కొండ గ్రామాల్లో కాలువలకు గండి పడటంతో మరో 20 ఎకరాలపైన వరిపొలాలు నీటి మునిగాయి. జంట నగరాల నుంచి వరదనీరు ఉధృతంగా ప్రవహిస్తుండంతో మండలంలో మూసీ పరవళ్లు తొక్కుతోంది. పిలాయిపల్లి, జూలూరు, పెద్దరావులపల్లి గ్రామాల మధ్య గల బ్రిడ్జిలపై నుంచి మూసీ ప్రవహిస్తుండటంతో రాకపోకలు నిలిచిపోయాయి. మండలం నుంచి ఘట్కేసర్, బీబీనగర్, భువనగిరికి వెళ్లడానికి రాకపోకలు నిలిచిపోయాయి. మండలంలోని చెరువులన్నీ నిండి అలుగుపోస్తున్నాయి. పోచంపల్లి చెరువు అలుగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో ఈ మార్గంలో వెళ్లే రేవనపల్లి, శివారెడ్డిగూడెం, ఇంద్రియాల గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అలాగే భీమనపల్లి చెరువు అలుగు పారి నీరంతా రోడ్డు పైకి చేరింది. జిబ్లక్పల్లిలో చిక్క అఖిల, అంతమ్మగూడెంలో రావుల లింగయ్యకు చెందిన ఇళ్లు కూలిపోయాయని వీఆర్వో షేక్ చాంద్‌పాష తెలిపారు. కాగా మండలంలో వర్షపాతం 54.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. -
గోస్తని పొంగితే..దిగ్బంధమే!
గోస్తని పొంగితే..దిగ్బంధమే! గోస్తనీ, దిగ్బంధం gostani,overflow,struked పద్మనాభం: పాండ్రంగి సమీపాన గోస్తని నదిలో వంతెన నిర్మాణం కలగానే మిగిలింది. పాండ్రంగి వాసులు బయటకు రావాలంటే గోస్తని దాటాలి. తగరపువలస, విశాఖపట్నం, విజయనగరం వెళ్లడానికి, పద్మనాభం రావడానికి పాండ్రంగి జంక్షన్లో బస్సులు ఎక్కుతుంటారు. వర్షాల సమయంలో నది గ్రామాన్ని తాకుతూ పొంగి ప్రవహిస్తుంది. నది ప్రవహించేటప్పుడు గ్రామస్తులు ఊరు దాటి వెళ్ల లేని పరిస్థితి. చుట్టుతిరిగి వెళ్లాలన్నా చిక్కులే మునివానిపాలెం మీదుగా తగరపువలస వెళ్లాలనుకున్నా సంగి వలస గెడ్డ, బోని మీదుగా పద్మనాభం రావాలనుకున్నా మద్ది సమీపాన ఉన్న పల్లి గెడ్డపై ప్రవహించే నీరు అడ్డు వస్తుంది. గ్రామంలోప్రాథమిక పాఠశాల ఏడో తరగతి వరకే ఉంది. ఎనిమిది నుంచి పదోతరగతి వరకు ఈ గ్రామ విద్యార్థులు రేవిడి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు వెళ్లా. వర్షాకాలంలో నది ఉధతంగా ప్రవహించడంతో విద్యార్థులు పాఠశాలకు వెళ్లలేని పరిస్థితి. పాండ్రంగి పంచాయతీ పరిధిలో ఉండే కొత్త కురపల్లి, పాత కురపల్లి, బర్లపేట గ్రామాల ప్రజలు పంచాయతీ పరంగా అవసరమయ్యే పనులకు పాండ్రంగి రావాలి. సందర్శకులకు తిప్పలు మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజుకు జన్మనిచ్చిన పుణ్యగడ్డ కావడంతో ఇక్కడ అల్లూరి జననగహం, విగ్రహం, సామాజిక భవనం నిర్మించారు. ఈ స్మారక చిహ్నాలను తిలకించడానికి పర్యాటకులు ఎక్కువగా వస్తుంటారు. నదిదగ్గరకు వచ్చే వరకూ పొంగిప్రవహిస్తుందన్న విషయం తెలియక పోవడంతో పర్యాటకులు అల్లూరి స్మారక చిహ్నాలను చూడకుండానే వెనుదిరగాల్సి వస్తోంది. నదిలో నిర్మించిన కాజ్వే గోతులు పడింది. నేతలు మారినా ఈ గ్రామానికి చెందిన రాజాసాగి సూర్యనారాయణ రాజు ఒక విడత, ఆర్.ఎస్.డి.డి.పి.అప్పలనరసింహరాజు నాలుగు సార్లు ఎమ్యేల్యేగా పనిచేశారు. అయినప్పటికీ వంతెన నిర్మాణం జరగలేదు. విశాఖపట్నం మాజీ ఎంపీ దగ్గుబాటి పరందేశ్వరి, భీమిలి మాజీ ఎమ్యెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు, మానవ వనరుల శాఖ మంంత్రి గంటా శ్రీనివాస తమను ఎన్నికల్లో గెలిపిస్తే వంతెన నిర్మిస్తామని హామీలు ఇచ్చారు. ఆ హామీలు నీటిలో రాతలగా మిగిలిపోయాయి తప్ప కార్యరూపం దాల్చలేదు. -
పొంగిన కాగ్నానది
బషీరాబాద్: మండలంలో కురుస్తున్న వర్షాలకు చెరువులు, వాగులు, వంకలు జలకళను సంతరించుకున్నాయి. మంతన్‌గౌడ్ ఊరచెరువు, నవాంద్గి బడా తలాబ్, ఎక్మాయ్ తూర్తలాబ్ తదితర చెరువులు నిండాయి. కాగ్నా నదిలోకి భారీగా వరద నీరు రావడంతో ఉధృతంగా ప్రవహిస్తుంది -
ఉద్ధృతంగా ప్రవహిస్తున్న కుందూ
కర్నూలు: ఎగువన కురిసిన భారీ వర్షాల కారణంగా కర్నూలు జిల్లా మిడుతూరు మండలం చింతల వద్ద కుందూ నది ఉద్ధృతంతో ప్రవహిస్తుంది. ఆ ఉద్ధృతికి చింతల పరిసర ప్రాంతాల్లోని లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమైనాయి. నదిలో నీరు రహదారులపైకి భారీగా వచ్చి చేరడంతో కాజీపేటకు రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. -
పొంగి పొర్లుతున్న చీకుపల్లి వాగు
ఖమ్మం : ఎగువను కురుస్తున్న భారీ వర్షాలతో ఖమ్మం జిల్లా వాజేడు మండలం చీకుపల్లి వాగు పొంగి ప్రవహిస్తుంది. వాగులో నుంచి ఆ నీరు రోడ్లపైకి భారీగా వచ్చి చేరింది. దాంతో దాదాపు 25 గ్రామలు మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. అలాగే గోదావరి నది పరవళ్లు తొక్కుతుంది. భద్రచలం వద్ద నది నీటిమట్టం బుధవారం 27 అడుగులకు చేరుకుంది. ధవళేశ్వరం వద్ద గోదావరిలో నీటి ఉధృతి పెరిగింది. ఈ నేపథ్యంలో లక్ష్యా 21 వేల క్యూసెక్ల నీటిని సముద్రంలోకి వదిలారు. అలాగే తాగునీటి కోసం గోదావరి డెల్టాకు 12 వేల క్యూసెక్ల నీటిని విడుదల చేశారు.