
సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చుతోంది. ఉదయo 10 గంటలకు 37.7 అడుగులకు గోదావరి నీటి మట్టం చేరుకుంది. దీంతో 7 లక్షల క్యూసెక్కుల నీరును దిగువకు విడుదల చేస్తున్నారు. 43 అడుగులకు చేరితే మొదటి ప్రమాద హెచ్చరికను అధికారులు జారీ చేయనున్నారు.
పర్ణశాల వద్ద నారా చీరల ప్రాంతం నీట మునిగింది. తెలంగాణాతో పాటు ఎగువ ప్రాంతంలో ఉన్న సరిహద్దు రాష్ట్రలైన ఛత్తీస్‌గడ్, మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఏజెన్సీ గ్రామాల్లోని వాగులు పొంగి గోదావరిలోకి భారీగా వర్షపు నీరు చేరుతుండటంతో క్రమంగా గోదావరి నీటి మట్టం పెరుగుతోంది. ఇప్పటికే భారీ వరదల కారణంగా అనేక చోట్ల రవాణకీ తీవ్ర అంతరాయం కాగా, పలుగ్రామాల్లో విద్యుత్ సరాఫరా నిలిచిపోయింది. అధికారులు అప్రమతంగా ఉండాలని జిల్లా కలెక్టర్ జితేష్ ఆదేశాలు జారీ చేశారు.
భారీ వర్షాల ప్రభావంతో గోదావరిలో వరద నీటిమట్టం పెరుగుతుంది. ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ నుంచి ఐదు లక్షల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. ఏజెన్సీ విలీన మండలాల్లో భారీ వర్షాల ప్రభావంతో కొండవాగులు ఉదృతంగా ప్రవహిస్తున్నాయి సోకిలేరు వాగు, అన్నవరం వాగు కొండరాజుపేట, వాగు చీకటి వాగు, అత్త కోడళ్ళ వాగు ఉదృతంగా ప్రవహించడంతో రహదారులపైకి వరద నీరు చేరుకుంది దీంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. మరోవైపు శబరి నది కూడా పోటెత్తి ప్రవహిస్తోంది. శబరి గోదావరి సంగమ ప్రాంతం సముద్రాన్ని తలపిస్తోంది.

Comments
Please login to add a commentAdd a comment