
సాక్షి, కడప: వైఎస్సార్ జిల్లాలో విషాదం నెలకొంది. కొల్లూరు వద్ద కుందునదిలోకి దూకి ఓ కుటుంబం గురువారం ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటనలో భార్యా, భర్తతో పాటు కుమార్తె కూడా మృతి చెందింది. మృతులు రాజుపాలెం మండలం గాదెగూడురుకు చెందిన తిరుపతిరెడ్డి, వెంకట లక్ష‍్మమ్మ, ప్రవళికగా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. కుటుంబ కలహాలే ఈ ఘటనకు కారణమని తెలుస్తోంది.
కాగా ప్రవళిక ప్రేమ వ్యవహారమే ఈ విషాదానికి కారణమని తెలుస్తోంది. చిన్న కుమార‍్తె ప్రేమను తల్లిదండ్రులు అంగీకరించకపోవడంతో పాటు మనసు మార్చుకోవాలని సూచించారు. అయితే కుమార్తె ప్రవర్తనలో రాకపోవడంతో తిరుపతి రెడ్డి మనస్తాపం చెంది, భార్య, కుమార్తెతో ప్రాణాలు తీసుకున్నట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.