సాక్షి, కడప : నాలుగేళ్లుగా కడప ఉక్కు పరిశ్రమ కోసం పోరాటాలు చేసిన వారిపై అక్రమ కేసులు పెట్టిన టీడీపీ ప్రభుత్వం ఇప్పుడు ఉక్కుదీక్ష చేస్తాననడం హాస్యాస్పదంగా ఉందని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి అన్నారు. టీడీపీది చేసేది ఉక్కు దీక్ష కాదని పార్టీ ఇమేజ్ కోసం ఏర్పాటు చేసిన ఈవెంట్ అని ఎద్దేవా చేశారు. బుధవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. కడప ఉక్కు కోసం తమ పార్టీ చిత్తశుద్ధితో పోరాటం చేస్తోదన్నారు. ఉక్కు పరిశ్రమ కోసం రాజీనామాలకు సిద్ధమని పేర్కొన్నారు.
మహానేత వైఎస్సార్ కేంద్రంపై ఆధారపడకుండా దృఢసంకల్పంతో ఉక్కుపరిశ్రమ స్థాపించి రెండు వేల కోట్ల రూపాయాల పనులు చేయించారని గుర్తుచేశారు. ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాలుగేళ్లలో ఒక్క పరిశ్రమను కూడా ఏర్పాటు చేయలేదని విమర్శించారు. ఎన్నికల ముందు కడపను టీహబ్ చేస్తా, హర్ట్ కల్చర్ హబ్ చేస్తామని వాగ్దానాలు చేసిన టీడీపీ ఒక్కపని కూడా చేయలేదని ఆరోపించారు. రాయలసీమ అభివృద్ధిపై టీడీపీకి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా ఉక్కు పరిశ్రమ, హైకోర్టుతో పాటు రెండో రాజధానిని ఇక్కడ నిర్మించాలని ఎమ్మెల్యే సవాల్ విసిరారు.
Comments
Please login to add a commentAdd a comment