పోలవరం ముంపు మండలాలను సీమాంధ్రలో విలీనం చేస్తూ కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా ఎమ్మెల్యే సున్నం రాజయ్య చేస్తున్న దీక్ష మూడోరోజుకు చేరింది.
భద్రాచలం : పోలవరం ముంపు మండలాలను సీమాంధ్రలో విలీనం చేస్తూ కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా.. భద్రాచలం ఎమ్మెల్యే సున్నం రాజయ్య చేస్తున్న ఆమరణ నిరాహార దీక్ష శనివారానికి మూడోరోజుకు చేరింది. ముంపు మండలాలను తెలంగాణాలోనే ఉంచాలని, పోలవరం ప్రాజెక్టు డిజైన్ మార్చి నిర్మించాలని ఆయన డిమాండ్ చేశారు.
కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్‌ను వెనక్కు తీసుకునేంత వరకు తన దీక్ష కొనసాగుతుందని ఎమ్మెల్యే రాజయ్య స్పష్టం చేశారు. మరోవైపు సున్నం రాజయ్యకు వైద్యులు పరీక్షలు నిర్వహించారు. ఆయన శరీరంలో బీపీ, షుగర్ లెవెల్స్ పడిపోతున్నాయని వారు తెలిపారు. కాగా రాజయ్య దీక్షకు మాజీ మంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డి మద్దతు తెలిపారు.