హైదరాబాద్ : పోలవరం ముంపు మండలాలను ఆంధ్రప్రదేశ్లో కలుపుతూ కేంద్రం జారీ చేసిన ఆర్డినెన్స్ను తక్షణమే వెనక్కి తీసుకోవాలని తెలంగాణ పొలిటికల్ జేఏసీ ఛైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ డిమాండ్ చేశారు. ఆర్డినెన్స్కు వ్యతిరేకంగా జులై రెండోవారంలో ఢిల్లీలో సదస్సు నిర్వహించనున్నట్లు ఆయన శనివారమిక్కడ తెలిపారు. ఇదే అంశంపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలసి వినతిపత్రం సమర్పిస్తామని కోదండరామ్ తెలిపారు.
'పోలవరం ఆర్డినెన్స్ వెనక్కి తీసుకోవాలి'
Published Sat, Jun 28 2014 2:20 PM | Last Updated on Mon, Jul 29 2019 2:51 PM
Advertisement
Advertisement