రెండు రాష్ట్రాల మధ్య ఆర్డినెన్స్ చిచ్చు
పోలవరం ప్రాజెక్టు విషయంలో ఏడు ముంపు మండలాలను ఆంధ్రప్రదేశ్లో కలపాలంటూ కేంద్ర ప్రభుత్వం చేసిన ఆర్డినెన్స్ రెండు రాష్ట్రాల మధ్య చిచ్చుపెట్టేలా ఉందని తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే, మాజీ డిప్యూటీ స్పీకర్ మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ఈ ఆర్డినెన్స్ జారీ వెనక కుట్ర దాగి ఉందని ఆయన చెప్పారు.
ఇలాగే అయితే ఇందిరాసాగర్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును కూడా ఆంధ్రప్రదేశ్కు తరలించే ప్రమాదం ఉందని భట్టి విక్రమార్క తెలిపారు. ఈ ఆర్డినెన్స్ రావడానికి కేసీఆర్ కూడా పరోక్ష కారణమేనని, ఆయన 1956కు ముందున్న తెలంగాణ కావాలనడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని అన్నారు. యూపీఏ నిర్ణయాన్ని ఎన్డీయే అమలు చేసిందనడం సరికాదని, విభజన బిల్లులో ఆనాడు ఈ ఏడు మండలాలు లేవని తెలిపారు.