‘ఉద్యోగ దీక్ష’ చేపట్టిన వైఎస్‌ షర్మిల | YS Sharmila Deeksha On Jobs Recruitment Issues In Telangana | Sakshi
Sakshi News home page

‘ఉద్యోగ దీక్ష’ చేపట్టిన వైఎస్‌ షర్మిల

Apr 15 2021 12:18 PM | Updated on Apr 15 2021 6:21 PM

ఈ సందర్భంగా వైఎస్‌ షర్మిల మాట్లాడుతూ, నిరుద్యోగులను సీఎం కేసీఆర్‌ పట్టించుకోవటం లేదని విమర్శించారు. ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడం లేదని ధ్వజమెత్తారు.

సాక్షి, హైదరాబాద్‌: ఇందిరాపార్క్‌ వద్ద వైఎస్‌ షర్మిల దీక్ష చేపట్టారు. వైఎస్సార్‌ విగ్రహానికి నివాళులు అర్పించి.. నిరుద్యోగులు, ఉద్యోగుల కోసం ఆమె దీక్షకు ఉపక్రమించారు. సాయంత్రం 5 గంటల వరకు వైఎస్‌ షర్మిల దీక్ష కొనసాగనుంది. ఈ సందర్భంగా వైఎస్‌ షర్మిల మాట్లాడుతూ, నిరుద్యోగులను సీఎం కేసీఆర్‌ పట్టించుకోవటం లేదన్నారు. ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడం లేదని ధ్వజమెత్తారు. ఉద్యమాలు చేస్తే అణచివేస్తున్నారని.. నిరుద్యోగ సమస్య పరిష్కారం అయ్యేవరకు ఆందోళన కొనసాగుతుందని ఆమె స్పష్టం చేశారు. మూడు రోజుల పాటు నిరాహార దీక్ష కొనసాగిస్తామని వైఎస్‌ షర్మిల వెల్లడించారు.

చదవండి:
జరిమానా తప్పించుకోవడానికి...క్యా ఐడియా సర్‌ జీ
ప్రమోషన్లు వదులుకుని మరీ తిష్ట? ఎవరా అధికారులు?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement