ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అంటూ నినదిస్తూ ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన నిరవధిక నిరాహార దీక్ష నేటికి నాలుగోరోజుకు చేరుకుంది. శనివారం ఉదయం ఆయనకు జీజీహెచ్ వైద్యులు బీపీ, షుగర్ పరీక్షలు (బీపీ 129/90, షుగర్ 87 ఎంజీ, పల్స్ 66) నిర్వహించారు. దీక్ష కారణంగా వైఎస్ జగన్ బాగా నీరసించిపోయారని, పల్స్ రేటు గంట గంటకు పడిపోతుందని తెలిపారు.