
బండారు దత్తాత్రేయ (ఫైల్ ఫోటో)
సాక్షి, హైదరాబాద్: పార్లమెంట్ సమావేశాలను విపక్షాలు అడ్డుకోవడాన్ని నిరసిస్తూ ఒకరోజు నిరాహారదీక్షకు దిగినట్లు సికింద్రాబాద్ ఎంపీ బండారు దత్తాత్రేయ తెలిపారు. ఢిల్లీలో బీజేపీ చెపట్టిన దీక్షకు మద్దతుగా ఖైరతాబాద్‌లోని శ్రీధర్ ఫంక్షన్ హాల్‌లో గురువారం ఆయన శాంతియుతంగా నిరాహార దీక్షలో కూర్చున్నారు. ఈ సందర్బంగా దత్తాత్రేయ విలేకరులతో మాట్లాడుతూ... పార్లమెంట్‌ను అడ్డుకోవడం అంటే ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనన్నారు. అనేక సంవత్సరాల్లో జరగని అభివృద్ధి నాలుగు సంవత్సరాలలో బీజేపీ చేపట్టిందనన్నారు. దీక్షలో ఆయనతో పాటు బీజేపీ ఎమ్మెల్యేలు లక్ష్మణ్, కిషన్ రెడ్డి, చింతల రామాచంద్రా రెడ్డి, పలువురు పార్టీనేతలు,కార్యకర్తలు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment