సభను అడ్డుకోవడం దారుణం: దత్తాత్రేయ
సాక్షి, న్యూఢిల్లీ: నోట్ల రద్దు అంశంపై పార్లమెంటులో అర్థవంతమైన చర్చ జరిపి ప్రజా సమస్యలను పరిష్కరించాల్సింది పోరుు.. సభ జరిగినన్ని రోజులూ ప్రతిపక్షాలు అడ్డుకోవడం దారుణమని కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. ప్రతిపక్షాలు పూర్తి బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నాయ న్నారు. శుక్రవారం ఢిల్లీలో తన కార్యాలయంలో దత్తాత్రేయ మాట్లాడుతూ.. ప్రసూతి సెలవుల పెంపు బిల్లు లోక్‌సభలో ఇంకా ఆమోదం పొందాల్సి ఉందని, ప్రతిపక్షాలు సభను జరగనిస్తే బిల్లు ఆమోదం పొంది మహిళలకు ప్రయోజనం కలుగుతుందన్నారు.
హైదరాబాద్‌లోని నానక్‌రామ్‌గూడలో ఏడంత స్తుల భవనం కూలి కార్మికులు మృతి చెందడంపై విచారం వ్యక్తం చేశారు. ఈ ఘట నపై పూర్తిస్థారుు విచారణకు ఆదేశించినట్లు తెలిపారు. అధికారులతో చర్చించి మృతు ల కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించేందుకు చర్యలు తీసుకుంటానన్నారు. ఢిల్లీ పర్య టనలో ఉన్న సీఎం కేసీఆర్‌తో దత్తాత్రేయ మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు.