చాతుర్మాస దీక్షలో శ్రీమఠం పీఠాధిపతి
చాతుర్మాస దీక్షలో శ్రీమఠం పీఠాధిపతి
Published Mon, Aug 1 2016 12:06 AM | Last Updated on Mon, Sep 4 2017 7:13 AM
మంత్రాలయం : శ్రీరాఘవేంద్రస్వామి మఠం పీఠాధిపతి సుభుదేంద్రతీర్థులు చాతుర్మాస దీక్ష బూనారు. ఆదివారం వేకువజామున రాఘవేంద్రుల మూలబందావనానికి విశేష పూజలు చేసిన అనంతరం మూల, జయ, దిగ్విజయ రామ పూజల్లో తరించారు. అనంతరం దీక్షను స్వీకరణ చేశారు. 41 రోజుల పాటు చాతుర్మాస దీక్షలో పీఠాధిపతులు ఉంటారు. లోక కల్యాణార్థం శ్రీమఠంలోనే జపతప అనుష్టానం చేస్తారు. దీక్ష వాస్తవంగా త్రయోదశి రోజున స్వీకరించడం ఆనవాయితీ. తిథిలోపం కారణంగా ఆదివారం ద్వాదశి, త్రయోదశి కలిసిరావడంతో పీఠాధిపతి చాతుర్మాస దీక్షకు ఉపక్రమించారు. 41 రోజుల తర్వాత సీమోల్లంఘన ఉంటుంది. కార్యక్రమంలో మేనేజర్ శ్రీనివాసరావు, జోనల్ మేనేజర్ శ్రీపతి ఆచార్, ధార్మిక సహాయ అధికారి వ్యాసరాజాచార్, ద్వారపాలక అనంతస్వామి పాల్గొన్నారు
Advertisement