పీఠాధిపతికి పుష్పాభిషేకం | puspabhisekam | Sakshi
Sakshi News home page

పీఠాధిపతికి పుష్పాభిషేకం

Published Tue, Sep 13 2016 12:16 AM | Last Updated on Mon, Sep 4 2017 1:13 PM

పీఠాధిపతికి పుష్పాభిషేకం

పీఠాధిపతికి పుష్పాభిషేకం

మంత్రాలయం : చాతుర్మాస దీక్షలో కొనసాగుతున్న  రాఘవేంద్రస్వామి మఠం పీఠాధిపతి సుభుదేంద్రతీర్థులకు పుష్పాభిషేకం నిర్వహించారు. సోమవారం బళ్లారికి చెందిన భక్తుడు హెచ్‌.జి.రాములు నేతత్వంలో మఠం అర్చకులు అభిషేకం గావించారు. డోలోత్సవ మండపంలో వేద మంత్రోచ్ఛారణలు పఠిస్తుండగా  పీఠాధిపతి శిరస్సుపై నుంచి పూల వర్షం కురిపించారు. అనంతరం భక్తులకు పీఠాధిపతి ప్రవచనం చేశారు. చాతుర్మాస దీక్ష పవిత్రతను వివరించారు. భక్తులకు రాఘవేంద్రస్వామి ఆశీర్వాదం ఎల్లవేళలా ఉంటుందన్నారు. పుష్పాభిషేకం వేడుక భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. వేడుకలో ఏఏఓ మాధవశెట్టి, మేనేజర్‌ శ్రీనివాసరావు, అసిస్టెంట్‌ మేనేజర్‌ ఐపీ నరసింహమూర్తి, సంస్కత విద్యాపీఠం ప్రధానాచార్యులు వాదిరాజాచార్, ద్వారపాలక అనంతస్వామి పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement